20.04.2017 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి
–26 వ.భాగమ్
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల రచన : తెలుగు.
ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి
గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్
చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త
మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు
కె.పి. ఆర్. దివ్య ప్రభాస్ ఎన్ క్లేవ్, ఫ్లట్
102, లోటస్ బ్లాక్,
నిజాంపేట, హైదరాబాద్
Mail id :
tyagaraju.a@gmail.ocm
ఫోన్ : & వాట్స్
ఆప్ : 9440375411
8143626744
సన్యాసిగా దర్శనమిచ్చిన
సాయి
1990వ. సంవత్సరం ఆగస్టు
13 వ.తారీకున మా ఆడపడుచు భర్త డా.కె.రామారావుగారు విజయనగరంలో పరమపదించారు. ఆయన యానిమల్ హస్బెన్ డరీలో అసిస్టెంట్ డైరెక్టర్.
డా.రామారావుగారి పూజాగదిలో శ్రీసాయి బాబా ప్రతిరోజు
ఆయనకు తన నిజ అవతారంలో దర్శనమిస్తూ ఉండేవారు.
శ్రీసాయిబాబా ఆయనకు ఎన్నో అనుభవాలనిచ్చారు. ఆయన మరణించిన తరువాత శ్రీసాయిబాబా నాభర్తకు ధ్యానంలో
దర్శనమిచ్చి, పదవరోజున నేను మీబావగారి ఇంటికి వస్తాను అని చెప్పారు.
పదవరోజున మేమంతా బాబాగారి
రాక కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూశాము. బంధువులందరూ
భోజనాలు చేసిన తరువాత వెళ్ళిపోయారు. బాబా ఏరూపంలో
వస్తారో మాకు తెలీదు. ఇంతలో బయట ఎవరో “అల్లా
మాలిక్ – సాయిరామ్” అని పిలవడం వినిపించింది.
వెంటనే మేము బయటకు వెళ్ళి
చూశాము. ఆవచ్చిన వ్యక్తి కాషాయ బట్టలను ధరించి,
తలకు గుడ్డ చుట్టుకుని ఉన్నాడు. గడ్డం నెరసిపోయి
ఉంది. నుదుటిమీద కుంకుమ బొట్టు , మెడలో రుద్రాక్షమాల
ఉంది.
మేమాయనని ఇంటిలోపలికి
ఆహ్వానించి, కూర్చోబెట్టాము. ఆయనకు అందరం నమస్కరించుకొన్నాము. ఆయన మానుదుటిమీద విభూతిని అద్దారు. మేమెవ్వరం డా.రామారావుగారి భార్యని ఆయనకు పరిచయం
చేయలేదు.
అయినప్పటికీ ఆయన ఆమెను
ఏడవవద్దని ఓదార్చి, తన సంచిలోనుంచి అరుదయిన శ్రీసాయిబాబా ఫొటోను తీసి ఆమెకిచ్చారు. మేమటువంటి ఫొటోని ఇంతకుముందెప్పుడు ఎక్కడా చూడలేదు. మేమాయనకు కొన్ని స్వీట్లు ఇచ్చాము. కాని ఆయన డా.రామారావుగారి భార్య చేసిన స్వీటును
మాత్రం కొద్దిగానే తీసుకుని, మిగతా బంధువులందరూ తీసుకువచ్చిన స్వేట్లను మాకందరికీ పంచిపెట్టేశారు.
మేమాయనను తలుపు ప్రక్కనే
ఉన్న మరొక గదిలోకి తీసుకుని వెళ్ళాము. ఆగదిలో
సాయిబాబావారి పెద్ద ఫొటో ఉంది. కాని, ఆయన ఆఫొటోవైపు చూడకుండా లామినేషన్ చేయించిన
డా.రామారావు గారి ఫొటోను తీసుకుని దీవించారు.
ఆయనని మీపేరేమిటి అని
అడిగాము. దానికాయన సమాధానంగా “సాయిరామ్” అన్నారు. ఇంకా మేమడిగిన ఏప్రశ్నలకి ఆయన సమాధానం ఇవ్వలేదు. నేను మళ్ళీ సంవత్సరం తరువాత వస్తానని మాత్రం చెప్పారు. ఆయన కొంత దూరం వెళ్ళిన తరువాత అదృశ్యమయిపోయారు.
ఈవిధంగా బాబా తను మాటిచ్చిన
ప్రకారం వచ్చి మమ్మల్నందరినీ దీవించి, ప్రత్యేకంగా డా.రామారావుగారి భార్యకు ఆశీస్సులు
అందజేశారు.
(రేపటి సంచికలో బాబా, సమాధిలో ఏవిధంగా ఉన్నది చూపించుట)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment