30.04.2017 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి
–32 వ.భాగమ్
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల రచన : తెలుగు.
ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి
గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్
చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త
మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు
కె.పి. ఆర్. దివ్య ప్రభాస్ ఎన్ క్లేవ్, ఫ్లట్
102, లోటస్ బ్లాక్,
నిజాంపేట, హైదరాబాద్
Mail id :
tyagaraju.a@gmail.ocm
ఫోన్ : & వాట్స్
ఆప్ : 9440375411
8143626744
ఒడలు గగుర్పొడిచే అనుభవాలు
-2
6. 1983 వ.సంవత్సరం నవంబరు 20వ. తారీకున మేము మంత్రాలయం
వెళ్ళి అక్కడ మూడు రోజులున్నాము. 24వ.తారీకు
ఉదయం హైదరాబాదుకు తిరిగి వద్దామనుకున్నాము.
23వ.తేదీ రాత్రి శ్రీరాఘవేంద్రస్వామి నాభర్తకు కలలో కనిపించి గుడి చుట్టూ
అంగప్రదక్షిణ చేయమని ఆదేశించారు. ఆయన ఆజ్ఞాపించిన
ప్రకారం అంగప్రదక్షిణ చేయడంకోసం మాప్రయాణాన్ని వాయిదా వేశాము.
కాని అంతకుముందు వారం
రోజుల క్రితమే శ్రీసాయిబాబా మావారికి గుండె ఆపరేషన్ చేశారు. దానికి గుర్తుగా వలయాకారంలో ముద్రకూడా పడింది. ఆ గాయం ఇంకా మానలేదు.
మంత్రాలయం గుడి ఆవరణలో మగవారెవరూ చొక్కా ధరించకూడదు. అది అనాదిగా వస్తున్న ఆచారం. అటువంటప్పుడు అంగప్రదక్షిణ చేసేటప్పుడు నేలమీద పొర్లుతూ
ఉండాలి. నేల గట్టిగా ఉంటుంది. అక్కడక్కడ చిన్నచిన్న రాళ్ళు కూడా ఉంటాయి. వాటిమీదనుంచి దొర్లే సమయంలో గాయం రేగి ఇంకా పెద్ద
పుండవుతుందేమోనని భయపడ్డాము. ఆయనకు గుండె జబ్బు
పూర్తిగా తగ్గిందోలేదో తెలీదు. మంత్రాలయంలో
సరైన వైద్య సదుపాయాలు కూడా లేవు.
మరుసటిరోజు వేకువఝాముననే
నాభర్త నిద్రనుంచి లేచి పవిత్ర తుంగభద్రా నదిలో స్నానం చేశారు. పంచకట్టుకుని గుడిచుట్టూ అంగ ప్రదక్షిణ ప్రారంభించారు. ఆయన బృందావనం వెనుక భాగానికి చేరుకోగానే ఆయనకు దేదీప్యమానమయిన
వెలుగులో సింహాసనం మీద ఆశీనులయి ఉన్న శ్రీరాఘవేంద్రస్వామి వారి దర్శనం లభించింది.
12 నిమిషాలలోనే అంగప్రదక్షిణ పూర్తి చేసుకుని తిన్నగా
గుడిలోపలికి వెళ్ళారు. దేవుని దయవల్ల గాయానికి
ఏమీ కాలేదు. ఆయన కూడా బాగానే ఉన్నారు. స్వామివారిచ్చిన ఆదేశాల ప్రకారం మావారు ఎప్పుడు
మంత్రాలయం వెళ్ళినా గుడి చుట్టూ అంగప్రదక్షిణలు చేసేవారు.
7. 1987వ.సంవత్సరంలో మేము మా మానల్లుడు (మా సోదరి కొడుకు)
చి. శిరం చంద్రమోహన్ ఇంటికి విజయవాడ వెళ్ళాము.
ఆరోజు రాత్రి నాభర్తకు ఒక విశేషమయిన కల వచ్చింది.
ఆయనకు వచ్చిన కలలో –
“నాభర్త గుడి ఆవరణలో నుంచుని ఉన్నారు. ఇద్దరు
పూజారులు ఆయన వద్దకు వచ్చారు. ఒకాయన చేతిలో
చిన్న గిన్నెలో నూనె, ఒక పళ్ళెంలో నలుగుపిండి ఉన్నాయి. ఇంకొక పూజారి నాభర్త తలకి నూనె రాశారు. మాకిదేమీ అర్ధం కాక మీరిదంతా ఎందుకు చేస్తున్నారని
అడిగాము. వారు సమాధానం ఇవ్వలేదు. గుడి అంతా భక్తులతో నిండిపోయి ఉంది. నేను, నాతోపాటు వచ్చిన బంధువులు అందరం గుడిలోనుంచి
బయటకు వచ్చి నాభర్త పరిస్థితిని చూసి నవ్వసాగాము.
పూజారులు విగ్రహాలను తీసుకుని వచ్చి పల్లకీలో పెట్టారు. తరువాత మంత్రాలు చదువుతూ ఊరేగింపుగా తీసుకుని వెళ్ళారు. మెల్లగా భక్తులందరూ వెళ్ళిపోయారు. గుడి అంతా ప్రశాంతంగా ఉంది. తరవాత నాభర్త గర్భగుడిలోకి వెళ్ళి దేవి విగ్రహం
ముందు నిలుచున్నారు. ఆశ్చర్యకరంగా ఆదేవతా విగ్రహంలోకి
ప్రాణం వచ్చినట్లుగా తన తలను త్రిప్పి గొణుగుతున్నట్లుగా ఏదో మాట్లాడింది. ఆ మాటలు విని మూలవిగ్రహం వెనుక ఎవరన్నా ఉన్నారేమోనని
నాభర్త విగ్రహం వెనకాల చూశారు. కాని ఎవ్వరూ కనిపించలేదు.
దేవి విగ్రహం ముందు నాభర్త ఒక్కరే నిలబడి ఉన్నారు. అప్పుడు అమ్మవారు తన సహజరూపంతో దర్శనమిచ్చింది. నుదుటి మీద సింధూరం ఉంది. ఆవిడ పెట్టుకున్న సింధూర తిలకం సూర్యకిరణంలా మెరిసిపోతూ
ఉంది. పద్మాలవంటి విశాలమయిన నేత్రాలు. వదనం ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తూ ఉంది. ఆవిడ శరీర ఛాయ నల్లగా ఉంది. ఆవిడ కంజీవరం పట్టు చీర ధరించి ఉంది. ఆవిడ ధరించిన కిరీటంలో వజ్రం పొదగబడి ఉంది. చెవులకున్న బంగారు రింగులు, ముక్కుపుడక ధగ ధగా మెరుస్తూ
ఉన్నాయి. మెడలో బంగారు ఆభరణాలు, నడుముకు వడ్డాణం,
చేతులకు బంగారు గాజులు ఉన్నాయి. నాభర్త ఆవిడ
దగ్గరగా వెళ్ళినపుడు అమ్మవారు నాభర్త నుదుటిమీద ‘సింధూరం’ పెట్టి రెండు రూపాయి నాణాలను
ఇచ్చింది. నాభర్తకు వెంటనే భావోద్వేగం కలిగింది. భక్తితో అమ్మ చరణ కమలాలపై పడి పది నిషాలపాటు వెక్కివెక్కి
ఏడ్చారు. తరవాత లేచి అమ్మ కోసం చూస్తే ఆస్థానంలో
పరమశివుడి విగ్రహం కనిపించింది. శివుడు, ఆదిశక్తి
ఇద్దరూ ఒక్కరేనని మావారికి అర్ధమయింది. ఆవిధంగా
కల కరిగిపోయి నాభర్తకు మెలకువ వచ్చింది.
కనకదుర్గాదేవి పుణ్యక్షేత్రంలో
తనకటువంటి కలరావడం, నాభర్తకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఇదంతా శ్రీసాయిబాబా అనుగ్రహం వల్లనే జరిగిందని ఎంతగానో
సంతోషించారు.
8. ఆగస్టు 15వ.తారీకున దత్తాత్రేయులవారి అవతారమయిన
శ్రీపాద శ్రీవల్లభస్వామి వారి జన్మస్థలమయిన పిఠాపురం వెళ్ళాము. అక్కడ కుక్కుటేశ్వరస్వామివారి దేవాలయాన్ని కూడా
దర్శించుకొన్నాము.
దత్తాత్రేయులవారి దర్శనం
చేసుకుని ఆగుడి ఆవరణలోనే ఉన్న ‘రాజరాజేశ్వరీదేవి’ ని కూడా దర్శించుకున్నాము. రాజరాజేశ్వరీదేవి విగ్రహాన్ని చూసి నాభర్త ఆనందానికి
అవధులు లేవు. రెండు నెలల క్రితం నాభర్తకు స్వప్నంలో
ఏవిధంగా దర్శనమిచ్చిందో అదే రీతిలో ఆమె విగ్రహ దర్శనభాగ్యం కలిగింది.
గుడి అమ్మ యొక్క శక్తిపీఠం. మన పౌరాణిక గాధ ప్రకారం పరమశివుడు తన సతీదేవి కళేబరాన్ని
తీసుకుని వస్తున్నపుడు శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అపుడామె శరీరంలోని ఒక భాగం ఇక్కడ పడటంవల్ల దీనికి
‘పీఠికాపురం’ అనే పేరు స్థిరపడింది. ఆ తరువాత
కుక్కుటేశ్వరస్వామి దేవాలయం నిర్మింపబడింది.
నాభర్తకు అమ్మ స్వప్నంలో దర్శనమివ్వడం ఆయన పూర్వజన్మ పుణ్యఫలం. నాభర్త గుడి చుట్టు ఉన్న పరిసరాలను గమనించారు. ప్రతిదీ కూడా తనకు స్వప్నంలో కనిపించినట్లె ఎక్కడా
తేడా లేకుండా ఉంది. ఆయన గుడి ఆవరణలో కూర్చుని
ఉండగా, ఇద్దరు పూజారులు ఆయన వద్దకు వచ్చారు.
తనకు కలలో కూడా ఆవిధంగా పూజారులు వచ్చారని గుర్తుకు వచ్చింది. అటువంటి మరపురాని అనుభూతి మావారికి కలిగిందంటే అది
భగవంతుని కృపవల్లనే.
ఇది జరిగిన తరువాత తంజావూరులోని
బృహదీశ్వరాలయానికి వెళ్ళాము. 23 అడుగుల ఎత్తు
ఉన్న శివలింగాన్ని దర్శించుకుని కామాక్షీదేవి గుడికి వెళ్ళాము.
గుడి పూజారి మాకు ప్రసాదాన్నిచ్చాడు. గుడి చూడటానికి వచ్చిన విదేశీయులకు గుడిలోని శిల్పకళావైభవాన్ని
దగ్గరుండి చూపించటానికి పూజారి వాళ్ళని తీసుకుని వెళ్ళాడు. నాభర్త కామాక్షీదేవి ఎదురుగా కూర్చుని ధ్యానం చేసుకుంటున్నారు.
ఆయన ధ్యానానికి భంగం కలగకూడదని, మాఅబ్బాయి, మాకోడలు,
నేను ముగ్గురం బయటకు వెళ్ళి నందీశ్వరుని విగ్రహం దగ్గర కూర్చున్నాము. ఒక గంట గడిచినా నాభర్త బయటకు రాలేదు. బయలుదేరడానికి సమయం మించిపోతోందని, నాభర్త కోసం
గుడిలోపలికి వెళ్ళాము. అక్కడ నాభర్త ఒక విధమయిన
ఉద్వేగంతో వణుకుతూ ఉన్నారు. ఆయన శరీరం కంపిస్తూ
ఉంది. అమ్మవారి నుదుటిమీద ఉన్న కుంకుమ బొట్టునుంచి
కాంతికిరణం తన ముఖం మీద ప్రసరిస్తూ ఉందని చెప్పారు. మేము అల్ప ప్రాణులం కాబట్టి మాకు ఆ కిరణకాంతి కనిపించలేదు. మావారి నుదుటి మీద పావాలాకాసు సైజులో కుంకుమబొట్టు
కనిపించింది. పూజారి లేని సమయంలో నాభర్త గర్భగుడిలో
ధ్యానం చేసుకున్నారు. నాభర్తకు భవిష్యత్తు
కలలో కనిపించడం అది నిజమవడం చూస్తే ఆయన మీద అమ్మ అనుగ్రహం ఉందని ఈ సంఘటన సూచించింది.
శ్రీసాయినాధులవారి మీద
నిశ్చలమయిన ప్రగాఢమయిన విశ్వాసం ఉన్నందువల్లనే అమ్మ దీవెనలు లభించాయి.
***
కొన్ని సంవత్సరాల క్రితం అప్పటికి ఇంకా సాయిపధంలోకి రాలేదు. ఒకరోజున నాకు కలలో పార్వతీ పరమేశ్వరులు ఆకాశంలో ఉన్నట్లుగా దర్శనమిచ్చారు. కలలో వారు కూర్చుని ఉన్నారు. వారు పెద్ద ఆకారంలో కనిపించారు. ఇది జరిగిన కొన్ని సంవత్సరాలకు బహుశ 4 లేక 5 అవచ్చు, అరుణాచలం వెళ్ళాము. అక్కడినుంచి వానులో చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాలను కామాక్షీ దేవాలయం, తిరుచెందూరు, ఇంకా కొన్ని క్షేత్రాలను దర్శించుకున్నాము. ఒక క్షేత్రంలో పేరు గుర్తు లేదు, గుడి ఆవరణలో పైన చుట్టుఉన్న శ్లాబుల మీద కూడా విగ్రహాలు వున్నాయి. మెట్లు ఎక్కి అన్ని చూస్తున్నాను. ఒక చోట పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు పెద్దవి కనిపించాయి. అవి చూడగానే నాకు కలలో కనిపించిన పార్వతీ పరమేశ్వరులు గుర్తుకు వచ్చారు. త్యాగరాజు
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment