21.04.2017 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి
–27 వ.భాగమ్
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల రచన : తెలుగు.
ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి
గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్
చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త
మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు
కె.పి. ఆర్. దివ్య ప్రభాస్ ఎన్ క్లేవ్, ఫ్లాట్ 102, లోటస్ బ్లాక్,
నిజాంపేట, హైదరాబాద్
Mail id :
tyagaraju.a@gmail.ocm
ఫోన్ : & వాట్స్
ఆప్ : 9440375411
8143626744
1918 నాటి బాబా సమాధి దర్శనమ్
నాభర్త షిరిడీలో జరగబోయే రజతోత్సవ వేడుకలకి వెళ్ళే హడావిడిలో ఉన్నారు. అందువల్ల ‘సాయిప్రభ’ మాసపత్రికలో ఏమేమి ప్రచురించాలో అన్నిటిని ఎంచుకుని, వెంటనే పుస్తకం ప్రచురణ పూర్తిచేద్దామనే తొందరలో ఉన్నారు. అపుడు సమయం మధ్యాహ్నం రెండుగంటలయింది.
శ్రీసాయిబాబావారు ఆయనని
ధ్యానం చేసుకోమని చెప్పారు. మావారు వెంటనే
ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోయారు. అపుడు సాయిబాబా
మావారికి ఒక దృశ్యం చూపించారు.
శ్రీసాయిబాబా సమాధిలో
కళ్ళుమూసుకుని పడుకుని ఉన్నారు. ఆయన శరీరం
మీద తెల్లని గుడ్డ ఛాతీ వరకు కప్పబడి ఉంది.
బాబావారి ఛాతీమీద ఎటువంటి ఆఛ్ఛాదన లేదు.
ఇదంతా 75 సంవత్సరాల క్రితం 1918 లో జరిగిన సంఘటన.
అనగా ఆసమయంలో బాబాని సమాధి చేసినప్పుడు, సమాధిలో ఏస్థితిలో ఉన్నారో అంతా
కళ్ళకు కట్టినట్లు శ్రీ ఉమామహేశ్వరరావుగారికి ధ్యానంలో చూపించారు. ధ్యానంలో తనకు బాబా ఆవిధంగా దర్శనమివ్వడంతో నాభర్త
ఎంతగానో సంతోషించారు. నాభర్తకి సాయంత్రం
4 గంటలకి ధ్యానంలోనుండి మెలకువ వచ్చింది. ఆయన
పైకి లేవబోతుండగా ఒడిలోనుంచి శ్రీసాయిబాబావారి ఫొటోలు రెండు క్రింద పడ్డాయి. ఒక తెల్లకాగితం మీద భుజాలవరకు స్కెచ్
పెన్ తో గీయబడ్డ బాబా చిత్రాలు అవి. అంతవరకు బాబావారి
అటువంటి స్కెచ్ ఫొటోలు చూడలేదు. మాకెంతో ఆశ్చర్యం
కలిగింది.
సాయిబాబా మావారిని ధ్యానంలో
కూర్చోమని ఆజ్ఞాపించి, షిరిడీలోని తన సమాధిని చూపించారు. తెల్లని కాగితం తెల్లని గుడ్డను సూచిస్తుందని, ఆయన
శరీరాన్ని నల్లటి స్కెచ్ పెన్ తో చిత్రించడం ఆరోజున జరిగిన విషాదకర సంఘటనని గుర్తు
చేయడమని మేము అర్ధం చేసుకున్నాము.
బాబాకు మాశతకోటి నమస్కారాలను
అర్పించుకున్నాము.
(మచిలీపట్నం దగ్గర నిడుమోలు గ్రామంలో బాబా మందిరం ఉంది. దాని ప్రక్కనే భూగృహంలో బాబావారు శయనించి ఉన్న భంగిమలో విగ్రహం ఉంది. చాలా సుందరంగా ఉంటుంది. అందులోకి ప్రవేశం ప్రతిరోజు ఉండదు. ప్రతి సంవత్సరం గురుపూర్ణిమనాడు, మరలా ఇంకొక రోజు (అది ఎప్పుడో నాకు సరిగా గుర్తు లేదు) మాత్రమే భక్తుల సందర్శనార్ధం తెరచి ఉంచుతారు.)
(రేపటి సంచికలో ధ్యానంలో ఉన్న రావుగారి చుట్టూ నీళ్ళతో ఆర్పినా ఆరని మంటలు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment