19.04.2017 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి
–25 వ.భాగమ్
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల రచన : తెలుగు.
ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి
గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్
చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త
మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు
కె.పి. ఆర్. దివ్య ప్రభాస్ ఎన్ క్లేవ్, ఫ్లట్
102, లోటస్ బ్లాక్,
నిజాంపేట, హైదరాబాద్
Mail id :
tyagaraju.a@gmail.ocm
ఫోన్ : & వాట్స్
ఆప్ : 9440375411
8143626744
శ్రీ సాయిబాబా చేసిన
సహాయమ్
1990వ. సంవత్సరం జూలై
25 వ.తారీకున నేను, నాభర్త ఇంకా పదమూడు మంది సాయిభక్తులందరం కలిసి హైదరాబాద్ నుంచి
కురుగెద్దకు మెటడార్ వాన్ లో బయలుదేరాము. కురుగెద్ద
రాయచూర్ దగ్గర ఒక చిన్న మారుమూల గ్రామం. ఇక్కడే
శ్రీపాద వల్లభస్వామివారు (దత్తాత్రేయస్వామివారి మొట్టమొదటి అవతారం) తపస్సు చేసుకున్నారు. ఉదయానికి మేము కృష్ణానది ఒడ్డుకు చేరుకున్నాము.
నది బాగా నిండుగా సుడులు తిరుగుతూ ప్రవహిస్తూ ఉంది. కృష్ణానదిని దాటడానికి మాకు భయంగా ఉన్నాగాని ఆయన
తపమాచరించిన పవిత్రమయిన ప్రదేశాన్ని దర్శించుకోకుండా వెనక్కి తిరిగి వెళ్ళడానికి మామనసొప్పలేదు. అన్ని అడ్డంకులను అధిగమించి హైదరాబాద్ నుంచి సగం
దూరం ప్రయాణం చేసి వచ్చాము. ఏమి జరిగినా సరే
అన్నిటికీ సిధ్ధపడి ముందుకే ప్రయాణం సాగిద్దామని నిర్ణయించుకున్నాము. ప్లాస్టిక్ కవర్లతో మొత్తమంతా కవరింగ్ చేయబడ్డ తెప్పలో
మేము నదిని దాటి ఒక గంటలోనే అవతలి ఒడ్డుకు చేరుకొన్నాము.
(కురువపూర్, కురుగెద్ద, కురుగద్ది, వల్లభాపురం)
కృష్ణానదిలో స్నానాలు
కానిచ్చి, శ్రీదత్తాత్రేయస్వామివారి గుడికి వెళ్ళాము. అక్కడ నాభర్త ధ్యానం చేసుకున్నారు. ధ్యానంలో శ్రీపాద శ్రీవల్లభస్వామివారు దర్శనమిచ్చి,
“తిరుగు ప్రయాణంలో మీరంతా దొన్నెలో అందరూ వలయాకారంలో కూర్చోండి. 12 నిమిషాలపాటు మనసును చెదిరిపోనీయకుండా నామీదనే
మనసు లగ్నం చేసి ధ్యానించుకోండి. పంచభూతాలు
మిమ్మల్ని భంగపరుస్తాయి. అయినా భయపడకుండా స్థిరచిత్తంతో ధైర్యంగా ఉండండి ” అని చెప్పారు.
ప్రాణాలకు తెగించి మేము
రావడంతో గుడిలో ఉన్న పూజారులు, చాలా ఆశ్చర్యపోయారు. నది నీటిమట్టం అప్పటికే రెండు అడుగులు పెరిగిందని,
ఏక్షణంలోనయినా వరద రావచ్చని చెప్పారు. ఇక మీరు
ఇక్కడ ఉండటం ఏమాత్రం క్షేమకరం కాదు, చాలా ప్రమాదం. వెంటనే బయలుదేరి వెళ్ళిపోండి అని
హెచ్చరించారు. వెంటనే మేము నది ఒడ్డుకు వచ్చి
స్వామీజీ సలహాప్రకారం తెప్పలో అందరం వలయాకారంలో కూర్చున్నాము. మాతెప్ప నదిలో నీటిప్రవాహానికి చాలా వేగంగా వెడుతోంది. ఇంతలో ఒక పెద్ద చెట్టు నదిలో కొట్టుకుంటూ మావైపుకే
వస్తోంది. అదేకనక మాతెప్పని ఢీకొంటే తెప్పకి
ఉన్న ప్లాస్టిక్ కవర్ చిరిగిపోయి తెప్పంతా నీటితో నిండిపోతుంది. మేమందరం తెప్పతో సహా మునిగిపోవలసిందే. మేమందరం వెంటనే
సాయినామ జపం మొదలుపెట్టాము. నదిలో నీటిమట్టనికి,
మాతెప్ప అంచుకు రెండంగుళాలు మాత్రమే దూరం ఉంది.
అప్పటికే కొంతనీరు తెప్పలోకి వచ్చేసింది.
అకస్మాత్తుగా మాతెప్ప ఒక సుడిగుండంలో చిక్కుకుని గుండ్రంగా తిరగడం మొదలుపెట్టింది. కాని మేము ధైర్యాన్ని కోల్పోకుండా భారమంతా శ్రీసాయిబాబా
మీదనే వేసి నామజపాన్ని కొనసాగిస్తూనే ఉన్నాము.
బాబాదయవల్ల మాతెప్ప సుడిగుండంలోనుంచి బయటపడింది. శ్రీపాద వల్లభస్వామివారు చెప్పిన విధంగా సరిగ్గ
12 నిమిషాల తరువాత మేమంతా క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నాము.
మేము వచ్చిన తరువాత బోటునడిపే
అతను ఆప్రదేశానికి వెళ్ళడానికి ఇది తగిన సమయం కాదని చెప్పాడు. ఏదయినా అనుకోని ప్రమాదం జరిగితే ఎవ్వరూ సహాయం చేయడానికి
కూడా ఉండదు. ఇంకెప్పుడూ ఈకాలంలో ఇక్కడికి రాకండని
సలహా ఇచ్చాడు.
శ్రీపాద శ్రీవల్లభస్వామి
మావారికి ధ్యానంలో ఇచ్చిన సందేశం, మేము ప్రయాణించిన తెప్ప ప్రమాదంనించి బయటపడటం
రెండిటినీ సరిచూసుకుంటే స్వామీజీ మాకు జరగబోయే ప్రమాదాన్ని ముందే హెచ్చరిక చేశారనిపించింది. స్వామీజీ మమ్మల్నందరినీ వలయాకారంలో కూర్చోమని చెప్పారు. రాబోయే ప్రమాదాన్నించి తప్పించుకోవటానికి ఏకాగ్రతగా
ధ్యానం చేయమన్నారు. పంచభూతాలనుంచి వచ్చే పర్యవసానాలకి
భయపడవద్దని కూడా చెప్పారు. రాబొయే ప్రమాదాన్నుంచి
చాలా అప్రమత్తంగా ఉండమని, దానినుంచి మేమెలా బయటపడాలో స్వామీజీ బోధించడం వల్లనే మేమంతా
బ్రతికాము.
మేము తెప్పలో మొదట వెళ్ళినపుడు
గంటసేపు పట్టింది. వచ్చేటప్పుడు మాత్రం అంత
వరదలోను, సుడిగుండాలలోను 12 నిమిషాలలోనే ఇవతలి ఒడ్డుకు చేరుకొన్నాము.
మహేంద్రగిరి పర్వతాన్నే
ఎత్తిన విష్ణుమూర్తి అవతారమయిన శ్రీసాయిబాబాకు సుడిగుండంలో వరదనీటిలో ప్రమాదకరంగా ఉన్న
మాతెప్పను ఒడ్డుకు చేర్చడం కష్టమయిన పనేమీ కాదు.
బాబా తన పిల్లలను ప్రమాదాల బారిన పడనిస్తారా? బాబా మాకందరికీ పునర్జన్మను ప్రసాదించారు. మమ్మల్నందరినీ రక్షించిన శ్రీసాయిబాబాకు శతకోటినమస్కారాలను
అర్పించుకుంటూ సాష్టాంగ నమస్కారం చేసుకొన్నాను.
ఈ సందర్భంగా నా అనుభవాన్ని
వివరిస్తాను. సుమారు పదకొండు సంవత్సరాల క్రితం
మేము మా పెద్దమ్మాయి ఇంటికి మద్రాసు వెళ్ళాము.
అప్పటికి నేనింకా పూర్తిగా సాయిపధంలోకి రాలేదు. కాని శ్రీసాయి సత్చరిత్రను ఇప్పుడు పారాయణ చేస్తున్నంతగా మాత్రం చదవలేదు. కాని ధ్యానం చేసుకుంటూ ఉండేవాడిని.
ఇంటిలో ఉన్నపుడు పొద్దున్నే పూజ చేసుకొంటూ ఉంటాను. ఎవరి ఇంటికయినా వెళ్ళినపుడు దేముడికి దణ్ణం పెట్టుకోవడం
తప్ప పూజలు చేసుకునేవాడిని కాదు. ఒకరోజు మా పెద్దల్లుడుగారు
నన్ను కూడా బజారుకు రమ్మన్నారు. ఎందుకనో కాసేపు
ధ్యానం చేసుకోవాలనిపించింది. వెంటనే పూజా మందిరం
ముందు కూర్చుని పదినిమిషాలపాటు ధ్యానం చేసుకున్నాను. తరువాత మా అల్లుడుగారు, నేను స్కూటర్ మీద బయలుదేరాము. నేను స్కూటర్ వెనకాల కూర్చున్నాను. ఒకచోట జంక్షన్ దగ్గర రెడ్ సిగ్నల్ పడింది. మరలా గ్రీన్ సిగ్నల్ రాగానే ఎడమవైపు తిరిగి కొంతదూరం
వెళ్ళాము. మాముందర స్కూటర్ మీద దంపతులు వెడుతున్నారు. హటాత్తుగా మాముందు వెడుతున్న స్కూటర్ క్రింద పడిపోయింది. దంపతులిద్దరూ క్రిందపడిపోయారు. వాళ్ళ స్కూటర్ పడగానే మాస్కూటర్ వాళ్ళ స్కూటర్ ని
ఢీకొంది. మేమిద్దరం కూడా క్రింద పడిపోయాము. అంతా క్షణకాలంలో ఊహించని విధంగా జరిగింది. ఎవరయినా చూస్తే మాస్కూటర్ గుద్దడంవల్లనే వాళ్ళ స్కూటర్
పడిందనే అనుమానం కలుగుతుంది. ముందు వెడుతున్న
స్కూటర్ ఎలా పడిందో తెలీదు. ఈలోపులో వెనకాలనుంచి
బస్సు ఏదయినా వస్తే మామీద నుంచి ఖచ్చితంగా వెళ్ళిపోయేదే. అదృష్టవశాత్తు వెనకాల ఎటువంటి వాహనాలు రాలేదు. మా ముందు స్కూటర్ ను డ్రైవ్ చేస్తున్న వ్యక్తి మేము
గుద్దడం వల్లనే తాము పడిపోయామన్నట్లుగా మావైపు అనుమానంగా చూశాడు. కాని ఎటువంటి గొడవ జరగకుండా ఎవరిదారిన వాళ్ళం వెళ్ళిపోయాము. రాబోయే ప్రమాదాన్నించి కాపాడటానికే ధ్యానం చేసుకోమని
భగవంతుడు నామనసుకి తోపించి ఉండవచ్చనిపించింది.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment