15.05.2021 శనివారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
ఈ
రోజు మరొక అధ్భుతమయిన బాబా లీల గురించి ప్రచురిస్తున్నాను. సాయి లీల ద్వైమాసపత్రిక మే – జూన్, 2011 వ.సంవత్సరంలో
ప్రచురింపబడింది.
తెలుగు
అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,
హైదరాబాద్
సర్వాంతర్యామి - ఆర్తితో అర్ధిస్తే ఆదుకుంటారు
ఒకసారి
నేను దసరా శలవలకి మా ఊరు షహజాన్ పూర్ (బరేలీ) కి వెడుతున్నాను. అంతదూరం ప్రయాణం చేయడం నాజీవితంలో అదే మొదటిసారి.
నేను
మధురలో దిగి బస్సులో వెళ్ళాలి. కాని బస్ స్టాండ్
కి వెళ్ళేటప్పటికి అప్పటికే మధురనుండి బరేలీకి వెళ్ళే బస్సులన్నీ వెళ్ళిపోయాయి. ఏమి చేయాలో తెలియక మా నాన్నగారికి ఫోన్ చేసాను. నేను ఫోన్ చేసిన సమయానికి ఆయన ఫోన్ ని ఇంటిలోనే
వదిలేసి బయటకు వెళ్లారు. అందుచేత నా పరిస్థితి
ఆయనకు తెలియదు.