Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, July 4, 2017

బడే బాబా - 1

Posted by tyagaraju on 8:42 AM
Image result for images of shirdi sai
Image result for images of rose hd

04.07.2017 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయిబక్తులలో ఒకరయిన బడేబాబా గురించి తెలుసుకుందాము.  ఈ సమాచారాన్ని శ్రీ సాయి సురేష్ గారు పంపించారు.  వారికి నా ధన్యవాదాలు.

కలరా రోగము
ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరముగా చెలరేగుతూ వుంది. గ్రామవాసులందరూ మిక్కిలి భయంతో వున్నారు. వారితరులతో రాకపోకలు కూడా మానేసారు. గ్రామంలో పంచాయతీ వారు సభచేసి రెండత్యవసరమైన నియమాలు చేసి కలరా నిర్మూలించడానికి ప్రయత్నించారు.



అవి యేవంటే – 1. కట్టెల బండ్లను గ్రామములోనికి రానీయకూడదు. 2. మేకను గ్రామములో కోయరాదు. ఎవరయిన వీనిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలెనని తీర్మానించారు. బాబాకి యిదంతా వట్టి చాదస్తమని తెలుసు. కాబట్టి బాబా చట్టాలని లక్ష్యపెట్టలేదు. సమయములో కట్టెలబండి ఒకటి ఊరిలోనికి ప్రవేశిస్తూ వుంది. ఊరిలో కట్టెలకు కరువున్నదని అందరికి తెలుసు. అయినప్పటికి కట్టెలబండిని ఊరిలోకి రాకుండా ప్రయత్నిస్తున్నారు. బాబాకు యీసంగతి తెలిసింది. అక్కడికి వచ్చి, కట్టెలబండిని మసీదుకు తీసికొనిపొమ్మని ఉత్తరువు నిచ్చారు. బాబా చర్యకు వ్యతిరేకముగ చెప్పుటకెవ్వరు సాహసించలేదు. ధునికొరకు కట్టెలు కావలసి వున్నాయి. కనుక బాబా కట్టెలను కొన్నారు. నిత్యాగ్నిహోత్రివలె బాబా తన జీవితమంతా ధునిని వెలిగించే ఉంచారు
     Image result for images of baba dhuni
దానికోసమే ఆయనకి కట్టెలు అవసరమవుతూ వుండేవి.అందువల్లనే వాటిని నిలవ చేస్తూ ఊండేవారు. బాబా గృహమనగా మసీదు, అది ఎప్పుడు తెరిచే ఉండేది. ఎవరయిన పోవచ్చును. దానికి తాళముగాని చెవిగాని లేదు. కొందరు తమ ఉపయోగము కొరకు కొన్ని కఱ్ఱలను తీసికొని వెడుతూ ఉండేవారు. అందుకు బాబా యెప్పుడు గొణుగుకొన లేదు. ప్రపంచమంతయు దేవుడే యావరించి యుండుటచే వారికి ఎవరియందు శతృత్వముండేది కాదు. వారు పరిపూర్ణ విరాగులైనప్పటికి, సాధారణ గృహస్థులకు ఆదర్శముగా నుండుటకై యిట్లు చేయుచుండెడివారు.

గురుభక్తిని పరీక్షించుట

రెండవదయిన కలరా నిబంధనను బాబా యెట్లు ధిక్కరించారో చూద్దాము. నిబంధనలు ఉన్నప్పుడెవరో ఒక మేకను మసీదుకు తీసుకునివచ్చారు. ముసలిమేక దుర్బలముగా వుండి చావుకు సిద్ధముగా వుంది. సమయంలో మాలేగాం ఫకీరు పీర్ మహమ్మద్ ఉరఫ్ బడేబాబా అక్కడే ఉన్నాడు. సాయిబాబా దానిని ఒక కత్తివ్రేటుతో నరికి, బలి వేయుమని బడేబాబాకు చెప్పారు. బడేబాబాయందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము. ఆయన ఎల్లప్పుడు సాయిబాబాకు కుడివయిపు కూర్చొనెడివారు. చిలుము బడేబాబా పీల్చినపిదప, సాయిబాబా పీల్చి యితరుల కిచ్చెడివారు
     Image result for images of shirdi sai baba and goats

మధ్యాహ్నభోజనసమయమందు *** సాయిబాబా బడేబాబాను పిలిచి యెడమప్రక్కన కూర్చుండబెట్టుకొనిన పిమ్మట భోజనమును ప్రారంభించేవారు. దక్షిణరూపముగా వసూలయిన పైకమునుంచి ఆయనకు దినమొక్కంటికి 50 రూపాయలు సాయిబాబా యిస్తూ ఉండేవారు. బడేబాబా వెళ్ళేటప్పుడు 100 అడుగులవరకు సాయిబాబా వెంబడించేవారు. బాబాకు వారికి గల సంబంధము అటువంటిది. సాయిబాబా బడేబాబాతో మేకను నరుకుమనగా అనవసరముగా దానిని చంపడమెందుకని బడేబాబా నిరాకరించాడు.  అప్పుడు సాయిబాబా శ్యామాను ఆపని చేయుమని చెప్పారు. అతడు రాధాకృష్ణమాయివద్దకు వెళ్ళి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టాడు. కత్తిని ఎందుకనితెప్పించారో తెలుసుకొన్న తరువాత రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించుకొంది. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామా వెళ్ళాడు. కాని వాడలోనుండి త్వరగా రాలేదు. తరువాత కాకా సాహెబు దీక్షిత్ వంతు వచ్చింది. వారు మేలిమి బంగారమే కాని, దానిని పరీక్షించవలెను. ఒక కత్తి దెచ్చి నరుకుమని బాబా జ్ఞాపించారు. అతడు సాఠేవాడకు వెళ్ళి కత్తిని తీసుకుని వచ్చాడు. బాబా వుత్తరువు కాగానే దానిని నరకుటకు సిద్ధముగా వున్నాడు. అతడు స్వచ్ఛమైన బాహ్మణకుటుంబములో పుట్టి చంపుట అనేది ఎరుగడు. హింసించుపనులను చేయుటయందిష్టము లేనివాడయినప్పటికి, మేకను నరకుటకు సంసిద్ధుడయ్యాడు. బడేబాబా మహమ్మదీయుడయినప్పటికీ అతనే యిష్టపడనప్పుడు బ్రాహ్మణుడేలసిద్ధపడుతున్నాడని అందరూ ఆశ్చర్యపడ్డారు. అతడు తన ధోవతిని ఎత్తి బిగించి కట్టుకొన్నాడు. కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై యెదురు చూస్తున్నాడు. బాబాఏమి ఆలోచించుచుంటివి? నరుకుము.” అన్నారు. అతని చేతిలోనున్న కత్తి మేకపై పడుటకు సిద్ధముగా వుండగా బాబాఆగుఅని వారించారు
       Image result for images of shirdi sai baba and goats

ఎంతటి కఠినాత్ముడవు. బ్రాహ్మణుడవయి మేకను చంపెదవా?” యనెను. బాబా యాజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని క్రిందబెట్టి బాబాతో యిట్లన్నాడు. “నీ యమృతమువంటి పలుకే మాకు చట్టము. మా కింకొక చట్టమేమియు తెలియదు. నిన్నే యెల్లప్పుడు జ్ఞప్తియందుంచుకొనెదము. నీరూపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ యాజ్ఞలు పాటింతుము. అది ఉచితమా? కాదా? యనునది మాకు తెలియదు. దానిని మేము విచారింపము. అది సరియైనదా? కాదా? యని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాల పాలించుటయే మా విధి, మా ధర్మము.”

బాబాయే మేకను చంపి బలివేసెదనని చెప్పిరి. మేకనుతకియాయనుచోట చంపుటకు నిశ్చయించిరి. ఇది ఫకీరులు కూర్చొను స్థలము. అచటకు దానిని తీసికొనిపోవునపుడు మార్గమధ్యమున అది ప్రాణములు విడిచెను.

శ్రీ సాయి బాబా సంస్థాన్ ప్రచురించిన శ్రీ సాయి లీలా మాసపత్రికలో బడేబాబా గురించి మరింత సమాచారం పొందవచ్చు. ఇది క్రింది విధంగా ఉంది:

శ్రీ సాయి బాబా ద్వారకమాయిలో అనేక భక్తులకు ఆశ్రయం యిచ్చారు. శ్రీ సాయి బాబా యొక్క దర్బారులోని అలా ఆశ్రయం పొందిన భక్తులలో బడేబాబా ఒక ముఖ్యమైన వ్యక్తి.

బాబా  '' నీవు ఒకటి యిచ్చినట్లయితే నేను నీకు వంద ఇస్తాను! '' అని బాబా చెప్పేవారు. అయితే, దేవుని బహుమతులు ప్రత్యేకమైనవి. అయితే వారి దీవెనలు పొందడానికి, భక్తులు అర్హులు మరియు ధర్మపరులుగా ఉండాలి. బడేబాబా జీవితాన్ని గమనించినట్లైతే బాబా అతనిని ఎంతగానో అనుగ్రహించారు, కానీ బడేబాబాకి బాబా వారి అనుగ్రహాన్ని స్వీకరించేందుకు తగిన ఆధ్యాత్మిక బలం లేదు.

బడేబాబాను మాలేగావ్ కు చెందిన 'ఫకీర్ పీర్ మహ్మద్' అని కూడా పిలుస్తారు. వృత్తి ద్వారా అతను ఫకీర్. అందువలన, అతను ఫకీర్ బాబా అనే పేరుతో కూడా పిలువబడ్డారు.

బడేబాబా మొట్టమొదట 1909 లో షిర్డీ వచ్చి షిర్డీలో శాశ్వతంగా నివసించారు. ప్రారంభంలో, అతను కొత్త చావడీలో నివసిస్తూ ఉండేవాడు. అతను ద్వారకామాయిలో ప్రవేశించటానికి సాయి బాబా అనుమతి లభించలేదు. బాబాతో చనువుగా ఉండే మహాల్సాపతి వంటి భక్తులు ద్వారకమాయిలో ప్రవేశించడానికి బడేబాబాను అనుమతించమని ఆయనను అభ్యర్థించారు. ఏదేమైనా, బాబా అనుమతించక అతనిని చావడిలో కూర్చుని ఖురాన్ చదవమని చెప్పారు. బాబా తన భక్తుల కొంతమంది యొక్క ఆధ్యాత్మిక పురోగతి కోసం అలాంటి వింతైన మార్గాలను అనుసరించేవారు.


కొన్ని నెలలు గడిచిన తరువాత, బాబా ద్వారకమాయిలో ప్రవేశించడానికి బడే బాబాను అనుమతించారు. షిర్డీలో ప్రముఖ వ్యక్తిగా అయ్యారు. దీనికి కారణం కూడా ప్రత్యేకమైనది.

దేవుడు అంతట కలడు
       Image result for images of shirdi sai baba and goats
బాబా వంటి యోగుల దృష్టిలో, ప్రపంచములో దేనియందు భేద భావం ఉండదు. వారు అంతటిని ఒకటిగా చూస్తారు. వారి ప్రతి చర్య కొంత సందేశాన్ని యిస్తుంది. మనం వాటిని అర్థం చేసుకొని అనుసరించాలి.

ఒకసారి, బాబా  భోజనం చేస్తున్నారు. ఒక మట్టి కుండలో మజ్జిగ ఉంది. అకస్మాత్తుగా ఒక కుక్క మసీదులో ప్రవేశించి దానిని రుచి చూసింది. సమీపంలో కూర్చుని ఉన్న బడేబాబా ఒక పిల్లవాడితో మజ్జిగను బయట పారపోయమని చెప్పారు. బాబా ఏమి జరిగింది అని ప్రశ్నించారు. బడేబాబా వివరించిన తరువాత, బాబా " మజ్జిగలో దోషం లేదు అది మంచిదే. దానిని యింటికి తీసుకువెళ్ళి, దానితో మజ్జిగ పులుసు చేసి తీసుకురమ్మని" అన్నారు. 'బడేబాబా మజ్జిగ పులుసుని సిద్ధం చేసి, దానిని తీసుకువచ్చారు గాని దానిని తాకనైన తాకలేదు. కానీ బాబా దానిని పూర్తిగా హృదయపూర్వకంగా త్రాగారు.

యోగులు మరియు సాయి బాబా వంటి సద్గురువులు వారి భక్తుల మనస్సులలో నుండి సంకల్ప మరియు వికల్పాలను (ఆలోచనలు) నిర్మూలిస్తారు. పై సంఘటన ద్వారా బడేబాబా యొక్క మనస్సు నుండి అటువంటి ఆలోచనలను అరికట్టడానికి బాబా యొక్క ప్రయత్నం. అతను బాబాతో ఎన్నో రోజులుగా ఉంటున్నాడు. అయినప్పటికీ, అతను బాబా సందేశాన్ని గ్రహించలేకపోయాడు.

బాబా తన భక్తులు తెచ్చిన ప్రసాదాల నుండి కనీసం కొంత భాగాన్నయిన ప్రేమతో తీసుకొనేవారు. ***ఆయన మాంసాహార వంటకాలను కూడా తినేవారు. ఆయన దృష్టిలో అంతా పరబ్రహ్మ స్వరూపమే. ఆయన మతాల మరియు కులాల మధ్య భేదం చూపలేదు. ఇతరులను తాకడం ద్వారా అపవిత్రం అయిపోతాము వంటి వాటికి విలువ యిచ్చేవారు కాదు. అదే సమయంలో, ఆయన భక్తులు తమ తమ మతాలకు కట్టుబడి ఉండాలని చెప్పేవారు.
మత మార్పిడిని శ్రీ సాయి తీవ్రం గా నిరసించేవారు. విశ్వానికి సృష్టి, స్థితి, లయ కారకుడైన భగవంతుడు ఒక్కడే ! సందర్భానుసారంగా వివిధ కాలాలలో వివిధ రూపాలను ధరించి తన అవతార కార్యం గావించేవాడు. అన్ని మతాలు భగవంతుడిని చేరడానికే పుట్టాయి. సర్వ మానవ సమానత్వాన్ని ఉద్భోదించే శ్రీ సాయి, భక్తులకు మతం మార్చుకోవడం అనవసరం అని చేప్పేవారు. శ్రీ సాయికి భక్తుడైన బడే బాబా ఒక హిందువును ముస్లింగా మార్చి శ్రీ సాయి దర్శనానికి తీసుకు వచ్చి తాను చేసిన ఘనకార్యాన్ని వివరించారు. అప్పుడు శ్రీ సాయి ఉగ్రులై యువకుని చెంప పగిలేలా కొట్టి " నీ తండ్రిని మార్చుకున్నావట్రా ! " అని అరిచారు. తన మతాన్ని మార్చుకోవడం తండ్రిని మార్చుకున్నంత పాపమని బాబా వారి అభిప్రాయం.

బాబా ఇస్లాం యొక్క కొన్ని తీవ్రమైన ఆచారాలతో ఏకీభవించలేదు మరియు వారిని అనుసరించడానికి నిరాకరించారు. ఒకసారి, ఆయన తన ధృఢమైన మరియు హార్డ్ లైనర్ ముస్లిం భక్తులతో షిర్డీ పట్టణ సరిహద్దు వెలుపలకు వెళ్లి తన ఖుత్బా ప్రార్ధనను చేయమని  చెప్పారు. ఆయన స్వయంగా ప్రార్థనలో పాల్గొనలేదు. రెండవ సందర్భంగా. మసీదులో నమజ్ చేయమని ఆయన వారికి అనుమతి ఇచ్చాడు. కానీ తాను పాల్గొనలేదు.

(ఇంకా వుంది)


***ఇక్కడ మీకొక రహస్యం,  బడేబాబా మరియు సాయిబాబా వారి మధ్య గల సంబంధం గురించి చెప్పాలనిపించింది.  ఎలాగూ సందర్భం వచ్చింది కాబట్టి ఆ రహస్యాన్ని మీకు కూడా వెల్లడిస్తున్నాను. ..  త్యాగరాజు

ఒకసారి నేను సాయిబానిస గారిని కలుసుకున్నప్పుడు ఆయనని ఈ విధంగా ప్రశ్నించాను. "బాబా, బడేబాబాను తన ప్రక్కనే కూర్చోబెట్టుకుని భోజనం పెట్టి, దక్షిణగా రూ.55/- ఎందుకని ఇచ్చేవారు?" 

దానికి సాయిబానిస గారు చెప్పిన సమాధానం : 
"నేను ఇదె ప్రశ్నని బాబాగారిని నేను ధ్యానంలో వున్నప్పుడు అడిగాను.  అప్పుడు బాబా నాకు ధ్యానంలో చెప్పిన విషయాన్ని మీకు చెబుతున్నాను.
బడేబాబా క్రిందటి జన్మలో ఒక జమీదారు యింటిలో వంటవాడుగా ఉండేవాడు.  అందరికీ వంటలు చేసి భోజనాలు పెట్టి అందరూ తిన్న తరువాతనే తను తిందామనుకునేటప్పటికి ఏమీ మిగిలి ఉండేవి కాదు.  అప్పట్లో అతను సాయి భక్తుడు.  అందు చేత ఈ జన్మలో సాయి, బడేబాబాకి రూ.55/- యిచ్చి భోజనం పెట్టేవారు" అని బాబా తనకు చెప్పిన విషయాన్ని నాకు వెల్లడించారు.

***ఇందులో బాబా మాంసాహార వంటకాలను కూడా తినేవారు అని వుంది.  నా సందేహాన్ని తీర్చుకోవడానికి దీనికి సంబంధించిన విషయం తెలుసుకుందామని వెతికాను.  శ్రీసాయిబాబా సంస్థాన్ వారి సైట్ లో ఈ విధంగా ఉంది. దానికి తెలుగు అనువాదం మీకు వివరిస్తున్నాను.
"తాత్యా పాటిల్ తన అనుభవం ప్రకారం ఈ విధంగా వివరించారు.  బాబా షిరిడీలో ఉన్న నలభై  సంవత్సరాలలో ఎప్పుడూ మాంసాహారాన్ని ముట్టుకోలేదు.  కాని ఆతరువాత కాలంలో కొంతవరకు మాత్రం తన నియమాన్ని ఉల్లంఘించారు."   ...  (త్యాగరాజు)


(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List