Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, December 2, 2013

శ్రీసాయితొ మధురక్షణాలు - 31

0 comments Posted by tyagaraju on 11:59 PM

                           
                       
03.12.2013 మంగళవారం (దుబాయి  నుండి)
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి

శ్రీసాయితొ మధురక్షణాలు - 31


సాయి బంధువులందరూ సాయితో మధురక్షణాలు చక్కగా చదివి ఆనందిస్తున్నారు కదూ!  మీరు చదివే ప్రతీ క్షణంలోను, ముఖ్యంగా కావలసినది నమ్మకం, సహనం అని గుర్తించేఉంటారు.  ఈ రోజు కూడా మీరు  చదివే క్షణంలో నమ్మకమే మనకు కావలసినది అని గ్రహిస్తారు.  ఇంతకుముందు మా అమ్మాయి స్వీయ అనుభవం," ఆ చేతులు ఎవరివి" చదివే ఉంటారు. ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 98వ.శ్లోకం , తాత్పర్యం. 
                           
శ్రీవిష్ణు సహస్రనామం 

శ్లోకం: అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః   |

        విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణ కీర్తనః    ||

తాత్పర్యం: భగవంతుని క్రూరత్వము తొలగించువానిగా, మధురమైనవానిగా, మృదువైనవానిగా, ధ్యానము చేయుము.  ఆయన అందరికన్నా మించిన సామర్ధ్యము కలవాడు.  యజ్ఞము చివర పంచి పెట్టబడు దక్షిణగా తానే యున్నాడు. క్షమించువారియందు ఉత్తముడు.  తెలిసినవారియందు అనగా జ్ఞానులయందు శ్రేష్టుడు.  ఆయన భయమును తొలగించి తనను గూర్చి స్తోత్రము చేయువారిని మరియూ ఆ స్తోత్రములను వినువారిని పవిత్రమొనర్చుచున్నాడు.    


Thursday, November 28, 2013

శ్రీసాయితో మధుర క్షణాలు - 30

0 comments Posted by tyagaraju on 12:45 AM
                                 
                           
                                                       
                                    
28.11.2013 గురువారం (దుబాయి నుండి)

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు సాయితో మధురక్షణాలలో మరొక మధురక్షణం తెలుసుకుందాము. నిన్న మధురక్షణం చదివారుకదా.. ధైర్యం కోల్పోకుండా బాబా మీదనే భారం వేసిన దంపతుల గురించి చదివారు.  ఈ రోజు కూడా ఆపద సమయం లో కూడా ఎంత సహనంతో ఉండాలో వివరిస్తుంది. ముందుగా  శ్రీవిష్ణుసహస్రనామం 97వ.శ్లోక, తాత్పర్యం.
                            
శ్రీవిష్ణుసహస్రనామం

శ్లోకం : అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః   |  

         శబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీకరః      ||  

తాత్పర్యం : పరమాత్మను భయంకరము కానివానిగా, చుట్టలుగా చుట్టుకొని యున్నవానిగా, చక్రమును ధరించినవానిగా, ధ్యానము చేయుము.  ఆయన సమస్తమునూ జయించి ఆక్రమించును.  ఆయన వాక్కు శాసనము.  ఆయన తన వాక్కుకతీతముగా నుండి తానుచ్చరించిన ప్రపంచమును తనయందే ధరించును.  చల్లదనము, మరియు రాత్రి కూడా ఆయన రూపములే.  


శ్రీసాయితో మధుర క్షణాలు - 30

నాయందెవరి దృష్టో వారియందే నా దృష్టి

సాయి సుధ మాసపత్రికనుండి 

నవంబరు 7వ.తేదీ 1986 సంవత్సరంలో నేను మాబంధువుల యింటికి వెడదామని విశాఖపట్నం బయలుదేరబోతుండగా కాకినాడనుండి నామేనల్లుడు ఫోన్ చేశాడు.  అతని రెండవ కొడుకు శీరం సాయి కల్యాణ్ (వయస్సు 22 సం.)  కు సీరియస్ గా ఉండటంతో ఆస్పత్రిలో చేర్పించామని చెప్పడంతో కాకినాడకు బయలుదేరి  8వ.తారీకు ఉదయానికి చేరుకున్నాను.  

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago