Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, August 25, 2020

గురు కృప

2 comments Posted by tyagaraju on 7:53 AM

    Chronology of the life of Shirdi Sai Baba
   Pink Rose Clipart - Rose, HD Png Download , Transparent Png Image ...

25.08.2020  మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ముందుగా నేను అడిగిన ప్రశ్నకు బాబా సమాధానం….
23.08.2020 తారీకున నాకు బాగా తెలిసున్న వ్యక్తి సుమారు 70 సంవత్సరాల పైగా  వయసున్నాయన బాబాను తన తరఫున ఒక ప్రశ్న నన్ను అడగమన్నారు.  ఆయనకు అన్ని బరువు బాధ్యతలు తీరిపోయాయి.  హాయిగా కృష్ణా రామా అనుకుంటూ ఉన్నారు.  కాని ఆయనలో ఒక విధమయిన కీర్తి కండూతి అనేది ఉందన్న విషయం తెలిపి దానిని ఎలా తగ్గించుకోవాలో బాబాని అడగమని చెప్పారు.

సరే అని నేను నిన్నటిరోజున అనగా 24 వ.తారీకున ధ్యానంలో బాబాని ఈ విధంగా ప్రశ్నించాను.  “బాబా ఆయన నిన్ను అడగమన్న ప్రశ్న అడుగుతున్నాను.  ఆయన తనలో ఉన్న కీర్తి కండూతిని ఏవిధంగా తగ్గించుకోవాలి.?”

బాబా సమాధానం.. "EGO”  అని సమాధానమిచ్చారు. అనగా అహంకారాన్ని తగ్గించుకోమని చెప్పారు.  కాని నాకు ఇంకా తృప్తికలిగించలేదు ఆ సమాధానం. ధ్యాన సమయంలో   నా శరీర  పరిస్థితిని బట్టి ఇంకా ఆయన చెప్పవలసినది ఉందనిపించి మరికాసేపు అయిదు నిమిషాలు కూర్చున్నా ఏమీ సమాధానం రాలేదు.  ఇక ధ్యానంలోనుంచి లేచి నా టేబుల్ మీద ఉన్న ‘HOW I FOUND GOD’  by E.K. SPENCER గారు వ్రాసిన 500 పేజీల పుస్తకం చేతిలోకి తీసుకున్నాను.  కళ్ళు మూసుకుని బాబాని ప్రార్ధించి ఒక పేజీ తీసి ఒకచోట వేలు పెట్టాను.  కళ్ళు తెరచి చూసాను.  అందులో ఉన్న సమాధానం తెలుగు అనువాదం ఇప్పుడు మీకు తెలియచేస్తున్నాను.

Monday, August 24, 2020

బాబా నాజీవితంలోకి ఏవిధంగా ప్రవేశించారు?

0 comments Posted by tyagaraju on 7:48 AM

Saibaba - Home | Facebook

Buy Light Lavender Purple Rose Hair Flower Clip Online at Low ...

24.08.2020  సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
నిన్నటిరోజున అనగా 23.08.2020 న ప్రచురించిన ‘మద్రాసు భజనసమాజం’ చదివి స్పందించిన సాయిభక్తులందరికీ కృతజ్ఞతలు.  బాబా జీవించి ఉన్న కాలంలో ఆయన అనుభూతులను, మహిమలను స్వయంగా అనుభవించిన మద్రాసు భజనసమాజంలోని వారు వ్రాసినదానిని చదివి సాయిభక్తులు ఎంతగానో సంతసించారు.

ఈ రోజు బాబా వారి అనురాగం, ప్రేమ, దయ గురించిన మరొక అధ్భుతమయిన విషయాన్ని మీకు అందిస్తున్నాను.  చెన్నై నుండి శ్రీమతి మంజు భాషిణి గారు బాబా తన జీవితంలోకి ఏవిధంగా ప్రవేశించారో ఆంగ్లంలో వ్రాసి పంపించారు.  బాబా తనవారిని ఏవిధంగా తన వైపు రప్పించుకుంటారో ఇది చదివిన తరువాత మనం గ్రహించుకోవచ్చు.  ఆయన అనురాగం ఎటువంటిదో చదివిన నాకే కళ్ళు చెమర్చాయి.  శ్రీమతి మంజుభాషిణి గారు శ్రీమతి మాధవి, భువనేశ్వర్ గారికి పంపించారు.   ఇక చదవండి.
(ఇక్కడ మీకొక ముఖ్యమయిన విషయం చెప్పాలి.  మంజుభాషిణిగారి పూర్వీకులు షిరిడీలోనే ఉండేవారట)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
బాబా నాజీవితంలోకి ఏవిధంగా ప్రవేశించారు?
(పిలుస్తే పలుకుతా)
సాయిబంధువులందరికీ ‘ఓమ్ సాయిరామ్’
ఈ రోజు విజయదశమి మహాపర్వదినం రోజున శ్రీసాయిబాబా జీవితాంతం మీకు తోడుగా ఉండి తన ఆశీర్వాదాలను నిరంతరం ఇస్తూ   ఉండమని కోరుకొంటున్నాను. 
బాబా నాజీవితంలోకి ఏవిధంగా ప్రవేశించారు?
ఆయన నా జీవితంలోకి ఏవిధంగా ప్రవేశించారో మీకు వివరిస్తాను.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago