07.05.2017 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి
–39 వ.భాగమ్
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల రచన : తెలుగు.
ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి
గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్
చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త
మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు
కె.పి. ఆర్. దివ్య ప్రభాస్ ఎన్ క్లేవ్, ఫ్లాట్
102, లోటస్ బ్లాక్,
నిజాంపేట, హైదరాబాద్
Mail id :
tyagaraju.a@gmail.ocm
ఫోన్ : & వాట్స్
ఆప్ : 9440375411
8143626744
మా సోదరీమణులకు బాబా
అనుభవాలు
1986వ.సంవత్సరంలో ఒక
గురువారమునాడు మేము శ్రీసాయిబాబాకు అభిషేకం చేస్తున్నాము. అభిషేకం చూడటానికి నా సోదరి శ్రీమతి పి.శ్యామలాదేవి
మా ఇంటికి వచ్చింది. రాత్రికి మాఇంటిలోనే ఉండిపోయింది. మా అబ్బాయి చి.కృష్ణకిషోర్ ఆరోజు రాత్రి ఒక భయంకరమయిన
ఇంగ్లీషు సినిమా వీడియోలో చూపించాడు.
ఆసినిమా
చూసిన తరువాత నాసోదరి గదిలో ఒంటరిగా పడుకుంది.
కాని ఆ భయంకరమయిన సినిమా ప్రభావంతో బాగా భయంవేసి తనను కాపాడమని బాబాని ప్రార్ధించడం
మొదలుపెట్టింది.
ఆ తరువాత ఆమెకు బాబా తన ప్రక్కనే
ఉన్న సోపాలో కూర్చుని తనకు తోడుగా ఉన్నారనే భావన కలిగింది. ఆమె లేచి చూసేటప్పటికి సోఫాలో బాబా నిజంగానే కొద్ది
క్షణాలు కూర్చుని కనిపించారు. ఆమె ఎంతో ఆనందంతో ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం
చేసుకొంది.
ఒకసారి మేమందరం వ్యానులో
యాత్రలకు బయలుదేరుతూ నా సోదరి శ్యామలను కూడా రమ్మన్నాము. ఆమెకు కూడా మాతో కలిసి పుణ్యక్షేత్రాలను దర్సించుకుందామని
బాగా కోరికగా ఉంది. కాని ఆమెకు ఆరొగ్యం బాగుండకపోవడం వల్ల పదిరోజులపపాటు వ్యానులో కూర్చుని
ప్రయాణం చేయగలనా అని సందేహించింది. ప్రయాణానికి
ఒక రోజు ముందు కూడా తను ఏనిర్ణయం తీసుకోలేకపోయింది. ఆ రోజు రాత్రి బాబా ఆమెకు కలలో కనిపించి “నువ్వు
కూడా షిరిడీ వస్తున్నావు” అని చెప్పారు. వెంటనే
బాబా ఆదేశించిన ప్రకారం తను కూడా మాతోపాటుగా యాత్రలకు బయలుదేరింది.
మేము షిరిడీ వెళ్ళి బాబాను
దర్శించుకున్న తరవాత నాసిక్ కి బయలుదేరాము.
ఒక గంట ప్రయాణం చేసిన తరవాత నా సోదరి శ్యామలకి నిద్రవచ్చి కళ్ళుమూసుకుని పడుకుంది. అపుడు బాబా వ్యానులో ఆమె ముందర నుంచుని దర్శనమిచ్చారు. ఆమెకు పంచదార, అల్లంపొడి కలిపిన మిశ్రమాన్ని ప్రసాదంగా
ఇచ్చి అదృశ్యమయ్యారు. బాబా స్వయంగా తనను షిరిడీకి ఆహ్వానించడమే కాకుండా ప్రసాదాన్ని
కూడా ఇచ్చినందుకు ఆమె ఎంతగానో సంతోషించింది.
హైదరాబాద్ చేరుకోగానే ఆమెకు పోస్టులో షిరిడీనుంచి ప్రసాదం వచ్చింది. బాబా ఆమెకు ఆవిధంగా తన లీలను ప్రదర్శించినందుకు
ఎంతగానో ఆశ్చర్యపడింది. బాగా ఆలోచించిన తరువాత,
ప్రయాణంలో బాబా తనకు వ్యానులో దర్శనమిచ్చి ప్రసాదాన్ని ఎందుకని ఇచ్చారో అర్ధం బోధపడింది. ఆమెకు ఫామిలీ పెన్షన్ కు సంబంధించిన ఎరియర్స్ సంవత్సరంనించి
రావలసినవి ఉన్నాయి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్
తను పుణ్యక్షేత్రాలన్ని దర్శించుకుని వచ్చిన మరుసటి రోజే వచ్చాయి. పెన్షన్ కాలుక్యులేషన్స్ గురించి ఆమెకి అవహాగన లేకపోవడంతో
పెన్షన్ తక్కువ వస్తోంది. ఈసారి ఆమెకు రావలసిన
పెన్షన్ సరిగ్గ లెక్కించబడి తను అనుకున్నదానికన్నా ఎక్కువ పెన్షన్ ఏర్పాటయింది.
కొన్ని రోజులతరువాత నా
సోదరి శ్యామలకి ఒక కల వచ్చింది. ఆ కలలో ఆమె
భర్త ఆమె ఇంటివద్ద నిలబడి ఒక గోనెసంచిలో ధాన్యాన్ని పోస్తున్నారు. ఆ సంచీని శ్రీసాయిబాబా పట్టుకుని ఉన్నారు. వారివద్దనే నుంచుని ఉన్న నాసోదరి బాబానే గమనిస్తూ
ఉంది. బాబా తెల్లని ధోవతీ ధరించి తెల్లని పొడుగు
చేతుల స్వెట్టర్ వేసుకుని ఉన్నారు. బాబా స్వెట్టర్
పొడవాటి చేతులను పైకి తోసుకుంటూ సంచీని పట్టుకుని ఉన్నారు. బాబాకి చలిగా ఉందేమో అందుకనే స్వెట్టర్ వేసుకున్నారనుకుంది. ఈలోగా ఆమెకు మెలుకువ వచ్చి కల కరిగిపోయింది. కలలో తాను కనీసం బాబా పాదాలకు నమస్కరించనందుకు బాధపడింది. బహుశ ఆ కలయొక్క అంతరార్ధం ధాన్యపురాశి అనంతమయిన
మానవజాతి అని, బాబా సంచిలోకి నింపబడుతున్న ధాన్యం ఆయన భక్తులయిఉండవచ్చని భావించింది.
నా రెండవ సోదరి శ్రీమతి.
ఎస్.కుసుమ కుమారి శ్రీసాయినాధ చరిత్ర పారాయణ చేసిన తరువాత షిరిడీకి పది రూపాయలు దక్షిణగా
పంపిద్దామనుకుంది. కాని పంపకుండా చాలా ఆలస్యం
చేస్తూ వచ్చింది. ఒకరోజు రాత్రి ఆమెకు కలలో
షిరిడీలో ఉన్న శ్రీసాయిబాబా విగ్రహం నుండి మాటలు వినిపించాయి. “నువ్వు నాకు పదిరూపాయలు బాకీ ఉన్నావు. నీసోదరి భర్త పదహారు రూపాయలివ్వాలి. వెంటనే ఆడబ్బు పంపించు” అని ఈ మాటలు వినిపించాయి. ఆమె తనకు వచ్చిన కలగురించి చెప్పిన వెంటనే మేము
పూజాగదిలోకి వెళ్ళి అక్కడ చిన్న పెట్టెను తెరచి చూశాము. అందులో సరిగ్గా పదహారు రూపాయలున్నాయి. వెంటనే షిరిడీకి మని ఆర్డర్ ద్వారా పంపించాము.
మరొక సారి వచ్చిన కలలో
సాయిబాబా నా సోదరి కుసుమకు దర్శనమిచ్చి, గోధుమపిండి ఉండలతో కూర తయారుచేసి తనకు సమర్పించమని
చెప్పారు. ఆమెకు ఆ కూర ఎలా చేయాలో తెలియనప్పటికీ
తను ఊహించుకున్న ప్రకారం తయారు చేసి బాబాకు నైవేద్యం పెట్టింది. ఆతరువాత మేము కూడా ఆ కూరను రుచి చూశాము.
బాబా మరొకసారి ఆమెకు
కలలో దర్శనమిచ్చి ఆమెకొక పూలదండ, స్వీటు ఇచ్చి ‘గురుచరిత్ర’ చదువు నీకు మంచి జరుగుతుందని
చెప్పారు.
ఆగస్టు 13, 1987 న కుసుమకు,
తాము ఒక నది ఒడ్డున ఉన్న ఇంట్లో నివస్తిస్తున్నట్లుగా కలవచ్చింది. ఒకరోజున నేను, నాభర్త, నాసోదరి ఇంటికి వెళ్ళాము. కొంతసేపయిన తరవాత నాభర్త నదివైపుగా చాలా వేగంగా
నడుచుకుంటూ వెళ్ళారు. మేము కూడా ఆయన వెనకాలే
వెళ్ళాము. సుమారు నాలుగు సంవత్సరాల బాలుడు
నది నీటిమీద నడుచుకుంటూ వెళ్ళడం చూశాము. నాభర్త
కూడా ఆ బాలుని వెనకనే నది నీటిమీద నడుచుకుంటూ వెళ్ళసాగారు. నీటిమీద నడిచే ధైర్యం లేక మేము నది ఒడ్డునే నిలబడిపోయాము. ఇక నది ఆవలి ఒడ్డుకు చేరుకోబోతుండగా నాభర్త పడిపోయారు. ఈలోగా బాబా ప్రత్యక్షమయి తన కాలుతో నాభర్త పొట్టమీద
గట్టిగా నొక్కసాగారు. అపుడు నాభర్త పొట్టలోనుండి నీరు బయటకు వచ్చింది. ఇవతలి ఒడ్డున ఉన్న మాకు జరిగేదంతా స్పష్టంగా కనిపిస్తూ
ఉంది. బాబా తెల్లని కఫనీ ధరించి ఉన్నారు. ఆయన
పాదాలు చాలా పెద్దవిగాను, అరుదయిన రంగులోను ఉన్నాయి. బాబా చేసిన ఉపచారాల వల్ల, నాభర్త కోలుకొని వెంటనే
లేచి, ఆబాలుని వెనకే వెడుతున్నారు. ఆబాలుడు
నాభర్త కోసం ఆగకుండా తనను కూడా పట్టించుకోకుండా దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళిపోయాడు. నాభర్త కూడా ఆబాలుడినే అనుసరిస్తూ అడవిలోకి వెళ్ళారు. ఆ అడవంతా పచ్చని పెద్ద పెద్ద చెట్లతోను, తీగలతోను
నిండి ఉంది.
నాసోదరికి వాళ్ళిద్దరూ
కనిపించకపోవడంతో చాలా భయ పడిపోయింది. ఆ భయంవల్ల
వెంటనే ఆమెకు మెలకువ చ్చింది. అప్పుడు సమయం
తెల్లవారుఝాము నాలుగు గంటలయింది.
నాభర్త శ్రీసాయిబాబాని
1983వ.సంవత్సరం నుంచి పూజించడం ప్రారంభించినా, ధ్యానంలో ఆయనకు బాబా అనుభవాలు 1983 వ.సంవత్సరంనుండి
కలగడం ప్రారంభమయ్యాయి. బహుశ కలలో కనిపించిన
నాలుగు సంవత్సరాల బాలుడు, నాభర్త యొక్క అర్హతను పరీక్షించె (Probation period) నాలుగు సంవత్సరాల కాలానికి
సంబంధించినదయి ఉండవచ్చు. బాబా తన పవిత్రమయిన
పాదంతో నాభర్త కడుపును గట్టిగా నొక్కడమంటె నాభర్త శరీరంలోని మలినాలన్నింటిని బయటకు
తీసివేశారన్నదానికి అర్ధమయి ఉండవచ్చు.
అంతరార్ధాలుః బాబా గారు ఏమి చెప్పినా నిగుఢంగా చెప్పేవారు. వాటిని అర్ధం చేసుకోవడం కూడా కష్టమే. ఈ సందర్భంగా నాకు మణెమ్మగారు వ్రాసిన శ్రీసాయి సత్ చరిత్రలోని ఈ మాటలు గుర్తుకు వచ్చాయి.
20వ. అధ్యాయమ్ : పేజీ నంబరు 200 . దాసగణు భావార్ధ బోధినియైన ఈశావాస్యోపనిషత్ ను అనువదించే సందర్భంలో ఈ వాక్యాలను పరిశీలించండి. " గురుకృప లేకపోతే, పదపదానికి ఎన్నో కష్టాలెదురౌతాయి. అదే గురుపాదాల కంకితమైన వారికి అణుమాత్రమైనా కష్టం లేకుండా, గూఢార్ధాలు వాటంతటవే ప్రకటమౌతాయి" --- త్యాగరాజు
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment