16.01.2021
శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 27 వ.భాగమ్
(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
(అనివార్య కారణాలవల్ల వారం రోజులుగా ప్రచురించడానికి సమయం కుదరలేదు)
షిరిడీ- కోపర్ గావ్ – షిరిడీ
శనివారమ్ – అక్టోబరు, 19, 1985
ప్రశ్న --- బాబావారి పుట్టుపూర్వోత్తరాల గురించి, ఆయన చెప్పిన గురువు గురించి మీరేమనుకుంటున్నారు? వీటిపై మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు --- బాబా గురువు గురించి రెండు కధలు ఉన్నాయి. ఒకసారి బాబా యాదృచ్చికంగా తన గురువు పేరు వెంకూసా అని తను మహారాష్ట్రలోని సేలూ గ్రామంనుండి వచ్చానని అన్నారు. షిరిడీకి వచ్చిన బాబా వేపచెట్టు క్రిందనే ఎల్లప్పుడూ తపస్సు చేసుకోవడం చూసిన గ్రామస్తులు వేపచెట్టు క్రిందనే కూర్చోవటానికి కారణమేమిటని బాబాను అడిగారు.
అపుడు బాబా అది పూర్వకాలంలో తన గురువుకు సంబంధించిన ప్రదేశమని చెప్పారు. ఇక్కడ ప్రజలందరూ ఖండోబా దేవుని పరమశివునిగా భావించి పూజిస్తూ ఉంటారు. అపుడు ఆ ఖండోబా ఇక్కడ ఉన్న ఒక భక్తుని ఆవహించి వేపచెట్టు వద్ద ఒక గొయ్యిని త్రవ్వమని ఆదేశించారు. ఆప్రదేశం ఆబాలునియొక్క గురువు స్థానమని, అందువల్లనే ఆబాలుడు అక్కడ తపస్సు చేసుకొంటున్నాడని ఆ భక్తునిలో ఆవేశించిన ఖండోబా చెప్పడం జరిగింది. అక్కడ త్రవ్వినట్లయితే ఒక చిన్న సమాధి కనపడుతుందని కూడా చెప్పారు. ఖండోబా చెప్పినట్లుగా అక్కడ గొయ్యిని త్రవ్వగా వారికి ఒక సొరంగం కనిపించింది. ఆ సొరంగం గుండా ఒక మీటరు 65 సెంటీమీటర్ల క్రింద భూగృహంలో వారికి సమాధి ఉన్నట్లుగా ఒక చిన్న గది కనిపించింది. లోపల వారికి దీపాలు వెలుగుతూ కనిపించాయి. అక్కడ ఎవరు నూనెపోసి దీపాలను వెలిగించారో ఎవరికీ అర్ధం కాలేదు.
ఆప్రదేశంలో అటువంటిది ఉంటుందని గ్రామస్థులు ఎవ్వరూ ఊహించలేకపోయారు. భూగృహంలో వారు ఆ గదిలో చూసినపుడు లోపల పుష్పాలు, వెలుగుతున్న దీపాలు కనిపించాయి. ఆ
పుష్పాల పరిమళం ఇంకా వస్తూ ఉంది. అది ఎలా ఉందంటే ఎవరో అపుడే పూలతో పూజచేసి వెళ్ళినట్లుగా ఉంది. అదిచూసి వారంతా చాలా దిగ్భ్రాంతి చెందారు. అపుడు బాబా అది తన గురువుగారి స్థానమని,
తాను ఆయనకు 12 సంవత్సరాలు సేవ చేసానని చెప్పారు. నేను ఈరోజు ఇలా ఉండటానికి కారణం అంతా ఆయన కృప వల్లనే. నేనాయనకు ఎంతో ఋణపడి ఉన్నాను. అన్నారు. అందువల్లనే ఈ ప్రదేశానికి గురుస్థానమని పేరు వచ్చింది. బాబా పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలని ప్రజలంతా ఎంతో ఆసక్తి కనబరిచారు. ఆవివరాలను తెలుసుకుని ఒక ఖచ్చితమయిన నిర్ధారణకు రావాలనుకున్నారు. ఒకసారి బాబా యధాలాపంగా తాను సేలూనుంచి వచ్చానని,
తన గురువు పేరు వెంకూసా అని చెప్పడం వల్ల, నిజానిజాలు తెలుసుకోవడానికి కొంతమంది సేలూ వెళ్ళారు. అక్కడివారు కొన్ని సంవత్సరాల క్రితం వెంకూసా అనే ఆయన ఉండేవారనీ,
ఆయన పేరు గోపాలరావు దేశ్ ముఖ్ అని చెప్పారు. ఆయన ధార్మిక జీవనాన్ని గడిపిన మహాత్ముడని, జ్ఞానసిధ్ధిని పొందినవారని చెప్పారు. వెంకూసా వద్ద ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడనీ, ఒకానొక సమయంలో ఆబాలుడు ఆయనను వదిలిపెట్టి వెళ్ళిపోయాడనీ చెప్పారు. వెంకూసా ఆబాలుడిని కొన్ని ప్రమాదాల బారినుండి కూడా కాపాడారని చెప్పారు. నిజానికి కొంతమంది ఆబాలుని మీద ఈర్ష్యతో ఉండేవారని,
ఆకారణంగా ఆబాలుడిని ఇటుకలతో కొట్టేవారనీ చెప్పారు.
ప్రశ్న --- ఆబాలుడు సాధుస్వభావిగాను, ధర్మనిష్టాపరుడిగాను ఉండటం వల్లనా?
తుకారామ్ --- అవును. ఆఇటుక బాలునికి బలంగా తాకి గాయపరచకుండా అతని గురువు వేగంగా వసున్న ఆ ఇటుకను మధ్యలోనే ఆపి ఆబాలుడిని కాపాడారు. కాని, విచిత్రమేమంటే వెంకూసా ఆఇటుకను బాలునికి ఎటువంటి గాయం కాకుండా తగిలేలా చేసారు. ఆయన రక్షించిన విధానానికి ధన్యవాదాలు తెలపాలి. తగలడానికి వేగంగా వస్తున్న ఇటుక వేగాన్ని తన శక్తితో తగ్గించివేసి దెబ్బ తగలకుండా ఆబాలుడిని రక్షించారు. ఇక వెంకూసా ఆబాలుడిని విడిచిపెట్టే సమయం ఆసన్నమయినపుడు ఆబాలునితో “నాలో ఉన్న శక్తులన్నిటినీ నీలో ప్రవేశపెడుతున్నాను” అన్నారు. ఆవిధంగా చెప్పి,
“ఇక నీవు సంచారం చేస్తూ మానవాళిని ఉధ్ధరించు” అన్నారు. ఈవిధంగా బోధించిన తరువాత గురువు ఆబాలుడిని అక్కడినుంచి వెళ్ళిపొమ్మని చెప్పారు. అపుడాబాలుడు తనవైపు విసరబడ్డ ఇటుకను తీసుకొని వెళ్ళిపోయాడు.
నిజానిజాలు తెలుసుకోవడానికి సేలూకి వచ్చినవారికి స్థానికులు చెప్పిన వివరాలు ఇవి.
(కాని దాసగణు ప్రామాణికంగా చెప్పినదాని ప్రకారం తన విద్యార్ధికి దెబ్బ తగలకుండా వెంకూసాగారే తనకు తగిలేలా చేసుకున్నారని…)
ప్రశ్న --- అయితే పరిశోధించడానికి సేలూ వెళ్ళినవారికి సేలూ గ్రామంలోనివారు చెప్పిన వివరాలా ఇవి?
తుకారామ్ --- అవును. సేలూ గ్రామస్థులు చెప్పినవే. కాని, ఆగ్రామంలో వెంకూసా అనే పేరుతో ఎవరూ లేనప్పటికీ బాబా చెప్పినదానినే నిర్ధారించుకున్నారు. సేలూలో గోపాలరావు దేశ్ ముఖ్ అనే ఆయన ఉండేవారని, ఆయన వెంకటేశ్వరస్వామికి భక్తుడని అక్కడి గ్రామస్థులు చెపారు. ఆకారణం చేతనే ఆయనను వెంకూసా అని పిలిచి ఉండచ్చని అన్నారు. కాని ఇక్కడ కాలానికి సంబంధించి ఒక సమస్య ఉంది. బాబా 16 సంవత్సరములు బాలునిగా షిరిడీలో మొట్టమొదటిసారిగా కనిపించారు. బాబా 1918 లో సమాధి చెందారు. అందువల్ల బాబా 52 సంవత్సరాలు షిరిడీలోనే ఉన్నారని అంటారు. ఆవిధంగా మీరు గోపాలరావు వృత్తాంతాన్ని, సేలులో ఆయన గడిపిన జీవిత కాలం , ఈ
సంవత్సరాలని మీరు పరిగణలోకి తీసుకుంటే---
ప్రశ్న --- కాని ఆయన తన గురువును ఇక్కడ గురుస్థానంలో 12 సంవత్సరాలు సేవించినట్లుగా చెప్పబడిన విషయానికి ఇది ఎలా సరిపోలుతుంది? ఎన్నో విషయాలు కనపడుతున్నట్లుగా ఉన్నాయి. ఆ సంఖ్య దేనినయినా సూచిస్తుందా?
తుకారామ్ --- అంతేకాదు. బాబా షిరిడీలో 52 సంవత్సరాలు నివసించి ఉన్నట్లయితే 1918 లోనుండి
52 సం. తీసివేయండి. అపుడు బాబా మొట్టమొదటిసారిగా షిరిడీకి ఎపుడు వచ్చారో తెలుస్తుంది. ఆవిధంగా చూసినట్లయితే 1866 వ.సం. అవుతుంది. బాబా షిరిడికి మొట్టమొదటిసారి వచ్చినపుడు ఆయన వయసు 16 సంవత్సరాలు. దీనిని మీరు పరిగణలోకి తీసుకుంటే ఆయన సేలూలో తన గురువుతో ఉన్న కాలానికి సరిపోలుతుంది. ఆవిషయం ఆలోచించారా? అందుచేత చాలా సంవత్సరాల క్రితం సేలూలో గోపాలరావు అనే వ్యక్తి ఉన్నట్లుగా మీరు భావించవచ్చు, అవునా? కాని దురదృష్టవశాత్తు తేదీలు సరిపోలడంలేదు.
ప్రశ్న --- అయితే మీ ఉద్దేశం ప్రకారం బాబా అప్పటికి చాలా చిన్నపిల్లవాడా?
తుకారామ్ --- అవును. అందుచేత ప్రజలు వెంకూసా అని భావిస్తున్న గోపాలరావు దేశ్ ముఖ్ అనే వ్యక్తి ఉన్నారని చెప్పిన విషయాన్ని బట్టి మనం ఒక ఖచ్చితమయిన నిర్ణయానికి రాలేము. గురుస్థానం గురించి బాబాని అడిగినపుడు ఆయన తన గురువుకు 12 సంవత్సరాలు సేవచేసినట్లుగా చెప్పారు. అంటే దీనిని బట్టి ఆయన నాలుగు సంవత్సరాల వయసులో ఇక్కడికి వచ్చారని సేలూలో లేరని అర్ధమవుతుంది. అందుచేత ఒక తుది నిర్ణయానికి రాలేము. మరొక విషయం బాబా సజీవులే అనే విషయం మీకు తెలుసుకదా? అందువల్ల బాబా తన గురువు ఇక్కడే ఉన్నారని అన్నపుడు (తుకారామ్ మధ్యలో తను చెబుతున్నదానిని ఆపి) తన భక్తులలో అత్యంత ప్రసిధ్ధుడు, బాబా గురించి ఎన్నో పుస్తకాలను పరిశోదన చేసి వ్రాసిన ఒక స్వామీజీతో బాబా అన్న మాటలు “స్వాతంత్ర్య సమర సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలో నేను ఉన్నాను”…
ప్రశ్న --- అంటే ఆయన తన పూర్వజన్మలోని అవతారాలను గురించి ప్రస్తావించారంటారా?
తుకారామ్ --- సాయిబాబా చాలా విషయాలు చెప్పారు. తను ఇక్కడ ఉన్నానని,
అక్కడ ఉన్నానని. అనగా బాబా అప్పుడూ ఇప్పుడూ ఉన్నారు. ఆయన ఎప్పటికీ సజీవులే. మనము ఆయనని చూడలేకపోయినా ఆయన నేటికీ ఇక్కడే ఉన్నారు. ఈ విశ్వం ఆరంభంనుండి ఆయన ఉన్నారు. ఆయనే సృష్టికర్త అని మీకు తెలుసు. అందుచేత ఖచ్చితంగా మనం ఏవిషయం చెప్పలేము.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment