Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, April 15, 2011

ఊదీ మహాత్మ్యము

1 comments Posted by tyagaraju on 6:58 AM
15.04.2011 శుక్రవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
కంప్యూటరు ప్రోబ్లెం వల్ల బాబా ఫొటొను, గులాబీని ఇవ్వలేకపోతున్నాను.



ఇంతకు ముందు మనము ఊదీ గురించి లీలలను తెలుసుకున్నాము. ఈ రోజు ఊదీ గురించి మరికొంత సమాచారాన్ని తెలుసుకుందాము. ఊదీ సర్వరోగ నివారిణి అని మనకు తెలుసు. మనకు బాథ ఉన్నచొట బాబా ఊదీని రాసుకుంటే చాలు బాథ నివారణ అవుతుంది. ఇది నమ్మకం ఉన్నవాళ్ళందరూ చేస్తూ ఉన్నారు.

ఒకవేళ అవతలి వ్యక్తికి బాబా మీద నమ్మకం ఉండకపోవచ్చు, లేదా బాబాని పూజించకపోవచ్చు.
అటువంటి సందర్భాలలో నేను చేసేది, ఈ విథంగా ఉంటుంది. అవతలి వ్యక్తికి శరీరంలో యేప్రాతంలో బాథ ఉందో, ఆప్రదేశంలో నేను, నాశరీరంలో ఆప్రాంతాన్ని తాకి, ఈ నా శరీర భాగము ఫలానా వ్యక్తియొక్క శరీర భాగముతో సమానము. బాబా ఊదీ మహత్యంతో బాథ నివారణ అయినది అనుకుటూ రాసుకుంటాను.

బాబా మీద నమ్మకంతొ ఉన్న వ్యక్తులకైనా సరే, నమ్మకము లేనివారయినా సరే వారికి ఊదీ అందుబాటులో లేని సమయాలలోను, వారు వేరే ప్రదేశములో ఉన్నా, విదేశములలో ఉన్నా, ఈ విథంగా మనము బాబా ఊదీని రాసుకుని నివారించమని ప్రార్థించవచ్చు.

**************************************************************************************



ఇక ఈరోజు నెల్లూరు నుంచి సుకన్య గారు సేకరించి పంపిన ఊదీ గురించి తెలుసుకుందాము.

ఊదీ మహాత్మ్యము

కష్టాలలో ఉన్నప్పుడు మన మనస్సు కూడా బలహీన పడుతుంది. భాబా మీద లేక నువ్వు నమ్మిన గురువుమీద కనక అమితమైన విశ్వాసముంటే నీమనస్సుకు శక్తి వస్తుంది. నీ దగ్గరి వారు కనక అనారోగ్యంతో ఉన్నప్పుడు ఈ క్రింద చెప్పినవాటిని ఆచరించడానికి మొహమాట పడవద్దు, సిగ్గు పడవద్దు.

1. ఊదీని నీటిలో కలుపుట:

ఊదీని నుదిటిమీద రాయండి. శరీరంలో యేప్రాంతములో బాథ ఉంటే అక్కడ ఊదీని రాయండి. నీటిలో ఈ పవిత్రమైన ఊదీని కలిపి ఇవ్వండి. ఊదీ అత్యంత శక్తివంతమైన రోగ నివారిణి. బాబా గారు జీవించి ఉన్నప్పుడు, ఆయన లక్షలమందికి ఊదీ ద్వారా నయం చేశారు. ఇప్పుడు కూడా యెంతోమంది ఊదీ మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఫలితాన్ని పొందుతున్నారు. మీరు సరాసరి షిరిడీ నించి గాని, దగ్గిరలో నున్న బాబా గుడినుంచి గాని ఊదీని పొందవచ్చు. ఊదీని నీటిలో కలిపి సేవించినవారికి బాబాగారు యెన్నో అథ్భుతాలు చేశారు.

2.నీటి పై, తన కరుణాదృక్కులు సారించమని బాబాని ప్రార్థించండి.

మీరు విదేశాల్లో ఉండి ఊదీ దొరకని సందర్భాలలో, దానికి ప్రతిగా, మీకు దగ్గరిగా ఉన్నవారితో ఒక గ్లాసు నిండా నీటిని పట్టుకొనమని చెప్పండి. ఆ నీటిని తన కరుణా దృక్కులతో పవిత్రం చేయమని బాబాను మనస్పూర్తిగా వేడుకొని, ఆనీటిని రోగి చేత త్రాగించండి. బాబా ఫొటో ముందు గ్లాసులో నీరు ఉంచి, ఆయన పవిత్రం చేసినట్టుగా భావించి, ఆనీటిని త్రాగండి. యెప్పుడైనా యెవరికైనా గాని మందులు ఇచ్చేటప్పుడు,వాటిని బాబా పాదాల వద్ద ఉంచి ఇవ్వండి.

3. బాబా మందిరాన్ని దర్శించండి, దీపాలను వెలిగించండి, యింటివద్ద ప్రార్థించండి.

దగ్గిరలోఉన్న బాబా మందిరాన్ని దర్శించి, దీపాలను వెలిగించండి. మీ శక్త్యానుసారం అన్నదానం చేసి ప్రసాదాన్ని, అనారోగ్యంతో ఉన్నవారికి ఇవ్వండి.
ఒకవేళ దగ్గిరలో బాబా మందిరము యేమీలేకపోతే, మీ ఇంటిలోనే బాబా విగ్రహము ముందుగాని, ఫోటో ముందుగాని, దీపాలను వెలిగించి, పండ్లు నైవేద్యముగా సమర్పించి, ఆ ప్రసాదాన్ని ఇవ్వండి.

4. వైద్యము చేయవలసినవారివద్ద సచ్చరిత్రను ఉంచండి.

మీరు యెక్కడ ఉన్నా సరే, అనారోగ్యంతో ఉన్నవారికి సచ్చరిత్రనివ్వండి. పుస్తకము దొరకని సందర్భాలలో ఆన్ లైనులో ప్రింట్ తీసి ఇవ్వవచ్చును.
(సచ్చరిత్ర దొరకకపోవడం ఉండదేమో అనుకుంటున్నాను)
వారికి చదవడం రాకపోయినా సరే, సచ్చరిత్ర దగ్గర ఉంటే చాలు. బాబా గారు దగ్గిరున్నట్లే. బాబాకి తెలుసు యెవరిని రప్పించాలో వారిని రప్పించి చరిత్ర చదివిస్తారు, అనారోగ్యంతో ఉన్న వ్యక్తి చేత కూడా చదివిస్తారు.

5. బాబా లీలలు, కథలు, సంఘటనల గురించి చెప్పండి.

షిరిడి సాయిబాబా శక్తి గురించి యెల్లప్పుడూ అనుకూలంగానే మాట్లాడండి. వీలయితే, మీ స్నేహితులు, బంథువులు వారికి జరిగిన బాబా అనుభూతులు, లీలలు, లేక మీరు చదివిన బాబా లీలలు, లేక సచ్చరిత్రలోని సంఘటనల గురించి చెప్పండి. బాబా గారు సహాయం చేసి రోగాలను యెలా తగ్గించారో చెప్పండి. బాబాగారు యేవిథమైన మాయలు, మంత్రాలు, చేయలేదని చెప్పండి. నివారణా శక్తి వారి మనసులోనే ఉందని చెప్పండి, యెందుకంటే బాబా గారు, అంతర్వాసిని, అనగా మన మనసులోనే ఉన్నారు. వారి మనసు కనక యెల్లప్పుడు సాయి ఆలోచనలతోనే నిండిఉండి, యెల్లప్పుడు, సాయినామాన్నే స్మరిస్తూ, సాయీ, సాయీ, సాయీ, అని సహాయాన్ని అర్థిస్తే ఆయన తప్పకుండా బాబా గారు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు. ఇంతే కాకుండా అనారోగ్యంతో ఉన్న వ్యక్తితో ఓర్పుతోనూ, సహనంతోనూ ఉండమని చెప్పండి, బాబా యేదోఒకరోజున సహాయము చేస్తారని చెప్పండి.


6. "సాయిరాం" మంత్రమును లేక యేమంత్రమైనా జపించుట.

యెల్లవేళలా సాయి మంత్రాన్ని జపిస్తూన్న చాలా మంది భక్తులు, బాబా ఉనికిని, ఆయన లీలలను అనుభవించారు. గంటలతరబడి, సాయి నామాన్ని జపిస్తూ ఉండండి. లేకపోతే మీకు యెప్పుడు, మీ మనసుకు బాబాగారు తలపులోకి వస్తారో అప్పుడు ఆయన నామాన్ని జపిస్తూ ఉండండి. మీరు చేసే నామ స్మరణ, ఇలా ఉండవచ్చు. "సాయిరాం" "ఓం శ్రీ సాయిరాం" "షిరిడీ సాయి ద్వారకామాయి"
"ఓంసాయి శ్రీ సాయి జయజయ సాయి"

7. బాబా గారు జీవించి ఉన్నప్పుడు 7 రోజులపాటు యేకథాటిగా నామ సప్తాహాన్ని ప్రోత్సహిచేవారు.

మనం కనీసం ప్రతిరోజు ఒక్కసారయినా చేయాలి. వైద్యం తీసుకుంటున్న వ్యక్తి కనక సాయి సాయి సాయి అని గుర్తు చేసుకుంటూఉంటే దుష్టశక్తులు ప్రవేశించవు.
ఆ వ్యక్తి కనక క్లిష్ట పరిస్తితిలో ఉంటే వారి తరఫున మనము చేయవచ్చు. మనకు ఇష్టమైన దేవుని మంత్రాన్ని జపించవచ్చు. యిక్కడ లార్డ్ హనుమాన్ మంత్రాన్ని జపిస్తే ఆయన దీవెనలు మనోశక్తిని నిబ్బరాన్ని ఇస్తుంది.

లార్డ్ థన్వంతరి ఆలయాన్ని దర్శించడానికి ప్రయత్నించండి. ఆయన ఆశీర్వాదము ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. వైదీశ్వరుని దర్శించుకోండి, ఆయన రోగాలను నయం చేస్తాడు. వీరికి సంబంథించిన మంత్రాలను కూడా ప్రతీరోజు చదువుకోవచ్చును.

8. షిరిడీ సాయిబాబా పాటలు, హారతులు వినండి.

అనారోగ్యంతో ఉన్న వ్యక్తి యింటిలో కనక ఉంటే హారతులు వినమని చెప్పండి, లేక సీ.డీ ఉంటే పెట్టుకుని చూడమని చెప్పండి. దీని వల్ల మన యింటిలో అనుకూల వాతావరణమేర్పడుతుంది. ఆయన అనుగ్రహ తరంగాలు యింటిలో వ్యాపిస్తాయి. చాలా శక్తివంతమైనవి.

9. మానవ సేవకి సంబంథించిన పనిలో నిమగ్నం కండి.

సాథ్యమయితే, బీదవారికి అన్నదానం చేయడం, బట్టలు, రగ్గులు అనాథశరణాలయాలలో పంచడం మొదలైన కార్యక్రమాలు చేయండి. మీరు పంచినవాటిని వారు సక్రమంగా వినియోగిస్తున్నారో లేదో గమనించండి. యెక్కువగా నిథులను పొందే సంస్థలని మినహాయించండి.
పాత్ర దానం చేయాలి. అపాత్ర దానం కూడదు. దానము చేసేటప్పుడు "సాయిరాం" అని దానము చేయండి. బాబా కోరుకునేదిదే. సాయి పేరుతో చేసే దానం శక్తివంతమైనది. దానాలు చేయడం వల్ల పూర్వజన్మ కర్మలు నశిస్తాయి. మనకు తోచినంతలోనే దానం చేయాలి. అంతేగాని ఒక్కసారిగా విపరీతంగా ఖర్చు చేసి దానం చేయనక్కరలేదు.
9. నువ్వు మన్స్పూర్తిగా చేసే ప్రార్థన బాబాకి యిష్టం.

కొంతమంది గుడిలో ప్రార్థన చేసేటప్పుడు, యితర సమస్యల గురించి ఆలోచించడం, యింకా తమని గమనించే వ్యక్తులమీద దృష్టి పెడతారు. నువ్వు నమస్కారం చేస్తున్నప్పుడు గాని, సాయి కి నీకు మథ్య అడ్డు తెర అనేది ఉండకూడదు. నీతనువంతా సాయికి అర్పించి నమస్కారం చేయి. సాష్టాంగ నమస్కారం చేయి, సాయి ఇష్ట పడతారు. సాయి ముందు ప్రయత్న పూర్వకంగా యేడవవద్దు. కాని అనుకోకుండా దుఖము గాని యేడుపుగాని వస్తే సిగ్గుపడద్దు. ఒక్కొక్కసారి సాయి మన పూర్వజన్మల పాపాలని కడిగివేయడానికి మన కన్నీటిని ఉపయోగిస్తారు.

నేను చాలా రోజులు బాబాఫోటోను కౌగలించుకుని చిన్నపిల్లవాడిలా యేడిచాను. నేనప్పుడు కొన్ని భరింపశక్యము కాని బాథలలో ఉన్నాను. నాకు తెలుసు బాబాయే నన్నలా చేయించారు. నువ్వు బాబా ఫోటోని గాని, విగ్రహాన్ని కాని చూస్తున్నప్పుడు బాబాని గుర్తు చేసుకోండి. మీరు కళ్ళు మూసుకున్నప్పుడు బాబా ద్వారకామాయిలో థుని ముందు కూర్చుని నిన్ను దీవిస్తున్నట్లుగా భావించుకోండి. బాబా మీతో మాట్లాడతారు, నేను హామీనిస్తున్నాను.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Thursday, April 14, 2011

బాబా 7 గురువారముల వ్రతము - బ్రెస్ట్ కాన్సర్ నివారణ

0 comments Posted by tyagaraju on 4:55 AM




14.04.2011 గురువారము

బాబా 7 గురువారముల వ్రతము - బ్రెస్ట్ కాన్సర్ నివారణ

బాబా మీద సంపూర్ణమైన భక్తి, నమ్మకం, విశ్వాసము ఉండాలే కాని యాఎదీ కూడా అసాథ్యమనంది లేదు. ఈ రోజు ఈ బాబా లెలలో భక్తితో చేసిన బబ 7 గురువారముల వ్రతన్ని యెంతో నమ్మకంతో ఆచరించగానే ఒకామెకు బ్రెస్ట్ కానసరు యెలా నివారణ అయిందో తెలుసుకుందాము.

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

ఈ రోజు మనము విశాఖపట్నమునుంచి శ్రీమతి నౌడూరు శారద గారు చెప్పిన బాబా లీలను తెలుసుకుందాము. బాబా మీద అచంచలమైన విశ్వాసము, నమ్మకము ఉండాలే గాని యేదీ అసాథ్యం కాదు అనే విషయం మనకు ఈ లీల చదువుతే తెలుస్తుంది.

శ్రీమతి శారద గారు విశాఖపట్నంలో టీచరుగా పని చేస్తున్నారు. ఆవిడ సహాథ్యాయి గారి అక్కగారు పోర్ట్ లో పనిచేస్తారట. ఆవిడకి బ్రెస్ట్ కాన్సర్. వారి అబ్బాయిలు బొంబాయిలో నావీలో పనిచేస్తూ ఉంటారు. ఈ మెను బొంబాయిలో ఆస్పత్రిలో వైద్యం చేయించారట. ఆపరేషన్ అయింది గాని, ఇంక కాన్సర్ కి సంబంథించిన లక్షణాలు ఉండిపోయి, ఇంక వైద్యానికి సహకరించడం లేని పరిస్థితుల్లో, అప్పుడప్పుడు జ్వరం రావడం జరుగుతూ ఉండేదిట. డాక్టర్లు కూడా ఇంక తామేమీ చేయలేమని, ఆఖరి దశలో ఉందని చెప్పారు. ఇలా ఉండగా, శారద గారు, సాయి వ్రతం చేసుకుని, ఒక పుస్తకాన్ని బొట్టు పెట్టి తన సహాథ్యాయికి ఇచ్చారు.
ఆమె తాను ఈ వ్రతాన్ని తన అక్క కొఱకు తప్పకుండా చేస్తానని చెప్పారు. వ్రతం నాలుగు వారములు చేయడం జరిగింది. ఆ సమయంలో మరల ఈమె అక్కగారు వైద్య పరీక్షలు చేయించుకోగా, కాన్సరు లక్షణాలు కొంతవరకు తగ్గినట్లు కనపడిందిట. మొత్తం తొమ్మిది వారాలలో ఒకవారము తప్పినా, మరల పూర్తి చేయడం జరిగిందిట. ఇక బాబా లీల చూడండి. ఆమె యెంతో, నమ్మకంతో, శ్రథ్థతో చేసిన వ్రతం వృథా కాలేదు.

మరలా ఆమె అక్కగారు వైద్య పరీక్ష చేయించుకోగా, డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయే విథంగా ఆవిడకు, కాన్సరు లక్షణాలు పూర్తిగా తగ్గిపోయాయిట.

చూశారా, బాబా లీల యెటువంటిదో. తనని నమ్మి శ్రథ్థా భక్తులతో తనని కొలిచేవారిని ఆయనెప్పుడు, యెల్లవేళలా, ప్రతిక్షణం, కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటారు.


ఈ వ్రతము పుస్తకాన్ని హిందీ నుంచి విశాఖపట్నము వాస్తవ్యులైన శ్రీ బాబూరావు గారు తెలుగులోనికి అనువదించారు. వారి చిరునామా కూడా ఇక్కడ ఇస్తున్నాను.

శ్రీ కె.వీ.సీహెచ్. బాబూరావు

యింటి. నం. ఎల్.ఐ.జీ. బీ.22

మిథిలాపురి ఉడా కోలనీ

మథురవాడ

విశాఖపట్నం 41

ఫొన్: 0891 2781290

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Wednesday, April 13, 2011

శ్రీ సాయి నాథ దండకం

0 comments Posted by tyagaraju on 8:35 PM


14.04.2011 గురువారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులందరికి బాబావారి శుభాశీశ్శులు

ఈ రోజునుండి మరల మన బ్లాగు నూతనంగా ప్రారంభింపబడింది. మరలా మనం యథావిథిగా బాబా లీలలన్నీ ముచ్చటించుకుందాము. ఈ రోజు సాయినాథ దండకంతో ప్రారంభిద్దాము.

శ్రీ సాయి నాథ దండకం

శ్రీ సాయిబాబా ! దయాసాంద్ర! త్రిమూర్త్యాత్మకా ! శ్రీ దత్త, శివ, రామకృష్ణ, మారుత్యాది దివ్యావతార స్వరూప! ఈ థరిత్రిన్ భక్తులన్ రక్షింప లీలతో దేహమున్ దాల్చి, నీ పూజలన్, నీ సేవలన్, నీనామ సంకీర్తలన్ జేయు భక్తాళికిన్, భక్తియున్, భుక్తియున్, ముక్తియున్ గూర్చి యాపత్తులన్ బాపి, యోగంబు క్షేమంబు జేకూర్చి రక్షించు దివ్య స్వభావా! నమస్కారమర్పింతు , లోకంబులో జాతి భేదాలు గల్పించుకొన్నట్టివేగాని సత్యంబుగా లేవు లేవంచు భక్తాళికిన్ విశ్వప్రేమంబు జాటు చందంబునన్ పత్రి గ్రామంబులో విప్ర గేహంబులో జన్మమున్ గాంచి బాలుండవై యుండ, నీ తల్లితండ్రుల్ ఫకీరొక్కనిన్ గాంచి నిన్నిచ్చివేయంగ అయిదేడు లా సాథు పోష్యంబులోనుండి యా పిమ్మట వెంకుసా పేరుతో నొప్పు నా దేశ ముఖ్యుండు గోపాలరాయుండు నిన్ చెంతకు జేర్చి సద్భోథనల్ జేసి జ్ఞానోపదేశంబు గావించి, నిన్నంపి వేయంగ నీ సంగతులీదేశమందెవ్వరున్ గాంచకుండ సంచారమున్ జేసి యష్టా దశాబ్దంబులున్ బ్రాయమొప్పారగా పూర్వపుణ్యంబు పక్వంబుగా నొప్పు గోదావరి తీర ప్రాతంబులోనున్న షిరిడీ యను గ్రామంబునన్ జొచ్చి యచ్చోటనున్నట్టి యావేపవృక్షంబు క్రిందన్ మహా ప్రీతితోనిల్చి, నీవచటన్ క్రిందకూర్చున్న, యా కొమ్మకున్ చాలా మాథుర్య యుక్తంబులౌ యాకులం గూర్చి, యా చెంతనున్ పాడుబట్టట్టిచోటన్ మసీదొక్కటిన్ గాంచి, యచ్చోటనే సుస్థిరం బై, నివాసంబుజేయంగ కాంక్షించి యద్దానికిన్ ద్వారకామాయి నామంబు గల్పించి, నీ చెంతకున్ కర్మశేవంబుతో జేరు నాశక్యంబైనా? యాకాశభాగంబునన్ పక్షి బృందంబు పైపైకి తాబోవునేగాని యంతంబు మంగాచగానోపునే! యట్లు నీ దివ్యమౌ వైభవంబులెల్ల నెన్నంగ నేరీతి వీలౌను? ప్రాపంచికార్థంబులన్ గోరునవ్వారికింగొప్ప ఉద్యోగముల్, ద్రవ్యలాభంబులున్, సత్సంతానమున్, జేకూర్చుచున్, కొందరిన్ సర్వలోకాథినాథుండు సర్వేశ్వరుడైన యా దేవునిపై భక్తి భావంబు సూచింపుచున్, కొందరిన్ ముక్తిమార్గంబు కాంక్షించు మర్త్యావళికిన్ జేరి దృశ్యంబు నిశ్యంబు జీవేశ్వరుల్ వేరు గారంచు నాత్మానుసంథానుభావంబు బోథించుచున్, కొందరున్ బ్రోచి పంచప్రదేశంబులన్ దెచ్చుకొన్నట్టి భిక్షాన్నమున్ దినుచు, రోజంతయు పుష్కలంబైనట్టి ద్రవ్యంబుతోడన్ మహావైభవోపేతుడై యుండి, సాయంత్రమౌవేళకున్, సర్వమున్, సాథులోకాళికిన్ ఖర్చు గావించి పూర్వంబురీతిన్ ఫకీరై మదిన్ భేదభావంబు లేకుండగా నందరిన్ జేర్చి, నీ పైన భారంబు సర్వంబునున్ వైచి సద్గురుడంచు నినే సదా నమ్మి సేవించు జీవాళి కార్యంబులెల్లన్ సానుకూలంబుగా దీర్చుచున్ కొంగుబంగారమై వారి రక్షించి సద్భక్త చింతామణీ! నేడు నీ దివ్య పాదాబ్జముల్ గాక, గత్యంతరంబేమీ లేదంచు, నీవే శరణ్యంబంచు నీ చెంతకున్ జేరు మమ్మెల్లరున్ కాపాడుతూ దీనబంథూ, మహాదేవ! దయాసింథు! శ్రీ సాయినాథా! నమస్తే నమస్తే నమహ!
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List