Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, April 9, 2016

శ్రీ సాయి లీలామృత ధార - పోయిన స్కూటర్ దొరుకుతుందా లేదా???

Posted by tyagaraju on 8:30 AM
Image result for images of shirdi sai in Shirdi
           Image result for images of rose yellow hd

09.04.2016 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి లీలామృత ధార
పోయిన స్కూటర్ దొరుకుతుందా లేదా???
రోజు మరొక అద్భుతమైన బాబా లీల మనమందరం పంచుకుందాము. కుమారి మాయా సాద్వాని  పూనా వారి  ఈ  లీల  శ్రీసాయి లీలా మాసపత్రిక సెప్టెంబరు  1983 .సంవత్సరంలో ప్రచురింపబడింది.  

గత ఏడు సంవత్సరాలనుండీ నేను సాయిని పూజిస్తూ ఉన్నానుఆయన మీద నాకెంతో భక్తిఆయన నాకు ఎన్నో లీలలు చూపించారుఅన్నిటినీ  నేను నా డైరీలో రాసుకుంటూ ఉంటానుకాని వేటినీ కూడా ప్రచురించే ఉద్దేశ్యం మాత్రం లేదుకాని, క్రిందటి నెలలోనే జరిగిన లీలను మాత్రం సాయి బంధువులందరితోను నేను పంచుకోదలచుకోవడానికి కారణం, ఇది ప్రచురిస్తానని నేను బాబాకు మాట ఇవ్వడం వల్లనా సద్గురువు, తండ్రి అయిన సాయికి నేనిచ్చిన మాట నిలబెట్టుకోవాలని.


నేను అడ్వకేట్ నిపూనాలో సీనియర్ అడ్వొకేట్ డి.ఎస్.అయ్యర్ గారి వద్ద జూనియర్ గా  పని చేస్తున్నానుఅయ్యర్ గారు కూడా ఎంతో దయ కలవారవడమే కాక దేవునిపై భక్తి కలవారు కూడాసాయిబాబా అనుగ్రహం వల్లే అటువంటి సీనియర్ వద్ద పనిచేసే అదృష్టం కలిగిందిమేమిద్దరం కలిసి స్కూటర్ మీద కోర్టుకు వెడుతూ ఉంటామునేను ఆయనతో గాని, వారి అబ్బాయి శేఖర్ తో గాని కోర్టుకు వెడుతూ ఉంటాను.

22.02.1983 మంగళవారము నాడు ఎప్పటి లాగే స్కూటర్లను (ఆయనది, వారి అబ్బాయిది) చిన్న తగాదాలను పరిష్కరించే  (స్మాల్ కాజెస్ ) కోర్టు భవనం వద్ద నిలిపి ఉంచారుఇది చెప్పే ముందుగా మీకు నేనొక విషయం చెప్పాలి.  17.02.1983 గురువారం నాడు స్వర్ గేట్ వద్ద ఉన్న సాయిబాబా గుడి దగ్గర సాయిబాబా స్టిక్కర్లు రెండు కొన్నానుఅయ్యర్ గారి  రెండు స్కూటర్లకి రెండు స్టిక్కర్లు అతికించాను.
                          Image result for images of sai baba stickers
మధ్యాహ్నం 2.30 కి నేను శేఖర్ తో కలిసి ఇంటికి వస్తున్నానుఅప్పటికి అయ్యర్ గారి స్కూటర్ అక్కడే ఉందిసాయంత్రం నేను ఆఫీసుకు వెళ్ళేటప్పటికి కోర్టు భవనం ముందు ఉంచిన స్కూటర్ ఎమ్ ఎక్స్ బి 6030 దొంగిలించబడిందనే వార్త వచ్చిందినేను నిర్ఘాంతపోయాను. మధ్యాహ్నం 3.30 కి కూడా తన స్కూటరు ఉంచిన చోటే చూశానని అయ్యర్ గారు చెప్పారుచిన్న తగాదాల కోర్టుకు వెడుతున్నపుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నేను అయ్యర్ గారితోసర్, (నేనెప్పుడూ అయ్యర్ గారిని ఆవిధంగానే సంబోధిస్తూ ఉంటాను) మీరేమీ ఆందోళన చెందకండిసాయిబాబా మీ స్కూటర్ ఎక్కడ ఉందో కనిపెట్టి మీకప్పగిస్తారునేనాయనకి చెబుతానుకానీ మీరొక పని చేయాలిమీ స్కూటర్ దొరికితే నాకు మీరు కొబ్బరికాయ, పూలు కోసం రూ.2.50 ఇవ్వండిఅన్నానుఅప్పుడు అయ్యర్ గారు "అలాగా! సాయిబాబా నా స్కూటర్ దొరెకేలా చేస్తారని నిజంగానే నువ్వు నమ్ముతున్నావా?” అన్నారుఅవును సర్నాకాయన మీద పూర్తి విశ్వాసం ఉంది. ఆయన నాకెంతో చేశారునాకోసం ఇది చేయలేరా?” అన్నాను.  “సరే చూద్దాం ఏం జరుగుతుందోఅన్నారు అయ్యర్ గారు.

పట్టణంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ లలో కంప్లయింట్ ఇచ్చాము.  సాయిబాబాని పిచ్చెత్తినట్లుగా వేడుకోవడం మొదలు పెట్టాను.  ఇప్పుడు నా విశ్వాసానికి ఆయన శక్తికి పరీక్ష. నాకు ఆయన మీద సంపూర్ణమయిన విశ్వాసం ఉంది.  ఎప్పటిలాగే గురువారం నాడు సాయిబాబా గుడికి వెళ్ళి ప్రార్ధించాను.  అక్కడ పూజారిగారికి (ఆయన పేరు శ్యామ్) స్కూటర్ గురించి అంతా చెప్పాను.  అప్పుడాయన “మంగళవారము నాడు పోయిన వస్తువు దొరకడం చాలా అరుదు. కాని శనివారం సాయంత్రానికి స్కూటర్ దొరుకుతుంది” అన్నారు.  అపుడాయన రెండు చీటీలు తీసి ఒక దానిమీద ‘దొరుకుతుంది’ రెండవదాని మీద ‘దొరకదు’ అని రాసి సాయిబాబా ముందు వేశారు.  కొంత సేపటి తరువాత పూజారిగారు ఒక చీటీ తీశారు.  ఆ చీటి నాకు ఇచ్చి అందులో ఏమని ఉందో చూడమన్నారు.  నేను బాబాని ప్రార్ధించి చీటీలో ఏముందో చూశాను.  అందులో ‘దొరుకుతుంది’ అని రాసి ఉంది.  నేను చాలా సంతోషించాను.  బాబాకి కృతజ్ఞతలు చెప్పి ఆఫీసుకు వెళ్ళి గుడిలో జరిగినదంతా అయ్యర్ గారికి చెప్పాను.  అయ్యర్ గారి దగ్గరే పని చేస్తున్న మరొక జూనియర్ అడ్వొకేటు శనివారం నాడు చిన్న విందు ఏర్పాటు చేశాడు.  అయ్యర్ గారు, ఆయన భార్య, ఇద్దరు కొడుకులు (రఘు, శేఖర్) మరొక అడ్వొకేటు, నేను, విందు ఏర్పాటు చేసిన అడ్వొకేటూ అందరం ఆ విందులో ఉన్నాము.  అయ్యర్ గారి భార్య లక్ష్మీ అయ్యర్ చాలా మంచావిడ.  ఆవిడ కూడా ఎంతో భక్తిపరురాలు.  స్కూటర్ పోవడం వల్ల ఆవిడలో కాస్తంత బాధ కనిపిస్తూ ఉంది.  స్కూటర్ ఖరీదు రూ.10,000/- అంతకన్నా ఎక్కువే ఉండచ్చు.  స్కూటర్ పోవడం వల్ల మరొక స్కూటర్ కొందామనే ఆలోచనలో ఉన్నారు అయ్యర్ గారు.  “ఆంటీ, మీరేమీ మనసులో ఆందోళన చెందకండి.  స్కూటర్ తప్పకుండా దొరుకుతుంది.  స్కూటర్ ఎలా ఉన్నది అలా దొరుకుతుంది.  కాని దానిని రిపేర్ చేయించడానికి వంద రూపాయలు ఖర్చు పెట్టాలి.  కాని దొరుకుతుందనే ఆశ నాకుంది.  రేపు నేను షిరిడీ వెడుతున్నాను.  బాబాని ప్రార్ధిస్తాను.  మీరేమీ గాభరా పడకండి.  బాబా స్కూటర్ దొరికేలా చేస్తారు.  నాకు ఖచ్చితంగా ఆయన మీద నమ్మకం ఉంది” అన్నాను.  అపుడామె “స్కూటర్ రిపేర్ కి వెయ్యిరూపాయలు ఖర్చయినా ఫరవాలేదు.  స్కూటర్ దొరికెతే చాలు” అన్నారు.  (ఇంతకు ముందు కోర్టు ఆవరణలో ఉంచిన 6,7 స్కూటర్లు పోయాయి.  ఇంతవరకు ఏ ఒక్కటీ దొరకలేదు) స్కూటర్ మాత్రం దొరికి తీరుతుంది. బెంగ పెట్టుకోవద్దని చెప్పాను.  డైనింగ్ టేబుల్ దగ్గిర స్కూటర్ దొంగతనం గురించి మళ్ళీ ప్రస్తావన వచ్చింది.  మాకు పార్టీ ఏర్పాటు చేసిన జూనియర్ అడ్వొకేటు “మాయా! నువ్వు గురువారం నాడు సాయిబాబా స్టిక్కరు స్కూటర్ కి అంటించావు.  అందుకే స్కూటర్ పోయింది” అన్నాడు. అతనన్న ఆ మాటలకి నాకు చాలా బాధ కలిగింది.  “సాయిబాబా స్టిక్కర్ ఉన్నందు వల్లే స్కూటర్ దొరుకుతుంది” అని నా మనసులో అనుకున్నాను. “మనసులో ఎటువంటి చింత పెట్టుకోకండి.  నేను రేపు షిరిడీ వెడుతున్నాను.  నేను షిరిడీ నుండి తిరిగి వచ్చేటప్పటికి స్కూటర్ దొరుకుతుంది” అన్నాను.  అప్పుడు మరొక అడ్వొకేటు “స్కూటర్ దొరుకుతుందని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు” అన్నాడు.  “నా సాయిబాబా చాలా శక్తి కలవారు. నీకా భయం అక్కరలేదు” అన్నాను.

షిరిడీలో హుండీలో వేయడానికి అయ్యర్ గారినుంచి  రూ.1.50 తీసుకున్నాను.  మరుసటి రోజే షిరిడీకి ప్రయాణమయ్యాను.  షిరిడీ ఏ సమయంలో చెరుకున్నా గాని, అభిషేకానికి టిక్కెట్టు లభించేలా చేయమని స్కూటర్ కూడా తప్పకుండా దొరికేలా చేయమని దారి పొడవునా బాబాని ప్రార్ధించుకుంటూనే ఉన్నాను.  షిరిడీ చేరుకోగానే అభిషేకానికి టిక్కెట్లు దొరకడంతో బాబాకి అభిషేకం చేయించాను.  ఆ రోజు బాబా వారి వదనం ఎంతో ప్రకాశవంతంగా దివ్యంగా ఉంది.  నేను ఇప్పటికి పదకొండు సార్లు షిరిడీ వచ్చాను. కాని ఇంతకు ముందెన్నాడూ ఇటువంటి ప్రకాశవంతమయిన వెలుగు నాకు బాబా ముఖంలో కనపడలేదు.  ఆయన ముఖంలోని తేజోమయమయిన చిరునవ్వు కూడా చూడగలిగాను.  స్కూటర్ దొరికేలా చేయమని ప్రార్ధించాను.  అదే రోజు షిరిడీనుండి తిరిగి వచ్చాను.
                                 Image result for images of shirdisaibaba smiling

మరుసటి రోజు (సోమవారం) ఆఫీసుకు వెళ్ళాను.  స్కూటర్ దొరికిందనే వార్త ఏమీ రాలేదు.  నేనింకా బాబాని ప్రార్ధిస్తూనే ఉన్నాను.   అఫీసునుండి వచ్చాక బాబాతో “ఏమిటి బాబా! ఇంకా స్కూటర్ దొరకలేదు “ అని ఆయనకు చెప్పుకోవడం మొదలు పెట్టాను.  సాయంత్ర్రం 5.30 కి స్కూటర్ దొరికిందని శేఖర్ ఫోన్ చేశాడు.  నా సంతోషానికి అవధులు లేవు. అదంతా సాయిబాబా దయ వల్లనేనని చెప్పాను.  “అవును.  మా ఇంటిలో అందరూ కూడా బాబా అనుగ్రహం వల్లే దొరికిందని అంటున్నారు” అన్నాడు.
                              Image result for images of shirdi saibaba cast your burden on me

నా గదిలో ఉన్న బాబా పటం వద్దకు వెళ్ళి ఆయన పాదాల వద్ద నా శిరసునుంచి కన్నీళ్ళతో ఆయనకు నా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

సాయంత్రం ఆఫీసుకు వెళ్ళాను.  అయ్యర్ గారు “మాయా! నువ్వు షిరిడీ వెడుతూ 24 గంటల్లో స్కూటర్ దొరుకుతుందని చెప్పావు.  నువ్వు చెప్పినట్లే దొరికింది.  నిజంగా సాయిబాబా దయ వల్లే పోయిన స్కూటర్ దొరికింది” అని ఎంతో సంతోషంతో చెప్పారు.  మెయిన్ రోడ్డులో ఉన్న ‘వండర్ లాండ్’ భవనం వద్ద శనివారం సాయంత్రం పోలీసులు స్కూటర్ని కనిపెట్టారు.  సాయిబాబాకి అయ్యర్ గారి నుంచి రూ.2.50 తీసుకున్నాను.  ఇంతవరకు ఎవ్వరికీ కూడా పోయిన తమ స్కూటర్లు దొరకకపోవడంతో అందరూ చాలా ఆశ్చర్యపోయారు.  మరునాడు ఆఫీసుకు వచ్చిన జూనియర్ అడ్వొకేటుతో “స్కూటర్ దొరికింది.  సాయిబాబా స్టిక్కర్ అంటించిన తరవాతే స్కూటర్ పోయిందని అన్నావు.  కాని నేను చెబుతున్నాను సాయిబాబా స్టిక్కర్ అంటించినందు వల్లనే స్కూటర్ ఏమీ పాడవకుండా దొరికిందని అనగానే అతను ఇంకేమీ మాట్లాడలేకపోయాడు.

నిజమే, సాయిబాబా యే స్కూటర్ దొరికేలా చేశారు.  స్కూటర్ లో పెట్రోల్ అయిపోవడం వల్ల స్కూటర్ ఎలా ఉన్నది అలా ఉన్నట్లు దొరకడమే కాక అంటించిన ష్టిక్కర్ కూడా చెక్కు చెదరకుండా ఉంది.

ఇంతటి అద్భుతం చేసి చూపించిన సాయిబాబాకి కోటి కోటి ప్రణామాలు.  “మీ బరువు బాధ్యతలన్నిటినీ ఆయన భుజస్కంధాలపై పెట్టండి.  ఆ భారం ఆయన మోస్తారు.”
                       Image result for images of chand patil horse

తప్పిపోయన చాంద్ పాటిల్ గుఱ్ఱాన్ని సాయిబాబా చూపించారు. (శ్రీ సాయి సత్ చరిత్ర 5వ.అధ్యాయం). పోయిన స్కూటర్ ఇక దొరకదని నిర్ణయించుకుని కొత్త స్కూటర్ కొందామనుకుంటున్న అయ్యర్ గారికి స్కూటర్ దొరికేలా చేశారు.
Image result for images of shirdi saibaba cast your burden on me

నా సద్గురు సాయిబాబాకి మరొక్క సారి నా సాష్టాంగ ప్రణామాలు                                             కుమారి మాయా సాధ్వాని, 
                                         పూనా      

(మరికొన్ని అమృత ధారలు ముందు ముందు)

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List