Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, March 17, 2021

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 54 వ.భాగమ్

Posted by tyagaraju on 7:40 AM

 




17.03.2021  బుధవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 54 .భాగమ్

(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేటహైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com


రోజు ఇంటర్వ్యూ విశేషాలు.

షిరిడీలో శ్రీ పండరినాధ్ భగవంత్ గోవంకర్ గారి ఇంటిలో ఉదయం గం.  8.15

శ్రీ పండరినాధ్ గోవంకర్ గారితో జరిపిన సంభాషణ.

శ్రీ సాయిబాబా మహాసమాధి చెందినపుడు ఆయన వయస్సు 12 సంవత్సరాలు.

ప్రశ్న   ---   బాబా సమాధి చెందిన సమయంలో మీకు గుర్తున్న వివరాలు చెబుతారా?

తుకారామ్   ---   ఆయన ప్రతిరోజు బాబాను కలుస్తూ ఉండేవారు.

పండరినాధ్ భగవంత్ గోవన్ కర్

బాబా నాకు ప్రసాదం మాత్రమే ఇచ్చేవారు.  డబ్బు కాని, మరి ఏ ఇతరమైనవి కాని ఇవ్వలేదు.

ప్రశ్న   ---   మీకు ఎప్పుడయినా బాబాతో మాట్లాడే అవకాశం లభించిందా?  బాబా మీకు ఎప్పుడయినా ఏదయినా చెప్పారా?

జవాబు   ---   నేను బాబాను కలుసుకోవడానికి మసీదుకు వెళ్ళినపుడు బాబా నాకు ప్రసాదం ఇచ్చి, మసీదులో కొంతసేపు కూర్చోమని చెప్పేవారు.


ప్రశ్న   ---   మిమ్మల్ని కూర్చోమని మాత్రమే ఎందుకని చెప్పేవారు?

తుకారామ్   ---   అవును, కూర్చోమనే చెప్పేవారు.  బాబా ఆయమీద ఎంతో ప్రేమగా ఉండేవారు.  బాబా ఆయనతో గోవంకర్, కూర్చో, మసీదులో కొంతసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళు అనేవారు.

ప్రశ్న   ---   బాబా ఆరోజుల్లో ఏమిచేస్తూ ఉండేవారు?  ఆయన దినచర్య ఏమిటి?

జవాబు   ---   అప్పట్లో నేను చాలా చిన్నవాడిని.  నేను మసీదుకు ఒక్కసారి మాత్రమే వెడుతూ ఉండేవాడిని.  బాబాను కలుసుకున్న తరువాత తిరిగి వెళ్ళిపోయేవాడిని.

ప్రశ్న   ---   బాబా గురించి ముఖ్యంగా చెప్పదలచుకున్న విషయం ఏదయినా మీరు గుర్తుకు తెచ్చుకుని చెప్పగలరా?

జవాబు   ---  లేదు.  బాబా నాకు ప్రసాదం మాత్రమే ఇచ్చేవారు.  అంతకు మించి ఏమీ లేదు.

ప్రశ్న   ---   బాబా భక్తులను ఏవిధంగా దీవిస్తూ ఉండేవారు?  ఆయన వారి తల మీద చేతులు పెట్టి దీవించేవారా?

జవాబు   ---   అవును.  ఆయన తన చేతులను వారిపై ఉంచి ఆశీర్వదించేవారు.   ఆశీర్వదించే సమయంలో బాబా ఈవిధంగా అనేవారు. “అల్లా బరా కరేగాఅనగాభగవంతుడు మీకు సహాయం చేయడానికి చేయవలసినదంతా చేస్తాడు.”

ప్రశ్న  --- “అల్లా రఖేగా…?”

తుకారామ్   ---   అల్లా బరా కరేగాఅర్ధం, “భగవంతుడు చేస్తాడు” “ఆయన సహాయం చేస్తాడు

ప్రశ్న   ---   బాబా భాలో మాట్లాడేవారు?

జవాబు   ---   ర్దూ, మరాఠీ

ప్రశ్న   ---   ఆయన హిందీ కూడా మాట్లాడేవారా?

తుకారామ్   ---   అవును.  హిందీ కూడా మాట్లాడేవారు.

ప్రశ్న   ---   అయితే ఆయన ఉర్దూ, మరాఠీ, హిందీ భాషలు మాట్లాడేవారన్న మాట?

తుకారామ్   ---  అవును, బాబా అందరితోను ఉర్దూ, మరాఠీ, హిందీ భాషలలో మాట్లాడేవారు.

ప్రశ్న   ---   సాయిబాబా సమాధి చెందిన వెంటనే ఏమి జరిగింది?

జవాబు   ---   అప్పటికి నేను చాలా చిన్నవాడిని.  నాకేమీ గుర్తు లేదు.

తుకారామ్   ---   ఆయనకు ఇపుడు 80 సంవత్సరాల వయసు.

ప్రశ్న   ---   బాబా కోపగించడం మీరు ఎప్పుడయినా చూసారా?

జవాబు   ---   అప్పుడప్పుడు.  భక్తులు తప్పులు ఏమయినా చేస్తే అపుడు బాబాకు కోపం వచ్చి వారిని శిక్షించేవారు, కొట్టేవారు (నవ్వుతూ).  ఆయన ఆవిధంగా ఒక ఆటలాగా సరదాగా కూడా చేసేవారు.  వారిని బాధించే ఉద్దేశ్యంతో కాదు.

ప్రశ్న   ---   బాబా మీకెప్పుడయినా ఊదీనిచ్చారా?

జవాబు   ---   అప్పుడప్పుడు ఆయన నాకు ఊదీనిచ్చేవారు.


ప్రశ్న   ---   ఊదీలో ఉన్న శక్తి ఏమిటి?

జవాబు   ---   (నవ్వుతూ)  బాబా ఊదీనిచ్చిన వెంటనే ఎవరయినా సరే నుదుటికి రాసుకుని, ఆతరువాత నోటిలో వేసుకునేవారు.  సాధారణంగా ఊదీని నీళ్ళలో కలిపి తీసుకుంటారు.  ఆవిధంగా బాబా ఆశీర్వదించేవారు.  బాబా తాత్యాకోతే పాటిల్ కి ప్రతిరోజు రూ.50/- ఇవ్వడం నేను కళ్ళారా చూసాను.

ప్రశ్న   ---   యాభై రూపాయలా?

తుకారామ్   ---   అవును.  ప్రతిరోజు తాత్యాకోతే పాటిల్ కి యాభై రూపాయలను ఇస్తూ ఉండేవారు.


ప్రశ్న   ---   ఉపాసనీ మహరాజ్ గారి గురించి మీకేమయినా తెలుసా?

జవాబు   ---   ఉపాసనీ బాబా షిరిడీలో రెండు సంవత్సరాలు ఉండటం చూసాను.  తరువాత బాబా ఆయనమీద కోపగించి సాకూరీకి పంపించి అక్కడే ఉండమన్నారు.

ప్రశ్న   ---   బాబాకు ఆయన మీద కోపం వచ్చిందా?

తుకారామ్   ---   అవును.  ఉపాసనీ మహరాజ్ మీద బాబాకు కోపం వచ్చి సాకూరీకి పంపించారు.

ఆంటోనియో   ---   నాకు ఇది అర్ధం కావటంలేదు.  ఇప్పటివరకు ప్రతివారూ ఉపాసనీ మహరాజ్ గొప్ప గురువు అనే చెప్పారు నాకు.

తుకారామ్   ---   ఉపాసనీ బాబా షిరిడిలో మంచిది కాని పని ఏదో చేసారని విన్నాను.  అందువల్ల గ్రామస్థులకి ఆయన మీద ఒక చెడు అభిప్రాయం ఏర్పడింది.  దానివల్ల వారంతా బాబా దగ్గరకు వెళ్ళి, “ఉపాసనీ బాబా ఈవిధంగా చేసారు, ఆవిధంగా చేసారు, ఆయన ఇక్కడ షిరిడీలో ఇక ఉండటానికి వీల్లేదు, లేకపోతే మేమే ఆయన తగిన గుణపాఠం చెబుతాము” అన్నారు.  అపుడే సాయిబాబా ఉపాసనీ మహరాజ్ ను సాకూరీకి పంపించేసారు.

ప్రశ్న   ---   మెహర్ బాబా గురించి ఏమయినా చెప్పగలరా?

తుకారామ్   ---   లేదు, ఆయనకు మెహర్ బాబా గురిం చి ఏమీ తెలీదు.

ప్రశ్న   ---   బషీర్ బాబా గురించి గాని నారాయణబాబా గురించి గాని ఏమయినా తెలుసా?

తుకారామ్   ---   ఆయనకు వారిద్దరి గురించి ఏమీ తెలీదు.

ప్రశ్న   ---   బాబా మసీదులోపల ఏమి చేస్తూ ఉండేవారు? ధుని ముందు కూర్చుని ఆయన ధ్యానచింతనలో ఉండేవారా లేక భక్తులతో మాట్లాడేవారా?  మీకు ఏమయినా గుర్తుందా?

జవాబు   ---   అప్పట్లో నావయస్సు పది లేక పన్నెండు సంవత్సరాలు ఉంటుంది.  అందుచేత నాకంతగా గుర్తులేదు.  ఏమయినప్పటికీ ఆయన ధుని ముందు కూర్చుని భగవంతుని నామాలను స్మరించుకోవడం, లేక తనలో తానే “అల్లా మాలిక్” అనడం చేస్తూ ఉండేవారు.  బాబాను కలుసుకున్నవాళ్ళు చాలామంది ఉన్నారు.

ప్రశ్న   ---   మసీదులోకి కుక్కలు, పిల్లులు, పక్షులు చాలా వస్తూ ఉండేవా?

జవాబు   ---   అప్పట్లో బాబాతో కుక్కలు అనేకం ఉండేవి.  బాబా వాటికి ఆహారం పెడుతూ ఉండేవారు.  ఆయన భోజనం చేసే ప్రతిసారి అవికూడా బాబాతోపాటుగానే తింటూ ఉండేవి.



ప్రశ్న   ---   షిరిడీ సాయిబాబాను దర్శించుకోవడానికి మీరు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి?

తుకారామ్   ----  ఆయన షిరిడి గ్రామస్తుడే

ప్రశ్న   ---   ఓహ్, మీరు షిరిడి గ్రామస్తులేనా?

జవాబు   ---   అవును.

ప్రశ్న   ---   బాబా గురించిన వృత్తాంతం మీకేమయినా గుర్తుందా?

తుకారామ్   ---   ఆయన అప్పటికి చాలా చిన్నవాడు.  అందువల్ల ఆయనకంతగా గుర్తులేదు.

ప్రశ్న   ---   అయితే బాబా సమాధి చెందిన నాలుగు లేక అయిదు సంవత్సరాల తరువాత ఇక్కడి వ్యవహారాలన్నిటికీ ఎవరు బాధ్యత వహించారు?

జవాబు   ---   బాబా సమాధి చెందిన తరువాత తాత్యా కోతే పాటిల్,  బాయజాబాయి, లక్ష్మీబాయి షిండే, ఇంకా మరిద్దరు సమాధియొక్క రక్షణ వ్యవహారాలను చూసేవారు.

ప్రశ్న   ---   అయితే ఆ వ్యవహారాలన్నిటిని వారే స్వయంగా నిర్వహించారా?

తుకారామ్   ---   అవును.

ప్రశ్న   ---   ఆరోజుల్లో షిరిడీ బయట ప్రదేశాలనుండి కూడా భక్తులు వచ్చేవారా?

జవాబు   ---   ఆరోజుల్లో షిరిడీ బయట ఊళ్ళనుంచి కూడా కొంతమంది భక్తులు వచ్చి బాబా దర్శనం చేసుకుని తిరిగి ఇళ్ళకు వెళ్ళిపోతూ ఉండేవారు.

ప్రశ్న   ---   వారంతా ప్రక్క న ఉన్న గ్రామాలనుండి వచ్చేవారా?

జవాబు   ---   అవును.  దగ్గరలో ఉన్న గ్రామాలనుండి వస్తూ ఉండేవారు.  బొంబాయి, గుజరాత్, మద్రాసు, నాగపూర్ ల నుండి కూడా వచ్చేవారు.

ప్రశ్న   ---   అయితే చాలా చోట్లనుంచి వచ్చేవారా?

తుకారామ్   ---   అవును.  ఎన్నో ఊర్లనుండి వచ్చేవారు.  చాలామంది మద్రాసు, నాగపూర్, ముఖ్యంగా బొంబాయినుండి వచ్చేవారు.   ఇప్పటికే పండరినాధ్ భగవంత్ గోవంకర్ గారు అలసిపోయారు.  ఇవాళ్టికి చాలు.

నేను (ఆంటోనియో)   ---   మీసమయాన్ని వెచ్చించి అన్ని విషయాలు చెప్పినందుకు, మీ దయకు నా ధన్యవాదాలు.

(ఇంకా ఉంది. తరువాత రామదాస్ విఠోబాజీ హజారేతో సంభాషణ)

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List