26.12.2022 సోమవారమ్
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
ఓమ్ శ్రీ గణేశాయనమః
శ్రీ మాత్రేనమః
ఓమ్ శ్రీ సాయినాధాయనమః
శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల
సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర – 7వ.భాగమ్
ప్రేరణ ; గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు
ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి
ఆలయమ్
సమన్వయ కర్త ; ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట్, హైదరాబాద్
ఫోన్. 9440375411
& 8143626744వ.
శ్రీమద్భగవద్గీత – అధ్యాయమ్
4 శ్లోకమ్ 34 (తరువాయి భాగమ్)
జ్ణాన – కర్మ – సన్న్యాస
యోగము
ఆ తరువాత కాకాజీ ఎలాగయితేనేమి
అదృష్టం కొద్దీ షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకున్నాడు. (కాకాజి షిరిడీ వెళ్లడానికి జరిగిన కధంతా ఇక్కడ
నేను ప్రస్తావించడంలేదు. సాయి సత్ చరిత్ర చదవనివారు
30 వ అధ్యాయం చదివి తెలుసుకోవచ్చు.) బాబాను
దర్శించినంతనే అతని మనశ్చాంచల్యము పోయింది.
( ఈ సంఘటనను సత్ చరిత్ర చదివినపుడెల్లా
నాకు ఒక సందేహం వస్తూ ఉండేది. సప్తశృంగి, ఆవిడే ఒక దేవత
. అంతేకాకుండా కాకాజీ వైద్య ఆమె వద్దనే పూజారిగా
ఉంటున్నాడు. అటువంటపుడు ఆ దేవతే ఆయనకి మనశ్శాంతిని
ప్రసాదించవచ్చు కదా అని నేను అనుకుంటూ ఉండేవాడిని. ధ్యానంలో బాబాను కూడా అడిగాను. కాని సమాధానం ఇవ్వలేదు. కారణం సమాధానం శ్రీ సాయి సత్ చరిత్రలోనే ఉంది. అందువల్లనే మనం సత్ చరిత్రను ఊరికే పారాయణ చేస్తే
సరిపోదు. ప్రతి విషయాన్ని బాగుగా అర్ధం చేసుకుంటూ
గుర్తుండిపోయేలా పారాయణ చేయాలి. అప్పుడే పారాయణ
ఫలితం సిధ్ధిస్తుంది.)
శ్రీ సాయి సత్ చరిత్ర 39 వ. అధ్యాయములోని
విషయాన్నే మనం ఇపుడు చర్చించుకుంటున్నాము.
ఇందులో బాబా సంస్కృత శ్లోకానికి అర్ధం చెబుతున్నారు కదా. బాబా ఏమన్నారో చూడండి.
“కృష్ణుడు అర్జునుని జ్ణానులకు, తత్త్వదర్శులకు
నమస్కారము, ప్రశ్నించుట,సేవ చేయుమని చెప్పనేల?
స్వయముగా కృష్ణుడు తత్త్వదర్శి కాడా?
వారు నిజముగా జ్ణానమూర్తియే కదా!
అపుడు నానా “అవును తత్త్వదర్శియే, కాని
అర్జునుని ఇతర జ్ణానులనేల సేవించుమనెనో నాకు తోచుటలేదు” అన్నాడు.
బాబా --- నీకది బోధ పడలేదా?
నానా సిగ్గు పడ్డాడు. అతని గర్వం అణగిపోయింది.
బాబా చెప్పిన వివరణ.
సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును.
భక్తుడు ఏ గురువునైన శ్రీకృష్ణుని గనే బావించును. గురువు శిష్యుని వాసుదేవుడుగాను, శ్రీ కృష్ణుడు
ఇద్దరిని తన ప్రాణము, ఆత్మలుగాను భావించును.
అటువంటి భక్తులు, గురువులు కలరని శ్రీకృష్ణుడు తెలిసి యుండుటచే, వారిని గూర్చి,
అర్జునునికి చెప్పెను. అట్టివారి గొప్పతనము
హెచ్చి అందరికి తెలియవలెననియే కృష్ణుడట్లు చెప్పెను.
ఇపుడు పై వివరణ చదివిన తరువాత నా సందేహానికి
సమాధానం లభించింది.
స్వయముగా సప్తశృంగిదేవి పూజారికి మనశ్శాంతిని
ప్రసాదించగలదు. కాని బాబా వద్దకు వెళ్లమని
చెప్పడంలోని ఉద్దేశ్యం ఆయన గొప్పతనం అందరికీ తెలియడం కోసమే దేవత ఆవిధంగా ఆదేశించింది.
దీనిని బట్టి స్వయంగా దేవతే బాబా గురించి
మనందరికి తెలియచేసిందని మనం గ్రహించుకోవచ్చు.
మరి అటువంటప్పుడు ఎవరయినా బాబా గురించి అవహేళనగా మాట్లాడటం భావ్యం కాదు కదా. అందుచేత ఎవరినయినా విమర్శించేముందు అవతలివాళ్ళ గురించి
పూర్తిగా తెలుసుకోవాలి అని కూడా మనం అర్ధం చేసుకోవచ్చు.
(సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు, శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment