18.01.2021
సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 29 వ.భాగమ్
(పరిశోధనా వ్యాస కర్త … శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ- కోపర్ గావ్ – షిరిడీ
శనివారమ్ – అక్టోబరు, 19, 1985
శివనేశన్ స్వామి చెబుతున్న వివరాలు…
నేను
(ఆంటోనియో) -- ‘దేవుడు ఒక్కడే’ ఇదే ముఖ్యమయిన
అంశంగా కనిపిస్తోంది.
జవాబు --- ఒకసారి
బాబా ఒక రోగికి ఔషధం ఇచ్చారు. కొన్ని సంవత్సరాల
తరువాత బాబా “నేను హరి, హరి, అల్లా, అల్లా” అని పాడసాగాను. అపుడు నేను హరిని అయ్యాను, అల్లాని అయ్యాను. ఆ రోజునుండి నేను రోగులకి ఊదీనివ్వడం మొదలుపట్టాను”
అన్నారు.
ప్రశ్న --- మందుగానా?
జవాబు --- అంటే
దాని అర్ధం భగవంతుని నామాన్ని పాడుతూ ఉన్నట్లయితే మనమే భగవంతునిగా అవుతాము. బాబా మందులనివ్వడం మానేసి ఊదీని మాత్రమే ఇచ్చేవారు.
ప్రశ్న --- బషీర్
బాబా గురించి ఏమయినా చెప్పగలరా?
జవాబు --- నేనాయనను
చూసాను. మొదట్లో ఆయన చాలా కష్టాలలో ఉన్నారు. ఆయన ఇక్కడే కొన్ని సంవత్సరాలు నివసించారు.
ప్రశ్న --- మొట్టమొదటిసారిగా
ఆయన ఇక్కడికి ఎప్పుడు వచ్చారు?
జవాబు --- ఆయనకు గొప్ప పేరు రాకముందు ఇక్కడికి వచ్చి లెండీబాగ్ లో ఉన్నారు. ఆరోజుల్లో ఆయన గురించి ఎవరికీ తెలియదు. అతరువాత ఆయన తపస్సు చేసుకోవడానికి ఒక కొండమీదకు వెళ్ళారు. ఆయనకు సాయిబాబా దర్శనమిచ్చి ఒక యోగదండానిచ్చారని అందరు చెప్పుకునేవారు. ఆయోగదండం చెక్కతో చేసిన కఱ్ఱ. దానిని భిక్షాటనకోసం జోలెతో కలిపి ఉపయోగిస్తారు. రాఘవేంద్రస్వామి అనే ఒక సాధువు కూడా ఉండేవాడు. ఆయనకు బషీర్ బాబా మంత్రోపదేశం చేసారు. మీరు నిజంగా సాయిబాబాను చూసారా అని రాఘవేంద్రస్వామి బషీర్ బాబాను అడిగారు. బాబా తనను అనుగ్రహించారని బషీర్ బాబా చెప్పారు. అప్పటినుండి ఆయనకు గొప్పపేరు వచ్చింది.
ప్రశ్న --- అయితే
ఆయనకు సాయిబాబా దర్శనమిచ్చి యోగదండాన్ని ఇచ్చినందువల్లనే ప్రసిధ్ధి చెందారా?
జవాబు --- అవును. అందువల్లనే ఆయనకు గొప్ప పేరు వచ్చింది. కాని హైదరాబాద్ లో ఉన్న ప్రజలద్వారా నాకు ఆయన గురించి
ఇటీవలే తెలిసిన విషయం ఏమిటంటే ఆయన తన స్వంతానికి భవనాలు నిర్మించుకున్నారనీ, ఆయనలో
ఉన్న శక్తులన్నీ పోయాయని.
ప్రశ్న --- అంటే ఆయనలో ఉన్న యోగశక్తులన్నీ పోయాయా?
జవాబు --- అవును. కొంతకాలం క్రితం ఆయన ఇక్కడికి వచ్చారు. ప్రజలు సాయిబాబాను పూజించినట్లుగానే ఆయనను కూడా
ఆయన గదిలో పూజించేవారు. నేనాయనను ఆఖరిసారి
చూసినపుడు ఆయన లెండీబాగ్ లో ఏవో యజ్ఞాలు నిర్వహిస్తున్నారు. ఆతరువాత కొన్ని నెలలకి ఆయన మరణించారు.
ప్రశ్న --- చివరి
సంవత్సరాలలో బషీర్ బాబా మారిపోయారని మీరు నమ్ముతున్నారా? అ తరువాతనుంచి ఆయన ఆధ్యాత్మిక జీవితం గడిపిన వ్యక్తికాదా?
జవాబు --- ఆయనతో
సన్నిహితంగాను, ఆయనతోనే ఉండె ఆయన భక్తులను కొంతమందిని నేను కలుసుకొన్నాను. బషీర్ బాబా ఇంతకు ముందు ఉన్న విధంగా లేరని వారు
చెప్పారు. ఆయన తన భక్తులవద్దనుంచి డబ్బు తీసుకుని
తిరిగి ఇచ్చేవారు కాదు. ఆయన శిష్యులు చాలామంది
ఈవిషయం నాకు చెప్పారు. ఇదే కారణం.
ప్రశ్న --- ఈ
కారణంవల్లనే ఆయనకు ఉన్న శక్తులు పోయాయా?
జవాబు --- అవును.
నేను (ఆంటోనియో)
--- నేనీ ప్రశ్నలను ఎందుకని అడుగుతున్నానంటే
బషీర్ బాబా తానే సాయిబాబాకు వారసుడినని అన్నారు…
జవాబు --- అవును. ఆయన ప్రపంచమంతా చుట్టి వద్దామనుకున్నారు. కాని బాబా ఆయనకు అనుమతినివ్వలేదు.
ప్రశ్న --- అయితే
ఆయనలో కొన్ని శక్తులున్నాయని మీరు భావిస్తున్నారా? ఉంటే అవి చివరి సంవత్సరాలలో ఆయన వాటిని పోగొట్టుకొన్నారా?
జవాబు --- అవును.
ప్రశ్న --- ఆయన
చెడు ప్రవర్తన కారణంగానా?
జవాబు --- అవును
నిజమే.
ప్రశ్న --- బషీర్
బాబా మొట్టమొదటిసారి షిరిడీకి రావడానికి ప్రేరణ ఏమిటీ? ఆయన ఇక్కడికి వచ్చి కొన్ని సంవత్సరాలు ఎందుకని ఉన్నారు?
జవాబు --- బాగా
తీవ్రమయిన సాధన చేసిన సాధకులు తమకు ప్రాప్తించిన ఆధ్యాత్మిక శక్తులను తమ స్వలాభం కోసం,
చెడుపనులకి వినియోగిస్తూ, జీవితాన్ని విలాసంగాను సుఖభోగాలతోను గడిపినట్లయితే వారు తమ
ఆధ్యాత్మిక క్రమశిక్షణను పోగొట్టుకుంటారు. అపుడు వారిలో అంతకు ముందు ఉన్న శక్తులన్నీ అకస్మాత్తుగా
ముగింపుకు వస్తాయి. ఈవిధంగా ఎంతోమంది ఆధ్యాత్మికంగా
సాధన చేసినవారిలో జరిగాయి. ఉదాహరణకి మొట్టమొదట్లో
భగవన్నామస్మరణ చేస్తున్నవారికి కొన్ని శక్తులు లభిస్తాయి. ఆతరువాత వారు తాము గడిపే పవిత్రమయిన ఆధ్యాత్మిక
జీవితంలో కొనసాగిస్తున్న సాధనని మధ్యలో మానివేసినట్లయితే వారికి ప్రాప్తించిన శక్తులు
ఏవయితే ఉన్నాయో వాటిని పోగొట్టుకుంటారు. ఆతరువాత
వారు మామూలు సామాన్య మానవులుగా మిగిలిపోతారు.
ఈవిధంగా ఎంతోమందికి జరిగింది.
ప్రశ్న --- ఈవిధంగా
బషీర్ బాబాకు కూడా జరిగిందన్నమాట.
జవాబు --- అవును. నేను కూడా అదే అనుకుంటున్నాను.
ప్రశ్న --- మీపేరేమిటి?
జవాబు --- గణేష్
చూర్య.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment