Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, July 13, 2012

నిజాయితీని విడనాడకు - బాబా తోడుంటారు

0 comments Posted by tyagaraju on 7:12 AM
 


 



 12.07.2012  శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబా వారి శుభాకాంక్షలు.
 
నిజాయితీని విడనాడకు -  బాబా తోడుంటారు
 
గత వారము రోజులుగా ప్రచురణకు అంతరాయం కలిగింది.  తరచూ కరెంటు కోతలవల్ల, ఇంటిలో కొన్ని పనుల వత్తిడివల్ల ప్రచురించడానికి సాధ్యపడలేదు. కరెంటుపోయినా ప్రచురణకు అంతరాయం కలగకుండా నెట్ కూడా పనిచేసేలా కొత్త ఇన్వర్టరు కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఒక వారము రోజులు హైదరాబాదు, బంగళూరు వెడుతూ, ఈ రోజు హైదరాబాదునుంచి ప్రచురణ సాగిస్తున్నాను.  

ఈ రోజు అమెరికానించి సాయి భక్తులు సూరజ్  గారి అనుభవాన్ని ప్రచురిస్తున్నాను. 

 మనలని నడిపించేది బాబా అని నమ్మినపుడు మన భారమంతా ఆయనమీదే వేసి నిశ్చింతగా ఉండటం అలవరచుకోవాలి.  ఎప్పుడూ కూడా మనలని మన నిజాయితీయే మనలని సర్వదా రక్షిస్తూ ఉంటుంది. మనం సన్మారగంలో పయనిస్తూ ఉన్నపుడు  బాబా యే మనకి సరియైన ఆలోచన కలిగించి తగిన సమయంలో సరియైన నిర్ణయం తీసుకునేలా చేస్తారు.  అదంతా  మన ప్రతిభే అనుకుని మనం గర్వంతో విఱ్ఱవీగకూడదు.  కష్టమైనా, సుఖమైనా మనం మన నిజాయితీని ఎప్పుడు విడవకూడదు.  ఈ సత్యాన్ని తెలుసుకుంటే బాబా ఎల్లపుడూ మనతోనే ఉంటారు. మనం చేయవలసినది "సర్వస్య శరణాగతి" మాత్రమే.  మనం మానవమాత్రులం కనక కష్టాలెదురయినప్పుడు ఆందోళన పడటం సహజం.  అప్పుడే మనం నిబ్బరంగా ఉండి బాబా వారి పాదాలకు సర్వస్య శరణాగతి చేస్తె అంతా ఆయనే చూసుకుంటారు.   
 

ఇకచదవండి.  ఓం సాయిరాం .....
                                                        ****************

సాయిబాబాయే నా జీవితాధారం. అవసరమయినప్పుడెల్లా ఆయన నాచేతిని పట్టుకునే వుటారు. నా కెన్నో లీలలు జరిగాయి. బాబా ఆదేశానుసారం వాటిలో ఒకదానిని నేను మీకిప్పుడు వివరిస్తాను.

మా ఇద్దరబ్బాయిలు కూడా అమెరికాలో ఉంటున్నారు. బాబా దయవల్ల వారిద్దరూ చాలా ఆనందంగా ఉన్నారు. కొద్ది నెలలుగా నేను వారితోనే ఉంటున్నాను. గత కొద్ది సంవత్సరాలుగా మారెండవ అబ్బాయి ఎన్నో సమస్యలనెదుర్కొంటున్నాడు. మా  రెండవ అబ్బాయి సంతోషం గా ఉండటంకోసం ప్రతీరోజు బాబాని ప్రార్ధిస్తూ ఉండేదానిని. క్రిందటి సంవత్సరం మా అబ్బాయి పనిచేస్తున్న కంపెనీని మూసివేస్తారనే వార్త వినగానే చాలా కలత చెందాడు. కొద్ది సంవత్సరాల క్రితం రెసెషన్ టైం లో మొదటిసారిగా ఇది జరిగింది. మా అబ్బాయి మరో ఉద్యోగం కోసం ప్రయత్నించాడు, ఉద్యోగం కూడా వచ్చింది.  కాని, ఈ సమయం లో పాత కంపనీకి మరొక కాంట్రాక్ట్ వచ్చింది.  వారు మా అబ్బాయికి , జీతం పెంచి ఉండిపొమ్మనమని చెప్పారు.  పాత కంపనీలో అంతగా తనకు అభివృధ్ధి లేకున్నా, కొత్త కంపనీలో అవకాశాలు బాగున్నా కూడా ఇప్పుడు పనిచేస్తున్న కంపనీలోనే ఉండిపోయాడు. నేను మా అబ్బాయిని "ఎందుకని నువ్వింకా ఈ పాత కంపనీలోనే ఉన్నావు" అని అడిగాను.  కంపనీ చాలా క్లిష్టదశలో ఉంది.  దానిని నిలబెట్టడం  నాకర్తవ్యం  తరువాతే నా సంగతి చూసుకోవాలి అని చెప్పాడు మా అబ్బాయి.
 
 అబ్బాయి నిజాయితీ కి నేను సంతోషించి తన నిర్ణయం ప్రకారమె చేయమని చెప్పాను. బాబా తనతోనే ఉన్నారని నాకు తెలుసు.నడిపించడానిని ఏది మంచిదో బాబాకి తెలుసు.  ఆయనే సరియైన తగిన మార్గంలో నడిపిస్తారు. మరలా ఎన్నో యింటర్వ్యూలకి వెళ్ళాడు. బాబా దయ వల్ల ఈ సారికూడా మంచి ఉద్యోగం వచ్చింది.  కాని ఇప్పుడు ఉద్యోగం  వేరే పట్టణంలో వచ్చింది. మా అబ్బాయి అక్కడికి వెళ్ళడానికి మానసికంగా సిధ్ధమయాడు. అందుచేత అక్కడ ఉద్యోగం చేయడానికే నిర్ణయించుకున్నాడు.  కొత్త కంపనీవారు తొందరలోనే ఉద్యోగంలో వీలయినత తొందరగా చేరమని చెప్పారు. కాని పాత కంపనీలోని వారు,  తమ కంపనీ పూర్తిగా మూసివేయడానికి ముందరగానే మా అబ్బాయి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. ఇక్కడే అసలయిన పరీక్ష మొదలయింది. ఇచ్చిన తేదీ ప్రకారం కొత్త కంపనీలో చేరకపోతే వచ్చిన మంచి ఉద్యోగం రద్దయి పోవచ్చు, ఇప్పుడు కంపనీ పూర్తిగా మూసివేసే ముందరే ఉద్యోగంలోనించి వెళ్ళిపోతే రావలసిన డబ్బు ఏదీ ఇవ్వరు.  రెండు విధాలుగా కూడా నష్టమే. అది చాలా బాధాకరం.  ఏమి చేయాలో తెలీని పరిస్థితి.

ఆసమయములో నేను భారత దేశంలో ఉన్నాను.  మా అబ్బాయి ఇదంతా నాకు వివరించి చెప్పినప్పుడు నేనేమీ సమధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. ఏమి సమాధానం చెప్పాలో నాకు తోచలేదు. అప్పుడు నేను బాబాని ఎప్పుడూ ప్రార్ధించేలాగే, "బాబా ఏది మంచో ఏది చెడో నీకేతెలుసు, నువ్వే మాచేయి పట్టుకుని నడిపించు  నువ్వే మమ్మలిని రక్షించేవాడివి," అని ప్రార్ధించాను.  దయాసముద్రుడయిన బాబా నాకు ఈ విధంగా ఆలోచన కలిగించారు. మా  అబ్బాయితో "ముందర కొత్త కంపనీ మానేజరుని  ని కలిసి ప్రస్తుత పరిస్థితి గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పమని, ఉద్యోగంలో చేరడానికి కొంత సమయం  ఇచ్చేదీ లేనిదీ వారినే నిర్ణయించమని చెప్పమని అడగమన్నాను.  పాత కంపనీలో చాలా కష్టపడి పనిచేశావు కనక అందులోని ప్రతీ పై సా నువ్వు తీసుకోవాలి.  అందుచేత కొన్నాళ్ళపాటు ఇందులోనే ఉండాలి.  నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్ము వ్యర్ధం కాకూడదు" అని చెప్పాను.  మా అబ్బాయి కొత్త కంపనీ మానేజరుని  కలుసుకుని మొత్తం విషయమంతా వివరించాడు. కొత్త కంపనీ మానేజరు మా అబ్బాయి నిజాయితీకి సంతోషించి, అడిగిన గడువుకన్నా ఇంకా ఎక్కువ సమయమే ఉద్యోగం లోచేరడానికి అనుమతినిచ్చారు.  పాత కంపనీ మానేజరు కూడా మా అబ్బాయి సహకారంతో పని పూర్తవడం వల్ల ఎంతో సంతోషించి రావలసిన డబ్బు మొత్తం ఇచ్చేశారు.

సర్వం శ్రీసాయినాధార్పణమస్తు


 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List