02.03.2021 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస
గ్రంధము – 48 వ.భాగమ్
(పరిశోధనావ్యాస రచయిత… శ్రీ ఆంటోనియో
రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ – కోపర్ గావ్ – షిరిడీ
సోమవారమ్ – అక్టోబరు, 21, 1985
శ్రీ దేశ్ పాండె సాహెబ్ చెబుతున్న వివరాలు…
నేను (ఆంటోనియో) --- బొంబాయిలో నేను మెహర్ బాబాగారి గురించి ఆంగ్లంలో
ప్రచురించిన పుస్తకాలను చాలా చూసాను. అమెరికాలో
మెహర్ బాబా భక్తులు చాలామంది ఉన్నారని నాకు తెలుసు. ఇక్కడ ఉపాసనీమహరాజ్ కు కొంతకాలంపాటు శిష్యుడిగా
ఉన్న ఒకాయన ఇక్కడ షిరిడీలో ఉన్నారనీ, ఆయనకు మెహర్ బాబాతో వ్యక్తిగతంగా పరిచయం ఉందని
తెలిసింది. ఆయనను కలుసుకొని మాట్లాడే అవకాశం
దొరుకుతుందని అనుకుంటున్నాను. సాయిబాబా ఆయనను
ఉపాసనీ మహరాజ్ వద్దకు వెళ్ళి శిష్యుడిగా ఉండమని స్పష్టంగా చెప్పారు.
జవాబు --- అవును.
నేను (ఆంటోనియో)
--- ఆయన కూడా తనకు తానే అవతారమని ప్రకటించుకొన్నారు.
జవాబు --- అవును.
తుకారామ్ --- దేశ్
పాండె గారి స్టూడియోలో మీకు మెహర్ బాబా గారి పెద్ద ఫొటో కనిపిస్తుంది. దానిని చూశారా మీరు?
ప్రశ్న --- నిజంగా
ఆయన అంత శక్తిమంతులా? ఆయన ఏమయినా అధ్భుతాలు
చేసారా?
తుకారామ్ --- అవును. చాలా అధ్బుతాలు చేసారని దేశ్ పాండె గారు చెప్పారు. కాని నేను వాటిని చూడలేదు. 1957 వ.సం. లో మెహర్ బాబా గారు సాకోరీ వచ్చి గోదావరి
మాతాజీని కలుసుకొన్నారని దేశ్ పాండేగారు చెప్పారు.
ప్రశ్న ---
1957 వ.సంవత్సరంలోనా?
తుకారామ్ --- అవును.
ప్రశ్న ---
28 సంవత్సరాల క్రితమా?
తుకారామ్, --- అవును. (ఆయన గోదావరి మాతాజీని కలుసుకున్న ఫొటోలను దేశ్
పాండే గారు చూపించారు)
ప్రశ్న ---
(ఫొటోలను చూస్తూ) ఈ ఫొటోలలో మెహర్ బాబా చాలా యువకుడిలా కనిపిస్తున్నారు. ఇవన్నీ మీరే తీసారా?
జవాబు --- అవును.
ప్రశ్న --- మెహర్
బాబాగారు పొగత్రాగేవారా?
తుకారామ్ --- లేదు
అస్సలు పొగత్రాగేవారు కాదు. ఆయన చిలుము కాని,
సిగరెట్లను కాని కాల్చేవారు కాదు. కనీసం వక్కపొడి
కూడా వేసుకునేవారు కాదు.
ప్రశ్న --- ఆయన
శాఖాహారా?
తుకారామ్ --- కాదు.
ఆయన శాఖాహారం, మాంసాహారం రెండూ తీసుకునేవారు.
దేశ్ పాండెగారు మొట్టమొదటగా 1958 లో మెహర్ బాబా గారిని కలుసుకొన్నారు. ఆ సంవత్సరానికి ముందు ఆయన తండ్రిగారు మెహర్ బాబా
వద్ద పనిచేసేవారు.
ప్రశ్న --- ఆవిధంగా
మీకుటుంబమంతటికీ మెహర్ బాబాతో సంబంధం ఉందా?
జవాబు --- అవును.
తుకారామ్ --- ఆయన
తండ్రిగారు కూడా మెహర్ బాబాకు ఫొటోలు తీసేవారు.
బాబా ఆయనకు ఏపని చెబితే ఆపని చేస్తూ ఉండేవారు. ముఖ్యంగా వేడుకలు జరిగే సమయాలలో… అపుడు 1958 వ.సంలో దేశ్ పాండే గారు తనే స్వయంగా
ఫోటోలు తీసేవారు. ఆవిధంగా చెబుతున్నారు ఆయన…
నేను
(ఆంటోనియో) --- ధన్యవాదాలు.
మా
సంభాషణ ముగిసిన తరువాత దేశ్ పాండేగారు నాకు చాలా రకాల ఫోటోలు చూపించారు. వాటిలోనుంచి మూడు ఫోటోలను నన్ను తీసుకోమన్నారు.
(రేపటి సంచికలో అక్టోబరు 22, 1985 న డైరీలోని విశేషాలు)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment