22.04.2017 శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి
–28 వ.భాగమ్
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల రచన : తెలుగు.
ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి
గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్
చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త
మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు
కె.పి. ఆర్. దివ్య ప్రభాస్ ఎన్ క్లేవ్, ఫ్లట్
102, లోటస్ బ్లాక్,
నిజాంపేట, హైదరాబాద్
Mail id :
tyagaraju.a@gmail.ocm
ఫోన్ : & వాట్స్
ఆప్ : 9440375411
8143626744
బాబా తన భక్తులను కాపాడే
విధానం
ఆరని మంటలు
జూబ్లీ హిల్స్ హైదరాబాద్
లోని మాఇంటిలో 1990 వ.సంవత్సరం అక్టోబర్ 14 వ.తారీకున నాభర్త ప్రాతఃకాలంలోనే పూజాగదిలో
ధ్యానంలో నిమగ్నమయి ఉన్నారు. అకస్మాత్తుగా
ఆయన చుట్టూ అగ్ని చుట్టుకొని మంటలు రావడం ప్రారంభమయింది. దాని వల్ల ఆయన ఏకాగ్రతకి భంగం కలిగింది. ఆయన కళ్ళు తెరచి చూశారు.
మంటలను ఆర్పడానికి ఒక్క అంగుళం కూడా కదలలేదు. ప్రతిరోజూ దీపారాధన చేస్తూ ఉండే దీపాలు కూడా ఆయనకు
దూరంగా ఉన్నాయి. మరి మంటలు ఏవిధంగా అంటుకున్నాయో
మాకర్ధం కాలేదు. మంటలను ఆర్పడానికి నీటిని
పోశాము. మేము పోసిన ఆనీటి మడుగులోనే కూర్చుని
నాభర్త యధావిధిగా ధ్యానం తిరిగి కొనసాగించారు.
మరలా పదినిమిషాల తరువాత మంటలు మళ్ళీ ఆయనను చుట్టుముట్టాయి. మళ్ళీ మేము నీళ్ళుపోసి మంటలను ఆర్పాల్సివచ్చింది.
నాభర్త ధ్యానం కొనసాగించారు. 15 నిమిషాలు గడిచాక
మరలా ఆయన చుట్టూ నిప్పు రాజుకుంది. నీటిలో
తడిసిన ఆయన ధోవతీకి కూడా నిప్పంటుకుంది. నాభర్త
చుట్టూ పెద్దపెద్ద మంటలు వ్యాపించాయి. నాభర్త
ఒక నిప్పులకొలిమి మధ్యలో కూర్చుని ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. కొన్ని సెకండ్లలోనే మాకోడలు శ్రీమతి నివేదిత ఒక
బకెట్ నిండా నీళ్ళు తీసుకునివచ్చి మంటలనార్పింది.
ఇంక ఆగదిలో ఉండటం క్షేమకరం కాదని చెప్పి ఆయనను బయటకు వచ్చేయమని బలవంత పెట్టాము.
మంటలమధ్యలో ఉండటం వల్ల
ఆయనకు వళ్ళంతా బాగా కాలిపోయి పరిస్థితి ప్రమాదకరంగ ఉంటుందని చాలా భయపడ్డాము.
ఆవిధంగా ఆయన ధ్యానంలో
ఉన్న సమయంలో బాబా ఆయనకి సందేశం ఇచ్చారు.
“నువ్వు యోగాభ్యాసం చేస్తున్నందువల్లనే
మంటలు వ్యాపించాయి. ధ్యానంలో సమాధిస్థితిలో
చాలా గాఢమయిన స్థితిలోకి వెళ్ళిపోయావు. ఆస్థితిలో ఉన్న నీకు ఆటంకం కలిగించాలనే ఆ జగన్మాత ఉద్దేశ్యం. ఆవిడ వల్లనే ఇదంతా జరిగింది. లేకపోతే నువ్వు ‘జడసమాధి’
లోకి వెళ్ళిపోయి ఉండేవాడివి. ఆజగన్మాత నీధ్యానానికి
భంగం కలిగించి నిన్ను కాపాడింది”.
నాభర్తని కాపాడినందుకు
శ్రీసాయిబాబాకు, జగన్మాతకు ప్రణామాలనర్పించుకున్నాను.
నాభర్త బాగా తీవ్రమయిన
ధ్యానసమాధిలోకి వెళ్ళినపుడెల్లా తన శరీరంనుంచి తీవ్రమయిన వేడి పుడుతుందని చెప్పేవారు. ఒకరోజున ధ్యానంలో ఉండగా ఆయన శరీరంనుంచి విపరీతమయిన
వేడి పుట్టి భరించరానంత బాధ కలిగింది. ఆయన
శరీరాన్ని చల్లబరచటానికి నేను తడి తువ్వాలును ఆయన తలమీద ఉంచాను. వేడి ఆయన కళ్ళలోకి వ్యాపించింది. కళ్ళుఎఱ్ఱబారి చిరచిరలాడసాగాయి. కళ్ళుపోతాయేమోననిపించింది మావారికి. బాబా దయవల్ల కొద్దినిమిషాల తరువాత అంతా సద్దుకుంది. లేకపోతే చాలా ప్రమాదం జరిగిఉండేది.
తన భక్తులు చేసే తప్పిదాలను
గమనిస్తూ వారి రక్షణ భాధ్యత వహిస్తూ ఉంటారు సాయిబాబా.
(ఇందులో ఇవ్వబడ్డ కొన్ని
కొన్ని విషయాలను గురించి సాయిభక్తుల సౌకర్యార్ధం గూగుల్ లో వెతికి సమాచారాన్ని ఇస్తున్నాను. జడసమాధి గురించి నాకు కూడా తెలియదు. తెలియని విషయాన్ని ఉన్నదున్నట్టు ప్రచురిస్తే ఉపయోగం
ఉండదు. అందుకని ముందుగా నేను తెలుసుకుని మీకు
కూడా తెలియచేస్తున్నాను. దీని గురించి ఇంకా
సమగ్రంగా తెలుసున్నవారు ఉంటే తెలియచేయవలసినదిగా కోరుతున్నాను.)
శ్రీభారం ఉమా మహేశ్వరరావుగారి
అనుభవాలన్నిటిలో ముఖ్యమయినది ధ్యానం. సాయిభక్తులు
కొంతమందిలో ధ్యానం చేస్తు ఉన్నవారు ఉండవచ్చు.
కొంతమందికి ఈ ధ్యానం ఏవిధంగా చేయాలి అని అనుకుంటూ ఉండవచ్చు. ధ్యానం ఏవిధంగా చేయాలో ముందుగా మనకి ఒక గురువు ఉండాలి.
గురువు లేకపోయినా సులభంగానే ధ్యానం మొదలుపెట్టవచ్చు. ధ్యానంలో అనేక పధ్ధతులు ఉన్నాయి. ఏపద్ధతిలో చేసినా ధ్యానంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి
ప్రయత్నం చేయాలి. తరువాత తరువాత అదే అలవాటు
అవుతుంది. కొంతమంది బ్రహ్మర్షి పత్రీజీ చెప్పిన
శ్వాస మీద ధ్యాస, మరికొంతమంది మాస్టర్ సి.వి.వి. గారి పధ్ధతిలోను ఆయా పధ్ధతులను అనుసరిస్తూ ధ్యానం చేసుకుంటూ ఉంటారు.
(బ్రహ్మర్షి పత్రిజి)
కాని ధ్యానం కొనసాగించటానికి
మనం ఒక సమయం పెట్టుకుని ప్రతిరోజు అదే సమయానికి
ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఉదయాన్నే 6 గంటలకు
, మరలా సాయంత్రం 6 గంటలకు చేసుకోవచ్చు. కుదరకపోతే
ప్రతిరోజు రాత్రి 10 గంటలకు కూడా చేసుకోవచ్చు.
శ్వాసమీద ధ్యాస. అనగా మనం నేలమీద సుఖాసనంలో కూర్చోవాలి. కూర్చోగలిగిన వారు పద్మాసనంలో కూర్చోవచ్చు.
లేక
కుర్చీలో గాని కూర్చుని మన దృష్టినంతా మనం
జరిపే శ్వాస మీదనే పెట్టడం. కుర్చీలో కూర్చున్నపుడు ఒక కాలును మరొక కాలుమీద వేసుకుని
అనగా కాళ్లను క్రిందకే వేళాడదీసుకుని కూర్చోవాలి.
ఎడమ అరచేతిలో కుడి అరచేతిని ఉంచుకొని కళ్ళుమూసుకుని శ్వాసమీదనే మన దృష్టిని
కేంద్రీకరించడం. ఆలోచనలు వస్తూ ఉంటాయి.
వాటిని
పట్టించుకోకుండా మనసును శ్వాస మీదనే పెట్టాలి. ఆవిధంగా ధ్యానంలో ఉన్నపుడు మన శరీరం
ముందుకు వెనక్కు ఊగుతూ ఉంటుంది. ధ్యానం అలవాటయితే
ప్రతిరోజు ఆ ధ్యానంలో కూర్చోవాలని మనసు ఉబలాట పడుతూ ఉంటుంది. ఇది నాస్వానుభవం మీద,
ధ్యానం చేసేవారు చెప్పిన మాటలను చెపుతున్నాను.
ప్రత్యేకంగా ఎందుకని చెప్పానంటే ధ్యానం వల్ల నాకు కొన్ని లాభాలు, అనుభవాలు కలిగాయి
కాబట్టే వివరిస్తున్నాను. నేను ఇదివరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 6 గంటలకు
చేసుకునేవాడిని. కాని నేను వ్రాసిన వివరాలను బట్టి నన్ను ఒక గురువుగాను, ధ్యానంలో నిష్ణాతుడిగాను
భావించవద్దు. నేనింకా తెలుసుకోవలసినది చాలా
ఉంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేసేవారికి అనుభవాలు వాటంతటవే కలుగుతాయి. ధ్యానం చేసే సమయంలో ఇక లేద్దామని ఉంటుంది. కాని లేవబుద్ధి కాదు, ఇంకాసేపు కూర్చోవాలనిపిస్తుంది. కారణం ఆ సమయంలో మాస్టర్శ్ అదృశ్యంగా అక్కడికి వస్తారని ధ్యానం
చేసేవారు చెప్పిన మాట. ధ్యానంలో మనం ఇంకా కొద్ది
సేపు కూర్చుందాము అని అనిపించడానికి కారణం అదే కావచ్చు.
జడసమాధి గురించి టూకీగా
వివరణ : (యోగమిత్ర మండలి బ్లాగునుండి సేకరింపబడినది)
జడ సమాధిస్థితి : ధ్యానం చేసేటప్పుడూ, జపతపాలు చేసేటప్పుడూ మనస్సు శరీరం నుంచి వేరైన స్థితి. మొదట నిద్ర వచ్చినట్టు, తరువాత నిద్రను మించిన మరేదో స్థితిలోకి వెళ్ళినట్టు అనుభూతి కలుగుతుంది. సమాధిస్థితిలో ఉన్న వ్యక్తికి, తన చుట్టూ ఏమి జరుగుతున్నదో తెలియదు. గాఢనిద్రలో ఉన్నా అలా తెలియకపోవచ్చు. కాని, గాఢనిద్రలో ఉన్న వ్యక్తిని గట్టిగా పిలిస్తే మెలకువ రావచ్చు. సమాధిస్థితిలోని వ్యక్తికి పిలిస్తే వినపడదు. సుషుప్తి కూడా గాఢనిద్రే కాని, తట్టి లేపితే మెలకువ వస్తుంది.
జడసమాధి స్ఠితిలో మరణించినవారు ఎలా ఉంటారో ఆవిధంగా ఉంటారు. భగవంతుని యొక్క ధ్యానం నిలబడి దానియందు సమాధికావడం ఒక ఆధారమయిన సమాధి. భగవంతుని ఆధారం లేకుండా తాను అన్న అహం (స్వస్వరూపస్థితి)పై నిలబడడం నిర్వికల్పసమాధి ఈ నిర్వికల్ప సమాధిలో కూడా అంత్యస్థితికి శరీరంలోని అవయవాలన్నీ విడిపోయి ఖండయోగం కలుగుతుంది. సాయిబాబా, ఆదోని తిక్కలక్ష్మమ్మ, గుంటూరు మస్తాన్ బాబా ఇలా చాలా మంది ఈస్థితిని పొందిన వారున్నారు. నిర్వికల్పసమాధి చేరుకున్న సాధకునికి జన్మరాహిత్యం కలుగుతుంది. అనగా ఇక జన్మ ఉండదు.
శ్రీ మహా యోగి లక్ష్మమ్మవారి సంక్షిప్త జీవిత చరిత్ర (వికీపీడియానుంచి
గ్రహంపబడినది)
మహాయోగి లక్ష్మమ్మవారు
ఆదోనికి 7 కి.మీ దూరంలో గల మూసానిపల్లె గ్రామంలో ఒక నిరుపేద దళిత కుటుంబంలో మంగమ్మ,
బండెప్ప అనే పుణ్య దంపతులకు జన్మించారు. బాల్యం నుంచే అవధూతగా సంచరిస్తూ ఉండేవారు.
పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ, నగ్నంగా సంచరించే ఆమెను పిచ్చిదని అందరూ భావించే వారు.
ఆమె నిజతత్త్వాన్ని తెలుసుకోలేని సామాన్య ప్రజలు పెళ్ళిచేస్తే పిచ్చి కుదురుతుందని
భావించి మారెప్ప అనే యువకునికిచ్చి పెళ్ళి జరిపించారు. కానీ పెళ్ళి రోజు రాత్రే ఆమె
యథాప్రకారంగా దిగంబరంగా తిరిగివచ్చి పుట్టింటికి చేరింది. ఆమెను పిచ్చిదానిని గా భావించి
ఆమెను రాళ్ళతో కొట్టి హింసించడం వంటి పనులు చేసినవారంతా ఆమె నోటినుంచి వెలువడిన వాక్కులే
శాపాలుగా తగిలి నశించి పోయారు. ఆమె వాక్శుద్ధి అట్టిది. ఆదోనిలో జరిగే సంతకు వస్తున్న
వారితో కలిసి తన 15వ ఏట ఆమె ఆదోని చేరింది. దిగంబరంగా తిరుగుతూ, దొరికింది తింటూ ఆమె
కసువు తొట్టి పక్క స్థిరంగా ఉండిపోయింది. అప్పటినుంచీ ఆమెకు తొట్టి లక్ష్మమ్మ, తిక్క
లక్ష్మమ్మ అనే పేరు స్థిర పడింది.
లక్ష్మమ్మ తన వాక్శుద్ధితో గౌరమ్మ అనే మహిళ భర్తకు కాన్సర్ వ్యాధి నయం చేసింది. ఆమె అవ్వకు ఒక్క అణా సమర్పించుకోగా అవ్వ ఆమెను అరవై ఎకరాల భూస్వామినిగా చేసింది. మహాత్ములకు చిత్తశుద్దితో సమర్పించుకొన్నది ఎంత స్వల్ప మొత్తమైనా అది అనేక రెట్లు ఫలాన్ని ఇస్తుందనడానికి ఇదే నిదర్శనం. అవ్వ ఇచ్చిన ఫలాలను ఆరగించిన అనేక మంది గొడ్రాళ్ళు సంతానవతులైనారు. ఊరికి రాబోయే ఉపద్రవాలను తన చర్యలద్వారా సూచించిన త్రికాలవేత్త శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ. కుండపోతగా వర్షం కురిసిన తరువాత పొంగిపొర్లుతున్న కాలువలో ఆమె మరణించి ఉంటుందని గ్రామస్థులు భావించి, చింతిస్తున్న సమయంలో, లక్ష్మమ్మవ్వవారు చెక్కుచెదరకుండా క్షేమంగా బయటికి వచ్చి తన మహిమతో అందరిని ఆశ్చర్యచకితులను చేశారు. శరీరాన్ని ముక్కలుగా చేసి మరలా ఏమీ తెలియయనట్లు సాధారణంగా దర్శనమిచ్చే ఖండయోగాన్ని కూడా ఆమె చూపారు.
ఆమె నిజమహిమ తెలుసుకొన్నస్వర్గీయులు రాచోటి వీరన్నగారు, తుంబళంగుత్తిలక్ష్మయ్య గారు, బల్లేకల్లు నరసప్పగారు, మన్నే రాంసింగ్ గారు మొదలైన వారెందరో ఆమె సేవలో తరించి సౌభాగ్యము, సంపదలు పొందినారు. స్వర్గీయ రాచోటి రామయ్య గారు ఆమె సజీవురాలుగా ఉండగానే ఆమెకు రథోత్సవం జరిపించి ధన్యులైనారు. లెక్కకు మిక్కిలిగా మహిమలను ప్రదర్శించిన శ్రీ మహాయొగి లక్ష్మమ్మవారు
16-05-1933 శ్రీముఖ నామ సంవత్సర వైశాఖ బహుళ సప్తమి నాడు సమాధిలో ప్రవేశించినారు. అప్పటినుంచీ అవ్వ సమాధి చెందిన రోజున ప్రతి సంవత్సరం రథోత్సవం వైభవంగా జరుపబడుతున్నది.ఆదోని మాజీ శాసన సభ్యులు శ్రీ రాచోటి రామయ్యగారి ధర్మకర్తృత్వంలో అవ్వకు వెండిరథము, దేవాలయానికి వెండిరేకుల తాపడము, అవ్వ విగ్రహానికి బంగారు కవచము, అనేక బంగారు ఆభరణాలు మొదలైన దివ్యమైన మొదలైన నూతన శోభలు చేకూర్చబడి అవ్వమందిరము దినదినాభివృద్ధి చెందుతూ దేశంలోని అనేక ప్రాంతాలనుంచీ భక్తులను అశేషంగా ఆకర్షిస్తున్నది.
(లక్ష్మమ్మ టెంపుల్)
శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ సమాధి చెందిన ఆదోని పట్టణంలోనే కాకుండా ఆమె జన్మస్థలమైన మూసానిపల్లె మరియు అనేక ప్రాంతాలలో ఆమె మందిరాలు నిర్మించబడి నిత్యపూజలు జరుపబడుతున్నాయి కొలిచిన వారికి కొంగుబంగారము, నమ్మినవారికి నమ్మినంత వరాలనిచ్చే అమృతస్వరూపిణి భగవాన్ శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వవారు.
ఈ సమాచారమును వికీపీడియాలో
పొందుపరిచిన వారు ఆర్.అప్పా శేష శాస్త్రీ, (రిటైర్డ్ ఫ్రిన్సిపాల్, ఆదోని ఆర్ట్స్ అండ్
సైన్స్ కాలేజి,) హెడ్ ఆఫ్ డిపార్ట్ మెంట్ (హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్) , సెయింట్ జాన్స్
ఇంజినీరింగ్ కాలేజి, ఎర్రకోట, ఎమ్మిగనూర్ మండలం ఆదోని.
(రేపటి సంచికలో మణిద్వీపాన్ని దర్శించిన రావుగారు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment