21.03.2021
ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 57 వ.భాగమ్
(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ
– ఉద్దవరావు మాధవరావు దేశ్ పాండే గారి ఇంటిలో ఉ. గం. 11-30 కి
ఉద్దవరావు చెబుతున్న వివరాలు …
బాబా గారు జీవించి ఉన్న రోజులలో నాకు తాతగారు ఉండేవారు. మాతాతగారికి తొడలో ఏదో సమస్య వచ్చినందున వైద్యులు శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. మా తాతగారు షిరిడీ వచ్చి బాబాను కలుసుకుని “బాబా, నాకు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందన్నారు. ఏమి చేయమంటారని” అడిగారు.
అపుడు
బాబా మాతాతగారిని బాధిస్తున్న కాలు మీద కొన్ని ఆకులను వేసి గుడ్డతో కట్టు కట్టారు. బాబాగారు జోక్యం చేసుకోవడం వల్ల మూడు
రోజుల తరువాత వైద్యుని అవసరం లేకుండానే మాతాతగారి బాధ నయమయింది.
ప్రశ్న --- ఇది సాయి చేసిన అధ్భుతమా?
జవాబు --- అవును. నేను స్వయంగా చూసాను.
ఉద్దవరావు గారు ఇంకా చెబుతున్న వివరాలు …
మా తాతగారికి ఒక కూతురు ఉంది.
ఆమెకు వివాహం చేయదలచారు. ఇంతకుముందు, నేను చెప్పినట్లుగా వివాహం చేయడానికి ముందుగా తనకు ఉన్న అనారోగ్య సమస్యల వల్ల
షిరిడీకి వచ్చి బాబాను కలుసుకొన్నారు.
ఆ సందర్భంలోనే బాబా మాతాతగారి జబ్బును ఆవిధంగా మూడు రోజులలోనే
నయం చేసారు.
ప్రశ్న --- ఆయన కూతురి సంగతి ఏమిటి?
జవాబు --- ఆమెకు వివాహమయింది.
ప్రశ్న --- బాబాయే ఆవివాహాన్ని జరిపించారా?
జవాబు --- లేదు, లేదు. వివాహం మరొకరు చేసారు.
ప్రశ్న --- అయితే మీతాతగారు తన కాలికి ఉన్న
బాధ గురించి, బాబాను కలుసుకోవదానికి వచ్చారు గాని, కుమార్తె వివాహ విషయ గురించి మాత్రం కాదన్న మాట?
జవాబు --- ఆయన ఒక్కరే వచ్చారు. ఆయన తన స్వంత గ్రామంలోనే కుమార్తెకు
వివాహం చేద్దామనుకొన్నారు. ఆరోగ్య సమస్య వల్ల ఆయన బాబాను కలుసుకోవదానికి వచ్చారు. మూడు రోజులలోనే బాబా ఆయనకు నయం చేసారు. ఆతరువాత మాతాతగారు ఇంటికి వెళ్ళిపోయారు.
(ఉద్ధవరావు గారు ఇదే విషయాన్ని మరలా వివరిస్తూ చెప్పారు.)
ప్రశ్న --- మీనాన్నగారయిన శ్యామాగారు
భగవద్గీతలోని ఒక అధ్యాయాన్ని పైకి చదువుతుండగా బాబా ఆయనకు ఒక అధ్యాయాన్ని వివరించి
చెప్పారనే సంఘటనను నేను నరసింహస్వామిగారు వ్రాసిన పుస్తకం
‘Sri Sai Baba’s Charters and Sayings’ లో చదివాను. ఆతరువాత బాబా ఆయనను ప్రతిరోజు మసీదుకు
రమ్మని తను ఆతరువాతి
అధ్యాయాలను వివవరిస్తానని బాబా అన్నారు.
దీని గురించి మీకేమయిన గుర్తుందా?
జవాబు --- అది భగవద్గీత కాదు – విష్ణుసహస్ర నామం.
ఉధ్ధవరావు గారి వివరణ …
ఒక సాధువు ఇక్కడికి వచ్చి మారుతీ మందిరంలో ఉన్నాడు. ఆయన వద్ద విష్ణుసహస్ర నామం పుస్తకం
ఉంది. ఆయన హరిద్వార్
నుండి వచ్చాడు. ఆ సాధువు
లేని సమయంలో అంటే బజారుకు వెళ్ళినపుడు బాబా ఆపుస్తకాన్ని తీసి
మానాన్నగారయిన శ్యామాకు ఇచ్చారు. ప్రతిరోజు మసీదులో చదవమని చెప్పారు. బాబా “నీకేమన్న
వివరణ కావాలన్న, నిర్వచనం కావాలన్నా నన్ను అడుగు” అని చెప్పారు.
ప్రశ్న --- మీనాన్నగారు విష్ణుసహస్రనామం పుస్తకం
పట్టుకుని మసీదుకు వెళ్ళినపుడు బాబా ఆయనకి వాటన్నిటికీ అర్ధాలు వివరించి చెప్పేవారా?
లేక శ్యామాగారు మసీదులోనే కూర్చొని మౌనంగా చదువుకునేవారా?
జవాబు --- కొన్ని సార్లు శ్యామా గారు విష్ణుసహస్ర
నామాల యొక్క అర్ధాలను ఇంకా పూర్తిగా తెలుసుకోదలచినపుడు ఆయన బాబా దగ్గరకు వెళ్ళి అడిగేవారు. అపుడు బాబా ఆయనకు వాటి అర్ధాలను వివరించి చెప్పేవారు.
ప్రశ్న --- బాబా వాటికి అర్ధాలు వివరించి చెప్పేవారా?
తుకారామ్ --- అవును. ఆయన శ్యామాగారికి వివరించి చెప్పేవారు. వాటి అర్ధాలను విశదీకరించి చెప్పేవారు. “ అది అలాగా, ఇలాగా “ అని.
ప్రశ్న --- అయితే అది ఒక విధమయిన శిక్షణా?
తుకారామ్ --- అవును శ్యామాకు శిక్షణ..
ఉధ్ధవరావుగారు గుర్తుకు తెచుకుని చెబుతున్న విషయాలు…
నాకు ఆరు సంవత్సరాల వయసున్నపుడు మా నాన్నగారిని పాము కాటు వేసింది. ఆయన ఒక్కరే మసీదుకు వెళ్ళలేకపోయారు. గ్రామస్థులందరూ కలిసి బాబా దగ్గరకు
వెళ్ళి జరిగినదంతా వివరించారు. అపుడు బాబా, “అతనిని ఇక్కడకు తీసుకురండి, నేను చూస్తాను” అన్నారు. వారందరూ శ్యామాను మసీదుకు తీసుకువచ్చిన
వెంటనే బాబా ఆయన మీద కోపంతో అరుస్తూ “ ఆయింటికి వెళ్లవద్దని నేను
చెప్పాను” బాబా చెప్పిన
మాటకు బదులుగా శ్యామా అక్కడికి వెళ్ళినందువల్ల పాము కాటువేసింది. బాబా చాలా తీవ్రమయిన ఆగ్రహంతో చాలా
సేపు గట్టిగా అరవసాగారు. ఆతరువాత రెండు మూడు గంటలు గడిచిన తరవాత పాము విషం క్రిందకు దిగిపోయి శ్యామాకు
నయమయింది. బాబా ఆవిధంగా
గట్టిగా అరుస్తూ శ్యామాకు నయం చేసారు.
ప్రశ్న --- బాబా అతన అరుపులతోనే విషాన్ని పారద్రోలారా?
జవాబు --- అవును గట్టిగా అరిచి పాము విషం దిగిపోయేలా
చేసారు.
శ్యామా చిటికెన వ్రేలు నల్లగా అయిపోయింది. ఆ నలుపు ఆయన చనిపోయే వరకు అలాగే ఉంది.
ప్రశ్న --- పాము కరిచినందువల్లనే ఆవిధంగా నల్లగా
మారిందా? చిటికెన వ్రేలు
నల్లగా ఎందుకని మారింది?
తుకారామ్ --- పాము సరిగ్గ ఆయన చిటికెన వ్రేలు
మీదనే కాటు వేయడం వల్ల.
ప్రశ్న --- దానివల్ల ఆయనకు ఏమయినా ఇబ్బంది కలిగిందా?
జవాబు --- ఎటువంటి ఇబ్బందిగాని, నెప్పి గానీ ఏమీ లేదు.
ప్రశ్న --- సాయిబాబా గురించి, మీనాన్నగారి గురించి గాని లేక మీస్వంత అనుభవాలు ఏమయినా
ఉంటే వాటి గురించి చెప్పవలసినవి ఉన్నాయా?
ఉద్దవరావుగారు గుర్తుకు తెచుకుని చెబుతున్న విషయాలు…
మా నాన్నగారు మరణించినతరువాత ఒకసారి నాకు
హరిద్వార్ వెళ్ళి హిమాలయాలను, బదరీనాధ్,
గంగోత్రీ , యమునోత్రి అన్నీ చూడాలనిపించి బయలుదేరాను. ఆవిధంగా వెళ్ళిన సమయంలో మధ్య దారిలో
నావద్ద ఉన్న డబ్బు ఖర్చయిపోయి ఇక పది లేక పన్నెండు రూపాయలు మాత్రమే మిగిలాయి. అపుడు హరిద్వార్ నుండి షిరిడీకి తిరిగి రావాలంటే సుమారు
50, 60 రూపాయల దాకా అవుతుంది. ఏమి చేయాలో అర్ధం కాని పరిస్థితిలో
ఉండిపోయాను. ప్రతిరోజు
బాబా ఫోటోకి పూజ చేస్తు ఉండేవాడిని
పూజ చేస్తున్నపుడు బాబాను ఇలా ప్రార్ధించాను, “ఇపుడు నేనేమి చేయాలి? నాదగ్గర పది లేక పన్నెండు రుపాయలే ఉన్నాయి. షిరిడికి నేనెలా తిరిగి వెళ్లగలను.?” ఆవిధంగా నేను ఏడుస్తూనే ఉన్నాను. ఆసమయంలో ఖాందేష్ ప్రాంతంలో ఉన్న మాలేగావ్, జలగావ్ ల నుండి కొంతమంది వచ్చారు.
నేను ఏడుస్తూ బాధపడుతుండటం చూసి వారు “ ఏమి జరిగింది మీకు? మీరెక్కడినుంచి వచ్చారు” అని అడిగారు. నేను వారికి జరిగినదంతా చెప్పాను. అపుడు వారందరూ మీరేమీ బాధపడకండి. మీకు ఏది కావలసివస్తే అన్నీ మేము
సమకూరుస్తాము అని ధైర్యం చెప్పారు.
భోజనం చేసిన తరువాత విశ్రమించాను. మధ్యాహ్న సమయంలో ఒకతను వచ్చి నా సమస్య గురించి అడిగాడు
“ఎందుకని అలా ఏడుస్తూ నిరాశ చెందుతున్నావు”
అని ప్రశ్నించాడు. అతనికి నా పరిస్థితినంతా వివరించాను. అప్పుడతను, “నువ్వు నన్ను గుర్తించలేదా”? అని అడిగాడు. “నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు”
అని జవాబిచ్చాను. అపుడతను “నేను షిరిడీనుంచి వచ్చాను” అన్నాడు. అతను
తన కుటుంబం పేరు చాదూబాయా అని తను షిరిడి దగ్గర ఉన్న అర్ధందా గ్రామంనుండి వచ్చానని
చెప్పాడు. అతను కూడా
బాబా భక్తుడే. అతను నాకెంత
డబ్బు అవసరమో తెలుసుకుని నాకు రెండువందల రూపాయలిచ్చాడు.
ప్రశ్న --- అది చాలా పెద్ద మొత్తం కదా?
తుకారామ్ --- అవును. చాలా
చాలా ఎక్కువ.
ఉద్ధవరావుగారు ఇంకా చెబుతున్న వివరాలు ---
నేను అతను ఎక్కడ ఉండేది చిరునామా అడిగాను. అతను తన పేరు చాదూబాయా అని తను అర్ధానందలో
ఉంటానని చెప్పాడు. తన
కుటుంబం వారందరూ బాబా భక్తులే అని కూడా అన్నాడు. అతను తన చిరునామా
ఇచ్చాడు. అతను చేసిన
ధన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకుని షిరిడీకి తిరిగి రాగలిగాను. తిరిగి వచ్చాక అతని అప్పును తిరిగి చెల్లించేందుకు రెండువందలరూపాయలను
మనీ ఆర్డర్ ద్వారా అతని చిరునామాకు పంపించాను. కాని పదిహేను రోజుల తరవాత నేను పంపించిన
డబ్బు మరలా తిరిగి నాకే వచ్చింది.
ప్రశ్న --- ఎలా వచ్చింది?
జవాబు --- ఆవ్యక్తి అక్కడ ఆ చిరునామాలో లేడని
తిరిగి వచ్చింది.
ప్రశ్న --- ఆసమయంలో ఆగ్రామంలో ఆవ్యక్తి లేకపోవడం
వల్ల తిరిగి వచ్చిందా లేక ఆ గ్రామంలో ఆపేరు గల వ్యక్తే లేడని
తిరిగి వచ్చిందా?
జవాబు --- ఆపేరు గల వ్యక్తి ఆ గ్రామంలోనే లేడని
తిరిగి వచ్చింది.
ప్రశ్న --- అయితే ఆవ్యక్తి ఎవరయి ఉంటారని మీరు
భావిస్తున్నారు?
జవాబు --- నేను ఎప్పటికీ తెలుసుకోలేకపోయాను. ఒకసారి ఒక పోలీసు ఇన్స్పెక్టర్ బాబాను
దర్సించుకోవదానికి షిరిడీ వచ్చాడు.
అర్ధందా గ్రామంలో ఆ పేరు గల వ్యక్తి ఉన్నాడా
అని, ఆ చిరునామా ఉందా అని ఆయనను అడిగాను. ఆ గ్రామంలో అటువంటి చిరునామా లేనే
లేదని ఆయన చెప్పారు.
ప్రశ్న --- ఇదంతా బాబా చేసిన లీలా?
తుకారామ్ --- అవును బాబా చేసిన లీల.
ప్రశ్న --- అవిధంగా ఆయనకు రెండువందల రూపాయలు లభించాయా?
తుకారామ్ --- అవును, రెండువందల
రూపాయలు.
ప్రశ్న --- ఇదంతా ఎప్పుడు జరిగింది?
జవాబు --- 1944 వ.సంవత్సరంలో
(ఉధ్ధవరావు గారితో సంభాషణ సమాప్తం)
(ఇంకా ఉంది)
0 comments:
Post a Comment