25.03.2016 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి
జయజయ సాయి
సాయి బంధువులకు
బాబావారి శుభాశీస్సులు
సాయి భక్తులందరూ
ప్రతిరోజు శ్రీ సాయి సత్ చరిత్రను పారాయణ చేస్తూ ఉంటారు. కొంతమంది సప్తాహం చేస్తే మరికొందరు రోజుకొక అధ్యాయం
పారాయణ చేయడం చేస్తూ ఉంటారు. కొందరికి సమయం
లేక ఒక పేజీ గాని, కొన్ని పేరాలు గాని ప్రతిరోజూ చదువుతూ ఉంటారు. మరికొందరికి అసలు సమయమే కుదరకపోవచ్చు. వారు మనసులోనే
సాయినామ జపం చేసుకుంటు ఉండచ్చు. అందుచేత సాయినామాన్ని
నిరంతరం జపిస్తూ ఆయననే గుర్తుంచుకునే సాయి భక్తులందరూ సమానమే. ముఖ్యంగా కావలసినది ధృఢమయిన భక్తి.
మరిచిపోయిన నగలను ఇప్పించిన బాబా….
ఈ రోజు చెన్నై
నుండి శ్రీమతి కృష్ణవేణి గారు పంపించిన అనుభవం, బ్లాగు పరిచయం ఏ విధంగా జరిగిందీ అనేదాని
గురించి పంపించారు. ఆవిడకి సత్ చరిత్ర పారాయణ
చేయడానికి సమయం కుదర లేదని బాధ పడినప్పుడు బాబావారు ఆమెకు బ్లాగులో తన లీలను చదివే
అవకాశాన్ని కల్పించారు. బ్లాగులో ప్రచురించేవన్నీ
బాబా కు సంబంధించిన లీలలే కనక అవి కూడా పారాయణతో సమానమే.