27.03.2021
శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 60 వ.భాగమ్
(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ
– హోమీ బాబా ఆశ్రమం – ఉదయం గం. 8.15 కి హోమీ బాబా తో జరిపిన సంభాషణ…
బప్పా బాబా చెబుతున్న మరికొన్ని వివరాలు
---
బాబా ఎవ్వరినీ
చూడకపోయినా, వారిని కలుసుకోకపోయినా వారందరియొక్క ప్రతి విషయం ఆయనకు అవగతమే. బాబా వద్దకు ఎప్పుడూ వచ్చేవారిలో కొంతమంది ఆయనకు
అత్యంత భక్తుపరులయిన వారు ఉన్నారు. వారు గణేష్
శ్రీకృష్ణ ఖాపర్దే, కాకాసాహెబ్ దీక్షిత్, మోరేశ్వర్ ప్రధాన్, గోవింద రఘునాధ్ ధబోల్కర్
(హేమాడ్ పంత్) మొదలయినవారు. వారు బాబాకు అత్యంత
సన్నిహితంగా ఉండేవారు. బాబా కూడా వారినెంతగానో
ప్రేమించేవారు.
ప్రశ్న --- బాబా ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవారా?
తుకారామ్ --- అవును.
ముఖ్యంగా వీరందరితోను మాట్లాడేవారు.
ప్రశ్న --- బాబా
మీకెప్పుడయినా ఏమయినా ఇచ్చారా?
జవాబు --- బాబా
జీవించి ఉన్న రోజులలో నాకు 17 లేక 18 సంవత్సరాల వయసు ఉంటుంది. అందుచేత నేను బాబాను ఎక్కువగా గమనించలేదు. కాని నేను చెప్పేది మాత్రం యదార్ధం. బాబా నన్ను సేవలకు ఉపయోగించుకునేవారు. తుడవడం, శుభ్రం చేయడంలాంటి పనులు నాకు అప్పచెప్పేవారు.
ప్రశ్న --- మీరు
ఈ పనులన్నిటినీ మసీదులోపల చేసేవారా?
జవాబు --- అవును. మసీదులోపలే చేసేవాడిని. అప్పుడప్పుడు దాసగణు మహరాజ్ బాబాను కలుసుకోవడానికి
వచ్చేవారు. ఒకసారి ఆయన తనకు బెనారస్ వెళ్ళి
గంగలో స్నానం చేయాలని ఉన్నదని బాబాతో అన్నారు.
అపుడు బాబా “ఇక్కడే ఉండు. నీకోసం గంగానది
ఇక్కడికే వస్తుంది” అన్నారు. అపుడు దాసగణు బాబా
పాదాలవద్ద కూర్చోగానే బాబా కాలిబొటన వ్రేళ్ళనుండి గంగాజలం ప్రవహించసాగింది.
తుకారామ్ --- దీని
గురించి పుస్తకాలలో కూడా ప్రస్తావించబడింది.
ప్రశ్న --- ఇక్కడ
షిరిడీలో జీవనవిధానం బాబా ఉన్న రోజులనుండి మార్పు చెందిందా, ఆయన సమాధి చెందిన తరువాతా?
జవాబు --- బాబా
సమాధిచెందిన తరువాత ఆయన శరీరాన్ని సమాధి మందిరంలో భూమిలో అయిదు, ఆరు అడుగుల లోతులో
సమాధి చేసారు. అందులో కర్పూరం, ఇంకా మరికొన్ని
సుగంధ ద్రవ్యాలను కూడా వేసారు. ఇదంతా నేను
నాకళ్ళతో చూసాను.
ప్రశ్న --- భూమిని
త్రవ్వడం, ఇంకా ఆ తరువాత జరిగినవన్నీ మీరు చూసారా?
జవాబు --- అవును. బాబాశరీరాన్ని ఉంచిన సమాధిని మొత్తం నేను చూసాను.
ఆయన శరీరాన్ని లోపల ఉంచిన తరువాత సమాధిలో సువాసనలు వెదజల్లడానికి కొంత కర్పూరాన్ని,
మరికొన్ని సువాసన ద్రవ్యాలను అందులో వేసారు.
ప్రశ్న --- బాబాను సమాధి చేసే సమయంలో ఆయనకు దుస్తులు ఉన్నాయా
లేక దిగంబరంగా చేసారా?
జవాబు --- ఆయనకు తెల్లని దుస్తులు తొడిగారు. ఆయనను దిగంబరంగా చేయలేదు. పుష్పాలు, పూలదండలు, పరిమళ ద్రవ్యాలు మొదలయినవాటిని
ఆయన శరీరం మీద ఉంచారు. అపుడు సమాధిని మూసివేశారు. నేను దీనిని ప్రత్యక్షంగా చూసాను. బాబాను సమాధి చేసిన పదమూడు రోజుల తరువాత అక్కడ ఉన్న
భక్తులందరికీ ప్రసాదం పంచిపెట్టారు. ఈ అన్నదానాన్ని
మహాప్రసాదం అంటారు.
బప్పా గుర్తుకు తెచ్చుకుని చెబుతున్న విషయాలు ---
బాబా ఇక నాలుగు రోజులలో సమాధి చెందుతారనగా, ఆ సమయంలో దాసగణు పండరీపూర్ లో ఉన్నారు. పండరీపూర్ లో ఉన్న ఆయనకు స్వప్నంలో బాబా, దాసగణును
తిరిగి షిరిడీకి రమ్మని పిలుస్తున్నట్లుగా వినిపించింది. “తొందరగా రా, తొందరగా రా – పండరీపురంలో ఇపుడు ఏమాత్రం
ఆలస్యం చేయకు. కాని నన్ను చూడటానికి షిరిడీకి
రా” అన్నారు. ఆయన ఇంకా ఇలా అన్నారు. “తొందరగా షిరిడీకి చేరుకుని నా శరీరం మీద పూలదండలు, పూలు సమర్పించు” దాసగణుకు ఈ స్వప్నం వచ్చినా గాని, సమయానికి అంటే బాబా శరీరాన్ని విడవడానికి
ముందుగానే షిరిడీకి చేరుకోలేకపోయారు. కొన్ని
రోజుల తరువాత దాసగణు గారు షిరిడీకి వచ్చారు.
కాని అప్పటికే బాబా సమాధి చెందారు.
ఈవిధంగా జరిగింది. దాసగణుగారికి తనకు
వచ్చిన కల గురించి, బాబా తనను ఎందుకని తొందర తొందరగా షిరిడీకి రమ్మనమని, తన శరీరాన్ని
పూలదండలతో కప్పమని అడిగారో అప్పుడు అర్ధమయింది.
తుకారామ్ --- దాసగణు బాబాకు కేవలం భక్తుడు మాత్రమే కాదు, బాబాకు
ఉన్న మంచి స్నేహితులలో ఆయనకూడా ఒకరు. అందువల్లనే బాబా దాసగణుగారిని త్వరగా రమ్మని పిలిచారు.
ప్రశ్న --- బాబా భజనలు పాడేవారా?
జవాబు --- అవును.
బాబా భజనలు పాడేవారు. కాని ఆయన అందరితోపాటు
కాకుండా ఒంటరిగా ఉన్నపుడు మాత్రమే పాడేవారు.
బాబా ఎపుడూ ఏదోఒకటి పాడుతూనే ఉండేవారు.
కాని ఆయన తను ఒంటరిగా ఉన్నపుడు మాత్రమే.
తన చుట్టూ ఉన్నవారితో కలిసి పాడేవారు.
కాదు.
ప్రశ్న --- భక్తులు పాడుతూ ఉండేవారా?
జవాబు --- అవును. భక్తులందరూ కలిసి భజనలు చేసేవారు. బాబా వారి మధ్యలో కూర్చుని వారు పాడే పాటలను వినేవారు
తప్ప వారితో కలిసి పాడేవారు కాదు.
ఆయనకు పాడాలని అనిపించినపుడు ఒంటరిగా ఉన్నపుడే పాడేవారు.
ప్రశ్న --- బాబా గడ్డం గీసుకునేవారా?
జవాబు --- బాబా తన గడ్డాన్ని ఒక్క అంగుళం ఉండేలాగా సుందరంగా
కత్తిరించుకునేవారు. పూర్తిగా గడ్డం చేసుకునేవారు
కాదు. ఆరునెలలకు ఒకసారి క్షురకుడు వచ్చి బాబాకు
గడ్డం గీసేవాడు.
(బప్పా బాబాతో సంభాషణ సమాప్తం)
(తరువాత స్వామి రామ్ బాబా గారి ఉపన్యాసమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment