16.03.2021 మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబా
– పరిశోధనా వ్యాస గ్రంధము – 53 వ.భాగమ్
(పరిశోధనా
వ్యాస రచయిత శ్రీ ఆంటోనియో రిగోపౌలస్, ఇటలీ)
తెలుగు
అనువాదమ్ ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,
హైదరాబాద్.
ఫోన్
నంబర్ 9440375411 &
8143626744
మైల్
ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ – బుధవారమ్,
అక్టోబరు 23, 1985
మధ్యాహ్నం గం.12.15 --- నా హోటల్ గదిలో ఈ రోజు ఉదయం చాలా ఆహ్లాదకరంగా ఉంది. సాయిబాబాను ఎరిగున్నవాళ్ళలో మరొక వృధ్దుడిని కలుసుకొని మాట్లాడే అవకాశం లభించింది. ఆయన పేరు శ్రీ పండరినాధ్ భగవంత్ గోవం కర్. సాయిబాబా సమాధి చెందినపుడు ఆయన వయస్సు 12 సంవత్సరాలు. పూర్వపు రోజులలో సాయిబాబాను చూసి ఇప్పటికీ జీవించి ఉన్న వ్యక్తులలో ఈయన ఆరవవ్యక్తి. ఈయనను మేము కలుసుకోగలిగాము.
మేమిద్దరం చాలా చక్కగా మాట్లాడుకున్నాము. ఆతరువాత నేను, స్వామి శేఖరరావు ఇద్దరం కలిసి మారుతీ
మందిరాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీరామదాస్ విఠోబాజీ హజారే గారిని కలుసుకోవడానికి వెళ్ళాము. ఆయనకు 55 సంవత్సరాలు. గత 15 సంవత్సరాలుగా ఆయన ఇక్కడే ఉంటున్నారు. మేమిద్దరం ఎంతో ఆనందంగా మాట్లాడుకొన్నాము. మాటల మధ్యలో తాను షిరిడీకి ఏవిధంగా రప్పించబడ్డారో
వివరించారు. ఆ తరువాత నేను శ్యామా కుమారుడయిన
ఉద్దవరావు మాధవరావు దేశ్ పాండేని రెండవసారి ఇంటర్వ్యూ చేసాను. ఇది చాలా అధ్భుతమయిన ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ గంటన్నర పైగా సాగింది. ఆయన ఎన్నో సంఘటనలని, వృత్తాంతాలని వివరించారు. నేను ఆరవ మినికాసెట్ లో ఇదంతా రికార్డు చేసాను. ఇప్పటివరకు 9 గంటలకు పైగా సాగిన ఇంటర్వ్యులను రికార్డు
చేసాను. ఎంతో శ్రమకోర్చి రికార్డు చేసిన ఈ
టేపులన్నీ ఎంతో విలువయిన సమాచారం కలిగి ఉండటం వల్ల అత్యంత విలువయినవి.
ఆ తరువాత నేను బాబా గారి పుణ్యతిధి ఆఖరివేడుకలలో పాల్గొన్నాను. కృష్ణుడిని
కీర్తిస్తూ కొన్ని అధ్భుతమయిన పాటలు పాడారు.
నాట్యప్రదర్సన,
కుస్తీపోటిలు
జరిగాయి. వేడుకలు జరుగుతున్న ప్రదేశమంతా ఎంతో కోలాహలంగాను, సంతోషదాయకంగాను ఉంది.
సరిగ్గా
మధ్యాహ్న సమయం అయ్యేసరికి వేడుకలన్నీ
ముగుస్తున్నాయనడానికి
గుర్తుగా ఒక పొడవాటి ఎఱ్ఱరంగు కఱ్ఱతో పెరుగు, తీపిపదార్ధాలతో మరెన్నిటితోనో నిండివున్న
కడవను పగలకొట్టారు. సమాధిమందిరంలో సుందరమయిన పూలదండను వ్రేలాడదీసారు.
వేడుకలన్నీ చాలా అధ్భుతంగా జరిగాయి.
ఎంతోమంది
భక్తులు ఆవేడుకలని
కనులారా తిలకించారు.
ఇక
పుణ్యతిధి ఉత్సవాలన్నీ ముగియడంతో షిరిడీకి వచ్చిన భక్తులందరూ తిరుగు ప్రయాణ సన్నాహాలలో ఉంటారు.
ఇక్కడ జరిగిన ఈ ఉత్సవాలను తిలకించడానికి గత మూడురోజులలో యాభైవేలమంది
దాకా భక్తులు వచ్చి ఉంటారని స్వామి శేఖరరావు అన్నాడు.
సామాన్యంగా
మామూలు రోజులలో ఏరోజైనా సరే సుమారు రెండువేలమంది దాకా భక్తులు షిరిడికి వస్తారని చెప్పాడు.
అతను
ఇక్కడ ఎప్పటినుంచో ఉంటున్న కారణంగా భక్తుల రాక గురించి అనుభవంతో చెప్పిన మాటలలో నాకు నమ్మకం
కలిగింది. ఎండ
బాగా ఉన్నా గాని వాతావరణం ఎప్పుడు బాగానే ఉంటోంది.
ఎండ
మరీ వేడిగా లేకున్నా భరించగలిగేలాగే ఉంది.
మేమిద్దరం
అక్కడికీ
ఇక్కడికీ అందరినీ కలుసుకోవడానికి చాలా శ్రమకోర్చి తిరుగుతున్నా గాని మంచి ఫలితాలు రావడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది.
కాసేపట్లో
క్రిందకి వెళ్ళి రెస్టారెంట్ లో భోజనం చేయాలి.
ఆ
తరవాత సాయంత్రం నాలుగు గంటల వరకు విశ్రాంతి తీసుకోవాలి.
సాయంత్రం గం.5.20 --- మేము
హోమీ బాబాను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లాము.
కాని
అక్కడ ఆయన దగ్గర చాలా మంది ఉండటం వల్ల కలుసుకోలేకపోయాము.
అక్కడ
నిజంగానే చాలా రద్దీగా ఉంది.
రేపు
ఉదయం 8 గంటలకు
మరొకసారి ప్రయత్నించాలి.
హోమీబాబా
ఒక విచిత్రమయిన వ్యక్తి.
ఆయన
తన చాతీమీద గుండె ఉన్న స్థానంలో గుబురుగా పెరిగిన
వెంట్రుకల
మీద సాయిబాబావారి రూపం కనిపిస్తూ ఉంటుందని చెబుతూ, వచ్చిన ప్రతివారికీ తన చాతీని చూపిస్తూ రకరకాలుగా దర్శనం ఇస్తూ ఉంటారు. స్పష్టంగా నాకేమీ కనిపించలేదు.
కొంతసేపటి
తరువాత మేము అప్పాసాహెబ్ బొరావకే గారి ఇంటికి వెళ్ళి ఆయన కొడుకును కలుసుకోవాలి.
రాత్రి గం.11.15… నా హోటల్ గదిలో సాయంత్రం బలదేవ్ గ్రిమేతో కలిసి అప్పాసాహెబ్ బొరావకే గారి కుమారుడు వసంత్ శంకర్ బొరావకే గారిని కలుసుకుని మాట్లాడాము. సాయంత్రం వారితో జరిపిన సంభాషణ చాలా ఆనందదాయకంగా జరిగింది. అప్పాగారికి సాకూరీ ఆశ్రమం అంటే అంతగా ఇష్టం లేనట్లుగా కనిపించింది. కారణం ఏమిటో స్పష్టంగా తెలీదు. వారు తాము సందర్శించిన ఢిల్లీ, సిమ్లా, కాశ్మీర్ ఫోటోలను చూపించారు. రాత్రి మేమందరం కలిసి భోజనం చేసాము. వారి గృహం చాలా పెద్దదిగాను, చాలా అందంగాను ఉంది. వారి కుటుంబం ఎంతో అన్యోన్యంగాను సంతోషంగాను గడుపుతున్న కుటుంబం. వారు భూస్వాములు కనుక ఖచ్చితంగా వారు ధనవంతులే అని తెలుస్తోంది. ఇక్కడ వారు ప్రధానంగా పండించే పంట చెఱకు. వారికి నా గురించి, నేను చేస్తున్న పరిశోధన గురించి వివరించాను. వాతావరణం చాలా హాయిగా ప్రశాంతంగా ఉంది. నన్ను కలుసుకోవడం వారికెంతో ఆనందాన్నిచ్చిందని అన్నారు. హిందూ మతం గురించి, సాయిబాబా గురించి నాకు ఎందుకని ఆసక్తి కలిగిందో తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో నన్ను ప్రశ్నించారు. రాత్రి 11 గంటలకు హోటల్ గదికి చేరుకొన్నాను. చాలా అలసిపోయి వెంటనే నిద్రకుపక్రమించాను.
(రేపు గోవంకర్ గారితో జరిపిన సంభాషణా వివరాలు)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment