18.03.2021
గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 55 వ.భాగమ్
(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ మారుతీ
దేవాలయంలో ఉ. 10 గం.
మారుతీ మందిర
సంరక్షకుడు కాపలాదారుడు 55 సం. వయసు గల శ్రీ రామదాస్ విఠోభాజీ హజారేతో సంభాషణ…
ప్రశ్న --- మీరు
షిరిడీలో ఎంత కాలంనుండి ఉంటున్నారు?
జవాబు ---
15 సంవత్సరాలనుండి ఉంటున్నాను.
ప్రశ్న --- మీరు
ఇక్కడికి రావడం ఏవిధంగా సంభవించింది?
తుకారామ్ --- ఆయన
ఒక సాధువు లాగా జీవిస్తున్నారు
జవాబు --- నేను యవత్ మల్ నుండి వచ్చాను. నేను ఇక్కడ షిరిడిలో ఒక సన్యాసిలాగా జీవించుదామనే
ఉద్దేశ్యంతో వచ్చాను. నాకెప్పుడూ ఒక సాధువులాగా
సన్యాస జివితం గడపాలనే ఆకంక్ష. మొట్టమొదటగా
నేను గజానన్ మహరాజ్ గారి దర్శనం చేసుకోవడానికి షేన్ గావ్ వెళ్ళాను. అక్కడినుంచి నాసిక్ మీదుగా ఇక్కడికి వచ్చాను. త్ర్యంబకేశ్వర్ లో మారుతీ మందిరంలో నిద్రిస్తున్న
సమయంలో నాకు స్వప్నంలో షిరిడీకి వెళ్ళమని ఒక స్వరం వినిపించింది.
ప్రశ్న --- ఇది
మారుతీ మందిరంలో జరిగిందా?
తుకారామ్ --- అవును. మారుతీ మందిరంలోనే జరిగింది. అపుడే ఆయన షిరిడికి వచ్చారు.
ప్రశ్న --- ఇప్పటికి
15 సంవత్సరాలుగా ఆయన షిరిడీలోనే ఉంటున్నారా?
తుకారామ్ --- అవును. ఇక్కడ షిరిడిలో హనుమాన్ మందిరానికి కాపలావానిగా
రామదాస్ బాబా గారు, మందిరంలోనే ఉంటున్నారు.
శ్రీ రామదాస్ గుర్తుకు తెచ్చుకుని చెబుతున్న విషయాలు…
నేను మొదటిసారిగా షిరిడికి వచ్చినపుడు
గ్రామం బయట ఉన్న మరొక మారుతీమందిరం దగ్గరే ఉన్న చెట్టుక్రింద ఉన్నాను. ఆ తరువాత నేను స్వామి అవధూత మహరాజ్ గారిని కలుసుకొన్నాను. ఆయనే నాకు గురువు, బోధకులు..ఆయన అనుగ్రహం వల్లనే
నేను ఇక్కడకి షిరిడికి రాగలిగాను. ఇక్కడే మారుతీ
మందిరంలో నివాసం ఏర్పరచుకొన్నాను. ఆతరువాత
షిరిడీ గ్రామస్థులు నాకెప్పుడూ సహాయపడుతూనే ఉన్నారు. నా అవసరాలన్నీ తీరుస్తున్నారు.
ప్రశ్న --- అవసరాలు
అంటే మీకు భోజనం, కట్టుకోవడానికి బట్టలు వగైరా?
తుకారామ్ --- అవును. గ్రామస్థులు, బాబా భక్తులు అందరూ ఆయనకు భోజనం, బట్టలు
అన్నీ సమకూరుస్తున్నారు. హనుమాన్ మందిరానికి
కూడా ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు.
ప్రశ్న ---
సాయిబాబా గురించి మీరు ఏమనుకుంటున్నారు?
జవాబు --- నేను
వార్ధా దగ్గర ఒక చిన్న మిల్లులో కార్మికునిగా పని చేస్తున్నపుడు ఒకసారి బాబా ఫోటో చూసాను. నేను ఆయనను చూడటం అదే మొదటిసారి. సాయిబాబా నాకేదో సూచించారు. అపుడే నేను షిరిడీకి రావాలనే నిర్ణయం తీసుకున్నాను. ఆవిధంగా నేను షేన్ గావ్ లో గజానన్ మహరాజ్ గారిని
దర్శించుకుని, నాసిక్ మీదుగా ప్రయాణించి త్ర్యంబకేశ్వర్ లోని మారుతీ మందిరానికి చేరుకొన్నాను. అక్కడే నాకు స్వప్నంలో షిరిడికి వెళ్ళమనే స్వరం
వినిపించింది. అక్కడినుంఛి తిన్నగా షిరిడికి
చేరుకున్నాను.
ప్రశ్న --- సాయిబాబా
బోధించినవాటిలో అతి ముఖ్యమయినది ఏది అని మీరు భావిస్తున్నారు?
తుకారామ్ --- ఆయన
ఎప్పుడూ బాబాని కలుసుకోలేదు.
నేను (ఆంటోనియో)
--- అవుననుకోండి, కాని ఒక భక్తుడిగా
సర్వసంగ పరిత్యాగిగా ఆయన దీని గురించి ఏదయినా చెప్పేది ఉండవచ్చు.
జవాబు --- మీరడిగినదానికి
నేను ఏమని సమాధానం చెప్పాలో నాకు తెలియటల్లేదు.
నాకు ఉన్న నమ్మకమే నన్ను ఇక్కడికి రప్పించి మారుతీ మందిరంలో నివసించేలా చేసింది.
ప్రశ్న --- మీరు
మొదటిసారిగా ఇక్కడికి వచ్చినప్పటికి, ఇప్పటికీ షిరిడీ లో ఏవిధంగా మార్పులు జరిగాయి?
జవాబు --- ఈ
15 సంవత్సరాలలో చాలా మార్పులు జరిగాయి. భక్తుల
రాక బాగా పెరిగింది. ఇపుడు యాత్రికులు కూడా
బాగా వస్తున్నారు.
ప్రశ్న --- ఈ
రోజుల్లో చాలా మంది వస్తున్నారా?
తుకారామ్ --- అవును
, గతంలోకన్నా బాగా వస్తున్నారు.
ప్రశ్న --- భవిష్యత్తులో
సాయిబాబా ఉద్యమం ఏవిధంగా ఉంటుందని మీరు భావిస్తున్నారు?
జవాబు --- భవిష్యత్తులో
ఏవిధంగా ఉంటుందో నేనేమీ చెప్పలేను. ఏది ఎలా
జరగాలో అలాగే జరుగుతుంది.
ప్రశ్న --- అయితే
భవిష్యత్తు గురించి మీకెటువంటి చింతా లేదా?
తుకారామ్ --- ఆయన
భవిష్యత్తు గురించి గాని, లేక తన జీవితం గురించి గాని మరే ఇతర విషయాల గురించి గాని
ఏమీ ఆలోచించరు.
నేను (ఆంటోనియో)
--- రోజులు అలా గడిపేస్తూ ఉంటారు.
తుకారామ్ --- అవును. ఆయన అనేదేమిటంటే, “బాబా దయకు కృతజ్ఞతలు” అనే చెబుతారు.
నేను (ఆంటోనియో)
--- ఆయన ఉద్దేశ్యం ప్రకారం ప్రతీదీ
కూడా నమ్మకం, శ్రధ్ధ వీటి వల్లనే అని కదా?
తుకారామ్ --- అవును. అదే, శ్రధ్ధ… యదార్ధానికి దీనినే పరిగణలోకి తీసుకోవాలి.
ప్రశ్న --- ఇక్కడ
షిరిడీలో మేము కలుసుకోవలసిన భక్తులు ఇంకా ఎవరయినా ఉన్నారా?
జవాబు --- భారతదేశం
అన్ని ప్రాంతాలనుండి ఎంతోమంది ఇక్కడికి వస్తూ ఉంటారు. విదేశాలనుంచి కూడా వస్తారు. వారు ఇక్కడికి వచ్చి బాబాతో నా స్వంత అనుభవాలు ఏమయినా
ఉంటే వాటిని చెప్పమని అడుగుతూ ఉంటారు. నేను
ఇపుడు మీకేమి చెప్పానో అదే వారికి ఎపుడూ చెబుతూ ఉంటాను. అంతే.. నాకు మారుతీమందిరంలో వచ్చిన స్వప్నం గురించే
చెబుతాను.
ప్రశ్న --- మీజీవితంలో
జరిగిన అతి ముఖ్యమయిన సంఘటన ఏది? త్ర్యంబకేశ్వర్
లో మీకు వచ్చిన కలా?
తుకారామ్ --- అవును. అపుడె ఆయన షిరిడీకి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తరువాత ఆయన గురువు ఆయనను అనుగ్రహించి
ఇక్కడే ఉండమని చెప్పారు.
శ్రీ
రామదాస్ చెబుతున్న వివరాలు…
అవధూత మహరాజ్ గారు భవిష్యత్తు గురించి ఎటువంటి బెంగ పెట్టుకోవద్దని ఇక్కడే షిరిడీలోనే ఉండమని, నమ్మకంతో జీవించమని అన్నారు అంతే?
తుకారామ్ --- అవును.
శ్రీ
రామదాస్ ---
అవధూత
మహరాజ్ గారి పాదుకలు ఇక్కడ మారుతీమందిరంలో ఉన్నాయి. ఆయన తన పాదుకలను ఇక్కడే ఉంచారు. ఆయన వాటిని నాకు ఇచ్చారు. నేను నిరంతరం వాటితోనే ఉంటాను.
ప్రశ్న --- అవధూత
మహరాజ్ గారు సాయిబాబాను కలుసుకున్న సందర్భం ఏదయినా ఉందా?
జవాబు --- అవధూత
మహరాజ్ గారు ఇప్పటికీ ఉన్నారు.
నేను (ఆంటోనియో)
--- ఆయన ఇంకా జీవించే ఉన్నారా?
తుకారామ్ --- అవును. ఇంకా జీవించే ఉన్నారు. ఆయనకు 70 సం. వయస్సు ఉంటుందని చెబుతున్నారు రామదాస్
గారు.
నేను (ఆంటోనియో)
--- ఆయన చిన్నవారే
తుకారామ్ --- అవును చిన్నవారే. బాబా సమాధి చెందినపుడు బహుశ ఆయనకు మూడు సంవత్సరాల వయస్సు.
నేను (ఆంటోనియో)
--- ఆయన చాలా చిన్న పిల్లవాడు.
తుకారామ్ --- సాయిబాబా
మీద ఆయనకు ఎంతో నమ్మకం. అదే ఆయన అనుభవం.
ప్రశ్న --- ఆయన
షిరిడీలోనే ఉంటారా?
జవాబు --- అవధూత
మహరాజ్ గారు నాతోపాటే మారుతీ మందిరంలో రెండు సంవత్సరాలు ఉన్నారు. ఆ తరువాత ఆయన తన స్వస్థలమయిన త్ర్యంబకేశ్వర్ దగ్గర
నాసిక్ కి వెళ్ళిపోయారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో
అది కూడా ఒకటి.
ప్రశ్న --- ఇప్పుడు
కూడా ఆయన అక్కడే ఉంటున్నారా?
తుకారామ్ --- అవును.
నేను (ఆంటోనియో) --- ధన్యవాదాలు.
(రేపు మరొకరితో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment