06.05.2017 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి
–38 వ.భాగమ్
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల రచన : తెలుగు. ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి
గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్
చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త
మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు
కె.పి. ఆర్. దివ్య ప్రభాస్ ఎన్ క్లేవ్, ఫ్లాట్
102, లోటస్ బ్లాక్,
నిజాంపేట, హైదరాబాద్
Mail id :
tyagaraju.a@gmail.ocm
ఫోన్ : & వాట్స్
ఆప్ : 9440375411
8143626744
శ్రీరావుగారి అల్లుడికి
బాబా వారి అనుగ్రహమ్
మా పెద్ద మనుమడు శ్రీ
జరార్ధనరావుగారి పెద్ద కుమారుడు చి.మురళీ కృష్ణ 1988వ.సంవత్సరంలో B.com ప్రధమశ్రేణిలో
ఉత్తీర్ణుడయాడు. అప్పటినుండి ఉద్యోగప్రయత్నాలు
చేస్తున్నాడు. కొన్ని ఉద్యోగాలకి ఎన్నో పోటీపరీక్షలు
రాశాడు.
పరీక్షలన్నీ బాగా రాసినా దేనిలోనూ సెలెక్ట్ కాలేదు. ఏ ఉద్యోగానికీ సెలెక్ట్ అవటంలేదని చాలా విచారంతో ఉండేవాడు. వాడు పెట్టుకున్న దరఖాస్తులలో ఇన్స్ పెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్, ఇన్ కమ్ టాక్స్ కూడా ఉన్నాయి. వాటిలో రాత పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యాడు. 04.07.1991 న. ఇంటర్వ్యూకి రమ్మని కాల్ లెటర్ వచ్చింది. మా మనుమడు మురళీ కృష్ణ ప్రగాడమయిన భక్తితో సాయిబాబాని ప్రార్ధించసాగాడు. ఎప్పటిలాగానే వైవా లో బాగా చేశాడు. ఆతరువాత ఇంటర్వ్యూకి వెళ్ళాడు.
పరీక్షలన్నీ బాగా రాసినా దేనిలోనూ సెలెక్ట్ కాలేదు. ఏ ఉద్యోగానికీ సెలెక్ట్ అవటంలేదని చాలా విచారంతో ఉండేవాడు. వాడు పెట్టుకున్న దరఖాస్తులలో ఇన్స్ పెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్, ఇన్ కమ్ టాక్స్ కూడా ఉన్నాయి. వాటిలో రాత పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యాడు. 04.07.1991 న. ఇంటర్వ్యూకి రమ్మని కాల్ లెటర్ వచ్చింది. మా మనుమడు మురళీ కృష్ణ ప్రగాడమయిన భక్తితో సాయిబాబాని ప్రార్ధించసాగాడు. ఎప్పటిలాగానే వైవా లో బాగా చేశాడు. ఆతరువాత ఇంటర్వ్యూకి వెళ్ళాడు.
ఆరోజు రాత్రి తెల్లవారుఝామున
మా అల్లుడుగారు జనార్ధనరావుగారికి ఒక కలవచ్చింది.
ఆకలలో ఆయన ఒక పట్టణంలోని వీధులలో తిరుగుతూ ఉన్నారు. అక్కడ ఆయనకొక గుఱ్ఱం కనిపించింది. అది తన ముందు రెండు కాళ్ళను ఎత్తి నుంచుని ఉంది. ఆ గుఱ్ఱం కదలటంలేదు. ఆ గుఱ్ఱం చూడటానికి మంచి ప్రకాశవంతంగా చూడముచ్చటగా
ఉంది. ఆ గుఱ్ఱాన్ని చూసినవారెవరయినా సరే దానిని
మంచి గౌరవభావంతో చూస్తారు. అంతగా మనసు దోచేలా
ఉంది.
ఆతరువాత మా అల్లుడు ఒక మధ్యవయస్కుడిని చూశారు. అతను నల్లగా ఉన్నాడు. అతను శ్రీసాయి భక్తుడు. అతను కళ్ళుమూసుకుని ధ్యానముద్రలో ఉన్నాడు. మా అల్లుడు ఆయనకు నమస్కరించుకున్నారు. ధ్యానంలో ఉన్న ఆవ్యక్తి కళ్ళుతెరచి చిరునవ్వుతో మా అల్లుడి వైపు చూశాడు.
అక్కడికి ఇక్కడికి తిరిగిన
తరవాత మా అల్లుడు బెంగళూరులోని సాయిబాబా మందిరానికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చారు.
ఆ ఇంటిలోని హాలులో ఒక
మూలగా ఒక చెక్కబల్ల ఉంది. అక్కడ అప్పుడే పూజ చేసినట్లుగా
ఒక ఇత్తడి పళ్ళెంలో పూజా ద్రవ్యాలు ఉన్నాయి.
దానిమీద ఒక పెద్ద ఆకు కప్పబడిఉంది.
ఆయన ఇంటిలోకి ప్రవేశించిన వెంటనే పూజారిలా ఉన్న ఒక స్వామీజీ ఆ హాలులోకి వచ్చాడు. ఆయన సాధారణమయిన దుస్తులు ధరించి ఉన్నాడు. ఆయన మా అల్లుడిని గౌరవంగా ఆహ్వానించి కూర్చోమని
చెప్పాడు. మీకు మంచిరోజులు వస్తాయి, రెండు
పక్షులు నీయింటికి వస్తాయి అని చెప్పాడు. అపుడు
మా అమ్మాయి లోపలినుండి వచ్చింది. అపుడు స్వామీజీ
మా అల్లుడితో ఇత్తడి పళ్ళాన్ని తీసుకునివచ్చి తన ముందు పెట్టమని చెప్పాడు మా అల్లుడు ఇత్తడి పళ్ళెం మీద ఉన్న ఆకును తొలగించి
చూశారు. ఆ పళ్ళెంలో పూజాద్రవ్యాలతోపాటుగా రెండు
లేత బూడిదరంగులో ఉన్న రెండు కఱ్ఱలలాంటి వస్తువులు కనిపించాయి. మా అల్లుడు అదే ఆకుతో మళ్ళీ పళ్ళాన్ని కప్పేశారు. స్వామీజీ మా అల్లుడు చేసేదంతా గమనిస్తూనే ఉన్నారు. ఆ పళ్ళెంలో రెండు పక్షులున్నాయి వాటిని చూశావా అని
మా అల్లుడిని అడిగారు స్వామీజీ. ఆవిధంగా మాట్లాడుతూ
ఆయన పళ్ళెంమీద ఉన్న ఆకును తొలగించారు. అశ్చర్యం
అందులో రెండు పక్షులు కనిపించాయి మా అల్లుడికి.
అవి లేత బూడిద రంగులో ఉండి ఆ పళ్ళెంలో మెల్లగా కదులుతున్నాయి. ఈ పక్షులు వచ్చాయి కాబట్టి, నీకు నీకుటుంబానికి
ఈ రోజు చాలా శుభదినం అని మా అల్లుడితో చెప్పారు. స్వామీజీ. మా అల్లుడు స్వామీజీకి దక్షిణ సమర్పించుకున్నారు. కలలో కనిపించిన స్వామీజీ శ్రీసాయిబాబాలాగ ఉన్నారు.
తనకు అటువంటి కలవచ్చినందుకు
మా అల్లుడు చాలా సంతోషించారు. ఈ కల వచ్చిన మరుసటిరోజే
మా మనుమడు మురళీకృష్ణ ఇంటర్వ్యూకి వెళ్లాడు.
తనకి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. అనుకున్నట్లుగానే శ్రీసాయిబాబా అనుగ్రహంతో మామనుమడికి
సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ లో ఇన్ స్పెక్టర్ గా ఉద్యోగం వచ్చింది. మా అల్లుడు పనిచేస్తున్న బెంగళూరులోనే పోస్టింగ్
వచ్చింది.
తనమీదనే దృష్టి ఉంచిన
తన భక్తులకు సహాయం చేయడానికి, వారిని ఆదుకోవడానికి శ్రీసాయి పరుగున వస్తారనే నమ్మకాన్ని
ఈ అనుభవం మరింతగా ధృఢపరిచింది.
సాయి భక్తులు అనుభూతి
చెందిన ఈ అనుభవాలు సాయిబాబా ఇంకా జీవించే ఉన్నారనీ మనమధ్యనే ఉంటూ మనకి అన్ని విషయాలలోను మార్గాన్ని చూపుతూ ఉన్నారనే విషయాన్ని కూడా ఋజువు చేస్తుంది. బాబా మనం చేసే ప్రతి చర్యని గమనిస్తూనే ఉంటారు. మన ఆలోచనలన్నీ ఆయనకు తెలుసు. మనమేదయినా తప్పులు చేస్తే మనలని సరైన దారిలో పెట్టి
ఆధ్యత్మిక జ్ఞాన మార్గంలో పయనించడానికి మార్గాన్ని చూపుతారు.
నాసమాధినుండియే నా ఎముకలు
మాటలాడును, వారికి జ్ఞానమార్గాని చూపించెదను అన్న బాబా వచనాలు సాయిలీలలను అనుభవించిన
సాయి భక్తుల విషయంలో ఋజువయ్యాయి.
కాని ఒక్కటి మాత్రం నిజం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయిభక్తులందరూ, సాయిబాబా
ఇప్పటికీ జీవించే ఉన్నారని, ఆయన మనం చేసే ప్రతిపనిని గమనిస్తూ మనలని సరైన మార్గంలో
నడిపిస్తున్నారని ప్రగాఢంగా విశ్వసిస్తారు.
(రేపటి సంచికలో భారమ్ మణి గారి సోదరికి బాబా
చూపించిన లీలలు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
(రేపటి సంచికలో భారమ్ మణి గారి సోదరికి బాబా
చూపించిన లీలలు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment