27.08.2017 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు మరొక అద్భుతమైన బాబా లీలలను తెలుసుకుందాము. బాబా, డాక్టర్ పితలే కుటుంబంవారికి ఎన్ని అధ్బుతమైన అనుభవాలను ఇచ్చారో తెలుసుకుంటే ఒళ్ళు గగుర్పాటు కలిగిస్తుంది. సాయిలీల
ద్వైమాసపత్రిక మే – జూన్ 2010 వ.సంవత్సరంలో ప్రచురింపబడిన ఆంగ్ల వ్యాసానికి తెలుగు అనువాదమ్.
వ్రాసినవారు : శ్రీమతి మయూరి మహేష్ కదమ్
మరాఠీనుండి ఆంగ్లంలోకి అనువదించినవారు : శ్రీమతి షంషాద్ ఆలీ బేగ్
సాయిసేవలో తరించిన డాక్టర్ కుటుంబం – డాక్టర్ పితలే దంపతులు – 2 వ.భాగమ్
“యాత్రికులందరికీ ఉచితంగా
వైద్య సేవలు, వారికి అవసరమయిన మందులు ఏవిధంగా యివ్వగలుగుతున్నారు?” అని అడిగాము.
“2001 వ.సంవత్సరంలో మానాన్నగారు
తన కోరిక తీరితే షిరిడీ వస్తానని బాబాకు మొక్కుకున్నారు” అని చెప్పారు పితలే.
(గుడి పడవ పండుగ)
“ఆయన కోరుకున్న కోరిక
తీరడంతో మేము మరుసటిరోజునే షిరిడీకి ప్రయాణమయ్యాము. ఆరోజు గుడిపడవ పండగ. మేము మాకూడా ప్రధమ చికిత్స పెట్టి, (First Aid
Box), కొన్ని మందులను తీసుకుని వెళ్ళాము. మేము
మాకారుని బైపాస్ రోడ్డు దగ్గర కాసేపు ఆపాము. ఆసమయంలో ‘శ్రధ్ధ సబూరి’ భక్త మండలివారు పల్లకీలో
సాయిబాబా ఫొటోని పెట్టి యాత్ర చేస్తూ మేమున్న చోటకి వచ్చి ఆగారు.
అపుడు ఆ బృందంలోని ఒక అబ్బాయికి కడుపునొప్పి వచ్చి వాంతులు చేసుకుంటున్నాడు. మా నాన్నగారు ఏమయినా సహాయం కావాలా అని అతనిని అడిగారు. ఆ అబ్బాయి బృందంలోని చైర్మన్ ని కలవమని చెప్పాడు. అదే సమయంలో చైర్మన్ వారివైపే వస్తున్నాడు. అపుడు మానాన్నగారు, “మా అబ్బాయి డాక్టరు. మీకేమయినా సహాయం కావాలా” అని అడిగారు. “ఈ కష్టసమయంలో దేవుడిలా వచ్చారు. ఇక్కడ 25 – 30 మంది యాత్రికులు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు” అని చెప్పాడు చైర్మన్.
అపుడు ఆ బృందంలోని ఒక అబ్బాయికి కడుపునొప్పి వచ్చి వాంతులు చేసుకుంటున్నాడు. మా నాన్నగారు ఏమయినా సహాయం కావాలా అని అతనిని అడిగారు. ఆ అబ్బాయి బృందంలోని చైర్మన్ ని కలవమని చెప్పాడు. అదే సమయంలో చైర్మన్ వారివైపే వస్తున్నాడు. అపుడు మానాన్నగారు, “మా అబ్బాయి డాక్టరు. మీకేమయినా సహాయం కావాలా” అని అడిగారు. “ఈ కష్టసమయంలో దేవుడిలా వచ్చారు. ఇక్కడ 25 – 30 మంది యాత్రికులు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు” అని చెప్పాడు చైర్మన్.
మేము సుస్తీ చేసినవాళ్ళందరికి
అవసరమయిన వైద్యం చేసి, మందులు యిచ్చి ముందుకి ప్రయాణం కొనసాగించాము. దారిలో ఇంకా రెండు మూడు యాత్రికుల బృందాలు కలిసాయి. వారిలో కూడా అనారోగ్యంతో ఉన్నవారికి వైద్యం
చేసి మందులు యిచ్చాము. ఆవిధంగా వైద్యం చేయడంవల్ల
మేము తెచ్చిన మందులన్నీ అయిపోయాయి. నాసిక్
లో మందులు కొని మరికొంతమందికి వైద్య సహాయం చేసాము. షిరిడీ చేరుకున్న తరువాత బాబావారి దర్శనం చేసుకుని
ముంబాయికి తిరిగి వచ్చాము. అప్పటినుంచి మానాన్నగారు
ప్రతి గుడిపడవ పండుగనుంచి రామనవవమి వరకు ఎనిమిది రోజులు, షిరిడీ వెళ్ళే యాత్రికులందరికీ
దారిలో ఉచితంగా వైద్యం చేసి మందులు యివ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. అప్పటినుండి ఈరోజువరకు ప్రతి సంవత్సరం మానకుండా
వైద్య సహాయం చేస్తూ వస్తున్నారు.
“మీకు మందులన్నీ కొనడానికి
అవసరమయి డబ్బును ఏవిధంగా సమకూర్చుకుంటున్నారు?” అని ప్రశ్నించాము.
“మొదట్లో మందులకోసం దాదాపు రూ.25,000/- ఖర్చు పెట్టాము. మా బిల్డింగ్ క్రిందనే
మీరు చూస్తున్న బాబా మందిరం మానాన్నగారు కట్టించినదే. మేమక్కడ ఒక ధర్మడిబ్బీ ఏర్పాటు చేసాము. ప్రతిసంవత్సరం ఆ డిబ్బీలో పోగయిన డబ్బుతో అవసరమయిన
మందులు కొంటూ ఉంటాము. సంవత్సరాలు గడిచే కొద్దీ
యాత్రికుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దానితోపాటుగా
మందుల ఖర్చు కూడా పెరిగి ఈ సంవత్సరం మందులకి రూ.4,42,614/- (అమ్మకం ధర లెక్క వేస్తే
యింకా ఎక్కువవతుంది) పెరిగింది. మేము చేస్తున్న
సేవా కార్యక్రమాలు పెరిగే కొద్దీ మాకు సహాయం కూడా దేవిధంగా లబిస్తూ ఉంది. ఇప్పుడు ఔషధ కంపెనీలవారు కూడా మాకు మందులను సరఫరా చేస్తూ
సహాయపడుతున్నారు. అంతేకాదు. ఇక్కడ ఉన్న సాయిమందిరం
యొక్క గురుస్థాన్ ట్రస్టీవారు కూడా మందుల ఖర్చులో కొంత భరిస్తున్నారు. మనఃస్ఫూర్తిగా కొంతమంది దాతలు కూడా మాకు సహాయం చేస్తున్నారు. మేమెపుడూ దేనికీ యిబ్బందిపడలేదు. మాకు ఎప్పుడూ ఎదో విధంగా సహాయం లభిస్తూనే ఉంది. మొదట్లో ఈ స్వఛ్చంద సేవలో 14 మంది ఉండేవారు. ఇప్పుడు 72 మంది ఉన్నారు. ఇదంతా బాబా లీల”.
“ఈ ఎనిమిది రోజులలోను
చాలా మంది యాత్రికులకి అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. వారందరికీ వైద్యం చేయాలంటే ఎన్నో మందులు అవసరమవుతాయి. ఈ భారమంతా మీరు ఎలా నిర్వహించగలుగుతున్నారు?” అని
తిరిగి ప్రశ్నించాము.
డా.పితలేగారు మా ప్రశ్నకి
సమాధానమిస్తు, “మేము బయలుదేరేముందు మేము తీసుకుని వెడుతున్న మందులన్నిటినీ సాయిబాబా
ముందు పెట్టి వాటిమీద ‘ఊదీ’ ఉంచుతాము. ఆతరువాత
వాటిని ఒళ్ళు నొప్పులకి, జ్వరానికి, విరోచనాలకి, వాంతులకి యిలా వేటివేటికవి విడివిడిగా
మందులను పొట్లాలు కడతాము. ఒక్కొక్క పొట్లంలో
నాలుగు మోతాదుల మందు పెడతాము. కొన్ని పొట్లాలను
బృందానికి బాధ్యత వహించే చైర్మన్ కి యిస్తాము.
ఆ సమయంలో మాకు 81 పల్లకీ బృందాలు తారసపడుతూ ఉంటాయి. వారందరికీ ఒక లక్ష మందుల పొట్లాలు అవసరమవుతాయి. సాయి భక్తులందరికీ ఆ మందులు ఎంతో అధ్భుతంగా పనిచేయడం
వల్ల వారందరూ ఆమందులని ‘సాయిడోస్’ అని పిలవడం మొదలుపెట్టారు.
“ఆఎనిమిది రోజులలోను
మీకు ఏమయినా సాయిబాబా లీలలు అనుభవంలోకి వచ్చాయా?” అని అడిగాము.
“మాకు ఎన్నో అనుభవాలు
కలిగాయి. ఆ అనుభవాలన్నీ వింటే మీరు చాలా ఆశ్చర్యకరమైన
ఆనందాన్ని పొందుతారు” అని చెప్పడం మొదలు పెట్టారు.
"ఒకసారి రాత్రి 12.30 కి భక్తబృందం చైర్మన్ నించి ఫోన్ వచ్చింది. ఒక భక్తుడు విపరీతమయిన జ్వరంతోను, చలితోను వణుకుతూ బాధపడుతూ ఉన్నాడని వెంటనే వచ్చి వైద్యం చేయాలని రమ్మన్నాడు. అతనికి 'సాయి డోస్' ఇమ్మని చెప్పాను. కాని, సాయిడోస్ మందు పొట్లాలన్నీ అయిపోయాయని చెప్పాడు చైర్మన్.
ఆ సమయంలో నేను కసార ఘాట్ లో ఉన్నారు. అతనేమో వాసిమ్ లో ఉన్నాడు. రెండిటికి మధ్య చాలా దూరం ఉంది. అపుడు చైర్మన్ "సరే నేను చేయగలిగినది చేస్తాను" అన్నాడు. ఆ సమయంలో ఆయన దగ్గర 'జెలూసిల్' (ఎసిడిటీకి వాడె టాబ్లెట్స్) ఉన్నాయి. ఆయన ఆ టాబ్లెట్స్ ని బాబా పల్లకీ ముందు పెట్టి వాటికి ఊదీని రాసి రోగికి యిచ్చాడు. వెంటనే అతని జ్వరం తగ్గిపోయింది. మర్నాడే అతను యాత్రకి బయలుదేరడానికి సిధ్ధమయి నడవగలిగాడు.
ఒక్కొక్కసారి రోగి పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉండి ఆస్పత్రిలో చేర్చాల్సిన సందర్భాలు కూడా వచ్చాయి. కాని 'సాయిడోస్' వేయగానే తగ్గిపోయేవి. ఇదంతా బాబా లీల కాదా?"
“ఒకసారి 62 సంవత్సరాల
వయసుగల వ్యక్తి మాకు ఇగత్ పురి సేవా మందిరంలో కలిసాడు. అతను ప్రతి సంవత్సరం కాలినడకన షిరిడీకి యాత్ర చేస్తూ
వస్తున్నాడు. అతని కాళ్ళకి ఆపరేషన్ అయి, డాక్టర్
లు స్క్రూలు బిగించారు. ఒక స్క్రూ బయటకు వచ్చి
అక్కడ చీము పట్టింది. నేనతనికి T.T ఇంజక్షన్
చేసి, బయటకు వచ్చిన స్క్రూ మళ్ళీ బిగింపించుకోవాలని, అందువల్ల ఇంటికి తిరిగి వెళ్ళిపొమ్మని
చెప్పాను.
ఆయన నేను చెప్పినదానికి ఒప్పుకోకుండా నాతో వాదిస్తూ, “నేను షిరిడీకి యాత్ర చేస్తున్నాను. నేను సగం దారిలో నా యాత్రను ఆపను. నేనిక్కడినుంచి బయలుదేరేలోగానే మీ కిష్టమయితే వైద్యం చేయండి లేకపోతే లేదు” అన్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగాలేదనీ, ఇంటికి తిరిగి వెళ్ళిపోవడం మంచిదని ఎంతో బత్రిమాలుతూ చెప్పాను. నామాటలకి ఆయన కాస్త కోపంగా “మీరు నాకు వైద్యం చేయదలచుకుంటే చేయండి. లేకపోతే నాకాలిలో ఉన్న మూడు స్క్రూలు బయటకు వచ్చేసినా సరే నేను షిరిడీకి మాత్రం వెళ్ళి తీరతాను” అన్నాడు. సాయిబాబా మీద ఆయనకి ఉన్న అచంచలమైన భక్తికి విశ్వాసానికి నమస్కరించి ఆయన గాయాలకి కట్టు కట్టాను. ఆయనకి కట్టుకట్టడానికి 30 నిమిషాలు పట్టింది. దీనినిబట్టి ఆయనకి ఎంత గాయమయింది, ఎంత చీము పట్టిందన్నది మీరు అర్ధం చేసుకోవచ్చు. ఆ తరువాత మూడురోజులు ఆయన చేసే యాత్రలో ప్రతిచోటకి నేను కూడా వెడుతూ ఆయన గాయానికి కట్లు కడుతూ వచ్చాను. మూడవరోజున జరిగిన అధ్భుతం ఏమిటంటే ఆయన గాయంనుండి చీము రావడం పూర్తిగా తగ్గిపోయింది. ఆయన చక్కగా షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకుని ముంబాయికి తిరిగి వచ్చారు. ఆ తరువాత డాక్టర్ దగ్గరకి వెళ్ళినపుడు ఆయన కాలు చక్కగా ఉంది. మేము ఈసంవత్సరం యాత్రలో ఆయనని మళ్ళీ కలుసుకున్నాము.
ఆయన నేను చెప్పినదానికి ఒప్పుకోకుండా నాతో వాదిస్తూ, “నేను షిరిడీకి యాత్ర చేస్తున్నాను. నేను సగం దారిలో నా యాత్రను ఆపను. నేనిక్కడినుంచి బయలుదేరేలోగానే మీ కిష్టమయితే వైద్యం చేయండి లేకపోతే లేదు” అన్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగాలేదనీ, ఇంటికి తిరిగి వెళ్ళిపోవడం మంచిదని ఎంతో బత్రిమాలుతూ చెప్పాను. నామాటలకి ఆయన కాస్త కోపంగా “మీరు నాకు వైద్యం చేయదలచుకుంటే చేయండి. లేకపోతే నాకాలిలో ఉన్న మూడు స్క్రూలు బయటకు వచ్చేసినా సరే నేను షిరిడీకి మాత్రం వెళ్ళి తీరతాను” అన్నాడు. సాయిబాబా మీద ఆయనకి ఉన్న అచంచలమైన భక్తికి విశ్వాసానికి నమస్కరించి ఆయన గాయాలకి కట్టు కట్టాను. ఆయనకి కట్టుకట్టడానికి 30 నిమిషాలు పట్టింది. దీనినిబట్టి ఆయనకి ఎంత గాయమయింది, ఎంత చీము పట్టిందన్నది మీరు అర్ధం చేసుకోవచ్చు. ఆ తరువాత మూడురోజులు ఆయన చేసే యాత్రలో ప్రతిచోటకి నేను కూడా వెడుతూ ఆయన గాయానికి కట్లు కడుతూ వచ్చాను. మూడవరోజున జరిగిన అధ్భుతం ఏమిటంటే ఆయన గాయంనుండి చీము రావడం పూర్తిగా తగ్గిపోయింది. ఆయన చక్కగా షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకుని ముంబాయికి తిరిగి వచ్చారు. ఆ తరువాత డాక్టర్ దగ్గరకి వెళ్ళినపుడు ఆయన కాలు చక్కగా ఉంది. మేము ఈసంవత్సరం యాత్రలో ఆయనని మళ్ళీ కలుసుకున్నాము.
“ఒకసారి కొంతమంది భక్తులు
మావైద్య శిబిరానికి ఒక రోగిని తీసుకుని వచ్చారు. అతనికి ఏమయిందని అడిగాను. “ఇతనిని ఒక ట్రక్కు గుద్దింది. ఎంత బలంగా గుద్దిందంటే దాని ఫలితంగా ఆ ట్రక్కు యొక్క హెడ్ లైట్ పగిలింది”
అని చెప్పారు. నేనతనిని పరీక్షించినపుడు అతనికి
వీపుమీద కొన్ని చిన్న చిన్న గీరుళ్ళు పడ్డయి అంతే".
“మేము చేస్తున్న వైద్య
సహాయం గురించి తెలుసుకున్న యాత్రల బృందంవారు స్వఛ్చందంగా తాము కూడా మాకు సహాయం చేసారు. ఒకతను మాకు జనరేటర్, మరికొంతమంది ఆహార పొట్లాలు,
నీళ్ళసీసాలు యిచ్చారు. మరికొంతమంది మందు పొట్లాలలో
మందులు నింపడంలాంటి స్వఛ్చంద సేవ చేసేవారు.
బాబా మనందరినీ ఈవిధంగానే సేవచేస్తూ ఉండమని బోధించారు. ఇటువంటివారిని కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ బృందాలలోని కొంతమంది భక్తులు మాకుటుంబంలో భాగమయి,
సంవత్సరకాలమంతా మాతో సన్నిహితంగా ఉంటారు”.
“ఒకసారి మానాన్నగారికి
జబ్బు చేయడంవల్ల రెండుమూడు సీసాల రక్తం కావాల్సి వచ్చింది. నేను ఒక సాయిభక్తుడిని సంప్రదిస్తే ఏకంగా 27 మంది
భక్తులు రక్తదానం చేయడానికి వచ్చారు.”
“యాత్రకు వెళ్ళే భక్తులందరికీ
సేవచేయడంలో మాకెంతో సంతోషం సంతృప్తి కలిగేది.
ప్రతిసంవత్సరం సెలవు రోజులలో భక్తులందరూ యాత్రకు వెళ్ళి వచ్చేటప్పుడు నూతనోత్సాహంతో
తిరిగి వస్తూ ఉండేవారు. ఆఎనిమిది రోజులు మాలో ఎంతో కొత్త శక్తి కలిగేది. ఆ శక్తి, బలం మాలో
సంవత్సర కాలమంతా ఉండేది. ఇది తప్ప సంవత్సరంలో
మేము ఇంకెక్కడికీ వెళ్ళేవారం కాదు.”
“2005 వ.సంవత్సరంలో డా.ఉజ్వల్
గారు పై చదువుల కోసం స్విడ్జర్ లాండ్ వెళ్లారు.
ఒకసారి సేవాకార్యక్రమాలకి బయలుదేరుతూ మాలో ఒక డాక్టర్ తక్కువయ్యారనే ఆలోచనలతో ఉన్నాము. కాని మరుసటిరోజే డా.ఉజ్వల్ మాతో కలిసారు. నాసోదరి ఆయన ప్రయాణం కోసం ఋణం తీసుకుంది. మా సేవాశిబిరం పూర్తయిన వెంటనే ఆయన స్విడ్జర్ లాండ్ కి తిరిగి వెళ్ళారు. ఈ సేవా కార్యక్రమాలవల్ల
మేము పొందే ఆనందం, తృప్తి, వర్ణింపనలవికానివి.
మేము పొందే ఆనందం తృప్తి దేనితోనూ సరిపోల్చలేము. బాబాయే మాచేత ఈ సేవనంతా చేయిస్తున్నారని భావిస్తూ
ఉంటాము.”
“ఆఖరికి మా అత్తగారిని,
మామగారిని కూడా బాబావారు అనుగ్రహించారు. మా
అత్తగారి ముత్తాతగారు కూడా పితలేగారిలాగానే బాబా భక్తుడు. బాబా ఆయనను ఆశీర్వదించి రెండు రూపాయలు ఇచ్చారు. ఇప్పటికీ అది వారింటిలోనే ఉంది".
బాబా మనందరినీ నిరంతరం
అనుగ్రహించు గాక. మన చేత ఆయన సేవలు చేయించుకో
గాక. ఇదే నేను ఆయన చరణాలమీద వినమ్రంగా నమస్కరించుకుంటూ
చేస్తున్న ప్రార్ధన.
(అయిపోయింది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment