Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, April 25, 2020

శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు - బాబా సమాధానాలు - 2 వ.భాగమ్

1 comments Posted by tyagaraju on 12:15 AM
      vedas Archives - Page 11 of 42 - Sagar World

          Single Yellow Rose Flower Isolated On White Stock Photo, Picture ...

25.04.2020  శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులందరికి బాబావారి శుభాశీస్సులు

ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, దైదరాబాద్  ఫోన్.  9440375411  &  8143626744
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com


నా సందేహాలు – బాబా సమాధానాలు - 1  సాయి భక్తుల స్పందన
శ్రీమతి కృష్ణవేణి, చెన్నై – చాలా మంచిప్రశ్న వేశారు.  అగ్గిపుల్లలను బాబాగారు అలా ఎందుకు చేసారో ఇప్పుడు మీద్వారా మేము కూడా తెలుసుకోగలిగాము. బాబాగారి ప్రతి చర్యలోను ఏదోఒక అర్ధమ్ ఉంటుంది అని అర్ధమయింది.
శ్రీ యఱ్ఱాప్రగడ ప్రసాద్ గారు, రాజమహేంద్రవరమ్ –
సుస్పష్టం గా... అత్యంత విశ్వాసం తో శ్రీ సాయి ఉండేవారు అని కాక.... ఉన్నారన్న భావంతో..
ఆయనతో భక్తి కంటే బాంధవ్యం పెంచుకున్నారు కాబట్టే ఒక్కోచోట ఒక్కో లా వచ్చింది. రిఫరెన్స్ లను ప్రోదిచేసి ప్రశ్న తానే అడిగించుకుని, సమాధానమూ తానే తెలిపి...
అన్నింటా తననే దర్శింపచేస్తున్న శ్రీ సాయి కి.. అందుకు ఆయన దగ్గర యోగ్యత పొందిన మీరు అదృష్టవంతులు..
*అన్వేషణ ఉంటేనే అంతరాత్మ అగుపిస్తాడు*

కేవలం సాయి చరిత్ర పరిచయము ఉన్న చాలామందికి అనుభూతి లేకపోవడానికి నాకు తెలిసిన కారణం...
*చరిత ను చదవడం కాదు..*
*పారాయణం చేయాలి* శ్రద్ద సబూరి అర్ధం అదే.
అలా పారాయణ చేస్తేనే కొద్దిగా కన్ఫ్యూషన్ గా కనిపిస్తూ అంతర్లీనంగ మనలో ఆయన చేరి ఆయన కధని మనకు ఆయనే వివరిస్తారు.. (మీ అనుభవం లా )...
కావలసిందల్లా శ్రద్ద సబూరి.. అమ్మయ్య వారంలో చదివేశా అనే ఒక పుస్తకం  కాదు వారం సాయితో గడపడం.. తెలిసే కాదు తెలియకుండా కూడా మనకు ఎన్నో మహిమలు జరుగుతాయి.
ప్రత్యక్షం గా కావాలంటే...

సాయి ఇంట్లో నే కాదు ఒంట్లో, ఉండాలి

Thursday, April 23, 2020

శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు - బాబా సమాధానాలు - 1

0 comments Posted by tyagaraju on 10:54 PM

        Today's Darshan Shri Shirdi Saibaba Temple, Maharashtra
            Pink Roses Hd Wallpapers - Beautiful Pink Rose Hd, Hd Wallpapers ...

24.04.2020  శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులందరికి బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన
సందేహాలు -  బాబా సమాధానాలు - 1
(ఈ సందేహాలు సమాధానాలను ఎవరైనా తమ స్వంత బ్లాగులో 

ప్రచురించుకోదలచినట్లయితే ముందుగా నాకు సమాచారం ఇవ్వవలసినదిగా

 నా మనవి)

ఆత్రేయపురపు త్యాగరాజు 
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్  ..  9440375411 & 8143626744
మైల్  ఐ.డి. tyagaraju.a@gmail.com

శ్రీ సాయి సత్ చరిత్రను పారాయణ చేసే సమయంలో నాకు కొన్ని సందేహాలు కలిగాయి.  ఆ సందేహాలకు సమాధానాలు బాబా తప్ప ఇంకెవరూ ఇవ్వలేరని నేను భావించాను.  మొట్టమొదటగా నాకు ఒక సందేహం కలిగింది.  ఆ తరువాత బాబాను రెండవ సందేహాన్ని నివృత్తి చేయమని అడిగాను.  అడగడానికి ముందు మనసులో బాబాని ఇలా ప్రశ్నించాను.  

శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు 3వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 5:08 AM
  Sai Baba of Shirdi - Wikipedia
               Single Red Rose PNG HD | PNG Mart

23.04.2020  గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు

శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు 3వ.భాగమ్

26.01.2020  --  ప్రేమ వివాహాలు

నేటి యువత ప్రేమల పేరిట కులాంతర వివాహాలుమతాంతర వివాహాలు చేసుకొని తమ జీవితాలను నాశనము చేసుకొనుచున్నారు.  ఇది నాకు చాలా బాధ కలిగించుచున్నది.
నా సలహా ఏమిటంటే తమతమ సాంప్రదాయాలలో పెద్దల అనుమతితో వివాహాలు చేసుకుని సుఖవంతమయిన జీవితాన్ని గడపండి.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List