Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, June 25, 2017

శ్రీసాయి తత్త్వసందేశములు –19 వ.భాగమ్

Posted by tyagaraju on 9:22 AM


Image result for images of shirdi saibaba smiling face
Image result for images of rose hd



25.06.2017 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబావారు ప్రసాదించిన మరికొన్ని సందేశాలు
శ్రీ సాయితత్త్వ సందేశములు
(voice of Sai Baba)

శ్రీసాయి తత్త్వసందేశములు –19 .భాగమ్

70.  24.03.1994 6.40 గంటలకు డా.గుడ్లవల్లేటి వెంకటరత్నంగారి యింటిలో శ్రీసాయిబాబా యిచ్చిన సందేశము.
   Image result for images of meditation
మీలో వున్న దివ్యజ్యోతిని వెలిగించుకొని చీకటిని పోగొట్టుకొనండి.  ప్రేమ, సత్యము, దైవస్వరూపాలే.  హృదయపూర్వకముగా ప్రేమాతిశయముతో దైవమును ప్రార్ధించండి.  మీ ప్రార్ధన హృదయాంతరమునుండి రావలయును.  పెదవులపైనుండి కాదు.  అంతర్గతమైన ప్రార్ధన ఉత్తమోత్తమమైనది.  మీ భక్తితో నన్ను బంధించుకొనండి.


        Image result for images of meditation
ధ్యానములో దైవముపై మీ మనస్సును లయము చేసి మీలోవున్న విశ్వశక్తిని స్పందన చేసి, ఆత్మస్వరూపానుభూతిని పొందండి.  పూజావిధులలో కేవలము పుష్పాలంకారము, ప్రసాదము పంచుట, మంత్రములు వల్లించుట వలన దైవ సన్నిధికి చేరలేరు.  సత్య, ప్రేమల వల్లనే దగ్గరకు చేరగలరు.  వికసితమైన, అమరమైన చైతన్య పుష్పములు దైవమునకు అర్పించండి.  పట్టుదలతో ధృఢమైన భక్తితో నన్ను ఆరాధించిన మీరు కోరినవి సిధ్ధించుటయేగాక, పరబ్రహ్మత్వమును పొందగలరు.

ఇతరులు మిమ్ములను సహింపవలయునంటే, మీరు యితరులతో సహనముగా ఉండవలయును.  సహనమును గ్రహించినవాడు ఉత్తమోత్తముడు.

మీహృదయము పవిత్రమైన ఆధ్యాత్మిక ఔన్నత్యస్థితిని పొంది, దైవయుక్తులై జన సంపర్కమునకు దూరముగా వుండెదరు. మీరు చేసిన ఆ కార్యముల కొరకు సంపూర్ణముగా పశ్చాత్తాపము పొందిన నా ప్రేమకు పాత్రులయ్యెదరు.  నాయందు మనస్సు, బుద్ధి నిలిపి ధ్యానించిన విషయ వాసనలునుండి దూరము చేసెదను.
         Image result for images of man meditating on shirdisaibaba
ధనము, శాస్త్ర జ్ఞానము, పదవి, పేరుప్రతిష్టలకు ఉబ్బితబ్బిబ్బులు కాక సద్భుధ్ధి కలిగి నిత్యానందము పొందగలరు.  మీ తలంపులు, మీ పలుకులు, మీరు కావించు సకల కార్యములు మీ హృదయాశీనుడనై సర్వమును గమనిస్తూనే వుంటాను.  ప్రాపంచిక కల్లోలములందు మీరు జోక్యము చేసుకొనరాదు.  రాబోవు రోజులు చాలా గడ్డువైనవి.  నిరంతరము నా నామస్మరణ చేస్తూ దాన ధర్మములు చేస్తూ బాహ్య శరణాగతిని పొందండి.

చంచలాత్మకమైన స్థితినుండి మీ మనస్సును త్రిప్పి నాయందు లగ్నము చేసి అంతరంగ సన్యాసము కొరకు ప్రయత్నము చేయండి.  మనోవికారములనుండి తప్పించుకొనలేక మీలో కొందరు ఒకరిపై ఒకరు మనస్పర్ధలు సృష్టించుకొని, ఈర్ష్య, అసూయ, ద్వేషాది భావములతో విశ్వాసమును కోల్పోవుచున్నారు.  ఇది ప్రళయమునకు దారితీయునని గ్రహించి సరిదిద్దుకొనండి.  దైవ సాన్నిధ్యము కోరువారు ఈర్ష్య, అసూయ, ద్వేషము, విషయవాసనలకు అతీతులుగా ఉండవలయును.

91.  08.12.1994  రాత్రి 7.55 గంటలకు గురువారం రోజున శ్రీసాయిబాబా యిచ్చిన సందేశము.
       Image result for images of meditating on saibaba
దైవనామము కాని, మంత్రము కాని, ఓంకారము కాని నామమాత్రంగా ఉఛ్ఛరించిన లాభము లేదు.  దానిలోని భావనను గ్రహించండి.  శబ్దము భాషతో కూడియున్నది.  భావము లేని మంత్రమును ఎన్ని పర్యాయములు పఠించినను నిష్ప్రయోజనము.  మంత్రముకాని, భజనలో చేయు కీర్తనలు కాని, భావము కలిగివుండవలెను.  మీకు యెవరైనా మంత్ర్రోపదేశము చేసిన ఆ మంత్రమును భావము కలిగియున్నచో దానిలోయున్న శబ్దము మిమ్ములను పరబ్రహ్మ స్థితికి తీసుకొనిపోగలదు.

మంత్రము చిన్నదైనచో దైవముపై మీ భావనను నిలుపుట సులభము అగును.  మీరు జపించే మంత్రము పెద్దదయినచో మీ మనస్సు నిలకడ లేక చంచలము అయ్యే అవకాశము కలదు.  కనుక అతి సులభమైన మంత్రము “సాయి – సాయి” అని దైవ భావనలో చేసిన మీరు ఆకాశ తత్త్వమును దాటి బ్రహ్మస్థితిలోనికి పోగలరు.  సుగంధమైన వాసన గల వస్తువును ఒక పెట్టిలో పెట్టిన దానిలోని వస్తువులన్నియూ ఆ సుగంధ వాసనే వచ్చును.  అదే విధముగా మీరు పరమాత్మయందు ధ్యాననిష్టతో వుండిన మీ మనస్సు పవిత్రమై మీనుండి సుగంధపరిమళము విరాజిల్లును.  కాబట్టి మీరు వేదాధ్యాయనం, ధ్యాన అనుష్టానములను నిత్యము ఆచరించండి.  ప్రతి దినము మీరు నిదురలేవగానే ‘ప్రాతఃస్మరామి, ప్రాతఃభజామి, ప్రాతఃనమామి,  అనే మూడు శ్లోకములను చదివిన మీకు శుభము కలుగును.

92.  16.12.1994 రాత్రి 7 గంటలకు గుంటూరులో శ్రీఉప్పలపాటి బాపిరాజుగారి యింటిలో సత్సంగములో శ్రీసాయిబాబా యిచ్చిన సందేశము.

భగవంతునికి దగ్గర కావలయునంటే ధ్యానము నిత్యము చేయండి.  ధ్యానమంటే మనస్సును ఆత్మయందు ఏకీభావము చేయుటయే.  పాపములు నశించవలయునంటే ఆధ్యాత్మిక ధ్యానము, మోక్షము పొందవలయునంటే ఆత్మధ్యానము చేయవలయును.  ధ్యానించుటయే అన్నిటికంటే గొప్పది.  పాప సంఘటలన్నియు ధ్యాన యోగముచే భస్మము చేసుకొనండి.  
       Image result for images of meditation
సప్తసాగరములలో స్నానము చేసినదానికంటే ధ్యానయోగము శ్రేష్టమైనది.  ధ్యానమందు ఏకాగ్రత కావలయునంటే సాత్వికాహారము మితముగా తీసుకొనవలయును. 

శరీర అనారోగ్యము, సందేహములు, అసంతృప్తి, భ్రమ, చిత్తచాంచల్యము మొదలైనవి ధ్యానయోగమునకు విఘ్నములు.

ధ్యానం చేయువారు మనోబుధ్ధిని, యింద్రియములను, శరీరమును, ఐహికకోరికలను, అదుపులో పెట్టుకొని శాంతచిత్తులుగాను, అరిషడ్వర్గములచే బాధింపబడని మనస్సుగలవారుగాను, భయరహితులుగాను, రాగద్వేషరహితులుగను యుండవలయును.
ధ్యానము ప్రారంభించేముందు దైమునకు, దేహము – ప్రాణము -  ధనము - యీమూడింటిని అర్పించున్నానని ప్రార్ధించి, సాష్టాంగనమస్కారము చేసి, తరువాత మీ గురువును, ‘నాకు యోగసిధ్ధి’ ప్రసాదించమని వేడుకొనండి.
 Image result for images of chinmudra
ధ్యానంలో కూర్చున్నప్పుడు, ‘చిన్ముద్రను’ వేసుకొనుట మంచిది.  దాని రహస్యము ఏమనగా, చిటికినవ్రేలు స్థూల శరీరము, ఉంగరపు వ్రేలు సూక్ష్మశరీరమ్, నడిమివ్రేలు జీవాత్మ శరీరము, పెద్ద వ్రేలుకొన పరమాత్మ స్వరూపము.  చిన్ముద్రలో చిటికెన వ్రేలు, ఉంగరపు వ్రేలు, నడిమి వ్రేలు తిన్నగా చాచుటలో అర్ధము స్థూల శరీరకారణ శరీరమును ప్రారద్రోలి, పెద్దవ్రేలు కొనలో చూపుడు వ్రేలును మీలోని జీవాత్మ పరమాత్మను, పరమాత్మ స్వరూపములో ఐక్యము చేయుట. 
                Image result for images of man in meditation
మీరు పెద్దలకు గాని, మహాత్ములకు గాని నమస్కారము చేయుటలో అర్ధము వారి మాంస శరీరమునకు గాక, వారి హృదయ కమండలములో వున్న పరబ్రహ్మ స్వరూపుడగు జీవాత్మ పరమాత్మ స్వరూపమునకు చేయుట అని గ్రహించండి.  జీవాత్మ పరమాత్మ ఐక్యానుసంధానమే రెండు చేతులను జోడించి నమస్కారము చేయుట.
 Image result for images of namaskar
మీరు ధ్యానంలో సమాధిస్థితినుండి బయటకు వచ్చిన తర్వాత ఏకార్యము చేసినను బ్రహ్మమునందే నిలపగలరు.  ఎందుకంటే మీ బుధ్ధి, చిత్తము అహంకారములనెడి అంతఃకరణములన్నియు ధ్యానాగ్నిచే భస్మమై, పరబ్రహ్మ స్వరూపముగా మారును.

సమాధిస్థితి అంటే మీరు ధ్యానించే పరమాత్మకు మీకు భేదములేనిదని స్వస్వరూపియై యుండు స్థితియే సమాధి.

యోగాభ్యాస సాధనలో ఎన్ని కష్టములు వచ్చినను బ్రహ్మ విద్యను సాధించవలయునని పట్టుదల కావలయును.  మనస్సు శాంతిపొందిన యోగసిధ్ధి పొందగలరు.  అట్టివారే పరబ్రహ్మ స్వరూపులు.

ఎవరైతే పిపీలికాది సమస్త జీవులయందు యున్నది పరబ్రహ్మస్వరూపమే అని గ్రహించి వాటి అన్నిటియందు సమభావము కలిగి వుంటాడో -  సమస్త జీవులయందు తాను వున్నవాడు అగును.  ఇతర జీవరాశులన్నియు తనలో వున్నవని, ఎవరైతే భావించునో అట్టివాడు బ్రహ్మస్వరూపుడు.

ఎవరైతె యీవిధముగా తలచి, యోగాభ్యాసం చేయుదురో అట్టివారు విగతకల్మషులై, ఆగమసంచితమనెడి పుణ్యపాపములు లేనివారై బ్రహ్మస్వరూపులై నిత్యానందము పొందగలరు.

మీ చిత్తమును మీరే వైరాగ్యబోధాపరత్వం ద్వారా శుధ్ధి చేసుకొనండి.  విషయ రాహిత్యములు, దృశ్యవాసనలెవ్వియు లేకుండా మీ చిత్తమును నిర్మలము చేసుకొనండి.  మనస్సును ఏకాగ్రపరచుకొని, ధ్యాన నిమగ్నులై, అజ్ఞానమును, పారద్రోలుకొని, బ్రహ్మ ఐక్యమునకు ప్రయత్నించండి.
మానవ జీవితము పరమేశ్వర ప్రసాదము.  విచక్షణాశక్తిని భగవంతుడు, మానవునికి  ప్రసాదించిన వరప్రసాదము.  దానిని సద్వినియోగము చేసుకొనండి.

(అయిపోయాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)




Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List