Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, September 6, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 20 వ, భాగమ్

Posted by tyagaraju on 8:55 AM

 



06.09..2022  మంగళవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి దయా సాగరమ్ 20 వ, భాగమ్

అధ్యాయమ్ –18

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాదు

పుష్పాలు చేసుకున్న అదృష్టమ్

నా తల్లిదండ్రులు ఎంతో ధర్మపరాయణులు.  నేను మంచి ఆధ్యాత్మిక వాతావరణంలో పెరిగాను.  మా నాన్నగారు షేన్ గావ్ లోని గజానన్ మహరాజ్ గారి శిష్యులు.  మా నాన్నగారు శ్రీ గజానన్ విజయం గ్రంధాన్ని ఒక అధ్యాయం చదువుతూ ఉన్నపుడు నేను, నా సోదరుడు, నా సోదరి ముగ్గురం వింటూ ఉండేవాళ్లం.  మా నాన్నగారు నాకోసమని గజానన్ విజయం మరొక పారాయణ గ్రంధాన్ని కొన్నారు.  మేము ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉండేవారం.  గ్రాంట్ రోడ్ నుండి సాయిభక్తుడు ఒకాయన మా ఊరికి వచ్చారు.  నేను ఆయనను కలుసుకున్నాను.  ఆయన షిరిడీ సాయిబాబా గారి గాధలు చాలా చెప్పారు.  ఆయన బాబా గురించిన కధలు చెబుతూ ఉంటే అవి నా మసుమీద ఎంతో ప్రభావాన్ని చూపాయి.  ఈ విధంగా బాబా మాఇంటికి వచ్చారు అనేకంటే బాబా నన్ను తనవైపుకు లాగుకున్నారు అంటే సమంజసంగా ఉంటుంది.


నేను యూనివర్శిటీ టాపర్.  కాని అదృష్టం కలిసిరాకపోవడం వల్ల ఇంతవరకూ నాకు మంచి ఉద్యోగం ఏదీ రాలేదు.  నిరుద్యోగిగా ఉండటంవల్ల చాలా నిరాశకి గురయ్యాను.  నా సోదరుడు ఆసమయంలో షిరిడీ వెళ్ళడం జరిగింది.  వచ్చేటప్యుడు శ్రీ సాయి సత్ చరిత్ర తీసుకువచ్చాడు.  నేను ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉండేవాడిని.  నన్ను ఇక ఉద్యోగంలొనుండి తీసేయని విధంగా ఉండే ఉద్యోగం ఇప్పించమని సాయిని వేడుకొన్నాను.  దానికి కారణం చాలా సార్లు నన్ను ఉద్యోగంలోనుండి తీసేస్తూ ఉండేవారు.

నన్ను ఉద్యోగంనుండి తొలగించకుండా శాశ్వతంగా ఉద్యోగం వచ్చినట్లయితే నా మొదటి నెల జీతాన్ని సాయిబాబాకు సమర్పించుకుంటాను అని బాబాకు మొక్కుకొన్నాను.  ఆరు సంవత్సరాల తరువాత నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది.  నేను మొక్కుకొన్న ప్రకారం నా మొదటి నెల  జీతాన్ని సాయిబాబాకు సమర్పించుకున్నాను.  నా జీవితంలో బాబా నాకు ప్రసాదించిన మొట్టమొదటి అనుభవం ఇది.  నేను లేహ్ మరియు లడఖ్ లకు పర్యటన కార్యక్రమం పెట్టుకున్నాను.  అక్కడికి వెళ్లడమంటే ప్రమాదకరమయిన విషయమే.  కాని బాబా దయతో ప్రయాణమంతా ఎక్కడా ఇబ్బంది లేకుండా జరిగింది.  అక్కడ చాలా ప్రసిధ్ధమయిన శాలువా బాబాకోసం కొన్నాను.  ముంబాయికి తిరిగి రాగానే ఆశాలువాను బాబాకు సమర్పిద్దామనుకున్నాను.

సాయిబాబా మందిరం మా ఇంటినుండి ఒక కిలో మీటరు దూరంలో ఉంది.  కాని నేను సాయిబాబా మందిరానికి బయలుదేరిన రోజు  చాలా ఆలశ్యమయింది.  బాబా ఆరతి వేళకు చేరుకోవాలని ఇంటినుండి టాక్సీలో బయలుదేరాను.  ఆరతి ప్రారంభమవడానికి ముందుగానే శాలువాను సమర్పించేలా చేయమని బాబాను ప్రార్ధించుకుంటూ ఉన్నాను.  సమయానికి నేను మందిరానికి చేరుకుని కోరుకొన్న ప్రకారం బాబాకు శాలువాను సమర్పించాను.

ఆ రోజు జూలై 26 వ.తారీకు.  నేను ఆఫీసులో ఉన్నాను.  మధ్యాహ్నం 12 గంటలకు వాన మొదలయింది.  బొంబాయివాసులకి ఇదేమీ కొత్తకాదు.  ఆతరువాత కుండపోతగా కురవసాగింది.  నేను ఆఫీసునుంచి ఇంటికి బయలురాను.  బస్సులు, టాక్శిలు అన్నీ కిటకిటలాడుతూ ఉన్నాయి.  ఏదయినా బస్సు గాని, టాక్శి గానీ దొరికేలా చేయమని బాబాని ప్రాధించుకోసాగాను.  కాని ఏదీ దొరకలేదు.  రోడ్డు మీద వర్షపునీరు ప్రవాహంలా పారుతూ ఉంది.  చాలా భయంకరమయిన పరిస్థితి..  లోకల్ గా తిరిగే రైళ్ళు కూడా కదలలేని స్థితిలో ఉన్నాయి.  


నాకు సహాయం చేయమని బాబాను ప్రార్ధించుకున్నాను.  రెండు గంటల తరువాత ఒక ఆటో వచ్చింది.  అందులో అప్పటికే ఇద్దరు ఉన్నారు.  వాళ్ళు కూడా నేనువెళ్లాల్సిన వైపే వెడుతున్నారు.  ఆటోలో ఎక్కి బయలుదేరిన గంటన్నరకి ఆటో ఇంజన్ పాడయి ముందుకు కదలలేదు.  మేమింక రోడ్డు మీదనే మరొక ఆటో కోసం వేచి చూడాల్సి వచ్చింది.  అప్పటికి రాత్రి 8 గంటలయింది.  కుంభవృష్టిగా వాన పడుతూనే ఉంది.  నేను సాయినామ స్మరణ చేస్తూనే ఉన్నాను.  రోడ్డు ప్రక్కన ఒక మూల ఆటో ఉంది.  ఆటోలో ఉన్న డ్రైవర్ నావైపు చూసాడు.  అతను నావద్దకు వచ్చి నన్ను మా ఇంటి దగ్గర దిగబెడతానన్నాడు.  ఆటోలో ఎక్కి కూర్చున్నాను. భారీగా పడుతున్న వర్షంలోనే బయలుదేరాము.  డ్రైవరు చాలా మర్యాదస్తుడిలా ఉన్నాడు.  ఆటోని చాలా నెమ్మదిగా పోనిస్తున్నాడు.  బాగా వర్షం పడుతూ ఉండటం వల్ల ముందున్న రోడ్డు కనపడటం లేదు.  ఆటో అతను నన్ను మా అపార్ట్ మెంట్ దగ్గర రాత్రి గం. 11.30 కి దింపాడు.  అతనికి డబ్బు ఇచ్చి అంత పెద్ద వర్షంలో సాహసోపేతంగా నన్ను ఇంటిదగ్గర దిగబెట్టినందుకు ధన్యవాదాలు చెప్పాను.  బాబా అనుగ్రహం వల్ల క్షేమంగా ఇంటికి చేరగలిగాను.

ఒకసారి నేను, నాస్నేహితురాలు,  ఇద్దరం  షిరిడి వెడదామని వోల్వో బస్సులో బయలుదేరాము.  అప్పుడు వేసవికాలం.  ఎండలు మండిపోతూ ఉన్నాయి.  మధ్యాహ్నం వేళకి భోజనాలకోసం బస్సు ఒక హోటల్ ముందు ఆగింది.  భోజనం అయిన తరువాత నాస్నేహితురాలు బయట ఆవరణలో  తిరుగుతూ  మందార చెట్టు కనపడితే ఒక పువ్వు కోసింది.  

నేనా పువ్వును షిరిడీలో బాబాపాదాల వద్ద సమర్పిద్దామనుకున్నాను.  అంత వేసవికాలం ఎండలు మండిపోతున్న రోజు మేము షిరిడీ చేరేంతవరకు ఆపువ్వు వాడిపోకుండా ఉంటుందా అని సందేహించాను.  అక్కడ షిరిడీలో సాయి పాదాల వద్ద ఎన్నో గులాబీలు వేలకొద్దీ ఉంటాయి.  అటువంటపుడు ఈ మందార పుష్పాన్ని ఎవరు పట్టించుకుంటారని అనుకున్నాను.  బాబా! ఈ మందార పుష్పాన్ని స్వీకరించి నీ పాదాల వద్ద కాస్తంత చోటు ఇవ్వవా అని ప్రార్ధించుకున్నాను.  చివరికి మెల్లగా నేను బాబా సమాధి వద్దకు చేరుకున్నాను.  పూజారికి నా చేతిలోని మందార పువ్వును ఇచ్చాను.  ఆయన కొద్దిక్షణాలు దానిని పరీక్షగా చూసి బాబావారి హృదయం వద్ద ఉంచారు.  ఆ అనుభూతికి నేను చాలా విస్మయం చెందాను.

అల్కా భట్

9869427081

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

 


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List