20.03.2016 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి
జయజయ సాయి
సాయి బంధువులకు
బాబాఅవారి శుభాశీస్సులు
ఈ రోజు సాయిబానిస
గారికి బాబావారు ఇచ్చిన ఆధ్యాత్మిక సందేశాలను మరికొన్ని తెలుసుకుందాము
శ్రీసాయి పుష్పగిరి
– ఆధ్యాత్మికం 8వ.భాగమ్
03.04.2009
71. పిల్లవాడు తన తల్లి పాలు
త్రాగి ఆమెకు ఋణపడి ఉంటాడు. ఆ
ఋణము ఒకజన్మలో తీరదు. బాబా
ఆవుపాలు త్రాగి ఆ ఆవు ఋణమును
లక్ష్మీఖాపర్డే రూపములో తన ద్వారకామాయికి రప్పించుకుని
ఆమెను ఆశీర్వదించినారు. (శ్రీ
సాయి సత్ చరిత్ర 27వ.అధ్యాయము)
సాయిబానిస
11.04.2009
72. గుఱ్ఱపు పందాలలో ఆఖరులో మెల్లిగా వచ్చిన గుఱ్ఱానికి, రౌతుకు బహుమానమిచ్చారు. గుఱ్ఱపు
పరుగు వేగాన్ని తగ్గించి రౌతు చాలా మెల్లిగా
గుఱ్ఱాన్ని ముందుకు నడపడం కూడా ఒక
సాధనె. ఈ
పందెములో బహుమానము పొందటం ఒక అదృష్టము.
(ఇక్కడ
గుఱ్ఱము అనగా భగవంతుని అనుగ్రహమని
భావించవలెను)
29.04.2009
73. ఎవరినివారే ఉధ్ధరించుకోవాలి. ఇతరులను
ఉధ్ధరించగలనని అనే ఆలోచన అవివేకము. కనుక
వివేకముతో జీవించి నీగమ్యము చేరుకో.
20.05.2009
74. గురువు శిష్యుడు యిద్దరూ ఒకచోట కూర్చుండి శాస్త్ర
అధ్యయనం చేయాలి. అంతేకాని,
గురువు తన పని తాను
చేసుకుంటూ శిష్యుడిని వదలివేసిన అది గురుశిష్య సాంప్రదాయానికి
విరుధ్ధము. గురుశిష్య పరంపరలో
అపార్ధాలకు చోటు ఉండరాదు.
24.06.2009
75. సముద్రంలో పెద్ద చేపలు చిన్నచేపలను
తినడం సృష్టి ధర్మాలలో ఒకటి. ఇది
లేనిరోజున సముద్రమునిండా చిన్న చేపలతో నిండిపోయి
సముద్రము నిరుపయోగమయిపోతుంది. పెద్దచేప
చిన్న చేపలను తినడం జీవహింస కాదు.
25.07.2009
76. శ్రీసాయి పంచభూతాలలోను ఉన్నారు. పంచభూతాల
కలయికే ఈశరీరము. అందుచేత
శ్రీసాయి ప్రతి జీవిలోను ఉన్నారు. సాయిబానిస
77. సరస్వతీ కటాక్షము ఉన్నవారిలో చాలామందికి అహంకారం రావడం నాకు కొంత
చికాకు కలిగించింది. మరికొంత
మందికి లక్ష్మీకటాక్షం రావడంతో వారు అహంకారంతో జీవించడం
ప్రారంభించారు. ఇది
నాకు చాలా బాధకలిగించింది.
భగవంతుని సేవలో అహంకారం విడనాడాలి. అప్పుడే
ఆ జీవితానికి సార్ధకత అని గ్రహించాను.
19.08.2009
78. దోమలలోను, చీమలలోను ఉన్నది నేనే అని నేను
అందరికి చెబుతున్నానే మరి షిరిడిలోని నా
విగ్రహానికి రాత్రి ఆరతి యిచ్చిన తరువాత
దోమతెర కట్టడం నాకర్ధం కావటల్లేదు.
79. నీ
శరీరం పంచభూతాలతో సృష్టించబడింది కదా. నీ
శరీరంలోని పంచభూతాలను నీవు చూడలేవు. కాని వాటి ఉనికిని
నీవు అనుభూతిగా పొందుతూ ఉంటావు. అలాగే
నీవు నీ కళ్ళతో భగవంతుని
చూడలేవు. కాని
నీవు ఆ భగవంతుని అనుభూతిని
మాత్రం పొందగలవు. కారణం
ఈ పంచభూతాలను సృష్టించింది ఆ భగవంతుడే కనక.
80. స్నేహాలు, బంధుత్వాలు, ఈ శరీరానికి ఎంత
వరకు ఉపయోగపడతాయి అని ఆలోచించి అంత
వరకే అవి నిజమని గుర్తించు. అవి
మాత్రము శాశ్వతం కావు. అందుచేత
శాశ్వతమయిన ఆ భగవంతుని సదా
స్మరిస్తూ ఉండు.
(మరికొన్ని సందేశాలు
తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment