Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, April 28, 2017

మాతాజీ కృష్ణప్రియ - 2 వ.భాగమ్

Posted by tyagaraju on 6:50 AM
     Image result for images of shirdi saibaba smiling face
              Image result for images of rose hd
28.04.2017 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబంధువులకు ఒక మనవి ః నిన్న ప్రచురించిన మాతాజీ కృష్ణప్రియ ఒకటవ భాగంలో ఆవిడ పుట్టిన నెల ఏమిటన్నది ప్రచురితం కాలేదు.  ఈ పొరబాటును కొంతమంది సాయిభక్తులు నాదృష్టికి తీసుకుని వచ్చారు.  వారికి నా ధన్యవాదాలు.  ఒకటవ భాగంలో దానిని సరి చేసాను.  ఆవిడ జన్మించిన తేదీ...1923 వ.సంవత్సరం, నవంబరు, 18తారీకు.

మాతాజీ కృష్ణప్రియ - 2 వ.భాగమ్
        Image result for images of mataji krishnapriya
మాతాజీ మాహాత్మ్యం గురించి ఆనోటా ఆనోటా ప్రచారంలోకి వచ్చిందిదాంతో అందరూ ఆమెను దర్శించుకోవడానికి తండోపతండాలుగా రావడం మొదలుపెట్టారుఇది ఆమె ధ్యానసాధనకి ఆటంకం కలిగించిందిబాబా అనుమతి తీసుకుని ఆమె మధ్యప్రదేశ్ లోని పంచమర్హి హిల్ స్టేషన్ లో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొన్నారు.  



ఆశ్రమంలో బాబా మందిరాన్ని కూడా నిర్మించి అక్కడ ఒక పూలతోటను కూడా పెంచారు.  ఆ ఆశ్రమంలోనే భగవంతుడిని పూజ చేసుకుంటూ 12 సంవత్సరాలు గడిపారు.  ఆ పన్నెండు సంవత్సరాల కాలం  భక్తుల సంక్షేమానికి, ప్రపంచ శాంతికోసం తపస్సు చేసారా అన్నంతగా,  ఆమెకు ఎన్నో దివ్యమయిన దృశ్యాలు, అనుభవాలు కలిగాయి. అప్పటినుండే కృష్ణప్రియ మాతాజీగా మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చారు.  1969 వ.సంవత్సరంలో తన శిష్యులని తనతోపాటుగా హోమంలో కూర్చోబెట్టి వాసుదేవ మహామంత్రాన్ని ఒక్కొక్కరిచేత 12 లక్షలసార్లు జపింపచేసారు.  ఈ జపయజ్ఞం హోమం ముగింపు సమయంలో జరిగే పూర్ణాహుతి.

1971 వ.సంవత్సరంలో ఆవిడ కొంతమంది శిష్యులను వెంటబెట్టుకుని దక్షిణదేశ యాత్రలకు వెళ్ళారు.  ఆ యాత్రా సమయంలో శిష్యులకి దివ్యానుభూతులను అనుభవించే అదృష్టం కలిగింది.  ఆతరువాత 1974 వ.సంవత్సరంలో తన శిష్యులకోరిక ప్రకారం బాబా అనుమతి తీసుకుని ఆవిడ తన ఆశ్రమాన్ని పంచమర్హినుంచి నాగపూర్ లో కొత్తగా నిర్మించిన భవనంలోకి తరలించారు.  ప్రక్కనే గుడిని కూడా నిర్మించి పంచమర్హి దేవాలయంలో ఉన్న విగ్రహాలను తిరిగి ప్రతిష్టించారు.  ఆమె శిష్యులు ఆప్రతిష్టా మహోత్సవాన్ని ఎంతో వైభవంగా జరిపించారు.  ఈ ఆశ్రమంలోని భక్తులందరూ ఎంతో ఉత్సాహంతో ఒకసారి అయిన తరువాత మరొకసారి ఆవిధంగా ఎన్నోసార్లు జపయజ్ఞం నిర్వహించారు.

ప్రతిసంవత్సరం కార్తికమాసంలో (సాధారణంగా నవంబరు రెండవవారం) కార్తిక పూర్ణిమనాడు అత్యున్నత స్థాయిలో శ్రీరాధాకృష్ణులను మంత్రాలతో పూజ సలిపే విధంగా జపయజ్ఞాన్ని నిర్వహించే సాంప్రదాయాన్ని మాతాజీ ఏర్పాటు చేశారు.  ఈ ఉత్సవాలలో పాల్గొనేవారందరూ భగవంతునికి అనేక సేవలు చేస్తూ, ఆయన కీర్తనలు భజనలు ఎంతో తన్మయత్వంతో పాడుతూ ఉండేవారు.  మాతాజీ అనుగ్రహం వల్లనే ఇవన్నీ జరగడానికి సాధ్యపడేది.

1977 వ.సంవత్సరంలో రామచంద్రపురంలో భారీ ఎత్తున మరొకసారి మాతాజీ, వాసుదేవ మహామంత్ర జపాన్ని నిర్వహించారు.  ఈకార్యక్రమంలో ఎంతోమంది శిష్యులు పాల్గొన్నారు.

ప్రతిసంవత్సరం నవరాత్రులలో నాగపూర్ గుడిలో ప్రతిష్టింపబడ్డ శ్రీకృష్ణుని విగ్రహాన్ని దుర్గాదేవిగా అలంకరణ చేసి వివిధ రకాలయిన యజ్ఞాకార్యక్రమాలను ఎంతో ఉత్సాహంతో జరిపించేవారు.  కార్తిక పౌర్ణమినాడు శ్రీకృష్ణుని రాధగా అలంకరణ చేసేవారు.  నువ్వు భగవంతుని ఏరూపంలో పూజించినా దేవుడు ఒక్కడె అని చెప్పడానికే ఆమూర్తికి అటువంటి అలంకరణలు చేసేవారు.

బాబా ఆదేశించిన ప్రకారం మాతాజీ ‘శ్రీసాయి సత్ చరిత్రను’ రచించి బాబాకే అంకితం చేసారు.  ఈ గ్రంధం ప్రతిరోజూ పారాయణ చేస్తూ ఒక వారంలో పారాయణ పూర్తయే విధంగా ఏడు అధ్యాయాలుగా వ్రాయబడింది.  జీవితంలో మొక్కుకొన్న మొక్కులు, లేక కోరికలు, లక్ష్యాలు సిధ్ధింపచేసుకోవడానికి మరలా మరలా పారాయణ చేయవలసిన విధానాన్ని మాతాజీ నిర్దేశించారు.  ఈ గ్రంధానికి బాబావారి ఆశీస్సులు, సద్గురు మాతాజీ పవిత్రమయిన వాక్కులు ఉండటం వల్ల, పారాయణల వల్ల ఎన్నో ఫలితాలు కలిగాయని ఋజువు చేయబడింది.  పారాయణ వల్ల తమ తమ కోరికలు సిధ్ధించాయని ఇప్పటికీ భక్తులు చెబుతూనే ఉన్నారు.  నమ్మినవారికందరికీ ఆవిధంగా సుఖ సంతోషాలను, మానసిక ప్రశాంతతను కలిగించే విధంగా చేయబడ్డ ఉన్నతమయిన సేవ చేసారు మాతాజీ.

మాతాజీ తన భక్తులపై చూపించే ప్రేమ, దయ ఎటువంటిదంటే వారికి జీవితంలో ఎదురయ్యే ప్రమాదాలనుంచి కూడా అనేకవిధాలుగా రక్షిస్తూ ఉండేవారు.  తన భక్తుల బాధలను తానే స్వీకరించి వారికి ఉపశమనం కలిగించిన సందర్భాలు అసంఖ్యాకంగా ఉన్నాయి.  కొంతమంది శిష్యులు ప్రమాదాలబారిన పడినపుడు, అకాల మృత్యువాత పడకుండా కూడా వారిని రక్షించారు మాతాజీ.  తన తల్లి జోగుబాయి ఆఖరిరోజులలో ఉన్నపుడు ఆమెకు ఎంతో శ్రధ్ధగా సేవ చేసారు.  ఆవిడకు వైద్యం చేయించి దగ్గరుండి అన్ని సపర్యలు చేశారు.  ఆవిడ తల్లి జోగుబాయిగారికి 1981 వ.సంవత్సరం అక్టోబరు 10వ.తేదీన అరుదయిన యోగపధ్ధతిలో కపాలమోక్షం కలిగి ఈ ప్రపంచాన్ని వదలి స్వర్గానికి చేరుకొన్నారు.  ఒక గొప్ప సద్గురువు ద్వారానే కపాల మోక్షమన్నది సాధ్యపడుతుంది.

మాతాజీ ఆశీర్వాదములతో 1981 వ.సంవత్సరం నవంబరు 7వ.తారీకున భక్తులందరూ కలిసి ‘సాయి కృష్ణ సేవాసమితి’ అనే సంస్థను స్ఠాపించారు.  మాతాజీ బోధనలు ప్రాచుర్యంలోకి తీసుకునిరావడానికే  కాక దీనజనోధ్ధరణ కోసం ఈ సంస్థ  ప్రారంభింపబడింది.

1985 వ.సంవత్సరంలో మాతాజీ గారి 60వ.జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా రామచంద్రపురంలో జరిగాయి.  ఆవిడ శిష్యులందరూ ‘మృత్యుంజయ జపహోమం’ కార్యక్రమాలను జరిపించారు.  ఉత్సవాల ముగింపు రోజున భక్తులందరూ దివ్యమయిన అనుభూతులను అనుభవాలను కనులారా వీక్షించారు. ఆసమయంలో వారికి విశ్వాంతరాళంనుండి శ్రీకృష్ణపరమాత్ముని యొక్క దివ్యమయిన వేణుగానం వినిపించింది.  
      Image result for images of srikrishna playing flute
       
రాధా, కృష్ణుల విగ్రహాలు అనుహ్యంగా దర్శనమిచ్చాయి.  మాతాజీ భక్తులందరి మధ్య ఆశీనురాలయి భజనలు పాడుతూ ఉన్న సమయం.  అపుడే బాబా మాతాజీకి పుట్టినరోజున బహుమతిని అందించారన్నట్లుగా ఆవిడ ముకుళిత హస్తాలలో సుందరమయిన ఆభరణాలతో ఉన్న విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి.  
        Image result for images of idols of radha krishna

ప్రతిరోజు ఆరుగంటలపాటు గుడిలో తన ఉనికిని చాటుతానని, పరిపూర్ణమయిన భక్తి విశ్వాసాలతో గుడిలోకి అడుగుపెట్టిన ఏభక్తుని కోరికలనయినా తీరుస్తానని శ్రీసాయిబాబా మాతాజీకి ఏనాడో మాటిచ్చారు.

1987 వ. సంవత్సరం డిసెంబరు 5వ.తేదీ దత్తజయంతి రోజున మాతాజీ, తన శిష్యులను, భక్తులను అందరినీ కోలుకోలేని దుఃఖసాగరంలో ముంచి గోలోకానికి వెళ్ళిపోయారు.

1989వ.సంవత్సరంలో రామచంద్రపురంలోని గుడిని పునరుధ్ధరించి, ఇతర దేవతా విగ్రహాలతోపాటుగా మాతాజీ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు.

మాతాజీ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టినా ఆవిడ శిష్యులు ఇప్పటికీ ఆవిడ ఉనికిని అనుభూతి చెందుతూనే ఉన్నారు.  వారికి ఎన్నో అనుభవాలు కూడా  కలుగుతున్నాయి.  భక్తులందరూ ఉన్న సమయంలో అనేక సందర్భాలలో ప్రత్యక్షంగా  కొన్ని అధ్బుతమయిన దృశ్యాలు కూడా కనిపించాయి.  దానికి చిన్న ఉదాహరణ. 1988వ.సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున అర్ధరాత్రివేళ గుడిలో పూలదండ ఊగుతూ కనిపించింది.  రామచంద్రపురం గుడి స్వర్ణోత్సవాలు 2004 వ.సంవత్సరంలో జరిగాయి.  ఆ సందర్భంగా ప్రచురించిన ప్రత్యేక స్మారక సంచికలో ఆవిడ శిష్యుల యొక్క జీవితకాల అనుభవాలు ప్రచురింపబడ్డాయి. 

‘మల్లిక’ (వకుళమాల గారి కలం పేరు) గారు మాతాజీ గారి జీవిత చరిత్రను రచించి అంకితం చేశారు.  ఆవిడ తెలుగులో వ్రాసిన మాతాజీ జీవిత చరిత్ర 1982వ.సంవత్సరంలో ప్రచురింపబడింది.  డా.ఎమ్. శ్రీనివాసరావు గారు దీనిని ఆగ్లంలోకి అనువదించారు.  అది 1985వ.సంవత్సరంలో ప్రచురింపబడింది.  మాతాజీ గురించి పూర్తిగా తెలుసుకోదలచిన వారు ఆపుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చు.

మాతాజీ రచించిన శ్రీషిరిడీ సాయిబాబా జీవిత చరిత్ర  బాబావారు ప్రత్యేకంగా ఆశీస్సులంద చేసిన పవిత్ర గ్రంధం. ఇది ప్రతిరోజు పారాయణ చేయదగ్గ పవిత్ర గ్రంధం.  ఈ గ్రంధ పారాయణ  భక్తులపై ప్రేమ, దయలను ప్రసాదించి వారి లక్ష్యాలను నెరవేర్చి, భక్తివిశ్వాసాల మార్గంలోకి తీసుకుని వెడుతుంది. 

మాతాజీ గారి బోధనల ద్వారా భక్తులందరికీ ఆశీర్వాద ఫలితములు లభించు గాక.
నాగపూర్                            -మల్లిక (ఆరాధి వకుళమాల)
                                    ప్రెసిడెన్ట్, సాయి కృష్ణ సేవాసమితి.

మాతాజీ కృష్ణప్రియగారు రచించిన పుస్తకాలు కావలసిన వారు వీరిని సంప్రదించండి.
1)    మాతాజీ కృష్ణప్రియ సేవాసమితి,  న్యూ నాగోల్, హైదరాబాద్
శ్రీ శ్రీనివాస్,  సెల్. నంబర్  :  9581322226

2)   గోదావరి జిల్లాల వారు వీరిని సంప్రదించండి.
   శ్రీ ఎ. శ్రీధర్, 'సాయి శ్యామా నిలయమ్’ రత్నంపేట, రామచంద్రపురం, తూర్పు గోదావరి జిల్లా, - 533 255 
    మొబైల్ నంబర్      :   9440017280 

(రేపటి సంచికలో భారం వారి కుటుంబంలో జరిగిన
ఒడలు పులకరించే అనుభవాలు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List