31.10.2020 శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయే తప్ప మరొక దైవాన్ని తలచకుండా ఆయన నామస్మరణలోనే జీవితాన్నంతా గడిపిన సాయి అంకితభక్తురాలయిన శ్రీమతి శివమ్మ తాయి గురించి మూడవభాగాన్ని ఈ రోజు ప్రచురిస్తున్నాను.
సాయి
అమృతాధారనుండి
సేకరణ.
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
శివమ్మ తాయి – 3 వ.భాగమ్
“సాయిబాబా మందిరంలోనే నన్ను సమాధిచేయవలసిన సమాధి కూడా నిర్మించబడుతూ ఉంది. ఇక అది పూర్తి కావస్తోంది. నా గురువు ఎప్పుడు నిర్ణయిస్తే అపుడు నా శరీరాన్ని ఆ సమాధిలో ఉంచి పై భాగాన్ని మూసివేయండి. ఆ ఒక్కపని మాత్రమే మిగిలి ఉంది” అని ఆమె 1993వ.సంవత్సరంలో చెప్పింది. ఆమె ఇంకా చెప్పిన విషయం, “బాబా జీవించి ఉన్న కాలంలోను, సమాధి చెందిన తరువాత కూడా ఆయన నన్ను కనిపెట్టుకొని ఉంటున్నారు.
నాకు మార్గం చూపిస్తూ నాకు తోడుగా సహాయపడుతూ ఉన్నారు. ఆయన నామీద ఎంతో దయ కనబరుస్తున్నారు. నా ప్రతి ఉచ్చ్వాస నిశ్వాసాలు ఆయన
ఆశీర్వాదబలంతోను, అభీష్టం వల్లనే జరుగుతున్నాయి. ఆయన తన భౌతిక శరీరాన్ని వదలివేసిన
తరువాత కూడా తన సూక్ష్మ శరీరంతో నాతో సన్నిహితంగానే ఉంటున్నారు. ఆయన నాతో చక్కటి తమిళ భాషలో మాట్లాడుతున్నారు. ఆమె ఇంకా తన సంభాషణను కొనసాగిస్తూ,
“ఆయన తరచుగా తన భౌతిక శరీరంతో గాని, సూక్ష్మశరీరంతో
గాని నాతో మాట్లాడుతూ ఉంటారు. నన్ను నడిపిస్తున్నది ఆయనే.
అవసరమయిన సమయాలలో నాకు జాగ్రత్తలు చెబుతున్నారు. ఆయన తను ఏది చెప్పదలచుకున్నా ఏవిషయమయినా
సరే నాతో చెబుతూ ఉంటారు.”
ఆమె ఆశ్రమంలో రెండు బాబా మందిరాలను నిర్మించింది. వాటిలో ఒకదానిలో నలుపురంగులో ఉన్న
బాబా విగ్రహాన్ని ప్రతిష్టించింది.
నాకు తెలుసున్నంతవరకు ఇటువంటి విగ్రహాలు ఒకటి నలుపు రంగులో ఉన్నది
మరొకటి బాబా భిక్షమెత్తుతున్నట్లుగా ఉన్నది మరెక్కడా చూడలేదు..(ఇది వ్యాసరచయిత చెప్పిన విషయం)
(శివమ్మ తాయి ప్రతిష్టించిన నలుపు రంగు బాబా విగ్రహం)
(ఇక్కడ హైదరాబాద్ నిజాంపేటలో ఉన్న బాబా మందిరంలో బాబా విగ్రహం నలుపు రంగులోనే ఉంటుంది.)
ఆమెకు బాబా స్వప్నంలో కనిపించి ఆయన అడిగిన
విధంగా బాబా నిలుచుని భిక్షమెత్తుతున్నట్లుగా ఉన్న మరొక విగ్రహాన్ని ప్రతిష్టించింది. ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా రాజస్ఠాన్
లోని శిల్పిచేత పాలరాయితో చెక్కించింది.
ఆమె ఒక కంసాలిని పిలిపించి వెండితో బాబా
ప్రతిమను అక్కడే తయారు చేయించి తన పూజాగదిలో ప్రతిష్టించింది. ఈ రెండు బాబా మందిరాలు శివమ్మతాయి
పూజాగదికి బయట ఉన్నాయి.
భక్తులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆమె
సహాయం కోరి వస్తూ ఉండేవారు. ఆమె
బాబాను ప్రార్ధించేది. ఆమెకు వారి సమస్యలకు దృశ్యరూపంలో బాబా చూపించిన పరిష్కారాలను, ఆశీర్వాదాలను, శుభాకాంక్షలను వారికి తెలుపుతూ ఉండేది. ఈ విధంగా ఆమె తనదగ్గరకు వచ్చిన ప్రతివారికి
ప్రతిసారి ఎప్పుడుపడితే అప్పుడు చేసేది కాదు. పరిమితి ప్రకారం ఒకసారికి ఒక భక్తునికి
మాత్రమే అతని సమస్యలకి పరిష్కారాలను బాబాని అడిగి తెలియచేసేది.
“నా గురువు ముందు నేనొక ధూళి రేణువును మాత్రమే”
అని అంటూ ఉండేది. ఆయన లేకుండా నేను లేను. ఇది సత్యం. నాద్వారా
ఈ భక్తులు పొందుతున్న అభినందనలు, దీవెనలు, వరాలు, తాత్త్విక సంబంధమయిన మానసిక ప్రశాంతత ప్రతీది
కూడా బాబానుంచి వస్తున్నవే” మీరు పూర్తిగా సమర్ధ సద్గురు షిరిడీ సాయిబాబాకు సర్వశ్యశరణాగతి చేసినట్లయితే
మీకు ఎటువంటి సమస్యలు ఉండవు. సంపూర్ణమయిన మానసిక ప్రశాంతత దానంతటదే మీకు ప్రాప్తిస్తుంది” అని ఆమె భక్తులకు చెప్పేది.
బాబా పుట్టుక, ఆయన జీవితం ఆయన బోధనలు తనకు తెలిసున్నంత వరకు అన్నిటిని వివరించింది. శివమ్మ తాయి ప్రతిష్టించిన వెండి
బాబా విగ్రహం ఇదే.
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment