29.04.2017 శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి
–31 వ.భాగమ్
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల రచన : తెలుగు.
ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి
గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్
చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త
మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు
కె.పి. ఆర్. దివ్య ప్రభాస్ ఎన్ క్లేవ్, ఫ్లట్
102, లోటస్ బ్లాక్,
నిజాంపేట, హైదరాబాద్
Mail id :
tyagaraju.a@gmail.ocm
ఫోన్ : & వాట్స్
ఆప్ : 9440375411
8143626744
ఒడలు గగుర్పొడిచే అనుభవాలు
1. 1986 వ. సంవత్సరంలో మేము
షిరిడీ వెడుతూ ప్రయాణం మధ్య దారిలో తుల్జాపూర్ లోని భవానిమాత దేవాలయాన్ని సందర్శించుకున్నాము. నాభర్తకు ధ్యానంలో భవానీ మాత ఎనిమిది చేతులతో, నడుము
చుట్టూ చిన్న బట్టను మాత్రమే ధరించి ఉన్నట్లుగా దర్శనమిచ్చింది. మేమెప్పుడు భవానీమాతను
దర్శించుకున్నా ఆమె విగ్రహానికి చక్కటి చీర కట్టబడి ఉంటుంది.
అటువంటిది నడుముకు మాత్రమే కురచని బట్ట చుట్టుకుని
ధ్యానంలో ఎందుకని దర్శనమిచ్చిందో మాకందరికి ఆశ్చర్యం కలిగించింది. తరువాత మేము ఉదయాన్నే
గుడిలోకి వెళ్ళాము. అపుడు పూజారులు భవానీ మాతకు
అభిషేకం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో భవానీమాత
విగ్రహానికి ధ్యానంలో మావారికి దర్శనమిచ్చినట్లుగా నడుము చుట్టు చిన్న బట్టకట్టారు. ఆమె తన నిజస్వరూపాన్ని ధ్యానంలో దర్శింపచేసినందుకు
మేమెంతగానో ఆనందించాము.
2. 1985 వ.సంవత్సరంలో మేము
బాసర వెళ్ళాము. నాభర్త శారదాదేవి విగ్రహం ముందు
ఎదురుగా కూర్చుని ప్రార్ధన చేసుకొంటున్నారు.
అకస్మాత్తుగా ఎవరో ఆ విగ్రహం మీదకు ఫోకస్ చేసినట్లుగా విగ్రహం చుట్టు వెలుగు
కనిపించింది. కొద్ది నిమిషాల తరువాత చీకటయిపోయింది. ఆ తరువాత మరలా వెలుగు కనిపించింది. ఈ విధంగా కొన్ని నిమిషాలపాటు జరిగింది. అపుడు నాభర్త సాయిబాబా తత్వాన్ని మెల్లమెల్లగా అర్ధం
చేసుకోసాగారు. చీకటి అన్నది అజ్ఞాన స్థితిని
తెలుపుతుందని, సరస్వతీదేవి చూపించిన వెలుగు జ్ఞానానికి ప్రతీక అని అర్ధం చేసుకున్నారు. మేము శారదామాతకి సాష్టంగనమస్కారం చేసుకుని, దత్త
పాదుకల ఆశీర్వాదములనందుకున్నాము.
3. ప్రతి గురువారాలలోను
మేము సాయిబాబాకు అభిషేకం చేస్తూ ఉంటాము. బాబాకు
అభిషేకం చేసినప్పుడెల్లా మాపూజా గదిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరుని వెండి విగ్రహానికి,
ఇంకా రెండు నాగేంద్ర స్వామి విగ్రహాలకి కూడా అభిషేకాలు చేస్తూ ఉంటాము.
ఒక గురువారం రోజున వాటి స్థానాలను మార్చి, ఆ విగ్రహాలను
ఒక మూలగా పెట్టాము. అందువల్ల బాబాకి అభిషేకం
చేసేటప్పుడు వాటిసంగతి మర్చిపోయాము. ఆ రోజు
రాత్రి రెండు పెద్ద సర్పాలు నాభర్త కలలోకి వచ్చాయి. ఆయన చాలా భయపడ్డారు. అప్పుడా సర్పాలు, “మమ్మల్ని చూసి ఎందుకని భయపడతావు? మేము నిన్ను చంపము. మమ్మల్ని నువ్వు నిర్లక్ష్యం చేసావు. మాకెందుకని నువ్వు అభిషేకం చేయలేదు? మాస్థానాలనుంచి మమ్మల్ని తప్పించి మూలగా ఎందుకు
పెట్టావు?’ అన్నాయి. నాభర్త క్షమించమని అర్ధించారు. మరుసటిరోజే వాటిని మరలా యధాస్థానాలలో ఉంచి, నేటి
వరకు మర్చిపోకుండా అభిషేకాలు చేస్తూ ఉన్నాము.
తను చిత్తశుధ్ధితో చేసే పూజని, నిశ్చలమయిన భక్తిని సాయిబాబా మాత్రమే కాక మిగిలిన
దేవతలందరు గుర్తించినందుకు మావారెంతగానో పొంగిపోయారు.
4. సాయిబాబాను పూజించడం
ప్రారంభించక ముందు మేము మంత్రాలయ శ్రీరాఘవేంద్రస్వామి గారిని పూజిస్తూ ఉండేవాళ్ళం. 1977 వ.సంవత్సరంలో మా అబ్బాయి చి.కృష్ణకిషోర్ ఖమ్మంలో
ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. దురదృష్ట వశాత్తు
మాకోడలు చి.సౌ. నివేదితకి మిస్ కారేజ్ అయి చాలా సీరియస్ అయింది. రక్తం ఎక్కించాల్సి వచ్చింది. ఆమె బ్లడ్ గ్రూప్ AB – Rh నెగిటివ్. అది చాలా అరుదుగా ఉంటుంది. అది ఖమ్మంలో దొరకలేదు. మా అబ్బాయి ఆ బ్లడ్ గ్రూప్ విజయవాడలో దొరుకుతుందేమోనని
కారును విజయవాడకు పంపించాడు. అదృష్టం కొద్ది,
O – Rh నెగిటివ్ దొరికింది. ఆ బ్లడ్ ఎక్కించారు. మాకోడలు ప్రమాదంనుంచి బయటపడింది. కొన్ని నెలల తర్వాత ట్యూబులార్ ప్రెగ్నెన్సీ వల్ల
ఒక ఫెలోపియన్ ట్యూబును తీసివేయాల్సి వచ్చింది.
ఈ పరిస్థితిలో ఆమెకు సంతానం కలుగుతుందా లేదా, మాకు వంశాభివృధ్ధి ఉంటుందా ఉండదా అని చాలా దిగులు
పడ్దాము.
మా అబ్బాయికి కర్నూలుకు
బదిలీ అయింది. మేము మా అబ్బాయి దగ్గర కొద్దిరోజులున్న
తరువాత మంత్రాలయం వెళ్ళాము. అక్కడ మాకు మానసిక
ప్రశాంతత లభించింది. రాఘవేంద్రస్వామివారి మీద
మానమ్మకం బలపడింది. మేము మా అబ్బాయిని కోడలిని
మంత్రాలయంలో నాగపూజ చేయించమని, వేపచెట్టు
క్రింద, రావిచెట్టుకిరంద నాగప్రతిష్ట చేయమని చెప్పాము.
వారిద్దరూ మేము చెప్పిన
విధంగా చేశారు. కొద్దిరోజుల తరువాత మాకోడలు గర్భవతయింది. ఆమెకు అంతకుముందు రెండుసార్లు అబార్షన్ అయింది. దానివల్ల మాకు చాలా భయంగా ఉంది. ఒకవేళ ఆమె శరీరంలో యాంటీబాడీస్ కనక ప్రవేశిస్తే
అది పుట్టబోయే బిడ్డకు ప్రమాదం. పుట్టిన బిడ్డకి
రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. ఇవన్నీ వినగానే
మాకు చాలా భయం వేసింది. శ్రీరాఘవేంద్రస్వామివారి
ఆశీర్వాద బలంతో డిసెంబరు, 1978 వ.సంవత్సరంలో, దత్తజయంతి రోజున ఆమెకు మగ శిశువు జన్మించాడు. 1981 వ.సంవత్సరంలో రెండవ సారి అబ్బాయి జన్మించాడు. వారిద్దరికి బ్లడ్ గ్రూపు తండ్రిదే సంక్రమించింది. భగవంతుని దయవల్ల అన్నీ సక్రమంగా జరగటంతో మేమంతా
సంతోషించాము. పిల్లలిద్దరికీ శ్రీరాఘవేంద్రస్వామివారి
పేరు పెట్టుకున్నాము. మంత్రాలయంలో పుట్టువెంట్రుకలు
తీయించి, అభిషేకం జరిపించాము.
5. నాభర్త ప్రభుత్వోద్యోగి
కావడంవల్ల తరచు బదిలీల మీద ఒక ఊరినుంచి మరొక ఊరికి మారవలసి వస్తూ ఉండేది. దానివల్ల హైదరాబాద్ లో ఉన్న మాయింటిని అద్దెకు ఇచ్చాము. నాభర్త పదవీ విరమణ చేసిన తరువాత ఇక హైదరాబాద్ లోనే
స్థిరపడదామనుకొన్నాము. మాఇంటిలో అద్దెకున్నవారిని
ఖాళి చేయమన్నాము. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు
ఖాళి చేయలేదు. 1979 లో మేము ఒక స్థలాన్ని ఏర్పాటుచేసుకుని
అక్కడ గ్రౌండుఫ్లోర్ మీద మొదటి అంతస్తు నిర్మించి అందులో ఉందామనుకున్నాము. ఇంటి నిర్మాణ సమయంలో అన్నీ దగ్గరుండి చూసుకోవడానికి
గారేజీ మీద ఉన్న చిన్న గదిలో మేమిద్దరం ఉన్నాము.
ఒకరోజు రాత్రి శ్రీరాఘవేంద్రస్వామి నాభర్తకు కలలో కనిపించి, “కొద్ది రోజులలోనే
నీ యింటిలో దొంగతనం జరగబోతూ ఉంది. కాని ఏమీ
భయపడకు. నేను నీయింటికి కాపలాగా ఉంటాను” అన్నారు. మాయింటిలో దొంగతనం జరగవచ్చని అర్ధమయి, మేము మాచుట్టుప్రక్కల
ఉన్నవాళ్ళకి ఫోన్ చేసి మానంబరు ఇచ్చాము. అత్యవసరం
అయితే మాకు ఫోన్ చేయమని చెప్పాము.
మా అబ్బాయి చి.కృష్ణకిషోర్
దసరా శెలవులు మాదగ్గర గడపటానికి కర్నూలునుండి వచ్చాడు. మరునాడు ఉదయాన్నే కర్నూలునుంచి ఫోన్ వచ్చింది. దొంగలు మాఅబ్బాయి ఇంట్లోపడి దోచుకున్నారని, ఇంట్లో
ఏమేమి పోయాయో తెలియదని, పోలీసులు కాపలాగా ఉన్నారని చెప్పారు. అప్పుడు మావారికి తనకు
వచ్చిన కల గుర్తుకు వచ్చింది. మాఅబ్బాయితో
“నాకు వచ్చిన కలే కనక నిజమయితే నీయింటిలో పూచికపుల్ల కూడా పోదు” అని చెప్పారు. క్రితం రోజు రాత్రి వాళ్ళ వాచ్ మన్ మా అబ్బాయి ఇంట్లో
లైట్లు వెలుగుతూ ఉండటం చూసాడట. ఆ వాచ్ మన్
అసలు ఎప్పుడో గాని రాడు. బహుశ మా అబ్బాయికి
హైద్రాబాద్ వెళ్ళే బస్సు తప్పిపోయి ఉంటుంది అందుకనే వెనక్కి తిరిగి వచ్చేశాడని అనుకున్నాడట. అలా అనుకుని ఇంటి కాలింగ్ బెల్ కొట్టాడట. ఎవరూ తలుపులు తీయలేదు. అప్పుడు అతనికి ఇంటి ప్రవేశద్వారం దగ్గరున్న తాళం
పగలకొట్టబడి ఉండటంతో దొంగలు పడ్డారని అర్ధమయిందట.
వాడికి భయంవేసి అందరినీ సహాయం కోసం తీసుకొద్దామని ILTD ఆఫీస్ కి వెళ్ళాడు. అతను తిరిగి వచ్చేటప్పటికి దొంగలు పారిపోయారు. ఇంటిలో ఏవస్తువూ పోలేదు. అదంతా రాఘవేంద్రస్వామివారి మహత్యం వల్లనే సంభవమ్దయింది.
ఎప్పుడోగాని రాని వాచ్ మన్ ని అటువైపుగా రప్పించి ఇంటిలో దొంగతనం జరగకుండా శ్రీరాఘవేంద్రస్వామివారు
కాపాడారు.
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment