22.06.2017 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబావారు ప్రసాదించిన మరికొన్ని సందేశాలు
శ్రీ సాయితత్త్వ సందేశములు
(voice of Sai Baba)
శ్రీసాయి తత్త్వసందేశములు
–17 వ.భాగమ్
62. 19.01.1994 తెల్లవారుఝాము 3.30 గంటలకు పూజామందిరములో
శ్రీసాయిబాబా యిచ్చిన సందేశము
విశ్వశక్తిని లీనము చేసుకొనుటకు,
విశ్వచైతన్యాన్ని ప్రకటించుటకు, విశ్వరహస్యాలను తెలుసుకొనగోరి, సత్యశోధనకై పరమాత్మ యోగప్రాప్తికై
జ్ఞానకర్మ భక్తియోగముల ద్వారా సాధన చేయు జిజ్ఞాసులకు, మోక్షగాములకు భగవత్ సాక్షాత్కారము
పొందగోరు ఆధ్యాత్మచింతనాపరులకు, ఆప్తుడనై జ్ఞానబంధువునై, మార్గదర్శకుడనై, సాధన చేయించుకొనువాడను
నేనే. విశ్వచైతన్యాన్ని అవలీలగా నాకృపతో భక్తులకు
అందించు పరిపూర్ణయోగీశ్వరుడను, యోగి చక్రవర్తిని నేనే.




