Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, July 20, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 19 వ, భాగమ్

Posted by tyagaraju on 6:19 AM

 20.07.2022  బుధవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి దయా సాగరమ్ 19 వ, భాగమ్

అధ్యాయమ్ –17

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాదు

జయమని జైస భావ

1951 వ.సం. లో నేను షిరిడీ వెళ్ళాను.  అప్పటికి నా  వయస్సు 15 సంవత్సరాలు.  ఆ కాలంలో షిరిడీలో బాబా విగ్రహం లేదు.  కేవలం ఆయన అసలు రూపంతో చిత్రించిన పటం మాత్రమే ఉంది.  ఆపటానికే భక్తులందరూ పూజలు చేస్తూ ఆరతులు ఇస్తూ ఉండేవారు.  ఇపుడు నాకు 77 సంవత్సరాలు.  అరవైయొక్క సంవత్సరాలుగా నేను సాయిని పూజిస్తూ ఉన్నాను.  నా ఈ జీవితకాలంతా నేను సాయి దయను ఎన్నో సార్లు అనుభూతి చెందుతూ ఉన్నాను.

2008వ. సంవత్సరంలో నా రెండు కళ్లకి వ్యాధి సోకింది.  కళ్ళు బాగా బాధపెట్టసాగాయి.  రెండు కళ్ళు ఎఱ్ఱబడి మంట మండసాగాయి.  వైద్యుడి దగ్గరకు వెళ్ళినపుడు ఆయన పరీక్షించి నా కళ్ళకి హెర్పిస్ సోకిందని, అది చాలా ప్రమాదకారని అన్నాడు.  కనీసం ఆరు నెలలపాటు వైద్యం చేయించుకోవాలని అన్నాడు.  ఆ సమయంలో కాకాదీక్షిత్ మనుమడయిన అనిల్ దీక్షిత్ నన్ను భివపురికి రమ్మన్నాడు. (ఇక్కడ ప్రదాన్ నిర్మించిన సాయిమందిరం ఉంది.) వారందరూ సాయిదర్శనం చేసుకోవడానికి వెడుతున్నారు.  నాకళ్లకు వచ్చిన వ్యాధి కారణంగా అది ఇతరులకు కూడా సోకవచ్చనే ఉద్దేశ్యంతో నేను రాలేనని చెప్పాను.

ప్రధాన్ గారి సాయిమందిరం యొక్క విశిష్టత ఏమిటంటే బాబా స్వయంగా ప్రధాన్ గారి ఇంటికి తన ఫొటోను తీసుకుని వచ్చి, “నేను ఇచ్చిన మాటప్రకారం నీ ఇంటికి వచ్చాను.  ఇపుడు నేను చెప్పేది విను.  ఇపుడు నేను ఎక్కడైతే నుంచుని ఉన్నానో అక్కడే నా చిన్న మందిరాన్ని నిర్మించు” అని ఆదేశించారు.  మందిరం ఎదురుగా తులసి బృందావనం కూడా ఉంది.  నేను అనిల్ దీక్షిత్ తో మీరు భివపురిలో ప్రధాన్ గారి సాయిమందిరానికి వెళ్ళి నా కళ్ళకి సోకిన వ్యాధిని నయంచేయమని బాబాని ప్రార్ధించండి అని కోరాను.  నేను కూడా మనఃస్ఫూర్తిగా బాబాను ప్రార్ధిస్తూనే ఉన్నాను.  మరుసటి వారమే అధ్బుతం జరిగింది.  నా క ళ్ళను పరీక్షించుకోవడానికి వైద్యుడి దగ్గరకు వెళ్లాను.  నా కళ్ళు పరీక్షించిన వైద్యుడి ఆశ్చర్యానికి అంతులేదు.  అప్రభుతుడయ్యాడు.  రిపోర్టు అంతా చక్కగా ఉంది.  రిపోర్టు చూసిన వైద్యుడు “ఇది అసంభవం. ఇంత తక్కువ రోజులలో హెర్పిస్ వ్యాధి తగ్గనే తగ్గదు.  కాని ఇదంతా సాయిబాబా దయ వల్ల మాత్రమే తగ్గిందని నాకు తెలుసు” అన్నాడు.

మేము ప్రతి సంవత్సరం నవంబరు రెండవ తేదీన సమర్పణ దినాన్ని జరుపుకుంటాము.  అక్టోబరు నెలలో వైద్యుడు నాకు ప్రొస్టేట్ క్యాన్సర్ ఉందని చెప్పాడు.  చాలా పెద్ద ఆపరేషన్ చేయాల్సి ఉంటుందన్నాడు.  మా కుటుంబంలోని వారందరమూ చాలా భయపడ్డాము.  సమర్పణ్ రోజులో పాల్గొనడానికి సత్పతి మహరాజ్ గారు వచ్చారు. ఆయనను దర్శించుకోవడానికి వెళ్లాను.  ఆయన తన హస్తాన్ని నా శిరస్సుపై ఉంచి భయపడవద్దనీ అంతా సాయి చూసుకుంటారనీ ఆయన మీద నమ్మకముంచమనీ అన్నారు.

బోర్కర్ గారి కుటుంబం కూడా సంవత్సరాల తరబడి సాయియొక్క దయను అనుభవిస్తూ ఉన్నారు.

ఆరు నెలల తరువాత మళ్ళీ పరీక్షించుకోవడానికి వైద్యుని దగ్గరకు వెళ్ళినపుడు ఆయన పూర్తిగా పరీక్షించి నాకు క్యాన్సర్ లేదని చెప్పాడు.  ఆయన చెబుతున్న సమయంలో నా మొబైల్ లో బాబా ఆరతి వస్తూ  ఉంది.  నేను ప్రమాదంనుండి బయటపడ్డాను.  బాబా మాత్రమే నా జీవితాన్ని నిలబెట్టారని గట్టి నమ్మకంతో చెబుతున్నాను.

నిరంజన్ జాని

9322648453

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment