30.05.2017 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబావారు ప్రసాదించిన మరికొన్ని సందేశాలు
శ్రీ సాయితత్త్వ సందేశములు
(vaice of Sai Baba)
శ్రీసాయి తత్వ సందేశములు –3 వ.భాగమ్
10. 07.03.1992
సాయంత్రం 5.25 నిమిషములకు దీక్షా సమయములో శ్రీసాయి యిచ్చిన సందేశము.
పట్టుదల దీక్షా వుంటే
సాధ్యము కాని పని ఏదియూ లేదు. నీగమ్యము చేరుటకు
ఎన్ని అడ్డంకులు వచ్చినను ఎవ్వరు ఏమి చెప్పినను నీదీక్షను కొనసాగించు. నాప్రేరణచే ఈ దీక్షను ప్రారంభించినందున సామాన్య
మానవులకు మార్గదర్శిగా వుండవలయును.
నీవు ఎవరివో,
ఈ ప్రపంచమునకు ఎందుకు వచ్చినావో నీజీవిత రహస్యము ఏమిటో ఈ దీక్ష ద్వారా తెలుసుకొనగలవు. ఈ రెంటిని సరిగా పాటించిన వైరాగ్యమును కూడా పొందే
అవకాశము కలదు. అంతేగాక జన్మరాహిత్యమును కూడా
సంపాదించగలవు.
ప్రతివారును నాదర్శనము
కావలయునని, జన్మరాహిత్యము కావలయునని కోరుకొనెదరని, ఈ కఠోరమైన నివంధనలను నియమించినాను. ఈ దీక్షా సమయమందు నీకు రాబోవు బుధవారమునాడు కొంత
మనస్ఠాపన కలిగి, ఆరోగ్యము చెడునని భయకంపితులయ్యెదరు. కాని వైద్యులను పిలిపించి చికిత్స చేయించరాదు. నీవు రాబోవు మంగళవారమునుండి తేనీటిలో నిమ్మకాయను
కలిపి త్రాగు.
ఇతర పదార్ధములను ఏమియూ ముట్టరాదు. ఇది నీకు పరీక్ష కాదు. కాని నాభక్తులకు నాదర్శన భాగ్యము కలుగుటకు వాటిలోని
కష్ట సాధనను తెలియచేయుటకు మాత్రమే చేయించుచున్నాను. నీ ఆరోగ్యమునకు ఏవిధమైన భంగపాటు కలుగగలదని భయపడవద్దు. నేను సర్వదా సంరక్షించెదను. ప్రతి భక్తుడు నాదర్శనము కావలయునని కోరుకొనుచున్నాడు. కాని వారి ధర్మమును నెరవేర్చుటలేదు. నేను ఎవరో ముందుగా తెలుసుకొనండి. నేనే బోధనిధిని, తత్వనిధిని, సర్వాంతర్యామిని, సర్వవ్యాప్తిని,
సర్వ గుణాలంకృతుడను, తేజోవంతుడను, నాభక్తుల కోరికలను నెరవేర్చువాడను. ఎవరైతే స్వధర్మమును సక్రమముగా నిర్వర్తించి, నాపాద
రక్షణ పొందెదరో అట్టివారికి నానిజ స్వరూపమును చూపగలను.
11. 08.03.1992 రాత్రి 7 గంటల 45 నిముషములకు దీక్షాకాలమందు
శ్రీసాయిబాబా యిచ్చిన సందేశము.
నీసాధన పాడుచేయవలయునని
కొన్ని శక్తులు అడ్డగించి నిన్ను గమ్యము చేరకుండా చేయుటకు, ప్రయత్నించుచున్నవి. కాని వాటికి సాధ్యము కాదు. నీవు రేపు ఉదయము పది పదిన్నరగంటలకు నవగ్రహ పూజ చేసి,
పదకొండు పర్యాయములు ప్రదక్షిణలు చేసి నాకు కొబ్బరికాయ కొట్టి నీసాధన సాగించు. ఇది సక్రమముగా జరుగుతుంది.
నేను నీకు అప్పగించిన
కార్యమును ఆశక్తిని చూపక దానిని వెనుకకు నెట్టుచున్నావు. నీవు వెనువెంటనే ప్రారంభించు.
పూజానంతరము బిళ్వపత్ర
రసమును, తులసీదళ రసమును కలిపి వాటి ద్రవమును మూడు పర్యాయములు స్వీకరించు. నీకు దోషరహితమగును. శరీరములోని మంటలు కూడా ఉపశమించును.
12. 11.03.1992 మధ్యాహ్నం 12 గంటలకు పూజామందిరములో దీక్షలో
నుండగా శ్రీసాయి యిచ్చిన సందేశము.
ఇప్పుడు నీకు మదిలో చెప్పిన
వాక్యములు దివ్య వాక్యములు. వాటిని సరియైన
మార్గములో పాటించిన మీరు నా సాన్నిధ్యమునకు చేరుకొనగలరు. ఇప్పుడు మీకు యిచ్చిన దీక్ష ఎంతవరకు సాధించగలరు? ప్రయత్నించండి. దానిని సాధించిన మీ జీవితములు ఉత్తమోత్తమమగును. నీవు ఈ కార్యమును కొలది దినములు సాగించవలయును. అప్పుడే నీకు జన్మ రాహిత్యము కలుగును. జన్మరాహిత్యమంటే నీ అంతరాత్మను నీవు తెలుసుకొనుటయే.
నీ జీవితాశయము కొరకు
ప్రయత్నము చేయి. నీలో వచ్చిన ప్రేరేపణలన్నియు
నావనియే భావించి వాటిని అమలు పరచుటకు సాధన చేయి.
నీ శరీర ఆరోగ్యము గురించి ఏవిధమైన మధన పడవద్దు. పట్టుదల దీక్షయున్నచో ఎటువంటి అసాధ్యమైన కార్యమునైనా
సాధించగలరు. ఇది నీ సన్నిహితులకు బోధించు. పూజా పునస్కారములకంటే నా సేవ ముఖ్యము.
నీకు యిచ్చిన కార్యమును
వెంటనే ప్రారంభించు. ఏవిధముగా ఎట్లు చేయవలయునో
మరల సలహా యిచ్చెదను. నీలో వున్న అహంకారమును
పూర్తిగా తుడిచిపెట్టు. అప్పుడే ఈ కార్యమును
సాధించగలవు. నేను సర్వాంతర్యామిని. ప్రతివిషయమును నేను గమనించుచుండెదను.
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment