18.02.2021 గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస
గ్రంధము – 46 వ.భాగమ్
(పరిశోధనావ్యాస రచయిత… శ్రీ ఆంటోనియో
రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ – కోపర్ గావ్ – షిరిడీ
సోమవారమ్ – అక్టోబరు, 21, 1985
షిరిడీలో హోమీబాబా ఆశ్రమం వద్ద సాయంత్రం గం.5.30
పార్శీ మహాత్ముడయిన హోమీబాబాను దర్శించుకున్న తరువాత నాకు కలిగిన అభిప్రాయాలు -
ఆయనను
దర్శించుకున్న
వెంటనే ఈ వ్యాఖ్యలను వ్రాసుకున్నాను.
ఎంతోమంది భక్తులు తన చుట్టూ
గుమిగూడి ఉన్న సమయంలో హోమీబాబా సాయిబాబా పటం ముందు మంత్రం గాని ప్రార్ధన గాని చేస్తుండటం చూసాను.
ఆయన
చుట్టూ ఉన్న భక్తులలో చాలామంది పార్శీవారే.
హోమీబాబా మెహర్ బాబా శిష్యుడయి ఉండవచ్చని లేక ఆయన గతంలో ఆయనను కలుసుకుని ఉండవచ్చని నా దుబాసీ స్వామి శేఖరరావు చెప్పాడు.
ఆ
తరువాత ఈ విషయాన్ని హోమీబాబా ఖండించారు.
సాయిబాబాలాగే వేషధారణ చేసుకుని ఇప్పటికీ గత పదకొండు సంవత్సరాలుగా హోమీబాబా షిరిడిలోనె ఉంటున్నారు.
హోమీబాబా ఒక విచిత్రవ్యక్తిగా నాకనిపించారు.
ఆయన
పధ్ధతులు వేరుగాను మరియు మొరటుగాను ఉన్నాయి.
ఇంకా
చెప్పాలంటే ప్రత్యేకించి ఆయనలో ఒక విచిత్రమయిన లక్షణం ఉంది.
ఆయన
తన చొక్కాను బాగా పైకెత్తి తన ఛాతీని తనను దర్శించడానికి వచ్చినవారందరికీ చూపిస్తారు.
తన
ఛాతీమీద గుండె ఉన్న స్థానంలో పెరిగిన గుబురు వెంట్రుకలను చూపిస్తూ అవి బాబాగారు కాలుమీద కాలువేసుకుని కూర్చున్న రీతిలో ఒక ఆకృతిలో కనిపిస్తాయని చూడమని చెబుతారు.
హోమీబాబా
చేసే ఈ చర్యని చూడటానికి ఎంతోమంది వస్తూ ఉంటారు.
దురదృష్టవశాత్తు నాకు
ఆయన ఛాతీమీద ఉన్న వెంట్రుకలు సాయిబాబా ఆకృతిలో కనిపించలేదు.
(ఈ
విధంగా ప్రజలను మాయ చేస్తూ తమకు తామే తమకు ఒక గొప్పతనాన్ని ఆపాదించుకుంటూ తామే బాబాకు అంకిత భక్తులయినట్లు బాబా తమమీదనే ఆవిధంగా తమ శరీరం మీద ఆకారంలో
ప్రకటితమవుతూ
ఉంటారని కొంతమంది ప్రచారం చేసుకుంటూ ఉంటారు…. త్యాగరాజు)
ఈ రోజు సాయిబాబావారి సమాధి ఉత్సవాల కారణంగా ఆయనకు తీరికలేకుండా ఉండటం వల్ల ఆయనకు మమ్మల్ని కలుసుకోవడం కుదరలేదు.
కొద్ది
రోజులలో నేను ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తాను.
మెహర్ బాబాకు (1894 – 1969) భక్తుడు మరియు వృత్తిరీత్యా ఫొటో గ్రాఫర్ అయిన శ్రీ దేశ్ పాండే సాహెబ్ తో సంభాషణ ...
శ్రీదేశ్ పాండే చెబుతున్న విషయాలు ---
నా పేరు దేశ్ పాండే.
25 సంవత్సరాలనుంచి నేను
మెహర్ బాబాకు భక్తుడిగా ఉంటున్నాను.
నేను
అహ్మద్ నగర్ నుంచి వచ్చాను.
1933 లో
మొట్టమొదటిసారిగా
మెహర్ బాబాగారిని ఫోటో తీశాను.
మెహర్
బాబా మహాత్ముడు అని మీకు తెలుసా?
నేనాయనకు
భక్తుడిని. ఆయనకు
ఎందరో శిష్యులు అమెరికావారు, భారతదేశంవారు ఉన్నారు. అహ్మద్ నగర్ దగ్గర ఉన్న మెహరాబాద్ లో జనవరి 31 న పెద్ద వేడుక జరుగుతుంది.
ప్రశ్న
--- మీరెప్పుడయినా మెహర్ బాబాను చూసారా?
జవాబు
--- అవును. చూసాను.
నేనాయనకు
ఫోటోలు తీస్తు ఉండేవాడిని.
ఆయన
చాలా శక్తికలవారు (తను తీసిన మెహర్ బాబా ఫొటొలు చిన్నవి, పెద్దవి తెలుపు నలుపు రంగులవి చూపించారు.)
ప్రశ్న
--- మీఉద్దేశ్యంలో మెహర్ బాబా తన శిష్యులకు బోధించిన అత్యంత ముఖ్యమయిన బోధలు చెబుతారా?
జవాబు
--- మెహర్ బాబా ప్రతివారికి, ప్రేమతోను, భక్తితోను మెలగమని బోధిస్తూ ఉండేవారు.
ప్రశ్న
--- మెహర్ బాబాకు షిరిడీసాయిబాబాతో ఉన్న అనుబంధం ఏమిటి?
జవాబు
--- సాయిబాబా మెహర్ బాబాగారికి గురువు.
ఉపాసనీ
మహరాజ్ కూడా ఆయన గురువే. అయిదుగురు సద్గురువులు కూడా మెహర్ బాబాకు గురువులు.
వారు
సాయిబాబా, ఉపాసనీ మహరాజ్, బాబాజాన్ (పూనా), తాజుద్దీన్ బాబా (నాగపూర్), నారాయణమహరాజ్.
ప్రశ్న
--- వ్యక్తిగతంగా మీకు మెహర్ బాబాతో కలిగిన అనుభవం ఏమయినా చెబుతారా?
జవాబు
--- మా అమ్మాయికి బాగా జబ్బుచేసింది.
వైద్యుడు
కూడా ఆమెను కాపాడలేనని చెప్పాడు.
అపుడు
నేను మెహర్ బాబాను ప్రార్ధించుకున్నాను.
ఒక
గంటలోనే మా అమ్మాయికి నెమ్మదించి నయమయింది.
మెహర్
బాబాతో నాకు కలిగిన అనుభవం ఇదే.
ప్రశ్న --- మీరు ఆయన ఆశ్రమం దగ్గరే ఉంటారా?
జవాబు
--- అవును.
మెహరాబాద్
కు బాగా దగ్గరలో ఉన్న అరన్ గావ్ లో ఉంటున్నాను.
జవాబు
--- 1970 నుండి ఉంటున్నాను. అరన్ గావ్ అహ్మద్ నగర్ కు చాలా దగ్గరలోనే ఉంది.
ప్రశ్న
--- మెహర్ బాబా
వ్యక్తిత్వం
ఎలా ఉండేది?
తుకారామ్
--- ఆయనకు పొడవాటి జుట్టు ఉంది
తెల్లగా
ఉండేవారు.
ప్రశ్న
--- అంటె నాఉద్దేశ్యం ఆయన ప్రవర్తన.
ఆయనకు
తరచుగా కోపం వస్తుండేదా లేక ప్రేమపూర్వకంగా ఉండేవారా?
జవాబు
--- లేదు లేదు, ఆయనకు కోపంలేదు.
ప్రేమగా
ఉండేవారు. ఎప్పుడూ
కోపగించలేదు. అందరిఎడల
ప్రేమగా ఉండేవారు.
ప్రశ్న
--- చాలా కాలంపాటు మెహర్ బాబాగారు మౌనంగానే ఉన్నారని విన్నాను.
దానిగురించి
ఏమయినా చెబుతారా?
తుకారామ్
--- మెహర్ బాబా మౌనంగానే ఉండటానికి సంకల్పించుకుని 1930 నుండి 1969 లో ఆయన సమాధి చెందేవరకు అలాగే మౌనాన్ని పాటించారు.
ప్రశ్న
--- అయితే 1930 నుంచి ఆయన ఇక ఎప్పుడూ మాట్లాడలేదా?
తుకారామ్
--- అవును.
ఆయన
ఏదయినా చెప్పదలచుకుంటె ఒక పలక మీద రాసేవారు.
ప్రశ్న
--- ఆయన ఈవిధంగా మౌనంగా ఉండటంలోని ముఖ్యోద్దేశం ఏమిటి?
తుకారామ్
--- తన గురువు ఆవిధంగా ఆదేశించారని మెహర్ బాబా తన శిష్యులకు చెప్పారు.
ప్రశ్న
--- ఇంతకుముందు మీరు చెప్పిన అయుదుగురు గురువులలో ఎవరు చెప్పారు?
తుకారామ్
--- ఉపాసనీ మహరాజ్
ప్రశ్న
--- మెహర్ బాబా అమెరికా కూడా వెళ్లారు కదా, విదేశంలో ఆయన ప్రభావం ఏమిటి?
తుకారామ్
--- కాలిఫోర్నియా, న్యూయార్క్ లలో మెహర్ బాబా కేంద్రాలు ఉన్నాయని అనుకుంటున్నాను.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment