Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, March 30, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 2 వ, భాగమ్

Posted by tyagaraju on 8:40 AM

 



30.03.2022  బుధవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి దయా సాగరమ్ 2 వ, భాగమ్

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

పరిచయమ్

ప్రాచీన కాలంనుండి భారతదేశం మహామహిమాన్వితులయిన యోగులు, గురువులకు, అధ్బుతాలకు నిలయంగా ప్రఖ్యాతి చెందింది.  అటువంటి గొప్ప యోగులలో ఒకరయిన శ్రీ సాయినాధ్ మహరాజ్ వారికి సంబంధించిన అనుభూతులు, తీపిగురుతులతో పొందుపరచబడినదే ఈ పుస్తకం.  శ్రీ సాయి భక్తులకోసం అటువంటి అనుభూతులతో ప్రచురింపబడటానికి కారకులయిన శ్రీమతి ఉజ్వల తాయి బోర్కర్ గారికి శుభాభినందనలు తెలుపుతున్నాను.  శ్రీమతి ఉజ్వల తాయి బోర్కర్ గారికి తన పుట్టింటి వారినుంచి అలాగే అత్తింటివారినుండి ఆధ్యాత్మిక వారసత్వం లభించడం ఆమె చేసుకున్న అదృష్టం. 




ఉజ్వలా తాయి గారి అత్తగారి అత్తగారు కీ.శే. శ్రీమతి చంద్రబాయి బోర్కర్ ఆమె కుటుంబం విలేపార్లే ఈస్ట్ లో ఉన్న తమ స్వగృహంలొనే సాయిమందిరాన్ని నిర్మించుకున్నారు.  చంద్రాబాయి గారు షిరిడీ వెళ్ళి సాయిబాబాతో ఉండేవారు.  ఉజ్వలా తాయి తన స్వీయానుభవాలనే కాకుండా కీ.శే. చంద్రాబాయి గారి అనుభవాలను కూడా ఈ పుస్తకంలో ప్రచురణకు ఇవ్వడం జరిగింది.  ఎన్నిక చేసిన కొంతమంది సాయిభక్తుల అనుభవాలను ఈ పుస్తకంలో ప్రచురించారు.  సాయిని పూజించే విధానంలో నేడు ఎన్నో వివాదాలు ఉన్నాయి.  కాని, ఉజ్వల గారికి సాయిని పూజించే విధానంలో ఒక స్థిరమయిన అభిప్రాయం ఉంది.  సంవత్సరాలుగా సాయిమందిర పర్యవేక్షణ, అన్ని కార్యక్రమాలు స్వయంగా ఆమే చూసుకుంటూ ఉంది.  ఈ పుస్తకంలో ఎటువంటి నాటకీయత లేదు.  సాయిబాబాలాంటి గురువులెవరూ మాయలు, మంత్రాలు చేయడానికిష్టపడరు.  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరి స్వీయానుభూతులు మాత్రమే ఈ పుస్తకంలో ప్రచురిపబడ్డాయి.  సమాజంలో మత విద్వేషాలను దూరం చేయడానికి సాయిబాబా వారు ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండేవారు.  ఏమతమయినా సరే భగవంతుడు ఉన్నాడనే అనుభూతినిచ్చి, మనసుకు ఎంతో  తృప్తిని, ఆనందాన్ని కలుగజేస్తుంది.  బాబా  ఇచ్చినటువంటి సలహా చాలా సరళంగా ఉంటుంది.  “ ఎల్లప్పుడూ సత్య మార్గాన్నే అనుసరించు.  నువ్వు చేసే పనియందు శ్రధ్ధ పెట్టి నీకు నువ్వే విశ్లేషించుకుంటూ ఉండు.  భగవంతునియందు నమ్మకముంచు.  నీ లక్ష్యాన్ని సాధించడానికి కష్టపడి శ్రమించు.  అహంకారాన్ని తొలగించుకో.  అన్యాయాన్ని గాని, హింసను గాని సమర్ధించకు.  వాటిని సహించవద్దు.  ఎల్లప్పుడూ ఐకమత్యంగా ఉండటానికే ప్రయత్నించు.  చెడు అలవాట్లకు బానిసవ్వవద్దు.  జీవితంలో ఏమి జరిగినా వాటిని స్వీకరించి ప్రశాంతంగా ఉండటం అలవరచుకో.  ప్రకృతితో మమేకమై ప్రశాంత జీవనాన్ని కొనసాగించు.  అందరి ఎడల మంచిగాను, దయతోను మసలుకో.  శత్రుత్వము, కక్ష, ప్రతీకారం ఇవేమీ నీలోకి ప్రవేశించనీయకు.”

ప్రతీ సామాన్య మానవుడి జీవితమంతా బాధలతోను, అంతులేని త్యాగాలతోను నిండి ఉంటుంది.  అందువల్ల ఆ బాధలను తట్టుకునే మనస్థైర్యం కావాలంటే ఒక ఆధారం కావాలి.  ఆ ఆధారం ఏమిటంటే భగవంతునిపై నిశ్చలమయిన భక్తి., పూజ, నమ్మకం.  ఆధ్యాత్మికంగా ఎదగడానికి యోగ సాధన (ద్యానం) వల్లనే సాధ్యపడుతుంది.  దానికి భగవంతుని మీద నమ్మకం కూడా అవసరం.  సాయిబాబా ఎంతో మందిని ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్ళించారు.

సాయిబాబా, గజానన్ మహరాజ్, స్వామి సమర్ధ, గోండవలేకర్ మహరాజ్ లాంటి భారతీయ యోగులెవరూ ప్రాపంచిక జీవితానికెప్పుడూ ప్రాధాన్యతనివ్వలేదు.  ప్రతి మానవునికి ఉన్నట్లుగానే వారికీ శక్తులున్నాయి.  మనందరికీ ఎంతో శక్తివంతమయిన మెదడు ఉంది.  కాని మనం దానికి ఉన్న శక్తిలో కొంతమాత్రమే వినియోగించుకుంటున్నాము.  మిగిలిన శక్తి మెల్లగా నాశనమవడం గాని, నిద్రాణస్థితిలొ ఉండటం గాని జరుగుతూ ఉంది.  చాలా కొద్ది మంది మాత్రమే తమలో దాగిఉన్న శక్తిని ఆధ్యాత్మిక సాధనల ద్వారా ఉపయోగించుకొంటున్నారు.  వారు తమ శక్తిని అసాధారణంగా ప్రదర్శించినపుడు, సామాన్య ప్రజలకి అవి అధ్బుతాలుగా కనిపిస్తాయి.  కాని సాయిబాబాలాంటి అసలయిన యోగులెవరూ ఎప్పుడూ తమ కీర్తిప్రతిష్టల కోస్లం అటువంటి ప్రదర్శనలు చేయలేదు.

                                                                                            మాధవి కుంతే

(ఇంకా ఉంది)

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

 


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List