01.03.2021 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస
గ్రంధము – 47 వ.భాగమ్
(పరిశోధనావ్యాస రచయిత… శ్రీ ఆంటోనియో
రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ – కోపర్ గావ్ – షిరిడీ
సోమవారమ్ – అక్టోబరు, 21, 1985
శ్రీ దేశ్ పాండె సాహెబ్ చెబుతున్న వివరాలు…
అమెరికాలో మెహర్ బాబాకు చాలామంది అనుచరులున్నారు…
ప్రశ్న
--- విదేశాలనుంచి మెహర్ బాబా భారతదేశానికి ఎప్పుడు వచ్చారు?
తుకారామ్ --- సంవత్సరం తరవాత
ప్రశ్న
--- ఏ సంవత్సరంలో?
తుకారామ్
--- ఆయన 1958 వ.సం.లో అమెరికా వెళ్ళి 1954 లో తిరిగి వచ్చారు.
ప్రశ్న --- తిరిగివచ్చిన తరవాత ఆయన ఎక్కడికి వెళ్ళారు?
తుకారామ్
--- ఆయన తిరిగి పూనా వెళ్ళిపోయారు.
ప్రశ్న
--- ఆశ్రమంలో మెహర్ బాబాగారి
దినచర్య ఎలా ఉండేది?
తుకారామ్
--- ఉదయం 5 గంటలకి ఆరతి, ప్రార్ధన
మొదలయేది. ఉదయం
గం.10.30 ని. బాబాదర్శనం ఉండేది.
వచ్చిన
ప్రతివాళ్ళు
బాబాని ప్రశ్నలు అడుగుతూ ఆయనకు ఉత్తరాలు ఇచ్చేవారు.
ఆయన
మౌనదీక్షలో ఉండటంవల్ల
వారిచ్చిన కాగితాల
వెనకాల సమాధానాలు రాసేవారు.
ప్రశ్న
--- మధ్యాహ్నం ఏవిధంగా జరుగుతూ ఉండేది?
తుకారామ్
--- భజన కార్యక్రమాలు, పాటలు ఉండేవి.
సంగీత
వాయిద్యాలెన్నిటినో వాయించేవారు. తరచుగా
బాబా కూడా స్వయంగా పాడేవారు.
ప్రశ్న
--- బాబా మధ్యాహ్నం కూడా దర్శనం ఇచ్చేవారా?
తుకారామ్
--- లేదు.
ఉదయంపూట
మాత్రమే దర్శనం ఇచ్చేవారు.
బాబా
ఎప్పుడూ భక్తులనుండి డబ్బు గాని, దక్షిణ గాని స్వీకరించలేదు. ఎంతోమంది
భక్తులు మెహర్ బాబాకు చందాలిచ్చేవారు. భక్తులు సమర్పించిన చందాలతో ఆయన ఆస్పత్రులను కట్టించారు. ఎన్నో సేవాకేంద్రాలను నిర్మించారు. దానికి మనం ఆయనకు దన్యవాదాలు తెలుపుకోవాలి. బీదలకు అన్నదానం చేసేవారు ఒకసారి అరన్ గావ్ లో ఎన్నోరోజులపాటు సుమారు వేయిమందికి
అన్నదానం చేసారు.
ప్రశ్న --- ఆవిధంగా
సేవచేయడమే చాలా ముఖ్యమని మెహర్ బాబా గారు భావించారా?
జవాబు --- అవును. సేవచేయడమే లెక్కించబడుతుంది.
ప్రశ్న ----
సేవ, ప్రేమ?
జవాబు --- మెహర్
బాబాకు సేవ, ప్రేమ ఇవే ముఖ్యమయినవి. నేటికీ
ఆయన ఆశ్రమంలో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి.
ప్రశ్న --- భారతదేశంలో
మెహర్ బాబాకు చాలామంది శిష్యులు ఉన్నారా?
జవాబు --- మహారాష్ట్రలో
సుమారు 75,000 మంది, మొత్తం భారతదేశమంతా సుమారు 5 లక్షలమంది లేక 10 లక్షలమంది ఉంటారు.
ప్రశ్న --- ఇపుడు
మీరు సాయిబాబాతో షిరిడిలో ఉంటున్నారు. మెహర్
బాబాకు, షిరిడీసాయికి మధ్య బలమయిన బంధం ఉందని మీరు భావిస్తున్నారా?
జవాబు --- అవును. సాయిబాబాకు మెహర్ బాబాకు గురు శిష్య బంధం ఉంది.
ప్రశ్న --- గురుపరంపర?
జవాబు --- అవును
- గురుపరంపర.
ప్రశ్న --- అయితే
వారిద్దరూ ఒకటే అని, ఒకే వ్యక్తి మాట్లాడుతున్నారని మీరు భావిస్తున్నారా?
జవాబు --- అవును
ఒకరే.
ప్రశ్న --- మెహర్
బాబా ఎప్పుడు సమాధి చెందారు?
తుకారామ్ --- ఆయన
1969 వ.సం.లో సమాధి చెందారు.
ప్రశ్న --- ఆసంవత్సరం
నుంచి మీరు షిరిడీకి వచ్చేశారా?
తుకారామ్ --- లేదు. క్రిందటి సంవత్సరంనుండే నేను షిరిడీలో ఉంటున్నాను. అంతకుముందు నేను మెహర్ బాబా ఉన్న ప్రదేశాలలో ఉండేవాడిని.
ప్రశ్న --- అయితే
మీరు ఈమధ్యనే వచ్చారా?
తుకారామ్ --- అవును
ఈమధ్యనే
ప్రశ్న --- మీరు
మెహర్ బాబాకు ఫొటోగ్రాఫర్ గా పనిచేశారా?
జవాబు --- అవును. నేను మెహర్ బాబాకు ఫొటోగ్రాఫర్ ని.
ప్రశ్న --- అవసరమయినప్పుడు
ఆయన మిమ్మల్ని పిలుస్తూ ఉండేవారా?
జవాబు --- అవును. బాబా నన్ను ఏసమయంలోనయినా పిలుస్తూ ఉండేవారు. ఏసేవకయినా, భక్తులఎడల ప్రేమతో చేసే కార్యక్రమాలకయినా
పిలిచినపుడు నేను ఫోటోలు తీసేవాడిని. ఇపుడు
నాదగ్గర మెహర్ బాబాగారి నెగెటివ్ ఫొటోలు 5000 దాకా ఉన్నాయి. కట్టలు కట్టలు.
తుకారామ్ --- టోనీగారూ,
దేశ్ పాండే మీకు కొన్ని ఫొటోలు ఇద్దామనుకుంటున్నారు.
ప్రశ్న --- మెహర్
బాబా ఎలా ఉండేవారు? అంటే ఆయన చాలా గంభీరంగా
ఉండేవారా లేక ఉల్లాసంగా ఉండేవారా?
జవాబు --- ఆయన
చాలా ప్రశాంతంగా, ప్రశాంతమయిన మనసుతో సంతోషంగా ఉండేవారు. ఆయన ఎపుడూ నవ్వుతూ ఉండేవారు.
ప్రశ్న --- ఆయన
ప్రజలమీద కోపాన్ని చూపించేవారు కాదా?
తుకారామ్ --- లేదు,
ఆయనకు ఎప్పుడూ కోపం రాలేదు. ఆయన ప్రతివారిని
ప్రేమించేవారు. అందరినీ నవ్వుతూ పలకరించేవారు.
ప్రశ్న --- ఆయన
తన భక్తులను ఆలింగనం చేసుకునేవారా/
జవాబు --- అవును. పిల్లలను, వృధ్ధులను అందరినీ కౌగలించుకునేవారు.
తుకారామ్ --- ప్రేమస్వబావంతో
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment