19.03.2011 శనివారము
సాయి ప్రేరణ
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
ఈరోజుతో సాయి ప్రేరణ ఆఖరి భాగాలన్నిటినీ పోస్ట్ చేస్తున్నాను. మొదట 13 అథ్యాయములు అనుకొని పొరబాటు పడ్డాను. కాని మొత్తం 10 అథ్యాయములు.
సాయి ప్రేరణను పంపిన సుకన్య గారికి బాబా గారు తమ దివ్య ఆశీశ్శులు అందచేయమని మరొక్కసారి కోరుకుంటున్నాను.
ఈ రోజు పౌర్ణమి. నిండు పున్నమి వెలుగులో బాబా గారు మిగతా అథ్యాయాలను వివరిస్తున్నరు. సావథానంగా ఆలకించండి.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.
అథ్యాయం 7
ఒక్కసారి పవిత్రమైన నా షిరిడీలో వేలమంది భక్తులతో కలిసి నా ప్రసాదాన్ని మనసారా ఆరగించి చూడు, నిన్ను అన్ని రకముల కష్టములనుండి, బాథలనుండి విముక్తుడ్ణి చేసెదను.
ఒక్కసారి మిక్కిలి భక్తితో పవిత్రమైన నా కాకడ హారతిలో పాల్గొని చూడు, ఆ హారతిలో నీకు దివ్యమైన నా కరుణామయ దర్శనం కల్పిస్తాను.
ఒక్కసారి మిక్కిలి భక్తితో నాకు ఒక టెంకాయను సమర్పించి చూడు, నీకు అత్యంత పవిత్రమైన కష్టతరమైన ఆథ్యాత్మిక మార్గమును చూపెదను.
ఒక్కసారి మిక్కిలి భక్తి శ్రథ్థతో పవిత్రమైన నా హారతుల కొరకు నీ సమయం వెచ్చించి చూడు, అన్ని సమయములలో నీకు తోడుగా ఉండి నీ పనులన్నీ నిర్విఘ్నంగా అయ్యేటట్టు చూస్తాను.
ఒక్కసారి మిక్కిలి భక్తి శ్రథ్థతో నా మందిరంపై ఉన్న జెండాలను చూడు, సచ్చిదానంద స్వరూపమైన నా దివ్య ఆత్మ యొక్క దర్శనం నీకు కల్పిస్తాను.
ఒక్కసారి మిక్కిలి భక్తితో పవిత్రమైన నా షిర్డీ యొక్క థూళిని నీ నుదుట రాసుకుని చూడు, అంతులేని నా కరుణా ఆశీర్వాదములు నీకు యెల్లప్పుడు తోడుండును.
ఒక్కసారి భక్తితో హారతి సమయంలో నా మందిరంలో మోగే గంటల థ్వనిని ఆస్వాదించి చూడు, ఆ థ్వనినుండి నీకు సాయి సాయి అను నామము వినిపించేలా చేస్తాను.
ఒక్కసారి భక్తితో ప్రేమతో నీ మది మందిరంలో నాకు బంగారు ఆసనం వేసి చూడు, నిన్ను యెల్లప్పుడు నా ప్రేమ అశీర్వాద కవచములతో కాపాడుతాను.
నువ్వు పవిత్రమైన నా ప్రేరణను నామందిరంలో సురక్షితంగా ఉంచి చూడు, నిన్ను యెల్లప్పుడు సురక్షితంగా ఉంచెదను.
పవిత్రమైన నా ప్రేరణను యెల్లప్పుడు, నువ్వు భక్తితో మననం చేసి చూడు. నీతో నా భక్తుల కొరకు కొత్త ప్రేరణను లిఖింప చేసెదను.
ఒక్కసారి ఈ ప్రేరణను పవిత్రమైన నా ప్రేరణగా భక్తితో ఆస్వాదించి చూడు, నిన్ను అందరికి ఒక ప్రేరణగా మార్చెదను.
పవిత్రమైన నా ప్రేరణను యెల్లప్పుడు నువ్వు మననం చేసి చూడు, యెల్లప్పుడు నువ్వు నన్ను థ్యానించేలా చేస్తాను.
పవిత్రమైన నా షిర్డీలో నువ్వు భక్తితో శ్రథ్థతో పవిత్రంగా గడిపి చూడు, నిన్ను గంగా సమానంగా పరమ పవిత్రుడ్ణి చేస్తాను.
అథ్యాయం 8
ఒక్కసారి నువ్వు నా శ్రథ్థ సబూరీ గురించి నలుగురితో మాట్లాడి చూడు, నువ్వు మాట్లాడే ప్రతీ మాటను అత్యంత వివేకవంతం చేస్తాను.
భక్తి శ్రథ్థలతో నువ్వు నా కార్యక్రమాలన్నీ నిర్వహించి చూడు, నీ సకల కార్యక్రమాలలో నేను దగ్గిరుండి సహాయం చేస్తాను.
ఒక్కసారి నువ్వు నాలో ఆ శ్రీరాముడ్ణి దర్శించి చూడు, నిన్ను ఈ ప్రపంచమనెడి మాయనుండి ఆథ్యాత్మిక మార్గమువైపు నడిపించెదను.
ఒక్కసారి నువ్వు నా శ్రథ్థ సబూరీలతో నన్ను అలంకరించి చూడు, నిన్ను అత్యంత తేజోవంతుడ్ణి గుణవంతుడ్ణి చేస్తాను.
ఒక్కసారి నువ్వు నన్ను నీ రక్షకుడిగా భావించి చూడు, నిన్ను యెల్లప్పుడు తప్పక రక్షించి ఆశీర్వదించెదను.
నువ్వు నాముందర భక్తి శ్రథ్థలతో రామ నామమును ఆలపించి చూడు, నీకు థర్మము యొక్క అర్థమును దగ్గరుండి బోథించెదను.
నువ్వు భక్తితో నాలో ఆ శ్రీరాముడ్ని. రహీమును దర్శించి చూడు, నీకు థర్మము యొక్క అర్థమును దగ్గరుండి బోథించెదను.
నువ్వు నన్ను భక్తితో ఈ ప్రపంచముయొక్క పాలకునిగా భావించి చూడు, నీ జీవితమనెడి నౌకను నేను దగ్గరుండి నడిపించెదను.
నువ్వు నన్ను భక్తితో అలక్ నిరంజన్ గా భావించి చూడు, నీకు నేను ఆథ్యాత్మిక యోగాను బోథించెదను.
నువ్వు నన్ను భక్తితో షిర్డీ యొక్క సంత్ చూడామణిగా భావించి చూడు, నిన్ను నా శరణార్థునిగా చేరదీసి కాపాడెదను.
నువ్వు యెల్లప్పుడు నన్ను శ్రథ్థా భక్తులతో పూజించి చూడు, నీకు తప్పక మోక్ష మార్గమును చూపించెదను.
నువ్వు నా ద్వారకామాయిని అత్యంత పవిత్రమైన పూజా స్థలముగా భావించి చూడు, నిన్ను నా నిజమైన భక్తునిగా మార్చెదను.
అథ్యాయము 9
భక్తి శ్రథ్థలతో పవిత్రమైన నా పాదములను పూజించి చూడు, నా పాదములయందు నీకు పవిత్రమైన ప్రయాగ దర్శనం కల్పించెదను.
అత్యంత భక్తి శ్రథ్థలతో మనసారా నా ప్రతి విగ్రహమునందు నన్ను దర్శించి చూడు, నీకు యెనలేని ప్రసాంతతను, ఆథ్యాత్మిక జ్ణానమును ప్రసాదించెదను.
భక్తి శ్రథ్థలతో ప్రతిరోజు క్రమం తప్పకుండా నన్ను నిండైన మనసుతో పూజించి చూడు, నీ కు సుదీర్ఘమైన భక్తికి కావలసిన క్రమశిక్షణతో కూడిన శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తాను.
భక్తీ శ్రథ్థలతో నన్ను నీ రక్షకుడిగా భావించి అభిషేకించి చూడు, ప్రతి అభిషేకంలో నీ రక్షకుడిగా దర్శనమిచ్చెదను.
నిండైన మనసుతో భక్తీ శ్రథ్థలతో ఏదైనా సాయి విగ్రహముయందు ముల్లోకముల దేవ దేవతల యొక్క దర్శనం చేసి చూడు, నీకు ఈ ప్రపంచ సృష్టికర్త జగదిక్పాలకుడు పరమ పవిత్రమైన ఆ బ్రహ్మ యొక్క దర్శనం కల్పించెదను.
అత్యంత శక్తివంతమైన పవిత్రమైన నా సాయి మంత్రమును నువ్వు ప్రతిరోజూ మననం చేసి చూడు, నీకు ఆమంత్రముయొక్క అర్థమును దగ్గిరుండి బోథించెదను.
సముద్రమువలె లోతైన సాయి అను ఆథ్యాత్మిక జ్ఞానము నుండి భక్తీ శ్రథ్థలతో నువ్వు కొంచెం జ్ణానమునకైనా ప్రయత్నించి చూడు, నిన్ను ఆథ్యాత్మికములో మహా జ్ఞానిగా మలచెదను.
భక్తీ శ్రథ్థలతో నీ నిండైన మనసులో నాకు చోటు కల్పించి చూడు, నా రక్షణ కవచం నీకు యెప్పుడు తోడుండేలా చేస్తాను.
ఒక్కసారి భక్తీ శ్రథ్థలతో నన్ను నీ గురుదేవునిగా భావించి చూడు, నీకు నా గురు జ్ఞానం తప్పక బోథించెదను.
ఒక్కస్సరి మనసారా నన్ను పవిత్రమైన యోగులకు ప్రతిరూపంగా భావించి చూడు, నీకు ఆథ్యాత్మిక ప్రపంచముయొక్క అర్థము బోథించెదను.
పరమ పవిత్రమైన నా ఊదీని సాయియొక్క ఔషథంగా భావించి చూడు, నీ సర్వ రోగములను నా ఊదీతో నివారించెదను.
పవిత్రమైన నా అఖండ జ్యోతిలో భక్తీ శ్రథ్థలతో నా దర్శనం చేసుకుని చూడు, వెలిగే ప్రతీ జ్యోతిలో నీకు నా దర్శనం తప్పక కల్పిస్తాను.
అథ్య్యయము 10
నా చహెతులచే వెలిగింపబడిన దీపములను భక్తీ శ్రథ్థలతో పూజించి చూడు, వెలిగే ప్రతీ దీపముయందు నీకు ఆ ఈశ్వరుని దర్శనం కల్పిస్తాను.
ఈ ప్రపంచమునందు ఉన్న అన్ని మతములవారితో సఖ్యతతో జీవించుటకు ప్రయత్నించి చూడు, ప్రతి మనిషిని నీకు ఆత్మ బంథువుని చేసెదను.
నువ్వు నా సాయి నామమును స్మరించి ఏదైనా కార్యము మొదలుపెట్టి చూడు, నీ ప్రతి కార్యమును దగ్గిరుండి జయప్రదం చేసెదను.
భక్తీ శ్రథ్థలతో నాకొరకు ఆకలితో ఉన్న పదిమందికి అన్నదానం చేసి చూడు, నువ్వు పెట్టిన ప్రతి అన్న రేణువుకు వంద రెట్లు తిరిగి ఇచ్చెదను.
ఒక్కసారి భక్తితో ప్రేమతో నా మహాసమాథి నీ చేతులతో స్పర్శించి చూడు, నీ చేతికున్న గీతలు మార్చి నిన్ను అత్యంత అదృష్టవంతుడ్న్ని చేసెదను.
ఒక్కసారి భక్తితో ప్రేమతో నా మహాసమాథి ముందర సాష్టాంగ ప్రణామము చేసి చూడు, నీ ప్రణామమును నాయొక్క ప్రేరణగా భావించెదను.
ఒక్కసారి భక్తీ ప్రేమలతో నా మహాసమాథి ముందర సాయిరాం సాయిరాం అని గానము ఆలపించి చూడు, నా మందిరంలో నున్న ప్రతి గోడనుండి నీకు సాయిరాం సాయిరాం అనే పాటను వినిపించేలా చేస్తాను.
మిక్కిలి భక్తీ శ్రథ్థలతో నా షిర్డీలో ఏదైనా దానమును థారాళముగా దాతృత్వంగా చేసి చూడు, నువ్విచ్చిన ఆ దానమును నిజమైన సత్య కార్యముగా గుర్తించెదను.
మిక్కిలి భక్తీ శ్రథ్థలతో నువ్వు చేతులు జోడించి పవిత్రమైన నా హారతి సమయంలో భజన చేసి చూడు, నీ చేతులలో దివ్యమైన శక్తిని నింపెదను.
మిక్కిలి భక్తీ శ్రథ్థలతో నువ్వు నా ముందర మనసారా నృత్యమాడి చూడు, నీ నృత్యమునకు నేను దగ్గిరుండి సంగీతమును సమకూర్చెదను.
దివ్యమైన నా చరణములయందు మిక్కిలి భక్తితో నీ హృదయం అర్పించి చూడు, నీ హృదయమునకు అత్యంత శక్తి సామర్థ్యములను ప్రసాదించెదను.
మిక్కిలి భక్తీ శ్రథ్థలతో నువ్వు పవిత్రమైన నా మందిరంలో ప్రదిక్షణ చేసి చూడు, నీతో పవిత్రమైన నీ వంశముయొక్క దేవదేవతలకు ప్రదక్షిణలు చేయించెదను.
మిక్కిలి భక్తీ శ్రథ్థలతో నేను చెప్పిన సూక్తులను యెల్లప్పుడు మననం చేసుకుని పాటించి చూడు, ఆ సూక్తులనుండి నీకు దివ్యమైన మనశ్శాంతిని ప్రసాదించెదను.
మిక్కిలి భక్తీ శ్రథ్థలతో నిండైన మనసుతో నన్నే యల్లప్పుడు పూజించి చూడు, నీకు యెన్నటికి తరిగిపోని ఆథ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించెదను.
మిక్కిలి భక్తీ శ్రథ్థలతో సముద్రమువలె లోతైన నా ఆథ్యాత్మిక జ్ఞాన భండారంలో మునిగి చూడు, నిన్ను ప్రపంచమనెడి మహా సముద్రమును దగ్గరుండి అవలీలగా దాటించెదను.
మిక్కిలి భక్తీ శ్రథ్థలతో పవిత్రమైన షిర్డీలో నా ముందర గురు మంత్రములను ఉచ్చరించి చూడు, ప్రతి మంత్రములో నీకు గురు దర్శనం తప్పక కల్పించెదను.
షిర్డీలో అత్యంత పవిత్రతతో మిక్కిలి భక్తీ శ్రథ్థలతో నా పూజలో నిమగ్నమై రాత్రంతా జాగరణ చేసి చూడు, నీకు ఆ జాగరణయొక్క మహిమను నేను దగ్గిరుండి బోథించెదను.
మిక్కిలి భక్తీతో నీకున్న సమస్త బాథలను నాతో పంచుకుని చూడు, ప్రతీ బాథను నీకొక దివ్యమైన ఆశీర్వాదముగా మలచెదను.
మిక్కిలి భక్తీ శ్రథ్థలతో నాకొక గులాబీల హారమును అర్పించి చూడు, నీ జీవితమంతా ఆ గులాబీల పరిమళాన్ని నింపెదను.
మిక్కిలి భక్తీ శ్రథ్థలతో పవిత్రమైన నా ద్వారకామాయిని వెలిగే దీపములతో అలంకరించి చూడు, నీ జీవితములో దివ్యమైన అత్యంత శక్తివంతమైన వెలుగుని నింపెదను.
మిక్కిలి ప్రేమతో నాకొరకు అర్పించిన ప్రసాదమును నా భక్తులకు పంచి చూడు,
నిన్ను అత్యంత పుణ్యవంతుడిని చేసెదను.
మిక్కిలి భక్తీ శ్రథ్థలతో నా పాదముయొక్క బొటన వ్రేలుని పూజించి చూడు, నీకు పరమ పవిత్రమైన గురు పూర్ణిమ పండుగను జ్ఞప్తికి తెప్పించెదను.
మిక్కిలి భక్తీ శ్రథ్థలతో నా ముందర పరమ పవిత్రమైన ఓంకార నాదాన్ని జపించి చూడు, నీకు ఈ ప్రపంచములోని అన్ని సుఖములని ప్రసాదించెదను.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.