Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, March 31, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ ౩ వ, భాగమ్

Posted by tyagaraju on 7:20 AM

 31.03.2022  గురువారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః  

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి దయా సాగరమ్ ౩ వ, భాగమ్

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

(నిన్నటి పరిచయమ్ తరువాయి భాగమ్)

శ్రీ స్వామి వివేకానంద మూఢ నమ్మకాలకి, గారడీ పనులకి వ్యతిరేకి.  ధ్యానం, మరియు మన మెదడులో నిద్రాణస్థితిలో ఉన్న కణాలను ఉత్తేజపరచి వాటిని ఉపయోగించినట్లయితేనే మనము జీవితంలో ఘనమయిన పనులను సాధించగలమని నమ్మేవారు.  ఏ పుస్తకాన్నయినా ఒక్కసారి చదివితే చాలు పుస్తకం మొత్తాన్ని గుర్తుంచుకోగలిగే శక్తి స్వామీజీ లో ఉంది.  స్వామీజీ అది తాను చేసే అధ్బుతమని అనేవారు కాదు.  మన మెదడును ఆవిధంగా తర్ఫీదునిచ్చినపుడు అది సాధ్యమేనని అన్నారు.


పర్వరీ బాబా, నిరాహారీ బాబా గురించి స్వామీజీ సంగ్రహంగా చరిత్రలు వ్రాసారు.  వారి చరిత్రల ద్వారా మనకు ఆధ్యాత్మిక ప్రపంచం అంటే ఏమిటన్నది తెలుస్తుంది.

మన ఋషులకు అతీంద్రియ శక్తులున్నాయి.  కాని వారందరూ వాటిని చాలా అరుదుగా మాత్రమే వినియోగించేవారు.

ఎటువంటి బాధలు లేని ప్రశాంతమయిన, సంతృప్తికరమయిన సమాజాన్నే బాబా కాంక్షించారు.  మనం ప్రతిరోజు చేసే పనులన్నిటినీ భగవంతుని కోసమే చేస్తున్నామనే భావంతో చేయాలని బాబా చెబుతూ ఉండేవారు.  మనమెపుడూ బాధలలో ఉన్నవారికి సహాయం చేస్తూ వారి బాధలను తగ్గించేందుకు ప్రయత్నం చేయాలి. 

సాయి ఒక ఇటుకనే తన దిండుగా ఉపయోగించేవారు.  ఒక చెక్క బల్ల మీద నిద్రించేవారు.  జీవితాంతం చిరిగిన కఫనీనే ధరించారు.  సాయి ఎప్పుడూ ఎటువంటి సిధ్ధాంతాలను గాని, మంత్రాలను గాని, సాధనలను గాని ప్రోత్సహించలేదు. 

బాబా చెప్పిన సందేశాలన్నిటిని జ్ణప్తియందుంచుకుని బోర్కర్ కుటుంబం సాయి మందిరాన్ని ఎల్లవేళలా పరిశుభ్రంగాను, సుందరంగాను ఉండేలాగా నిర్వహిస్తూ ఉండేవారు.  ఆర్ధికంగా వెనుకబడినవారికి అన్ని సౌకర్యాలతోను వివాహాలను జరిపించడం లాంటి సామాజిక సేవలను కూడా చేసారు. పాఠశాలలకి, అనాధశరణాలయాలకి విరాళాలు ఇచ్చారు.  ఉజ్వల తాయి గారి అత్తగారి అత్తగారయిన కీ.శే. శ్రీమతి మంగళతాయి బోర్కర్ సాయి పేరుమీద మందిరంలో సాధ్యమయినన్ని సామాజిక సేవలెన్నో చేసారు.

ఈ పుస్తకంలో ఉజ్వలతాయి గారు తన అత్తగారి అనుభావాలే కాక అత్తగారి అత్తగారి అనుభవాలను కూడా మనకందించారు.  ఈ పుస్తక రచన తన గొప్పతనం కాదని, అంతా సాయి అనుగ్రహమ్ వల్లే అని,  అంతే కాకుండా సాయిదృష్టి పడిన సాయి భక్తులందరి సహకారం వల్లనే సాధ్యమయిందని చెప్పారు.

సాయి భక్తులయినవారెవరూ ఇతరులనెవరినీ బాధించకూడదనీ, అవసరమయినపుడు తోటివారిని ఆదుకోవాలనే సందేశాన్ని సాయి  నిరాడంబర జీవితం మనకు ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది.  నిజమయిన సాయి భక్తుడు తన దైనందిన కారక్రమాలలో మునిగి ఉన్నాగాని కొద్ది సమయాన్నయినా సాయిని పూజించి సాయిసాధనలో నిమగ్నమవాలి.  అటువంటివారు సహజంగానే సమాజంలో ఒకడిగా శాంతంగా జీవిస్తాడు.  ప్రపంచానికి సహాయకారిగా ఉంటాడు.

ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారికి ఉజ్వల తాయి బోర్కర్ ప్రచురించిన ఈ పుస్తకం ఖచ్చితంగా ఒక మార్గదర్శి అని చెప్పవచ్చు.  ఇటువంటి ఉపయోగకరమయిన కార్యాలను మరిన్ని చేస్తూ బాబాయొక్క తత్త్వాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేయమని ఉజ్వల తాయి గారిని మనఃస్ఫూర్తిగా కోరుతున్నాను.

                                                                     మాధవి కుంతే

 

(రేపటి సంచికలో కీ.శే. చంద్రాబాయి బోర్కర్ గారి అనుభవాలు)

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment