29.12.2022 గురువారమ్
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఓమ్ శ్రీ గణేశాయనమః
శ్రీ మాత్రేనమః
ఓమ్ శ్రీ సాయినాధాయనమః
శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే
శ్రీ సాయి సత్ చరిత్ర –8 వ.భాగమ్
ప్రేరణ ; గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు
ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి
ఆలయమ్
సమన్వయ కర్త ; ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట్, హైదరాబాద్
ఫోన్. 9440375411
& 8143626744వ.
శీమద్భగవద్గీత – అధ్యాయమ్ 4 శ్లోకమ్ 5
జ్ణాన – కర్మ – సన్న్యాస యోగము
( 7వ.భాగమ్ లో ముందుగా 5 వ.శ్లోకానికి వివరణ ఇవ్వడానికి బదులు పొరబాటున 34 వ. శ్లోకానికి
వివరణ ఇచ్చాను. ఇప్పుడు 5 వ.శ్లోకానికి వివరణ)
బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున
తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్ధ పరంతప
శ్రీ భగవానుడు తెలిపెను. ఓ పరంతపా ! అర్జునా ! నాకును నీకును పెక్కు జన్మలు
గతించినవి. కాని, వాటిని అన్నింటిని నేను ఎఱుంగుదును. నేవెఱుగవు.
పైన చెప్పిన శ్లోకానికి సంబంధించి శ్రీ
సాయి సత్ చరిత్రలోని ఘట్టాలను గమనించండి.
శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్ –
36
ఒకనాడు శ్యామా మధ్యాహ్న భోజనానంతరము. బాబా చేతులు తువాలుతో తుడుచుచుండగా బాబా, శ్యామా బుగ్గను గిల్లెను.
శ్యామా కోపగించి, “దేవా! నా బుగ్గను గిల్లుట నీకు
తగునా? మా బుగ్గలు గిల్లునట్టి పెంకి దేవుడు
మాకక్కరలేదు. మేము నీపై ఆధారపడి యున్నామా? ఇదియేనా మన సాన్నిహిత్య ఫలితము?” అనెను. బాబా ఇట్లనెను. “శ్యామా! 72 జన్మలనుంచి నీవు నాతోనున్నప్పటికి నేను
నిన్ను గిల్లలేదు. ఇన్నాళ్ళకు గిల్లగా నీకు
కోపము వచ్చుచున్నది.”
ఇక్కడ విషయాన్ని గమనించండి. బాబాకు శ్యామాతో 72 జన్మలు గతించాయి. కాని శ్యామా ఆవిషయము ఎఱుగడు.
శ్రీ సాయి సత్ చరిత్ర - అధ్యాయమ్ – 50
బాలారామ్ దురంధర్ – (1875 – 1925)
(టూకీగా వివరిస్తున్నాను)
బొంబాయికి చెందిన శాంతాక్రజ్ లో పఠారేప్రభు
జాతికి చెందిన బాలారాం దురంధర్ అనువారుండిరి.
వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది.
దురంధర్ కుటుంబములోనివారందరు భక్తులు, పవిత్రులు, భగవచ్చింతన కలవారు. బాలారామ్ తన సోదరులు సాయిబాబా గురించి చెప్పగానే
అందరు కలిసి సాయిబాబా దర్శనము చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. వారు షిరిడీకి రాకమునుపే బాబా, “ఈ రోజు నా దర్బారు
జనులు వచ్చుచున్నారు” అన్నారు. దురంధర సోదరులు
తమ రాకను బాబాకు తెలియచేయనప్పటికీ, బాబా పలికిన పలుకులు ఇతరులవలన విని విస్మయమందారు. తక్కినవారందరు బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారితో
మాట్లాడుచు కూర్చొనియుండిరి. బాబా వారితో నిట్లనెను, “వీరే నా దర్బారు జనులు. ఇంతకుముందు వీరి రాకయే మీకు చెప్పియుంటిని. బాబా దురంధర సోదరులతో నిట్లనెను. “గత 60 తరములనుండి మనమొండురలము పరిచయము గలవారము.”
ఇక్కడ కూడా బాబాకు దురంధర సోదరులకు
60 తరములు గతించాయి. బాబాకు తెలుసు. కాని దురంధర సోదరులకు తెలియదు.
(సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు, శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment