28.03.2021
ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 61 వ.భాగమ్
(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ చావడి
వద్ద – సాయంత్రం గ> 5.30 కి
ఏప్రిల్,
1984 వ.సం. సాయిలీల పత్రికలో ప్రచురింపబడిన స్వామి రామ్ బాబా గారి ఉపన్యాస సారాంశము
– మరాఠీలో ప్రచురింపబడిన వ్యాసాన్ని శ్రీ బలదేవ్ గ్రిమే నాకు ఆంగ్లంలోకి అనువదించి
వివరంగా చెప్పారు. అలాగే దానితోపాటుగా ప్రచురింపబడిన
వ్యాసాన్ని కూడా వివరించారు.
స్వామి రామ్
బాబా చెపుతున్న వివరాలు….
శ్రీ సాయి సత్
చరిత్రలో ఒక సంఘటన గురించిన వివరణ ఉంది. అది
మనకు 23వ.ధ్యాయంలో కనబడుతుంది. అన్ని శాస్త్రాలను
బాగుగా చదివిన ఒక స్వామి ఉన్నాడు. అంతటి జ్ఞానాన్ని పొందినా గాని ఆయన మనసు స్థిరంగా
ఉండేది కాదు. స్థిరంగా ధ్యానస్థితిలో కూడా
కూర్చోలేకపోయేవాడు. అందువల్ల ఆయన గురువు ఆయనను
షిరిడీకి వెళ్లమని సలహా ఇచ్చారు. “ధ్యానస్థితిని
సక్రమంగా సాధించాలంటే సాయిబాబాయే నీకు మార్గం చూపించగలరు” అని అన్నారు.
“నేను షిరిడీ వెళ్ళేటప్పటికి సాయిబాబా రొట్టెను
(భక్త్రీ), ఉల్లిపాయతో తింటున్నారు. సాధువులు
చెప్పినదాని ప్రకారం సాధువు అన్నవాడు రొట్టెను గాని, ఉల్లిపాయను గాని తినరాదు. సాయిబాబా రొట్టె, ఉల్లిపాయ తినడం చూసిన నేను ఈవిధంగా
ఆలోచించాను. “రొట్టె, ఉల్లిపాయను తినే ఈ సాధువు
నాకేమి నేర్పగలడు?” ఈ సంఘటన ఫిబ్రవరి, 22, 1914 వ.సం. లో జరిగింది. నేను బాబా దర్శనం కోసం మసీదుకు వెళ్ళినపుడు ఆయన
కాస్త తేలిక భావంతో నావైపు చూసి, “ఏ కుక్కా, ఇక్కడినుంచి పో” అన్నారు. సాయిబాబా తింటున్నది చూసిన తరువాత నాలో కలిగిన ఆలోచనకి
ఆయన ఆవిధంగా అన్నారు.
నేను ఫిబ్రవరి,
22, 1860 వ.సంలో జన్మించాను.
శ్రీ బలదేవ్
గ్రిమే ఆవ్యాసాన్ని నాకు అనువదించి చెప్పాడు.
ఆవ్యాసాన్ని గురించి వ్యాఖ్యానించి, దానితోపాటుగా స్వామి రామ్ బాబా గారి ఉపన్యాసాన్ని
కూడా వివరించాడు.
ఈ వ్యాస రచయిత
అయిన శ్రీ సామంత్ గారు, స్వామి రామ్ బాబా గారిని ఆగష్టు, 13, 1982 లో కలిసారు. స్వామి రామ్ బాబా గారిని ఆయన కలుసుకున్నపుడు మొదటి
చూపులోనే ఆయనకు వెంటనే రవీద్రనాధ్ టాగూర్ గారు గుర్తుకు వచ్చినట్లుగా చెప్పారు. స్వామి రామ్ బాబాగారు మాట్లాడటం ప్రారంభిస్తే, వినేవారికి
స్వామి వివేకానంద గుర్తుకు వస్తారు. ఆయన ఏవిషయం
గురించి మాట్లాడినా చాలా క్షుణ్ణంగా మాట్లాడగలరు. ఆయన మాట్లాడే ప్రతి విషయం మీద మంచి పట్టు ఉండేది. ఆయన ఉపన్యాసాలన్నీ ప్రధానంగా శ్రీ సాయి సత్ చరిత్రకు సంబంధించిన వ్యాఖ్యానాలు
లేక గొప్ప సాధువుల వ్యక్తిత్వాల గురించే ఉంటాయి.
ఆయనకు ఆంగ్ల భాషలో మంచి పట్టు ఉండటంతో చాలా అనర్గళంగా మాట్లాడగలరు. ఆయన మాట్లాడటం ప్రారంభిస్తే వినడానికి వచ్చిన ప్రేక్షకులను
దృష్టిలో పెట్టుకుని మాట్లాడతారు. స్వామి రామ్
బాబా గారి కళ్ళు ఎక్స్ రే కళ్లని శ్రీ సామంత గారు అన్నారు. ఆయన మాట్లాడేటపుడు ఎవరూ మధ్యలో అడ్డుతగలడం ఆయనకు
ఇష్టముండదు.
స్వామి రామ్
బాబా గారి ఉపన్యాసాలను వినే భక్తులు నోరు తెరచి ఏమీ చెప్పకుండానే వారి మనసులో ఉన్న
సమస్యలకు, సందేహాలకు పరిష్కారాలు లభిస్తూ ఉండేవి.
అధ్భుతాలను,
చమత్కారాలను, ప్రదర్శించడం స్వామి రామ్ బాబా గారికి ఇష్టముండదు.
ఆయన దానికి వ్యతిరేకి. ఆయన అభిప్రాయాల
ప్రకారం ఎవరయినా తమకు లభించిన శక్తులను గాని, సిధ్ధులను గాని ప్రదర్శించినట్లయితే అది
చాలా పెద్ద తప్పు. సిధ్ధి ద్వారా లభించిన శక్తులను
ఆడంబరానికి ప్రదర్శించడం స్వామి రామ్ బాబాకు ఇష్టముండదు. గంగ, నర్మద, గోదావరి లాంటి పవిత్ర నదులకు ప్రదక్షిణలు
చేసినవాడే అసలయిన సాధువు అని ఆయన అభిప్రాయం.
స్వామి రామ్
బాబా చెప్పిన ప్రకారం సాయిబాబా ఎప్పుడూ ఎవరికీ ఎటువంటి మంత్రోపదేశం చేయలేదు. కాని ఈరోజుల్లో బాబాలు, సాధువులు మంత్రాలను ఉపదేశిస్తున్నారు. స్వామి రామ్ బాబాకు వాటిలో నమ్మకం లేదు. అందువల్లనే ఆయనకు అటువంటివి ఇష్టముండదు. పవిత్ర నదులకి ప్రదక్షిణం చేసినంతనే సాధకునిలో తనంత
తానుగానే మంత్ర సిధ్ధి లబిస్తుంది.
స్వామి రామ్
బాబా తనకు కలిగిన స్వీయ అనుభవాలను వివరిస్తున్నారు. ఆయన వివరించేటప్పుడు “నేను” అనే పదాన్ని వాడకుండా
మాట్లాడతారు. “నేను” అనడానికి బదులుగా ఆయన
“రామ్ దీనిని ఉపయోగించారు – రామ్ రేపు బొంబాయి వెడతారు – రామ్ రేపు మిమ్మల్ని కలుస్తారు---“
ఈవిధంగా మాట్లాడతారు. స్వామి రామ్ బాబా తన
గురించి అరుదుగా మాట్లాడేవారు. “ఈశ్వరుడు ఒకడే.
భగవంతుడు ఒకడే, ఆయన సర్వాంతర్వామి” అని చెబుతారు. ఆయన ప్రజలందరితోను “సాక్షాత్తు భగవంతుని రూపంలో
మనకు కనిపిస్తున్నది సాయి” అని చెబుతారు.
స్వామి రామ్
బాబా ఏవిషయాన్ని ఉదాహరణగా తీసుకున్నా ఆయన ఎప్పుడూ దానిని శ్రీసాయి సత్ చరిత్రనుండే
గ్రహిస్తూ ఉంటారు. ఈరోజుల్లో మనకు లభించిన
అధ్భుతమయిన గొప్ప గ్రంధం “శ్రీ సాయి సత్ చరిత్రేనని స్వామి రామ్ బాబా భావిస్తారు. శ్రీ సాయి సత్ చరిత్రలో సాయిబాబా జీవితానికి సంబంధించిన
గాధలు ఉన్నాయని చెబుతారు. ఈ గాధలన్నీ అభూత
కల్పనలు కాదనీ అవన్నీ యదార్ధంగా జరిగినవని చెబుతారు. అందుచేత వాటిని ఏదో లాంచనప్రాయంగా తీసుకోవలసిన విషయాలు
మాత్రం కాదు. శ్రీ సాయి సత్ చరిత్ర గురించి
స్వామి రామ్ బాబా ఉపన్యాసమిచ్చే ప్రతిసారి ఆయనకు సాయిబాబా మీద ఎంతటి భక్తి విశ్వాసాలు
ఉన్నాయో వినేవారందరికీ అర్ధమవుతుంది. సాయిబాబా
గురించి వ్రాసిన ఎన్నో గ్రంధాలు, పుస్తకాలు ఉన్నాయి. కాని చాలామట్టుకు వాటన్నిటిలో నాటకీయదృశ్యాలు
చాలా ఉన్నాయని స్వామి రామ్ బాబా అంటారు. పేదవారు
కొనలేని విధంగా పుస్తకాల ధరలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా ఆయన అంటారు. ఈప్రపంచం మొత్తంలో ఉన్న ఒకే భగవంతుడు “సాయి” అనీ,
ఉన్న ఒకే ఒక పవిత్ర గ్రంధం శ్రీ సాయి సత్ చరిత్రే అని స్వామి రామ్ బాబా చెబుతారు.
స్వామి రామ్
బాబా ఉనన్యాసాలు ఇచ్చేటపుడు, మాట్లాడేటప్పుడు ఎటువంటి మొహమాటం లేకుండా నిజాయితీగా మాట్లాడతారు. దానికి కారణం ఆయన ఎప్పుడూ నిజాలే మాట్లాడతారు కాబట్టి. ఒక్కోసారి భక్తులకి ఇది రుచించదు. కారణమేమిటంటే నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. ఎప్పుడు నిజాలు మాట్లాడినా భక్తుల యొక్క వ్యక్తిగత
భావాలను ఆయన ఎప్పుడూ పరిగణలోకి తీసుకోరు.
శ్రీ సాయిబాబావారి
అనుగ్రహం వల్లనే శ్రీ సాయి సత్ చరిత్ర లాంటి గొప్ప గ్రంధం మనకు లభించింది. స్వామి రామ్ బాబా గారి అభిప్రాయం ప్రకారం భక్తులకి
శ్రీ సాయి సత్ చరిత్ర అమృతం వంటిది.
అందరిలోను,
ప్రతి వ్యక్తిలోను భగవంతుడు నివసిస్తాడని స్వామి రామ్ బాబా చెబుతూ ఉంటారు. కాని తనలోనే భగవంతుడు నివాసం ఉంటున్నాడనే విషయాన్నీ,
ఆయన ఉనికినీ భక్తుడే గ్రహించుకోవాలి.
సాయిబాబా ఈ
ప్రపంచంనుండి వెళ్ళిపోయారనే విషయాన్ని స్వామి రామ్ బాబా అంగీకరించరు. సాయిబాబా ప్రతిరోజు, ప్రతిక్షణం మనతోటే, మన చుట్టూ
సంచరిస్తూనే ఉన్నారని స్వామి రామ్ బాబా గారి ప్రగాఢమయిన విశ్వాసం. భక్తులు తమంతతామే ఆవిషయాన్ని అర్ధం చేసుకుని అనుభవంలోకి
తెచ్చుకోవాలి.
సరిగ్గా సమాధి
ముందర సాయిబాబా వారి విగ్రహాన్ని ప్రతిష్టించారు కాబట్టి, బాబా దర్శనానికి వచ్చిన భక్తుడయినవాడు
సమాధి మీదకి ఎక్కడం స్వామి రామ్ బాబాగారు అంగీకరించరు. భక్తునియొక్క పాదాలు ఆయన సమాధిని తాకినట్లయితే దాని
ఫలితంగా వెలువడే ప్రకంపనాలు కొన్ని సార్లు అపవిత్రమవుతాయి అనీ, అది అపచారమని ఆనేవారు.
స్వామి రామ్
బాబా గారు సాయిబాబావారిని దర్శించుకోగానే ఆయనలోని పూర్తి అహంకారం, వ్యతిరేక భావాలు
అన్నీ సమసిపోయాయి. తనకు ఎటువంటి సిధ్ధులు అవసరం
లేదని స్వామి రామ్ బాబా చెప్పేవారు.
ఫిబ్రవరి,
22, 1984 వ.సంవత్సరానికి స్వామి రామ్ బాబా గారు 125 వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు.
ఇంతటితో ఈ వ్యాసాన్ని
ముగిస్తున్నాను. జై సాయిరామ్…
( పరిశోధనా వ్యాసం ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment