26.03.2021 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 59 వ.భాగమ్
(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ
– హోమీ బాబా ఆశ్రమం – ఉదయం గం. 8.15 కి హోమీ బాబా తో జరిపిన సంభాషణ…
హోమీ
బాబా చెబుతున్న వివరాలు ---
అఖిల భారత శారీరక దారుఢ్యపోటీలలో Boday Builder గా నాకు రెండవ బహుమతి వచ్చింది. బాబా అనుగ్రహం వల్లనే నేను ఫకీరుగా మారాను. ఆయన నాకు 1950వ.సం. లో ఆవిధంగా అనుగ్రహించారు. అపుడే ఆక్షణంలోనే నాకు బాబాతో అనుబంధం ఏర్పడింది. బాబా నన్ను ఈ విధంగా కటాక్షించారు. అందరూ నన్ను షిరిడీకి వెళ్లమని చెప్పారు.
కాని ఆరోజుల్లో నాకు షిరిడీ ఎక్కడ ఉందో తెలియదు. చివరికి నేను ఇక్కడికి చేరుకొన్నాను. మందిరంలో నేను సాయిబాబావారి పటాన్ని చూడగానే నా సద్గురువును కనుగొన్నానని గ్రహించుకొన్నాను.
నేను
దీనిని స్పష్టంగా గ్రహించాను.
“నీకు
నేను కావాలా లేక ధనం కావాలా” అని బాబా అన్నారు.
“నాకు
ధనం వద్దు, నాకు బాబాయే కావాలి” అన్నాను.
“మీరు
నాశరీరంలోని
ప్రతి రక్తపు బొట్టును
తీసుకోండి. కాని
నాకు బాబాయే కావాలి, ఇంకేమీ వద్దు” అని కూడా అన్నాను.
ఆక్షణం
నుండి బాబా నన్ను కటాక్షించారు.
బాబా
నన్ను గడ్డం పెంచుకోమన్నారు.
తనలాగే
నన్ను కూడా దుస్తులు ధరించమని చెప్పారు.
బాబా
సజీవంగా లేరు.
ఆయన
నాకు స్వప్నంలో చెప్పారు.
1950 వ.సం. నుండి బాబా నా మార్గదర్శకునిగా నన్ను నియమానుసారంగా నడిపిస్తున్నారు.
సమయాన్ని
బట్టి బాబా నాకు సందేశాలను ఇస్తూ ఉన్నారు.
ఆవిధంగా
ఇచ్చిన సందేశాలలో బాబా నన్ను గడ్డం పెంచుకోమని, తనలాగే దుస్తులను ధరించమని చెప్పారు.
ప్రశ్న --- మీరు పార్శీ మతస్తులు అవునా?
జవాబు --- అవును.
నేను
పార్శీ. నేను
మొదటిసారిగా
ఆయన సమాధిని దర్శించుకోవడానికి వెళ్ళినపుడు నాకు బాబా దర్శనమిచ్చారు.
అపుడు
బాబా తనకొక చిలుమును సమర్పించమని అడిగారు.
ఆ
తరువాత నాకు ఆయన ఆశీర్వాదాలు లబించాయి.
హోమీ
బాబా ఇంకా చెపుతున్న వివరాలు ---
నేను
ఈ స్థలాన్ని డబ్బిచ్చి కొన్నాను.
నాకిది
ఉచితంగా రాలేదు.
(నవ్వుతూ).
ప్రశ్న ---
1974 నుండి ఈ ఆశ్రమం ఉందా?
జవాబు --- అవును
తుకారామ్ --- హోమీ బాబా ఏమని చెబుతున్నారంటే 1950వ.సం లో ఆయన బొంబాయిలో ఉన్నపుడు బాబా ఆయనకు స్వప్నంలో సాక్షాత్కరించి, షిరిడీకి రమ్మని చెప్పారట.
ఆయన
1974వ.సం. లో షిరిడీకి వచ్చారు.
ఆయనకు
ఇంకా సాయిబాబా వారు వేరే స్వప్న దృశ్యాలను కూడా ఇచ్చారు.
ఒకసారి
ఆయన మందిరంలో సమాధి వద్దకు వెళ్ళినపుడు ఆయన బాబా పటాన్ని చూసారు.
ఆయన
వాస్తవంగా మందిరం లోపల సాయిబాబాను చూసారు.
ప్రశ్న --- అయితే హోమీ బాబా 1974 లో ఇక్కడికి వచ్చి , చిన్న ఆశ్రమం నిర్మించుకుని అప్పటినుండి ఇక్కడే ఉండిపోయారా?
తుకారామ్ --- అవును.
నేను (ఆంటోనియో) --
మీకందరికీ
ధన్యవాదాలు.
(ఆతరువాత దుబాసీ నాకు చెప్పిన విషయం --- హోమీ బాబా చాలా ధనిక కుటుంబంనుండి వచ్చిన వ్యక్తి. ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించకముందు ఆయన పెద్ద భూస్వామి)
షిరిడీలో – బప్పా బాబా ఇంటిలో ఉదయం గం. 10-15 కి
లక్ష్మణ్ రత్న పార్కే గారి కుమారుడు బప్పాబాబాతో రెండవసారి జరిపిన సంభాషణ – లక్ష్మణ్
గారు మాధవరావు దేశ్ పాండే (శ్యామా) కు మేనమామ, మరియు షిరిడీ గ్రామంలో పూజారి, జ్యోతిష్కులు.
ప్రశ్న --- సాయిబాబా గురించి మీరేమి చెప్పదలచుకున్నారు?
జవాబు --- ఈ ప్రపంచంలోకి కబీర్, నామదేవ్ మహరాజ్, జ్ఞానేశ్వర్
మహరాజు గార్లు ఏవిధంగానయితే వచ్చారో బాబాకూడా షిరిడికి అదేవిధంగా వచ్చారు. వారు ఈ భూమి మీదకి ఎక్కడినుంచి వచ్చారో ఎవరికీ తెలియని
రీతిలో వచ్చారు. అలాగే బాబా కూడా ఈ భూమి మీదకు
వచ్చారు. ఆయన జన్మస్థలం గాని, ఆయన తల్లిదండ్రుల
వివరాలు గాని ఎవరికీ తెలియవు.
ప్రశ్న --- సాయిబాబా గురించి మీకు గుర్తున్న విషయాలు చెబుతారా?
జవాబు --- ఒకసారి సతారా నుంచి గోపాలరావు గుండు అనే ఆయన బాబా
ఆశీర్వాదాల కోసం వచ్చారు. ఆయనకు సంతానం లేకపోవడం
వల్ల బాబా దీవెనల కోసం వచ్చారు. బాబా ఆయనకు
ధునిలోని ఊదీని మాత్రమే ఇచ్చి దానిని నీటితో కలిపి సేవించమని చెప్పారు. బాబా దీవెనల ఫలితంగా బాబా ఊదీ మహత్యంతో గోపాలరావు
గుండు దంపతులకి సంతానం కలిగింది.
ప్రశ్న --- బాబా తత్త్వాన్ని గురించి మీరు ఏమని భావిస్తున్నారు?
జవాబు --- ఇందులో తత్త్వం ఏమీ లేదు. కుమారుడు జన్మించిన తరువాత గోపాలరావు గుండు గారు
తిరిగి షిరిడీకి వచ్చి పాడుబడిన స్థితిలో ఉన్న మసీదుకు మరమ్మత్తులు చేయించారు. బాబా చేసిన సహాయానికి కృతజ్ఞతగా మసీదుకు మరమ్మత్తులు
చేయించారు.
ప్రశ్న --- బాబా భక్తులమీద కోపాన్ని ప్రదర్శిస్తూ ఉండేవారట,
నిజమేనా?
జవాబు --- ఎవరయినా భక్తుడు తప్పులు చేస్తే బాబా వారిమీద కోపగించేవారు. వారికి ఏదో చెప్పేవారు. ఒక్కోసారి గ్రామస్థులు కాని, భక్తులు కాని, తప్పులు
చేస్తే బాబాకు వారి మీద పిచ్చికోపం వచ్చేది.
ఆయనకు తీవ్ర ఆగ్రహం కలిగినపుడు వారిని కొట్టేవారు కూడా. ఏమయినా గాని బాబా ఇదంతా ఒక పరిహాసంగా చేసేవారు.
ప్రశ్న -- ఆయన స్వబావాన్ని మీరు ఏవిధంగా వివరిస్తారు?
జవాబు --- ఒక్కోసారి కోపంగాను, ఒక్కోసారి ప్రేమగాను ఉండేవారు. ఎవరయినా భక్తుడు లేక వ్యక్తియొక్క మానసిక స్థితి
యోగ్యంగా ఉన్నప్పుడు (మంచి ఆలోచనలు) మాత్రమే బాబా వారిని మసీదులోకి అడుగుపెట్టనిచ్చేవారు.
పనికిమాలిన మానసిక స్థితిలో (చెడు ఆలోచనలు) ఉన్నవారిని మసీదులోకి అడుగుపెట్టనిచ్చేవారు
కాదు. వారంటే ఇష్టపడేవారు కాదు.
తుకారామ్ --- బాబా గురించి ముఖ్యంగా గ్రహించుకోవలసిన విషయం ఇది.
ప్రశ్న --- బాబా ఎప్పుడూ కాలుమిద కాలు వేసుకుని ఒక ప్రత్యేకమయిన
భంగిమలో కూర్చుంటారన్నది నిజమేనా?
జవాబు --- బాబాకు ప్రతివ్యక్తి గురించే కాక అందరి గురించి
అన్ని విషయాలు తెలుసు. బాబా ఒక్కోసారి రాతిమీద
కూర్చునేవారు. అప్పుడు ఆయన ఆ భంగిమలో కాలుమీద
కాలు వేసుకుని కూర్చునేవారు.
ప్రశ్న --- బాబా రాతిమీద కూర్చున్నపుడు ఆభంగిమలో ఉండేవారా?
తుకారామ్ --- ఎప్పుడూ కాదు, అప్పుడప్పుడు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment