01.11.2020 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయే తప్ప మరొక దైవాన్ని తలచకుండా ఆయన నామస్మరణలోనే జీవితాన్నంతా గడిపిన సాయి అంకితభక్తురాలయిన శ్రీమతి శివమ్మ తాయి గురించి నాలుగవభాగాన్ని
ఈ రోజు ప్రచురిస్తున్నాను.
సాయి
అమృతాధారనుండి
సేకరణ.
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
శివమ్మ తాయి – 4 వ.భాగమ్
బెంగళూరు రూపేన్ అగ్రహారంలో ఉన్న షిరిడీ
సాయిబాబా మందిరం గురించి వ్యాస రచయిత చెప్పిన వివరాలు
నేను ఇంతవరకు పవిత్రభూమి షిరిడీలో అడుగు
పెట్టనప్పటికీ, భారతదేశంలో ఉన్న పవిత్రమయిన అన్ని
సాయి మందిరాలను సందర్శిస్తూ ఉంటాను.
ఆవిధంగా బెంగళూరు రూపేన్ అగ్రహారంలో ఉన్న సాయిబాబా మందిరాన్ని
దర్శించే అవకాశం కలిగింది. ఒకానొక గురువారమునాడు నేను ఆ సాయి
మందిరాన్ని దర్శించాను.
మా మేనమామ ఈ మధ్యనే సాయిలీల పుస్తకాలలో ఈ మందిరం గురించి చదివి నాకు చెప్పారు. ఆదే నేను మొట్టమొదటిసారిగా ఈ మందిరం గురించి వినడం. ఇక్కడున్నటువంటి బాబా విగ్రహాన్ని నేను మరెక్కడా చూడలేదు. బాబా నేత్రాలను బంగారు రంగుతో వేయడం వల్ల అవి ఎంతో ప్రకాశవంతంగా వెలుగులు చిమ్ముతున్నాయి. ఆ విగ్రహం చిన్న భవనంలో రెండవగదిలో ప్రవేశద్వారానికి ఎదురుగా ప్రతిష్టింపబడి ఉంది. అక్కడ ఉన్న పూజారికి నేను ఆమందిరానికి రావడం అదే మొదటిసారని అర్ధమయిపోయింది. ఆయన నన్ను మందిరం చుట్టూ అంతా తిప్పి చూపించి మందిరం చరిత్ర, శివమ్మతాయి గురించి అంతా వివరించారు. శివమ్మ తాయి బాబాకు గొప్ప భక్తురాలని ఆమె అక్కడ 70 సంవత్సరాలు నివసించినట్లుగా చెప్పారు. శివమ్మతాయి 1889 వ.సంవత్సరంలో జన్మించిందని, 1994 వ.సంవత్సరంలో మందిరం ఉన్న ప్రాంతంలోనే సమాధి చెందారని చెప్పారు. ఆమె తన కుమారుని వివాహమయిన తరువాత ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించారని చెప్పారు. బాబా స్వయంగా ఆమెకు ఉపదేశం చేసారని ఆమెకు ఆభాగ్యం కలిగిందని చెప్పారు. ఆమె సమాధి సరిగ్గ బాబా ప్రతిమ ఉన్న చోటనే ఉంది. ఆమె సమాధి ఉన్న గది చాలా చిన్నది. ఆ గదిలో పదిమంది మాత్రమే పట్టేటంతగా ఇరుకుగా ఉంటుంది.
ప్రధాన మందిరం ప్రక్కనే చావడి ఉంది. ఆ చావడి అమ్మ నివశించిన గృహం. అక్కడ ఒక చిన్న పూజాగది, అందులో బాబా వెండి ప్రతిమ ఉంది.
చావడికి ఆనుకుని ద్వారకామాయి ఉంది. ఇక్కడే బాబావారు చేతిలో భిక్షాపాత్ర
పట్టుకుని నుంచుని ఉన్న విగ్రహం ఉంది.
సాయిబాబా మందిరానికి ఎలా చేరుకోవాలి
మడియవాలా లేక కోరమంగళ నుంచి హోసూరుకు వెళ్ళే రహదారిలో ఈ మందిరానికి చేరుకోవాలి. ఆదారిలోనుండి ప్రయాణిస్తే సిల్క్ బోర్డు పై వంతెన తరువాత కుడివైపు చిన్న సందులోనుండి వెళ్ళి
వెంటనే ఎడమవైపుకు ఆతరువాత కుడివైపు తిరగాలి. మందిరం ‘టి’
ఆకారంలో రహదారి ఉన్న ప్రాంతంలో ఎడమవైపు ఉంది. కాని, అక్కడ మందిరం ఉందని తెలిపే గుర్తులు ఏమీ ఉండవు. అందువల్ల మందిరాన్ని కనుగొనడం కాస్త
కష్టమే. కాని నేను చెప్పిన
వివరాలను బట్టి సులభంగానే చేరుకోవచ్చు…సాయిరామ్
శ్రీ నారాయణరెడ్దిగారు, ఆయన భార్య శారదమ్మ ఎంతో సహృదయంతో శివమ్మతాయికి తమ స్థలాన్ని ఇచ్చారు. అక్కడ బాబా మఠం నిర్మింపడటానికి తాము
నిమిత్తమాత్రులమని చెప్పారు. ప్రస్తుతం మందిరం నిర్వహణ,
ఉన్నతపాఠశాల, వృధ్ధాశ్రమం వీటన్నిటి వ్యవహారాలను
శ్రీగోపాలరెడ్డిగారు, ఆయన భార్య కమలమ్మగారు చూసుకుంటున్నారు. మందిరం ఆవరణలో ఉన్న పాథశాలలో దాదాపు 800 మందివరకు విద్యార్ధులకు
ఉచితంగా విద్యాబోధన జరుగుతూ ఉండటం పెద్ద విశేషం.
ఉన్నతపాఠశాలను వారు ఎంతో పధ్ధతిగా క్రమశిక్షణతో
నిర్వహిస్తూ ఉన్నారు. అందులో
చదువుతున్న పేద విద్యార్ధులకు ఉచిత విధ్యాబోధన చేస్తున్నారు.
వారు తమ వృధ్ధాశ్రమంలో నిరుపేదలయిన ఏడుగురు
మగవారికి, ఏడుగురు ఆడవారికి ఉచితంగా ఆశ్రయం కల్పించారు. ఆవరణంతా చాలా పరిశుభ్రంగా ఉంచుతారు. అందులో ఆశ్రయం పొందుతున్నవారికి చక్కటి
భోజనం ఉచితంగా పెడుతున్నారు. అవసరమయినపుడు ఉచితంగా వైద్య సహాయం అందిస్తున్నారు. ఇక్కడ పాఠశాల, ఆశ్రమం అన్ని కార్యకలాపాలను నటరాజ్ అనే ఆయన పర్యవేక్షిస్తూ ఉంటారు. ఆయనే ఇక్కడ
ఉపాధ్యాయునిగా, మానేజరుగా కార్యాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉన్న మూడు మందిరాలలోను వెంకటరాజుగారు, ఆయన సోదరుడు సంపంగి గారు బాబాకు పూజ, అర్చన, అభిషేకాలు నిర్వహిస్తున్నారు.
చిరునామా
శ్రీ షిరిడీ సాయిబాబా మఠం
రూపేన్ అగ్రహార, ఎన్ జి ఆర్ లేఅవుట్
హోసూర్ ప్రధాన రహదారి
మడివాల పోస్టు
బెంగళూరు – 68
ఫోన్
080-25732522
(సమాప్తం)
0 comments:
Post a Comment