08.05.2017 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి
–40 & 41 వ.భాగాలు
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల రచన : తెలుగు. ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి
గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్
చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త
మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు
కె.పి. ఆర్. దివ్య ప్రభాస్ ఎన్ క్లేవ్, ఫ్లాట్
102, లోటస్ బ్లాక్,
నిజాంపేట, హైదరాబాద్
Mail id :
tyagaraju.a@gmail.ocm
ఫోన్ : & వాట్స్
ఆప్ : 9440375411
8143626744
సాయిబంధువులకి ఈ రోజు మరొక అద్భుతమైన లీలను అందిస్తున్నాను. 41వ.భాగమ్ అనువాదం చేస్తూ ఉంటే బాబా డ్రైవరుమీద చూపించిన అనుగ్రహానికి కాస్త కళ్ళంబట నీరు వచ్చింది. ఆయన తన భక్తుల మీద చూపించే కరుణ అనూహ్యం. ఆయన దయ ప్రసరింపబడాలంటే ఎంత పుణ్యం చేసుకుని ఉండాలో కదా అని అనిపించింది.
40. వ.భాగమ్
మా అబ్బాయి అత్తగారికి
బాబా అనుభూతి
మహబూబ్ నగర్ ప్రభుత్వ
ఆస్పత్రిలో సూపరింన్ టెండెన్ట్ గా పనిచేస్తున్న డా.ఎ. ప్రభాకరరావుగారి భార్య శ్రీమతి
ధనలక్ష్మి నాసోదరి కూతురు. ఆమె మా అబ్బాయి
చి.కృష్ణకిషోర్ కి అత్తగారు కూడాను.
వాళ్ళు మహబూబ్ నగర్ లో
ఉండేవారు. ఒకరోజు రాత్రి ఆమెకు ఒక కలవచ్చింది. ఆ కలలో ఆమె మహబూబ్ నగర్ లో ఉన్న సాయి మందిరంలో కొంతమంది
స్త్రీలతో కలిసి కూర్చుని ఉంది.
శ్రీసాయిబాబా
ఎత్తయిన పీఠంమీద ఆశీనులయి ఉన్నారు. ఆయన విగ్రహం
మనిషంత ఎత్తు ఉంది. బాబా ఎంతో మనోహరంగా కనిపిస్తున్నారు. ఆమె బాబాకు సాష్టాంగనమస్కారం చేసుకొంది. ఆ తరువాత లేచి చూసినప్పుడు ఆయన నేత్రాలు కదలడం కనిపించింది. ఆ తరువాత ఆయన తన కాళ్ళను కూడా కదపడం కనిపించింది. ఆశ్చర్యపోతూ ఆమె బాబా ముందర నిలబడి ఉంది. అపుడు బాబా ఆమెని “ఎవరు నువ్వు? నీకేమి కావాలి?” అని ప్రశ్నించారు. బాబా ఈ ప్రశ్న వేయగానే ఆమె కలవరపడింది. అపుడామె బాబాతో “బాబా నేనెవరో మీకు తెలియదా? నాకేమి కావాలో మీకు తెలియదా?” అని సమాధానమిచ్చింది. బాబా ఆమెకు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా విగ్రహం నుండి
బయటకు వచ్చి నడచుకుంటూ వెళ్ళారు. ఆమె బాబానే
అనుసరిస్తూ వెళ్ళింది. బాబా చాలా పొడుగ్గా
ఉన్నారు. ఆమె ఆయన వేగాన్ని అందుకోలేక పరుగెత్తడం
మొదలుపెట్టింది.
నాసోదరి కూతురయిన శ్రీమతి
ధనలక్ష్మి బాబా విగహాన్ని, ఆయనని సజీవంగా దర్శించుకున్న అదృష్టవంతురాలు. ఆమెకు తరువాత మెలుకువ వచ్చి చూస్తే అపుడు సమయం తెల్లవారుఝాము
నాలుగు గంటలయింది. తను కలలో చూసిన ప్రదేశం షిరిడీలోని ద్వారకామాయి అని చెప్పింది. బాబా అనుగ్రహం ఆమె మీద ఉండటం వల్లనే ఆమెకు బాబా దర్శనం
లభించింది. తనకాయన దర్శన భాగ్యం కలిగినందుకు
బాబాకి సాష్టాంగపడి నమస్కరించుకొంది.
41వ.భాగమ్
వాను డ్రైవరుపై బాబా
అనుగ్రహమ్
1994వ.సంవత్సరం నవంబరు
16వ.తారీకున మేము, కొంతమంది సాయిభక్తులం కలిసి మెటాడార్ వానులో షిరిడీకి బయలుదేరాము. దారిలో గాణుగాపూర్ వెళ్ళాము. మరుసటిరోజు కార్తికపౌర్ణమి. ఉదయాన్నే అమరాజా, భీమానదుల సంగమంలో స్నానాలు చేసి
శ్రీనరసింహ సరస్వతిస్వామివారి గుడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొన్నాము. ఆరోజు పౌర్ణమినాటి రాత్రి పూజ్య నరసింహస్వామీజీ
ధ్యానం చేసుకున్న పవిత్రమయిన ‘ఔదుంబర వృక్షం’ క్రింద కూర్చుని కొంతసేపు ధ్యానం చేసుకొన్నాము.
మరునాడు అక్కల్ కోట వెళ్లి,
అక్కల్ కోటస్వామీజీ సమాధిని దర్శించుకుని ప్రార్ధించుకొన్నాము. అక్కల్ కోటనుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘శివపురి’
కి చేరుకొని ‘గజానన్ మహరాజ్’ దర్శనం చేసుకొన్నాము. అదేరోజు రాత్రి ప్రయాణమయి, మరుసటిరోజు ఉదయానికి
షిరిడీ చేరుకొన్నాము. బాబా దర్శనం కోసం సమాధిమందిరం
నుంచి RTC బస్ స్టాండ్ వరకు భక్తులందరూ బారులుతీరి ఉన్నారు. కొంతసేపయిన తరువాత బాబా సమాధి మందిరంలోకి ప్రవేశించి
ఆయనను ప్రార్ధించుకొన్నాము.
మర్నాడు ఉదయం బయలుదేరి
శింగణాపూర్ వెళ్ళి శనేశ్వరస్వామి గుడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొన్నాము. అక్కడినుండి అహ్మద్ నగర్ వెళ్ళి మెహర్ బాబా గారి
సమాధిని దర్శించుకొన్నాము.
తరువాత తుల్జాపూర్
వెళ్ళి ఛత్రపతి శివాజీ మహరాజ్ కు ఖడ్గాన్ని బహూకరించిన మాతా భవానీ దేవిని దర్శించుకున్నాము.
మా వ్యాన్ డ్రైవర్ పేరు
కృష్ణ. అతను వ్యానుని అద్దెకు తిప్పుతూ ఉంటాడు. అదే అతని జీవనోపాధి. వాను కూడా అతని స్వంతమే.
మేము మెహర్ బాబా సమాధికి
వచ్చిన తరువాత తన గతం చెప్పాడు. "తనకు పొత్తికడుపులో విపరీతమయిన నొప్పితో బాధ పడుతూ ఉండేవాడినని చెప్పాడు. తను ఏవిధమయిన ఆహారం గాని కనీసం కాఫి, టీలను కూడా
తీసుకునేవాడిని కాదని చెప్పాడు.. తను ఏది తిన్నా నెప్పి
ఇంకా ఎక్కువవుతుందని బాధ భరించలేకపోయేవాడినని చెప్పాడు.
ఈ నొప్పివల్ల అతను అంతకు
ముందు హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరాడు.
అక్కడి డాక్టర్స్ అన్ని పరీక్షలు చేసి కిడ్నీలమీద గడ్డలు ఉన్నాయని ఆపరేషన్ చేయడం
తప్ప మరో మార్గం లేదని చెప్పారు. అప్పటికే
అన్ని పరీక్షలకి నాలుగువేల రూపాయలదాకా ఖర్చయింది.
ఆపరేషన్ కి ఇంకెంత ఖర్చవుతుందోననే భయం పట్టుకుంది. ఆపరేషన్ చేయించుకోవాలా వద్దా అనే సందేహంలో ఉన్నానాడు. ఆఖరికి ఆపరేషన్ చేయించుకోవాలనే ఆలోచన విరమించుకున్నాడు.
1994వ.సంవత్సరం నవంబరు
14వ.తారీకున కొంతమంది భక్తులను తీసుకుని మంత్రాలయం వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో వారు కర్నూలులోని శ్రీసాయిబాబా
మందిరానికి వెళ్ళారు.
అక్కడ అతను బాబాని
ఈ విధంగా ప్రార్ధించానని చెప్పాడు. “బాబా, నేను పేదవాడిని.
నేనీ పొత్తికడుపులో నొప్పిని భరించలేను.
ఆపరేషన్ చేయించుకునే స్థోమత కూడా నాకు లేదు. ఆపరేషన్ అంటే ఎంతో ఖర్చవుతుంది. నువ్వు ఉమామహేశ్వరరావుగారికి గుండె ఆపరేషన్ చేశావు. నామీద కూడా నీదయ చూపించి నన్నీ కడుపునొప్పి నుంచి
విముక్తుడిని చేయవలసిందిగా ప్రార్ధించుకుంటున్నాను. నన్నీ బాధనుండి తప్పించు. షిరిడీ వచ్చి నీ దర్శనం చేసుకునే భాగ్యాన్ని కలిగించు. కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు టాక్సులు
పెంచడంవల్ల ఈరోజుల్లో ఎవరూ వానును కూడా అద్దెకు తీసుకోవటం లేదు.”
15వ.తారీకున హైదరాబాద్
కి తిరిగివచ్చాడు తిరిగి వచ్చిన తరువాత, మేము
షిరిడీ ఇంకా ఇతర పుణ్యక్షేత్రాలను దర్శించుకోవటానికి వానును అద్దెకు తీసుకున్నామని
శ్రీసాయిబాబా ట్రావెల్స్ వారి ద్వారా అతనికి తెలిసింది. శ్రీసాయిబాబా తన ప్రార్ధనలకు స్పందించి మరుసటిరోజే
షిరిడీ వెళ్ళే అదృష్టం కలిగించినందుకు ఎంతో సంతోషించాడు.
16వ.తారీకున మేము హైదరాబాద్
నుంచి బయలుదేరి దారిలో దత్తక్షేత్రాలన్నిటిని దర్శించుకొని 19వ.తారీకుకి షిరిడీ చేరుకొన్నాము.
ఆ రోజు ఎంత రద్దీగా ఉన్నప్పటికి ఆ రోజు ఉదయాన్నే తను బాబా సమాధిని దర్శించుకుని పరిపూర్ణమయిన విశ్వాసంతో మనస్ఫూర్తిగా బాబాని ప్రార్ధించుకొన్నాడు.
కర్నూలు బాబా మందిరంలో ఆవిధంగా ప్రార్ధించుకుంటున్న సమయంలో తన పొత్తికడుపులో
ఒక విధమయిన మంటగ ఉన్నట్లు అనిపించింది అతనికి.
ఏమయిందా అని ఆ మంటకి కారణం ఏమిటోనని చూసుకున్నాడు. పొత్తికడుపు మీద బ్లేడుతో కోసినట్లుగా చారలు కనిపించాయి.
వాటినుంచి కొద్దిగా రక్తం కూడా వస్తూ ఉంది.
తన పొత్తికడుపు మీద రెండు చారలు పడ్డాయి.
వెంటనే హోటల్ కి వెళ్ళి
కడుపునిండా తృప్తిగా తిన్నానని చెప్పాడు. తిన్న తరువాత
ఇక ఎటువంటి నెప్పి రాలేదు. పొత్తికడుపులో నొప్పి
తగ్గాలంటే ఆపరేషన్ తప్పదని చెప్పారు డాక్టర్స్. డాక్టర్స్ చెప్పిన ప్రకారం ఆస్పత్రిలో చేరి ఆపరేషన్ చేయించుకునే పరిస్థితినుండి తప్పించి, శ్రీసాయిబాబాయే తనకు ఆపరేషన్ చేసి పొత్తికడుపునొప్పి బాధనుండి విముక్తుడిని
చేశారు. బాబా వైద్యులలోకెల్ల ఘనమైన వైద్యుడు. ఇక అప్పటినుంచి అతనికి ఏవిధమయిన నెప్పి రాలేదు."
మేము మెహర్ బాబా సమాధికి
వచ్చిన తరువాత జరిగినదంతా వివరంగా చెప్పాడు. అతని పొత్తికడుపుమీద
రెండు చారలు నిజంగానే ఉన్నాయి. నేను వాటిని
చూశాను.
ఇంతకుముందు మేము ఎప్పుడు
షిరిడీ యాత్రకు వెళ్ళినా లింగయ్య అనే డ్రైవర్ మమ్మల్ని వానులో తీసుకునివెళ్ళేవాడు. అతను కూడా సాయి భక్తుడే. బాబా దయవల్ల అతనికి RTC లో మంచి ఉద్యోగం లభించింది. బాబా తన భక్తులను తనవద్దకు రప్పించుకుని వారి సమస్యలను
తీరుస్తారు.
బాబా అనుగ్రహాన్ని అనుభవించిన
వారెంతో అదృష్టవంతులు.
(రేపటి సంచికలో ఆటో డ్రైవరు
మీద బాబా అనుగ్రహం, డ్రైవరు రావుగారిని
తదేకంగా చూడటానికి కారణమ్?)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment