09.05.2017 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి –42వ.భాగమ్
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల రచన : తెలుగు. ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు
కె.పి. ఆర్. దివ్య ప్రభాస్ ఎన్ క్లేవ్, ఫ్లాట్ 102, లోటస్ బ్లాక్,
నిజాంపేట, హైదరాబాద్
Mail id : tyagaraju.a@gmail.ocm
ఫోన్ : & వాట్స్
ఆప్ : 9440375411
8143626744
ఆటో డ్రైవర్ కి బాబా
దర్శనమ్
1994వ.సంవత్సరం నవంబరు
20వ.తారీకున హైదరాబాద్ లో చిరాగ్ ఆలీ వెళ్లడానికి ఆటోస్టాండుకు వచ్చారు నా భర్త. దోమల్ గూడ వెళ్లాలి వస్తావా అని ఒక ఆటోడ్రైవర్ ని
అడిగారు. అక్కడే ఉన్న మరొక ఆటో డ్రైవర్ మావారి
వంకే చాలా పరీక్షగా తేరిపార చూస్తు ఉన్నాడు.
అతను ఆవిధంగా చూస్తూ ఉండటంతో మొదటి డ్రైవర్ సమాధానం ఏమీ వినకుండా తననే చూస్తూ
ఉన్న ఆటో అతని దగ్గరకు వెళ్ళారు. అతను నా భర్తని
దోమల్ గూడాకు తీసుకుని వెడతానని చెప్పాడు.
మీరేమి చేస్తూ ఉంటారని నా భర్తను అడిగాడు.
తను రిటైర్ అయిపోయానని చెప్పారు నాభర్త.
అపుడా ఆటో అతను మీరు ఎందులో పని చేసి రిటైర్ అయ్యారు మీరు ఏహోదాలో పని చేశారు? అని ప్రశ్నించాడు. తను
పోలీస్ డిపార్ట్ మెంట్ లో పనిచేసి ఎడిషనల్ సూపరింన్ టెండెన్ ట్ గా రిటైర్ అయినట్లు
చెప్పారు. ఆ ఆటో డ్రైవర్ కి వళ్ళంతా పులకరించి చాలా సంతోషం కలిగింది. అక్కడ ఉన్న అంతమంది
ఎదుట నాభర్త పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసుకున్నాడు. అతని కళ్లనుంచి ఆనందభాష్పాలు వస్తున్నాయి. అపుడు నా భర్త ఆటోలో కూర్చుని మాట్లాడుకుందాము ఆటోను
పోనీయమన్నారు. నా భర్త ఆటోలో కూర్చున్నారు. ఆటోడ్రైవరు తన పేరు కాశీరెడ్డి అని, తనకు స్వంత
ఆటో ఉందని, దాని నెంబరు AET 5240 అని చెప్పాడు.
ఆటోవల్ల వచ్చే ఆదాయమే తన జీవనాధారమని చెప్పాడు. తనకి భగవంతునిపై నమ్మకం ఉన్నప్పటికి, పూజ చేసేందుకు
సమయం ఉండదని చెప్పాడు.
15.11.1994 నుండి ప్రతిరాత్రి
తనకు శ్రీసాయిబాబా కలలో దర్శనమిస్తున్నారని, దాని ఫలితంగా బాబాపై తనకు విశేషమయిన భక్తి
పెరుగుతోందని చెప్పాడు. ఇలా ఎందుకు జరుగుతూ
ఉందో తనకు అర్ధం కావటంలేదని అన్నాడు. స్వాంతన
కోసం హైదరాబాదులోని సాయి మందిరాలకు వెడుతూ ఉంటానని చెప్పాడు.
25.11.1994 న శ్రీసాయిబాబా
తనకు కలలో కనిపించి “తెల్లని దుస్తులు ధరించి, బట్టతల ఉన్న ఒక వ్యక్తి రేపు నీ ఆటో
ఎక్కుతాడు. ఆయన పోలీస్ డిపార్ట్ మెంటులో పనిచేసారు. నువ్వు ఆయన చెప్పిన ప్రకారం నడుచుకో” అని చెప్పారని
నా భర్తతో చెప్పాడు. బాబా కాస్త అస్పష్టంగా
నాభర్తని కూడా ఆటోడ్రైవర్ కి కలలో చూపించారట.
ఆ క్షణంనుండి ఆ ఆటోడ్రైవర్ కి నిద్రపట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా ఆటోలో బయటకు వెళ్ళి బాబా
చూపించిన ఆ వ్యక్తిని ఎప్పుడు వెతుకుదామా అనే ఆత్రంతో నిద్ర లేకుండా గడిపాడు. తన ఆటో ఎక్కిన ప్రతివారిని మీరు ఎందులో పనిచేసేవారని
అడిగాడు. ఎంతమందిని అడిగినా బాబా తనకు కలలో
సూచించిన ప్రకారం వారెవరినుంచి సరైన సమాధానాలు రాలేదు. వారెవరూ సాయిబాబా సూచించిన వ్యక్తులు కారు.
నా భర్త అతని ఆటో ఎక్కిన
తరువాత మీరు సాయిభక్తులేనా అని నా భర్తని అడిగాడు. నాభర్త తన పేరు భారం ఉమామహేశ్వరరావు అని, తాను సాధకుడిని
మాత్రమేనని చెప్పారు. తన ఆధ్యాత్మిక స్థితిని
పెంపొందింపచేసుకోవటానికి శ్రీసాయిబాబాను ప్రార్ధించుకుంటూ ఉంటానని చెప్పారు. నా భర్త ఆటో అతనితో ఇంకా ఇలా చెప్పారు. “బాబా చెప్పినట్లుగా నీకు సలహాలిచ్చేంతటి గొప్పవాడిని
కాను నేను. నేను నీకేమి సలహా ఇవ్వను. నీకు కలలలో సాయినాధులవారు దర్శనం ఇచ్చారంటే నువ్వెంతో
అదృష్టవంతుడివి. బాబా ఆదేశాల ప్రకారం నేను
నీకు కొన్ని సలహాలు ఇస్తాను. ఒకటి…ఉదయం లేవగానే
నీమనసులో శ్రీసాయిబాబా రూపాన్ని నిలుపుకుని కొంతసేపు ధ్యానం చెయ్యి. ఒకవేళ ధ్యానం చేసుకోవడానికి నువ్వు సమయం కేటాయించుకోలేకపోతే
ప్రతిరోజు శ్రీసాయి నామాన్ని జపిస్తూ పూజ చేయి.
రెండవది, నీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు శ్రీసాయి సత్ చరిత్రలోని ఒకటి
లేక రెండు అధ్యాయాలు చదువు.”
ఈ విధంగా చెప్పి
నాభర్త సంచిలో నుంచి సాయిభక్తుల అనుభవాల పుస్తకం ‘సాయిలీలా స్రవంతి’ ని తీసి అతనికిచ్చారు. ఈ పుస్తకం చదివితే ఇందులో ఏమి ఉన్నదో నీకు అర్ధమవుతుంది. నీలో ఉన్న భక్తిని ఇంకా ధృఢ పరుస్తుందని చెప్పారు. ఆటో డ్రైవరు ఆ పుస్తకం వెల చూసి తను అంత ధర చెల్లించలేనని
చెప్పాడు. అపుడు నాభర్త “ఈ పుస్తకానికి నువ్వు
ఒక్క పైసా కూడా ఇవ్వనక్కరలేదు. నేను నీకిది
ఉచితంగా ఇస్తున్నాను తీసుకో” అని చెప్పారు.
అతను మావారిని దోమల్
గూడా దాకా తీసుకునివెళ్ళి దిగబెట్టాడు. నా
భర్త ఆటో చార్జీలు ఇస్తుంటె అతను తీసుకోలేదు.
నీకు ఆటొవల్ల వచ్చే ఆదాయమే జీవనాధారం, అందుచేత కాదనకుండా తీసుకో అని నాభర్త
బలవంతంగా అతని చేతిలో పెట్టారు.
అతను పూర్వజన్మలో చేసిన
పుణ్యకార్యాల వల్ల కావచ్చు, బాబా అతనికి కలలలో దర్శనమిచ్చి పవిత్రమయిన సాయి పుస్తకం
లభించేలా అనుగ్రహించారు. బాబాపట్ల మరింత నమ్మకం
పెంపొందడానికి ఈ సంఘటనలన్నీ జరిగాయని నేను విశ్వసిస్తున్నాను.
శ్రీసాయినాధులవారి దయ,
ఆశీర్వాదములు మాకెల్లప్పుడు లభిస్తూ ఉన్నాయని పూర్తిగా నమ్ముతున్నాను. బాబాతో నాస్వీయ అనుభవాలు ఏమీ లేనప్పటికీ, శ్రీఉమామహేశ్వరరావుగారి
భార్యగా, పూలదండలో పరిమళాన్ని వెదజల్లే దారంలా బాబాతో మావారి అనుభవాలన్నీ మీకు అందిస్తున్నాను. బాబా లీలలను నేను ప్రత్యక్షంగా చూశాను. బాబా ఫొటోనుంచి వచ్చే సుగంధ పరిమళాన్ని ఆస్వాదించి
సంతృప్తి చెందాను. బాబా పాటలు పాడుకుంటూ, బాబా
ఆధ్యాత్మిక గ్రంధాలను చదువుకుంటూ నాశేష జీవితాన్ని గడుపుతున్నాను. అందుకు నేనెంతో అదృష్టవంతురాలిని. బాబా తరచు నన్ను షిరిడీకి వచ్చి ఆయనను దర్శించుకునే
అవకాశాన్నిచ్చినందుకు నేనాయనకు ఎంతో ఋణపడి ఉన్నాను. నేను ఆయనను పూజించకపోయినా, ధ్యానం చేసుకోకున్న గాని,
ఆయన ఎప్పుడూ నామనసులోనే ఉంటారు. బాబా నామస్మరణ
చేసుకోకుండా ఒక్క క్షణం కూడా గడపను. బాబా పట్ల
నాకు గొప్ప భక్తి ఉంది. అంతకన్నా ఎక్కువగా
ప్రేమ, నమ్మకం ఉన్నాయి. నాకు బాబాయే సర్వస్వం. అంతకన్నా మరింకేమీ లేదు. కాని బాబా నాకు తన దర్శన భాగ్యం కలిగించలేదు. కాని ఆయన నానుండి దూరంగాను లేరు. నాకు బాబా దర్శనం లభించనందుకు బాధగా ఉంటూ ఉండేది. ఆయన దయ కోసం, దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను.
1984వ.సంవత్సరంలో నా
భర్త పనిమీద ఊరు వెళ్లారు. అపుడు బాబా ఈ దీనురాలి
మీద తన దయను ప్రసాదించారు. ఒకరోజు రాత్రి అధ్భుతమయిన
దర్శనం ఇచ్చారు. బాబా దర్శనం నా కనులకు ఆనందాన్ని
కలిగించింది. ఆ కలలో నేను నా భర్త ప్రక్కనే
కూర్చుని ఉన్నాను. అపుడు నాకు బాబా భౌతికంగా
దర్శనమిచ్చారు. ఆయన నాముందు కూర్చున్నారు.
ఆయన దివ్యమయిన ప్రకాశంతో వెలిగిపోతూ ఉన్నారు.
మేమంతా కొన్ని విషయాలు మాట్లాడుకొంటూ ఉండగా మెలకువ వచ్చి కల కరిగిపోయింది. శ్రీసాయిబాబా దర్శనమచ్చినందుకు నాజన్మ ధన్యమయిందని
సాష్టాంగ నమస్కారం చేసుకొన్నాను. లేచి చూసిన
తరువాత నా చీరమీద సుగంధ ద్రవ్యం చిలకరించబడి ఉంది. పక్కమీద కూడా దాని తాలూకు చుక్కలు కనిపించాయి. గదంతా మంచి సువాసనతో నిండిపోయింది. నాకు వచ్చినది కల కాదు, వాస్తవమే అని నేను గ్రహించుకునేలా
ఈ లీల చూపించారు బాబా. ఆ రోజున నాభర్త ఉరు
వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నట్లయితే ఈ సువాసన, బాబా నా భర్తకు చూపించిన లీల అని, అది నామీద
బాబా చూపించిన అనుగ్రహం కాదని అనుకునేదానిని.
ఈ లీల ద్వారా బాబా నామీద సుగంధ ద్రవ్యాన్ని చల్లి నా పైన కూడా తన అనుగ్రహాన్ని
చూపించారు. బాబా నాకిచ్చిన ఈ అనుభవానికి నేను
సంతోషంతో ఉప్పొంగిపోయాను. నా హృదయంలో వేలకొలది
గులాబీలు విరిసినంతగా సంబరపడ్దాను.
2. బృందావనంలో శ్రీసాయి :
బాబా నుగ్రహం వల్ల నాకు
మరొకసారి ఆయన దర్శన భాగ్యం కలిగింది. శ్రీసాయిబాబా
అనుగ్రహం కలగడానికి ముందు నాభర్త శ్రీమంత్రాలయ రాఘవేంద్రస్వామిని పూజించేవారు. ఇపుడు నాభర్త పూర్తిగా సాయి పూజలోనే నిమగ్నమయిపోయారు. ఆయన శ్రీరాఘవేంద్రస్వామిని పూజిస్తున్నప్పటికీ ఆయన
మనసంతా శ్రీసాయితోనే నిండిఉంది.
3. శ్రీమాణిక్య ప్రభువుతో అనుభవమ్ :
మేము కారులో ఎప్పుడు
షిరిడీకి వెళ్ళినా దారిలో హుమ్నాబాద్ లో ఉన్న శ్రీమాణిక్య ప్రభు సమాధిని కూడా దర్శించుకుంటూ
ఉంటాము. మొట్టమొదట మేము సమాధిని దర్శించుకున్నపుడు
సమాధి సిల్కు వస్త్రంతో కప్పబడి ఉంది. అందువల్ల సమాధిని పూర్తిగా చూడలేకపోయాను. ఆ రాత్రికి మేము తుల్జాపూర్ చేరుకొన్నాము.
రాత్రి అక్కడ నాకొక కలవచ్చింది. ఆ కలలో నాకు ఒక పెద్ద వృక్షం క్రింద భక్త ప్రహ్లాదుని
సమాధి కనిపించింది. ఆ చెట్టు కొమ్మలనుండి నల్లటి
సర్పాలు వ్రేలాడుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నవారిని
ఆ సర్పాల గురించి అడిగాను. అపుడు వారు స్వామియొక్క
పవిత్ర సమాధిని దర్శించుకొన్న భక్తుల పాపాలన్నీ తొలగిపోయి ఆవిధమయిన సర్పాలుగా మారతాయని
చెప్పారు. ప్రహ్లాదుని సమాధి దర్శనం లభించినందుకు
నేనెంతో అదృష్టవంతురాలినని సంతోషించాను. శ్రీమాణిక్య
ప్రభువుల సమాధిని దర్శించుకున్న రోజునే ఈ లీల నాకు అనుభవం కలగడం వల్ల తెలిసో తెలియకో
చేసిన మా పాపాలన్నీ తుడిచిపెట్టుకుని పోయాయనే నమ్మకం కలిగింది.
కొన్ని నెలల తరువాత మళ్ళీ
శ్రీమాణిక్యప్రభు సమాధి దర్శనానికి వెళ్లాము.
ఈసారి సమాధి మీద సిల్కు వస్త్రం కప్పబడి లేదు. నేను తుల్జాపూర్ లో ఉన్నపుడు నాకు కలలో సమాధి ఏవిధంగా
కనిపించిందో సరిగా ఆవిధంగానే ఉంది.
కొద్ది నెలల తరువాత మరలా
మేము మా బంధువులతో కలిసి మెటాడార్ వానులో పుణ్యక్షేత్రాల దర్శనానికి బయలుదేరాము. ఇప్పుడు కూడా శ్రీమాణిక్యప్రభువుల వారి సమాధిని
దర్శించుకున్నాము. సమాధి మీద ఎటువంటి వస్త్రం
కప్పలేదు. కాని ఈసారి సమాధిని చూసినపుడు నాకు
చాలా ఆశ్చర్యం వేసింది. క్రితంసారి చూసినపుడు
నాకు కలలో కనిపించిన విధంగానే సమాధి బ్రౌన్ రంగులో కనిపించింది. కాని ఈసారి వేరే విధంగా నల్లటి గ్రానైట్ రాయితో
కనిపించింది. ఆనందంతో నాకు మాటరాలేదు.
శ్రీదత్తభగవానుడు నాపైన
తన అనుగ్రహాన్ని చూపించారని ప్రగాఢమైన నమ్మకం కలిగింది. శ్రీరాఘవేంద్రస్వామే శ్రీసాయినాధులవారని, శ్రీమాణిక్య
ప్రభువులవారి సమాధే భక్తప్రహ్లాదుని సమాధి అని ఈలీల ద్వారా నాకు తెలియచేసారు. ఈ సందర్భంగా శ్రీదత్తాత్రేయులవారికి నాప్రణామాలను
అర్పించుకున్నాను. ప్రహ్లాదుడె మరలా శ్రీరాఘవేంద్రస్వామిగా
అవతరించారనే విషయం గుర్తుకు వచ్చింది.
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment