01.05.2017 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి
–33 వ.భాగమ్
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల రచన : తెలుగు.
ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి
గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్
చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త
మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు
కె.పి. ఆర్. దివ్య ప్రభాస్ ఎన్ క్లేవ్, ఫ్లట్
102, లోటస్ బ్లాక్,
నిజాంపేట, హైదరాబాద్
Mail id :
tyagaraju.a@gmail.com
ఫోన్ : & వాట్స్
ఆప్ : 9440375411
8143626744
ఒడలు గగుర్పొడిచే అనుభవాలు
-3
9. 15 మంది
బాబా భక్తులతో కలిసి మాహుర్ ఘడ్, షేగామ్, షిర్ది మొదలయిన పుణ్యక్షేత్రాలను దర్శించడానికి
బయలుదేరి వెళ్ళాము. మాహుర్ ఘడ్ లో నాభర్త తీవ్రమయిన
ధ్యానంలో ఉన్నారు.
(మాహుర్ ఘడ్ దత్తాత్రేయ - అనసూయ మందిర్)
కొద్ది నిమిషాల తరువాత
ఆయన లేచి నిలబడి తనని ఒక పాము కాటు వేసిందని చెప్పారు. కాని మాకక్కడ పాముఏదీ కనిపించలేదు. పాము ఆయనను కాటు వేసిందన్నదానికి గుర్తుగా వేళ్ళమీద,
కాటు గుర్తులు కనిపించాయి. వాటినుంచి రక్తం
వస్తోంది. ఆవిధంగా జరగడం శ్రీదత్తాత్రేయులవారి
ఆశీర్వాదములేనని నాకర్ధమయింది.
కాసేపటి తరువాత మమ్మల్ని
గుడిలోకి వెళ్ళి దత్తాత్రేయులవారిని దర్శించుకోమని నా భర్త చెప్పారు. లోపలికి ఎవరినీ అనుమతించరని చెప్పాము. అది తనకు తెలియదని చెప్పి తను మాత్రం గర్భగుడిలోకి
వెళ్ళారు. ఆయనను ఎవరూ అడ్డుపెట్టలేదు. మాతో ఉన్న కొంతమంది భక్తులు తమకు కూడా దత్తాత్రేయులవారిని
స్వయంగా స్పర్శించే అవకాశం లభించబోతోందని సంతోషంగా ఆయన వెనకాలే వెళ్ళారు. కాని అక్కడ ఉన్న పూజారి వారిని అనుమతించలేదు. దత్తాత్రేయులవారు తన విగ్రహాన్ని స్పర్శించే భాగ్యాన్ని
నాభర్త ఒక్కరికే ఇచ్చారని అర్ధమయింది.
1992వ.సంవత్సరం ఫిబ్రవరి
నెలలో మేము హైదరాబాదునుండి తిరుపతి వెళ్ళాము.
తిరుమలలో శ్రీసాయిబాబా మావారికి ధ్యానంలో దర్శనమిచ్చి, తన వేదంతం గురించి, తత్వం
గురించి నాభర్త చేత ఒక పుస్తకం రాయిస్తానని చెప్పారు.
పుస్తక రచన ప్రారంభించేముందు “శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి’
వారి మంత్రాన్ని యాభయి వేల సార్లు పఠించి, మంత్రపఠనం పూర్తయిన తరువాత పుట్టలో పాలు
పోయమని చెప్పారు.
కొన్ని రోజుల తరువాత
మా అబ్బాయితో కలిసి గుంటూరు వచ్చాము. బాబా
చెప్పినవిధంగా మంత్ర పఠనం చేశారు. నాభర్త ధ్యానంలో
ఉండగా పెద్ద సర్పం ఆయన మీదకు ప్రాకింది. అది
ఆవిధంగా వచ్చిందన్న దానికి సాక్ష్యంగా మావారి తొడమీద కాటువేసింది. కాని నాభర్తకు ఏమీ కాలేదు.
పాముపుట్టలో పాలు పోయడానికి
వెళ్ళాము. గుంటూరు దగ్గర ఉన్న ఎరుకలపూడిలో
ఉన్న పూజ్య చిన్ని స్వామీజీతో పరిచయం కలిగింది.
ఆమె నాగేంద్రస్వామికి గొప్ప భక్తురాలు.
నాగేంద్రస్వామి ఆమె వంటిమీదకు వచ్చి (ఆమెను ఆవహించి) భక్తుల ప్రశ్నలకు సమాధానాలు
చెబుతారు. పూజ్య చిన్ని స్వామి నాభర్తని “ఈ
రోజు నీకు నాగేంద్రస్వామివారి దర్శనం లభించింది, ఆయన నీవంటిమీదకు పాకుతూ వచ్చారు అవునా?”
అని అడిగింది.
ఒకసారి నాభర్త ధ్యానంలో
ఉండగా స్వామి పరుశురామ దర్శనమిచ్చారు. అదేరోజు
నాభర్త చిన్నిస్వామి వద్దకు వెళ్ళారు. అపుడామె
పరుశురామ నీకు ధ్యానంలో దర్శనమిచ్చారు. ఆయన
నీకెప్పుడూ సహాయం చేస్తారు. నిన్ను ఏస్వామి
అనుగ్రహించినా అదంతా శ్రీసాయిబాబా అనుగ్రహం వల్లనే అని చెప్పారు.
11. 1989వ.ససంవత్సరం సెప్టెంబరు నెలలో మేము కర్ణాటక
రాష్ట్రంలోని హరికర, ఇంకా ఇతర ప్రదేశాలను దర్శించడానికి వెళ్ళాము. కొల్లూరు వెళ్ళి మూకాంబికను కూడా దర్శనం చేసుకొన్నాము.
(మూకాంబిక)
అక్కడికి వెళ్ళిన తరువాత నాభర్త ధ్యానంలో ఉండగా
బాబా దర్శనమిచ్చి మమ్మల్ని దత్తక్షేత్రమయిన చిక్ మగళూర్ వెళ్లమని చెప్పారు.
చిక్ మగళుర్ చేరుకున్న
తరువాత అక్కడ, కొండమీద బాబా బుదన్ గిరి అనే ప్రాంతానికి వెళ్లమని చెప్పారు. 1989 సెప్టెంబరు 25వ.తారీకున మేము బాబా బుదన్ గిరికి
చేరుకొన్నాము.
అక్కడ కొండమీద ఉన్న ఒక గుహలో
దత్తాత్రేయులవారి పాదుకలను దర్శించుకునే అదృష్టం కలిగింది.
26వ.తేదీ ఉదయం నాభర్త ధ్యానం చేసుకుంటూ ఉండగా ఆయనకు
ఒక సందేశం వచ్చింది. ఆగుహలో ఉన్న పాదుకలు,
కమండలము అచ్చంగా దత్తాత్రేయులవారికి చెందినవని, ప్రక్కన ఉన్న సమాధులు దత్తసాంప్రదాయానికి
చెందినవి కావని సందేశం వచ్చింది.
అంతేకాదు,
ప్రతిరోజు సతీ అనసూయమాత వచ్చి దత్తాత్రేయులవారికి చందనం అద్ది అభిషేకం చేస్తుందని కూడా
ధ్యానంలో సందేశమిచ్చారు. అక్కడ ఉన్న మట్టికూడా
చందనం వాసన వస్తూ ఉంది.
12. 24.11.1988 న మేము నాగపూర్ వెళ్ళి సంత్.తాజుద్దీన్
బాబా సమాధిమందిరాన్ని దర్శించుకున్నాము. అక్కడ
నాభర్త తలనుంచి తీయని పరిమళపు వాసన వెలువడింది.
13. అదే సంవత్సరం మేము గుల్బర్గా వెళ్ళాము. అక్కడ హజ్రత్ బందే నవాజ్ దర్గాలో నాభర్త ధ్యానంలో
ఉన్న సమయంలో ఆసాధువు తన పవిత్ర హస్తాన్ని నాభర్త శిరసుపై ఉంచి ఆశీర్వదించినట్లుగా అనుభవం
కలిగింది.
పైన చెప్పిన సంఘటనలన్నీ
కూడా భగవంతుడు ఎన్ని రూపాలలో ఉన్నాగాని అన్ని రూపాలు సాయిబాబాయేనని, సాయిబాబా సకలదేవతా
స్వరూపడనే నిజాన్ని ఋజువు చేస్తుంది.
(రేపటి సంచికలో మా అబ్బాయికి
బాబా ఇచ్చిన అనుభవమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment