16.02.2021 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస
గ్రంధము – 45 వ.భాగమ్
(పరిశోధనావ్యాస రచయిత… శ్రీ ఆంటోనియో
రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ – కోపర్ గావ్ – షిరిడీ
సోమవారమ్ – అక్టోబరు, 21, 1985
ఉదయం గం.7.30 ని. ఈ రోజు ఉదయాన్నే గురుస్థాన్ నుండి మసీదు వరకు జరిగిన ఊరేగింపులో పాల్గొన్నాను. ఇది నాకంతగా ప్రత్యేకమయిన ఆకర్షణీయంగా అనిపించలేదు. చావడి దగ్గర ప్రవేశద్వారంవద్ద కూర్చున్నాను. అక్కడ కొంతమంది యువతులు ఎంతో నైపుణ్యంగా రంగవల్లులను తీర్చిదిద్దుతున్నారు. అంతలో ఒక వీధి కుక్క నాదృష్టిని ఆకర్షించింది. ఆకుక్క శరీరమంతా తామర, గజ్జి తో నిండివుంది. దానిమీద ఈగలు ముసురుతూ ఉన్నాయి. చూడటానికి చాలా అసహ్యకరంగా ఉంది. ఒక్కసారిగా నామనసులో మెరుపులాంటి ఆలోచన మెదిలింది.
ఆకుక్క
సాయిబాబా అయి ఉండవచ్చనిపించింది.
కాని
నాలో కలిగిన ఈ ఆలోచన మామూలుగా కలిగినది కాదు.
నా
అంతరదృష్టికి
ఆకస్మికంగా కలిగిన బలీయమయిన
అవగాహన. దానిని
మాటలలో వివరించడం కష్టం.
యదార్ధంగా
ఆయనే ఆరూపంలో నా ఎదురుగా నించుని ఉన్నారని అనిపించింది.
ముమ్మాటికి
అది కాదనలేని
తిరుగులేని సత్యం.
ఇది
నిజంగా వింతయిన ఆశ్చర్యకరమయిన అనుభవం.
అందరిచేత
నిర్లక్ష్యం
చేయబడి దగ్గరికి వస్తే తరిమికొట్టబడేలా ఒక అల్పప్రాణిగా శునకరూపంలో వచ్చిన సాయిబాబా.
ఆ
కుక్క కళ్ళు ఎంతో సుందరంగాను సానుభూతికోసం మన దృష్టిని ఆకర్షించేలా ఉన్నాయి.
చివరికి
నాకేదో అర్ధమయిందనే
భావన నాలో కలిగింది.
ఆభావం
నాలోని బుధ్ధికుశలతకు సంబంధించినది
మాత్రం కాదు.
ఒక
విధమయిన భావావేశం నాహృదయంలో అంకురించింది.
ఆ
కుక్క రూపంలో ఎదురుగా ఉన్నది సాయిబాబా, అది పూర్తి యదార్ధం అనే విషయం ఒక దివ్యసందేశంగా నాలో ప్రవేశించింది.
ఆ
సందేశం నాలో ప్రవేశించగానే నాకళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి.
నేను
ఆభావావేశంలో
మునిగిపోయాను. ఈ
విధంగా ఈ రోజు మొదలవుతుంది.
ఉత్సవసమయాలలో
పాడే ఆరతులను టేప్
చేసాను. ఇపుడు
ఫలహారం చేసే వేళయింది.
మధ్యాహ్నం గం. 12.30 ని.
… వెనిస్ కి ఒక టెలిగ్రామ్, మరొక టెలిగ్రామ్ ఖామ్ గావ్ లో ఉన్న హెచ్.జి.అగర్వాల్ గారికి పంపించాను.
వచ్చే
గురువారంనాటికి
టెలిగ్రాములు
అందుతాయని పోస్టాఫీసులోవారు చెప్పారు.
ఆతరువాత
నేను, స్వామి శేఖరరావు ఇద్దరం కోపర్ గావ్ లో ఉన్న బ్యాంక్ కు వెళ్లాము.
ఆఖరికి
నాదగ్గర ఉన్న 140 డాలర్లను రూపాయలలోకి మార్చుకోగలిగాను.
బ్యాంకులో
గుమాస్తా చాలా నెమ్మదిగా పని చేస్తూండటం
వల్ల బాగా ఆలస్యమయింది.
ఎలాగయితేనేమి
అన్నీ సవ్యంగా జరిగాయి.
ఇపుడు
నాదగ్గర రూ.1,800/- ఉన్నాయి. ఫరవాలేదు
హాయిగా గడపచ్చు అనిపించింది.
తిరిగి
మేము షిరిడీకి వచ్చాము కాసేపట్లో భోజనం చేయడానికి రెస్టారెంట్ కి వెళ్ళాలి.
సాయంత్రం
5 గంటలకి హోమీబాబా గారిని ఇంటర్వ్యూ చేయాలి.
ఆయన
ఇక్కడ 15 సంవత్సరాలుగా ఉంటున్నారు.
రాత్రి గం. 7.35ని.
హోమీబాబాతో
చాలా క్లుప్తంగా మాట్లాడాను.
ఇప్పటికిప్పుడు ఆయన నాతో మాట్లాడటానికి తీరికగా లేరు.
మరొకరోజు
ఆయనను కలుసుకుని మాట్లాడాలి.
ఇక్కడ
షిరిడిలో ఆయనకు చిన్న ఆశ్రమం ఉంది.
ఆయన
మెహర్ బాబాను కూడా కలుసుకున్నట్లుగా స్పష్టంగా తెలిసింది.
హోమీబాబా
పార్శీ మతస్తుడు.
ఆయన
బాబా వేషదారణలో ఆయనను అనుకరిస్తూ ఉంటారు. తెల్లని
దుస్తులు ధరించి తలకి తెల్లని తలపాగా చుట్టుకుని
ఉంటారు. ఆయన
చాలా విచిత్రంగా కనిపిస్తారు.
ఆయన
ప్రవర్తనని అంచనావేయడం సాధ్యం కాదు.
ఆయనది
కాస్తంత చిరాకుపడే స్వభావం.
కాని
అంతలోనే చాలా దయగా ఉంటారు.
ఆయనను
చూడగానే నాలో కలిగిన అభిప్రాయం
ఇది. ఇక్కడికి
వచ్చే చాలామంది పార్శీ భక్తులు ఆయనను ఎంతో గౌరవిస్తారు.
ఆయన
పెద్ద ధనికకుటుంబంనుంచి వచ్చారని స్వామి శేఖరరావు చెప్పాడు.
ఆతరువాత నేను మెహర్ బాబాకు భక్తుడయిన దేశ్ పాండే సాహెబ్ తో చాలా సావకాశంగా మాట్లాడాను. ఆయన మెహర్ బాబాకు వ్యక్తిగత ఫొటోగ్రాఫర్ గా ఉండేవారు. ఆయన గత ఒక సంవత్సరంగా షిరిడిలోనే ఉంటున్నారు. 1958 నుంచి ఆయన మెహర్ బాబాతోనే కలిసిఉంటూ చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆయనతో చాలా సేపు మాట్లాడకపోయినా మాయిద్దరి సంభాషణా 20 నుంచి 30 నిమిషాలవరకూ చాలా ఆనందంగా జరిగింది. ఆయన తీసిన మెహర్ బాబా ఫోటొలు మూడింటిని నాకు కానుకగా ఇచ్చారు.
సతీగోదావరి
మాతాజీతో కలిసి మెహర్
బాబా తీయించుకున్న
ఫోటో ఒకటి, మరొక ఫోటో అవతార్ శ్రీమెహర్ బాబా చుట్టూ అయిదుమంది గురువులు జ్ఞానానికి ప్రతీకగా తీసిన ఫోటో
ఇచ్చారు. ఆఫొటోలో
షిరిడీ
సాయిబాబా పైస్థానంలోను, ఇక కుడివైపునుండి వృత్తాకారదిశలో సద్గురు బాబాజాన్ (పూనా), తాజుద్దీన్ బాబా (నాగపూర్), నారాయణమహరాజ్ (ఖేడ్ గావ్), ఇక సద్గురు ఉపాసనీ బాబా (సాకోరీ) లు ఉన్నారు.
ఆతరువాత మేము సంస్థానానికి వెళ్ళాము.
రేపు
ఉదయం 11 గంటలకు సంస్థాన్ మేనేజర్ గారితో సంభాషించాలి.
దీనికోసం
నేను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను.
సరే
చూద్దాం. ఈరోజు
సాయంత్రం పల్లకీ ఉత్సవంలో పాల్గొనాలి.
రేపు
సమాధిఉత్సవాలు
బ్రహ్మాండంగా
జరిగే
రోజు. ఇప్పటికీ
చాలా మంది భక్తుల రాక పెరుగుతూ ఉంది.
అయిదు
లేక ఆరువేలమంది భక్తులు వచ్చి ఉండవచ్చు.
సంవత్సరంలో
రేపు చాలా పుణ్యప్రదమయిన రోజు కాబట్టి ఖచ్చితంగా షిరిడి చాలా రద్దీగా ఉంటుంది.
మొత్తానికి
ఇది మరొక పుణ్యదినం.
అన్ని
ఆరతిపాటలను నేను రికార్డు చేసుకున్నాను.
రాత్రి గం.9.40 నాగదిలో…
ద్వారకామాయినుంచి ప్రారంభమయిన పల్లకీ ఉత్సవంలో పాల్గొన్నాను.
అక్కడంతా
ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంది.
వాస్తవంగా
మసీదు
ఎంతో పవిత్రమయిన ప్రదేశం.
ప్రతివారి
హృదయాలలోను ఎంతో భక్తిభావం నిండిపోతుంది.
రాత్రి
సమయాలలో బాబా ధునిముందు కూర్చుని “అల్లామాలిక్” అని ఉచ్చరిస్తూ ఉండటం, పగటివేళలలో దర్బారులో తనను దర్శించుకోవడానికి వచ్చినవారిని ఆశీర్వదించడం, వారికి కధలను చెబుతూ దక్షిణ అడగటం ఇవన్నీ ఆరోజుల్లో ఏవిధంగా జరిగేవో అన్నీ నామనసులోనే ఆదృశ్యాలను ఊహించుకున్నాను.
బాబాగారి
తైలవర్ణచిత్రం
ఎంతో మనోహరంగా ఉంది.
ఆయన
కళ్ళు జీవశక్తితో నిండి ఎంతోశక్తివంతంగా చూసేవారి హృదయాలలోకి
చొచ్చుకొనిపోయేలా
ఉన్నాయి. పల్లకీ
ఉత్సవసమయంలో
సాయిబాబాకు, నారాయణబాబాకు భక్తురాలయిన ఒకామెతో నాకు పరిచయం కలిగింది.
ఆమెతో
నాసంభాషణ చాలా చక్కగా జరిగింది.
బొంబాయికి
శివారులో ఉన్న పాన్ వెల్ ఆశ్రమానికి వెడితే నారాయణబాబాగారిని కలుసుకోవచ్చని చెప్పింది.
ఆయనను
కలుసుకోమని నన్నెంతగానో ప్రోత్సహిస్తూ చెప్పింది.
ఆమె
చాలా మంచిమనిషి.
ఆమె
చిరునవ్వు
ఎంతో మనోహరంగా ఉంది.
నేను
కూడా ఆవిధంగా చిరునవ్వు నవ్వగలనేమో చూడాలి.
ఈరోజుకి
ఇవే విశేషాలు.
ఇప్పటికే
చాలా అలసిపోయి నిద్రకుపక్రమించాను.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment