29.08.2017 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
పంచ భూతాలపై ఆధిపత్యమ్
ఈ రోజు మరొక అధ్భుతమైన సాయిబాబా శక్తిని తెలుసుకుందాము. శ్రీసాయి సత్ చరిత్ర పారాయణ చేసేవారందరికీ బాబావారికి దైవాంశ శక్తులు, అంతే కాక ప్రకృతిని కూడా శాసించగలిగే శక్తి ఉన్నాయని తెలుసు. బాబా తాను జీవించి ఉన్న రోజులలోనే కాదు, మహాసమాధి చెందిన తరువాత కూడా ఆవిధంగానే తన శక్తిని చూపించి తానింకా మన మధ్యనే ఉన్నారన్నదానికి సజీవ సాక్ష్యమే ఇప్పుడు మనం తెలుసుకోబేయే ఈ అధ్బుతమైన లీల.
ఇది సాయిలీల మాసపత్రిక నవంబరు 1974 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది.
ఆయన ఆజ్ఞ ప్రకారమే గాలులు వీస్తున్నాయి. ఆయన ఆజ్ఞ ప్రకారమే సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆయన ఆజ్ఞానుసారమే అగ్ని, చంద్రుడు ప్రకాశిస్తున్నారు. అయిదవదయిన మృత్యువు తనపని తాను చేసుకునిపోతుంది.
శ్రీమద్భాగవతమ్ దశమ స్కంధమ్ 19 వ.అధ్యాయాన్ని ఒక్క సారి మననం చేసుకుందాము.
ఒకసారి శ్రీకృష్ణ బలరాములు గోపబాలురు ఆవులని, పశువులని మేపడానికి అడవిలోకి వెళ్ళారు.
ఆవులు, పశువులు పచ్చిగడ్డి మేస్తూ దారి తప్పి దూరంగా ఉన్న ఇషికావనము అనే అడవిలోకి వెళ్ళిపోయాయి. అవిఎక్కడికి పోయాయో తెలియక అడవంతా గాలించి ఆఖరికి వాటిని వెదకిపట్టుకొని అన్నిటినీ ఒక చోటకు చేర్చారు. ఆ అడవిలో ఎండిపోయిన చెట్లున్నాయి. అవి ఒకదానికొకటి రుద్దుకోవడం వల్ల అగ్ని పుట్టింది. ఆవిధంగా కార్చిచ్చు అడవంతా వ్యాపించింది. కృష్ణబలరాములు, గోపబాలురతో సహా ఆవులను పశువులను అగ్ని చుట్టుముట్టింది. ఆవులు భయంతో అరుస్తున్నాయి. గోపబాలురందరూ కృష్ణుడిని తమందరినీ రక్షించమని వేడుకొన్నారు. కృష్ణుడు అందరినీ ఒక్కసారి కళ్ళుమూసుకోమని చెప్పగా అందరూ ఆవిధంగా చేశారు.
ఆవులు, పశువులు పచ్చిగడ్డి మేస్తూ దారి తప్పి దూరంగా ఉన్న ఇషికావనము అనే అడవిలోకి వెళ్ళిపోయాయి. అవిఎక్కడికి పోయాయో తెలియక అడవంతా గాలించి ఆఖరికి వాటిని వెదకిపట్టుకొని అన్నిటినీ ఒక చోటకు చేర్చారు. ఆ అడవిలో ఎండిపోయిన చెట్లున్నాయి. అవి ఒకదానికొకటి రుద్దుకోవడం వల్ల అగ్ని పుట్టింది. ఆవిధంగా కార్చిచ్చు అడవంతా వ్యాపించింది. కృష్ణబలరాములు, గోపబాలురతో సహా ఆవులను పశువులను అగ్ని చుట్టుముట్టింది. ఆవులు భయంతో అరుస్తున్నాయి. గోపబాలురందరూ కృష్ణుడిని తమందరినీ రక్షించమని వేడుకొన్నారు. కృష్ణుడు అందరినీ ఒక్కసారి కళ్ళుమూసుకోమని చెప్పగా అందరూ ఆవిధంగా చేశారు.
పంచభూతములను సృష్టించిన పరమాత్మ ఆపంచ భూతములలో ఒకటయిన అగ్నిని నోరుతెరచి తన యోగశక్తితో తనలోకి లాక్కున్నాడు. దావానలం అంతా కృష్ణుని నోటిలోకి వెళ్ళిపోయింది.
సృష్టికర్త పంచభూతాలమీద ఆధిపత్యం వహించి వాటిని తన అదుపులో ఉంచుకుంటాడంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు.
పూజనీయులైన శ్రీ బి.వి.నరసింహస్వామీజీ గారు తాను వ్రాసిన లైఫ్ ఆఫ్ సాయిబాబా రెండవభాగం పుస్తకం ముందుమాటలో “ ఈ విధంగా శ్రీ కృష్ణుడు చేసిన అద్భుతం ఈ రచయితనే కాదు ఎంతోమందికి దిగ్భ్రమను కలిగించింది. ఆ తరువాత సాయిబాబా చెప్పినది చేసినది విన్నతరువాత, ఆయన చేసిన అధ్భుతాలను చూసిన తరువాత అందరి భ్రమలు తొలగిపోయాయి” అని వ్రాసారు. పంచభూతాలపై ఆధిపత్యం సంభవమేనా అని భక్తితత్పరుడయిన స్వామీజీలాంటి మహావ్యక్తిత్వం కలిగినటువంటి ఆయనకే దిగ్భ్రమను కలిగించిందంటే, ఇక సందేహాస్పదులైనవారికి, నాస్తికులకి శ్రీకృష్ణపరమాత్మ చేసిన అధ్భుతాన్ని నమ్మశక్యంగా లేదని వాదిస్తారు. వేదవ్యాసమహాముని దానిని కల్పించి వ్రాసిన కట్టుకధ అని కొట్టిపారేస్తారు. ఇపుడు
పైన వివరించిన చమత్కారం యదార్ధమని మనం నమ్మడానికి శ్రీసాయిబాబా చూపించిన శక్తి ద్వారా మనం నిర్ధారించుకోవచ్చు.
ఒకరోజున ధునిలో మంటలు బాగా ప్రజ్వరిల్లుతూ మంటలు బాగా పైపైకి ఎగసిపడుతూ ఉన్నాయి. ఆ మంటలు మసీదు పైకప్పును తాకుతున్నయి. ద్వారకామాయిలో కూర్చున్న భక్తులందరూ ఏమిచేయాలో పాలుపోక భయాందోళనలతో ఉన్నారు. సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడయిన బాబాని ఆజ్వాలలను అణచివేయమని భక్తులందరూ వేడుకోనవసరం లేదు. బాబాకు అంతా తెలుసు. ఆసమయంలో
బాబా అతీంద్రియ స్థితిలో ఉన్నారు. భక్తులందరిలోని భయాందోళనలను గమనించి సాధారణ స్థితిలోకి వచ్చారు. వెంటనే
ధుని దగ్గరకు వెళ్ళి తన సటకాతో స్థంభంప్రక్కనున్న మీద కొడుతూ “తగ్గు, తగ్గు, శాంతించు” అని అగ్నిని శాసించారు. వెంటనే
ఆయన ఆజ్ఞ ప్రకారం ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచం కొంచం చొప్పున మంటలు తగ్గిపోయి ధుని యధాప్రకారంగా మండసాగింది.
పైన ఉదహరించిన సంఘటనపై వ్యాఖ్యానిస్తూ హేమాద్రిపంత్ శ్రీసాయి సత్చరిత్రలో ఈవిధంగా అంటారు. “భగవంతుని అవతారమయిన ఈయనే మన సాయి. తనకు శరణాగతులయినవారినెవరినయినా సరే ఆయన అనుగ్రహిస్తారు. భయంకరమయిన అడవిలో కార్చిచ్చులో చిక్కుకున్న గోపబాలురను ఆవులను పశువులను శ్రీకృష్ణప్రరమాత్మ
ఏవిధంగా రక్షించాడో ఆవిధంగానే సాయిబాబా తన భక్తులను రక్షించారని హేమాడ్ పంత్ వ్యాఖ్యానించారు.
ఒక వేసవికాలంలో మిట్టమధ్యాహ్నంవేళ షిరిడీలో ప్రమాదవశాత్తు ఒక గడ్డివామికి నిప్పంటుకుంది. దానికి
ప్రక్కల యింకా చాలా గడ్డిమేటులున్నాయి. గాలి బాబా విపరీతంగా వీస్తూ ఉంది. ఆగాలికి
నిప్పురవ్వలు ఎగిరి మిగిలినవాటిమీద పడితే అన్నీ ఒక్కసారిగా అంటుకుని బూడిద కుప్పగా మారే ప్రమాదం ఉంది. ఒక గ్రామస్థుడు పరుగుపరుగున ద్వారకామాయికి వెళ్ళి తమను, పాడిపంటలను కాపాడమని అర్ధించాడు. బాబా వెంటనే మండుతున్న గడ్డిమేటు దగ్గరకు వెళ్ళి దాని చుట్టూరా నీటిని వలయాకారంగా చల్లి “ఈ గడ్డిమేటు మాత్రమే తగలబడి మిగిలినవి మాత్రం అంటుకోకుండా ఉంటాయి” అని అగ్నిని శాసించారు. బాబా ఆజ్ఞాపించిన ప్రకారం అది ఒక్కటే తగలబడి అంతగాలి వీస్తున్నా దగ్గరలోనే ఉన్న మిగిలినవన్నీ సురక్షితంగా ఉన్నాయి.
బాబా తరచుగా భక్తులందరికీ పరమాన్నం గాని పులావు గాని స్వయంగా వండి వడ్డించేవారు. ఆయనే స్వయంగా వంట చేసేవారు. అది సరిగా ఉడికిందా లేదా అన్నది చూడటానికి అన్నం ఉడుకుతున్న గుండిగలో తన చేతిని పెట్టి కలియత్రిప్పేవారు.
అయినా బాబా చేయి ఆవిపరీతమయిన వేడికి ఎప్పుడూ కాలలేదు. దీనిని బట్టే బాబాకు అగ్నిమీద వాటి స్వభావాలమీద అదుపు ఉన్నదని మనకు రూఢిగా తెలుస్తుంది.
అయినా బాబా చేయి ఆవిపరీతమయిన వేడికి ఎప్పుడూ కాలలేదు. దీనిని బట్టే బాబాకు అగ్నిమీద వాటి స్వభావాలమీద అదుపు ఉన్నదని మనకు రూఢిగా తెలుస్తుంది.
ఈ సందర్భంగా శ్రీసాయి శరణానందస్వామి (వామనరావు పి.పటేల్) బాబా వారి అతీంద్రియ శక్తులను గురించి ;శ్రీసాయి ది సూపర్ మాన్’ అనే పుస్తకంలో వ్రాసిన విషయాలను గుర్తుతెచ్చుకోవడం ఎంతో సముచితంగా ఉంటుంది. సాయిబాబా భగవంతునికన్న విభిన్నమయిన అవతారపురుషుడు. ఆయన మనతోటే కలిసి జీవిస్తారు, మనతోనే కలిసి సంచరిస్తారు. భగవంతునిలాగే ఆయనలోను అతీంద్రియ శక్తులు ఉన్నాయి. కాని ఆయన వాటిని అవసరమయినపుడు ఉపయోగించినా గాని, అవి తనకు సహజమే అన్నట్లుండేవారు. అంతేగాని తానేదొ అధ్భుతాలను చేస్తున్నానని ఎప్పుడూ ప్రకటించుకోలేదు.
సెంట్ మాథ్యూ అధ్యాయం 8 శ్లో. 24 – 27 లలో , “ఓడలో జీసస్ క్రైస్ట్ నిద్రిస్తున్న సమయంలో పెద్ద తుపాను సంభవించింది. సముద్రంలో లేచిన అలలకి వీచే గాలులకి ఓడ విపరీతంగా అటూ ఇటూ ఊగడం మొదలుపెట్టింది. అప్పుడు ఆయన భక్తులందరూ తమను ఆ గండంనుండి గట్టెక్కించమని జీసస్ ను వేడుకున్నారు. అపుడు జీసస్ వీస్తున్న గాలులని సముద్రాన్ని గద్దించడంతోనే ప్రశాంత వాతావరణం ఏర్పడింది. అపుడందరూ ఆయనని ఎటువంటి అధ్భుతమయిన మానవుడు? ప్రచండమయిన గాలులు అల్లకల్లోలంగా ఉన్న సముద్రం ఆయనకు విధేయులుగా ఉంటాయి” అని శ్లాఘించారు.
అదేవిధంగా శ్రీసాయిబాబా 1914
వ.సంవత్సరంలో తన దైవాంశ శక్తులతో
భయంకరమయిన తుఫానును అదుపు చేసారు. శ్రీసాయిబాబా యిప్పటికీ తన భక్తులను కాపాడటానికి తన అత్యద్భుతమయిన శక్తులను ప్రదర్శిస్తూనే ఉన్నారు. దానికి సజీవ సాక్ష్యం ఇపుడు తెలుసుకోబోయే యదార్ధ సంఘటన.
1951 వ.సంవత్సరంలో నేను కైకలూరులో స్టేషనరీ సబ్ మేజస్త్రేట్ గా పనిచేస్తున్నాను. ఆ ఊరిలో ఒక సంస్కృత పాఠశాల ఉంది. నాకు సంస్కృత భాష అంటే ఎంతో అభిమానం. అందువల్లనే నేను ఆపాఠశాల కార్యక్రమాలలో చాలా సన్నిహితంగా పాల్గొంటూ ఉండేవాడిని. ఒకసారి
1951 వ.సంవత్సరంలో నాతో సంప్రదించిన తరువాత ఉపాధ్యాయులందరూ అక్టోబరు 13, 14 తేదీలలో ఒక సాహితీ సమావేశాన్ని ఏర్పాటు చేసారు. 10.10.1951 న
బాబా మహాసమాధి రోజున వెంట్రప్రగడ లోని సాయిమందిరానికి వెళ్లాను. 11.10.1951 న అక్కడినుంచి వచ్చేముందు, సాహితీ సమావేశం జయప్రదంగా జరిగేటట్లుగా అనుగ్రహించమని బాబాను మనసారా ప్రార్ధించుకున్నాను.
కవి సామ్రాట్, పద్మభూషణ్, కళాప్రపూర్ణ, జ్ఞానపీఠ అవార్ఢు గ్రహీత శ్రీవిశ్వనాధ సత్యనారాయణ గారు, పండిత పెనుమత్స సత్యనారాయణరాజు గారు, యింకా కొంతమంది ప్రముఖ పండితులను ఆసమావేశానికి ఆహ్వానించారు. సమావేశానికి వారందరూ హాజరయ్యారు.
13.10.1951 ఉదయం మా సమావేశ ప్రారంభోత్సవ కార్యక్రమం మొదలయింది. సాయంత్రం మూడు గంటలకి మరలా సమావేశ కార్యక్రమం ప్రారంభించాము. కార్యక్రమం మొదలయిన వెంటనే పెనుగాలి, వర్షపు జల్లులు మొదలయ్యాయి. ఆకాశమంతా దట్టమయిన మబ్బులు పట్టి భీతావహంగా ఉంది. విపరీతంగా వీస్తున్న గాలికి పందిరి ఎగిరిపోతుందేమోనన్నంత
భయంకరంగా ఉంది. నాకు చాలా భయం వేసి ఈ పెనుగాలి, వర్షాన్నుండి కాపాడమని బాబాని మనసులోనే ప్రార్ధించుకున్నాను. ఆవిధంగా ప్రార్ధించుకున్న వెంటనే వీస్తున్న గాలి, వాన చినుకులు ఆగిపోయాయి. మేము అనుకున్న ప్రకారం సమావేశం ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా జరిగింది. అంతా పూర్తయిన తరువాత మేము ఇంటికి తిరిగి వచ్చాము. ఇంటి ముందరంతా చాలా బురదగాను, బాగా తడిగాను ఉంది. ఏమయిందని
ఇంట్లోనివాళ్ళని అడిగాను. సాయంకాలం
4 గంటలకి కుండపోతవాన వచ్చిందని, దానివల్ల ప్రక్కనున్న కాలువలు పొంగి ప్రవహించాయని చెప్పారు. చుట్టుప్రక్కలంతా నీటితో నిండిపోయిందని చెప్పారు. ఆతరువాత
ఇంకా అడిగినమీదట మా సమావేశం జరిగిన చోటునుంచి రెండు ఫర్లాంగుల వరకు విపరీతమయిన ఈదురు గాలులతోపాటు కుండపోత వర్షం కురిసిందని తెలిసింది. మేము సమావేశం ఏర్పాటుచేసుకున్న ప్రదేశంనుంచి దానికి కొంతదూరం వరకు గాలి గాని వాన గాని లేదంటే అదంతా సాయినాధుని కృపవల్లనే. ఇది బాబా మహాసమాధి చెందిన 33 సంవత్సరాల తరువాత జరిగిన సంఘటన.
దీనిని బట్టి బాబా చెప్పిన వచనాలు నిత్యసత్యాలని నేటికీ ఋజువు చేస్తున్నాయి.
నా సమాధినుండియే నేనన్ని కార్యక్రమాలను నిర్వర్తిస్తాను.
నేను మహాసమాధి చెందినా మీరు నన్నెపుడు ఎక్కడ తలచుకున్న తలచుకున్న క్షణంలోనే మీముందు ఉంటాను.
ప్రేమతో నా భక్తుడు పిలిచిన వెంటనే నేను ప్రత్యక్షమవుతాను.
నేను ప్రయాణించడానికి నాకు ఎటువంటి వాహనములు అవసరము లేదు.
దీనిని బట్టి సాయియే శ్రీకృష్ణుడు అనీ ఆయన సర్వదేవతా స్వరూపుడని అర్ధం చేసుకోవచ్చు. భగవంతుడనేవాడు ఒక్కడే. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల మనం మన సాయిమాతకు బిడ్డలమయ్యాము. నిరంతరం
ఆయన రక్షణలో ఉన్నాము. నిరంతరం మనం ‘సాయి’ నామాన్ని జపిస్తూ సదా ఆయనను మన మదిలో నిలుపుకుందాము.
పి.వి.సత్యనారాయణ శాస్త్రి, బి.ఎ.
రిటైర్డ్ తహసీల్ దార్
కృష్ణలంక, విజయవాడ
(సర్వం శ్రీసాయినాధార్పనమస్తు)
(సర్వం శ్రీసాయినాధార్పనమస్తు)
0 comments:
Post a Comment