23.03.2021
మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 58 వ.భాగమ్
( పరిశోధనా వ్యాస రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ – సాకూరీ
– షిరిడీ
గురువారమ్ –
అక్టోబరు, 24, 1985
నా డైరీలోని
ముఖ్యాంశాలు ---
ఉదయం – 9 గంటలకు
లెండీ బాగ్ లో
ఉదయం గం.
7.40 కి నిద్రనుండి లేచాను. ఆఖరికి హోమీబాబాను
కలుసుకుని క్లుప్తంగానయినా సరే మాట్లాడే అవకాశం దొరికింది. నాకాయనను చూస్తే అంతముఖ్యమయిన వ్యక్తిగా అనిపించలేదు. ఏమయినాగాని ఆయన స్వరంకూడా అందరిలాగానే ఉంది. ఆయన అందరిముందూ తన ఛాతీని చూపిస్తూ ఉన్నపుడు ఆయన
ఫొటో ఒకటి తీసాను. ఉదయం 10 గంటలకు బప్పా బాబాగారిని
ఆయన ఇంటివద్ద కలుసుకోవాలి.
సాయంత్రం గం.
4.40 ని. నా హోటల్ గదిలో ---
బప్పాబాబా గారిని
రెండవసారి ఇంటర్వ్యూ చేసాను. గంటన్నరపాటు మేమిద్దరం
చాలా చక్కగా మాట్లాడుకున్నాము. ఆ సమయంలో మేము
మొదటిసారి కలుసుకున్నపుడు చర్చించుకున్న సమస్యల గురించి మరింతగా మాట్లాడుకోగలిగాము. ఈ అవకాశం కలిగినందుకు నేనెంతో అదృష్టవంతుడిని.
బప్పాబాబా గారిని
కలుసుకున్న తరువాత నేను, స్వామి శేఖరరావు ఇద్దరం మరలా ఒకసారి సాకూరీలోని శ్రీ ఉపాసనీ
కన్యాకుమారి సంస్థానానికి వెళ్ళాము. శ్రీ టిప్నిస్
గారు నన్ను చాలా నిరాశపరిచారు. నన్ను ఎంతతొందరగా
పంపించాలో అంతతొందరగా పంపించేసారు. ఆయన ఆవిధంగా
పంపించేయడం నాకు చాలా అసంతృప్తిని కలిగించింది.
కాని నాకు సతీగోదావరి మాతాజీ దర్శనం కలిగింది. ఆవిడ నన్ను, నేను చేస్తున్న పరిశోధనకి మనఃస్ఫూర్తిగా
ఆశీర్వదించారు. ఆమె ఆశీర్వాదాలను నాకు లభించిన
అత్యంత విలువయిన సంపదగా భావిస్తున్నాను. ఇంక
నాకు మరేమీ అవసరం లేదు. నేను సాకూరీకి రావడం
ఇదే ఆఖరుసారి. మాతాజీతో ఇంటార్వ్యూ చేయలేకపోయినా
ఫరవాలేదు. మధ్యాహ్నం ఒంటిగంట అయేసరికి తిన్నగా
షిరిడీకి తిరిగి వచ్చేసాము. నేను బసచేసిన హోటలులో
భోజనం చేసాను. స్నానం చేసి చిన్న కునుకు తీసాను.
రాత్రి గం.
10.30 నా హోటల్ గదిలో---
సాయి సంస్థానానికి వెళ్ళి 1975 సం.నుండి 1985 వరకు సాయిలీల పాత సంచికలు 20 కొన్నాను. ఇంకా వివిధ రకాలయిన ఫోటోలను కూడా కొన్నాను. సాయిలీల పత్రికకు సంవత్సర చందా రూ. 60/- కట్టాను. అరవై రూపాయలు మాత్రమే అంటే చాలా అధ్బుతమయినదే. 1984 వ.సం. సాయిలీల పత్రికలో స్వామి రామ్ బాబా గురించి ప్రచురింపబడిన వ్యాసాన్ని, బలదేవ్ గ్రిమే, మరాఠీనుండి ఆంగ్లంలోకి అనువాదం చేసి చెప్పాడు. ఆయన చెప్పిన అనువాదాన్ని నేను రికార్డు చేసుకున్నాను. చాలా ఆసక్తికరంగా ఉంది.
(శ్రీ పరమహంస యోగానంద గారు)
(శ్రీ యుక్తేశ్వర్ గారు)
పరమహంస యోగానందగారు వ్రాసిన
‘AUTO BIOGRAPHY OF A GOYI ‘ అనే పుస్తకంలో
శ్రీ యుక్తేశ్వర్ గారితో కలిసి యోగానందగారు, మరికొందరితో కలిసి ఉన్న ఫోటో ఉన్నదని,
అందులో యువకునిగా ఉన్న స్వామి రామ్ బాబా గారు ఉన్నారని చెప్పాడు. ఒక సమావేశంలో తను స్వామి రామ్ బాబాతో ఉన్నానని ఆయన
జి.కె. ప్రధాన్ గారు వ్రాసిన పుస్తకం ‘ TOWARD SILVER CRESTS OF HIMALAYAS ‘ చదవమన్నారని
చెప్పాడు. అది తన దృష్టిలో చాలా ముఖ్యమయిన
పుస్తకమని బలదేవ్ గ్రిమే నన్ను కూడా చదవమని చెప్పాడు.
ఉధ్ధవరావు మాధవరావు
దేశ్ పాండే గారి ఇంటిలో రాత్రి భోజనం చేసే భాగ్యం కలిగింది. సాయంత్రం ఉధ్ధవరావు మాధవరావు దేశ్ పాండే దంపతులతో
సమయం ఆనందంగా గడిచింది. మరుసటి రోజు కూడా మధ్యాహ్నం
భోజనానికి రమ్మని ఆహ్వానించారు. ఉధ్ధవరావు
గారితో ఇంకాస్త సమయం ఇటార్వ్యూ చేసే అవకాశాన్ని ప్రత్యేకించి తీసుకుంటాను. ఈ రోజు సాయంత్రం ధూపం వేయడానికి గురుస్థానం వద్ద
ఉన్న వేపచెట్టు దగ్గరకు వెళ్ళాను. నేను తెచ్చినవన్నీ
ధునిలో సమర్పించాను. అవన్నీ అగ్నిలో దగ్ధమయ్యాయి. అన్నీ కూడా నేను అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతూ
ఉండటంతో నేనెంతో అదృష్టవంతుడిని. ఈ రోజుకి
ఇంతే సంగతులు.
(తరువాత హోమీ బాబాతో జరిపిన సంభాషణ)
(సర్వం శ్ఈ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment